అడ్వెంచర్‌ ట్రిప్‌ స్టార్ట్‌ | Malvika Sharma to romance Ram ? | Sakshi
Sakshi News home page

అడ్వెంచర్‌ ట్రిప్‌ స్టార్ట్‌

Apr 27 2018 12:43 AM | Updated on Apr 27 2018 12:43 AM

Malvika Sharma to romance Ram ? - Sakshi

కార్తీక్, ‘స్రవంతి’ రవికిషోర్, ప్రవీణ్‌ సత్తారు, రామ్, కృష్ణ చైతన్య

ఎనర్జిటిక్‌ హీరో రామ్, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌ కుదిరింది. ఇద్దరి స్టైల్‌కి తగ్గట్టుగానే యాక్షన్‌ అడ్వెంచర్‌లో సాగే న్యూ ఏజ్‌ సినిమాకు శ్రీకారం చుట్టారు. పి.కృష్ణ చైతన్య సమర్పణలో రామ్, మాళవిక శర్మ జంటగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ను ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం  గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిషోర్‌ మాట్లాడుతూ– ‘‘మే7 నుంచి జార్జియాలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. మే లాస్ట్‌ వీక్‌ వరకూ ఫస్ట్‌ షెడ్యూల్‌ చేస్తాం.

తర్వాత ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌ దేశాల్లో బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. విదేశాల్లో షెడ్యూల్‌ అయిపోయాక కాశ్మీర్, లడఖ్‌లో భారీ షెడ్యూల్‌ ప్లాన్‌ చే శాం. ఇది న్యూ ఏజ్‌ మూవీలా ఉంటుంది’’ అన్నారు. ‘‘రామ్‌కి సరిపోయే కథ ఇది. స్క్రిప్ట్‌ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. యాక్షన్, అడ్వెంచర్‌ అంశాలు ఉంటాయి. టాప్‌ టెక్నీషియన్స్‌ మా సినిమాకు పని చేయబోతున్నారు. అందర్నీ మెప్పించే చిత్రం అవుతుంది’’ అన్నారు ప్రవీణ్‌ సత్తారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement