జోడీ కుదిరిందా? | Ileana next titled Naa Ratha Nene Rasukunta | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరిందా?

Published Tue, Jun 23 2020 12:40 AM | Last Updated on Tue, Jun 23 2020 5:09 AM

Ileana next titled Naa Ratha Nene Rasukunta - Sakshi

నాగార్జున, ఇలియానా

ఇలియానా తెలుగు సినిమా కమిట్‌ అయి దాదాపు రెండేళ్లవుతోంది. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ తర్వాత ఈ గోవా బ్యూటీ మరో తెలుగు సినిమా అంగీకరించలేదు. అయితే ఇప్పుడు ఓ సినిమా సైన్‌ చేశారని సమాచారం. నాగార్జున సరసన ఇలియానా ఓ సినిమాలో నటించబోతున్నారట. నాగ్‌తో ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహించనున్న సినిమాలోనే ఆమె కథానాయికగా కనిపించబోతున్నారని టాక్‌.

ఇందులో నాగార్జున సీఎస్‌ఓ (చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) పాత్ర చేయనున్నారని సమాచారం. ఇటీవలే నాగార్జునను కలిసి ప్రవీణ్‌ సత్తార్‌ ఈ కథను వినిపించారట. ఈ కథ రీత్యా ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌) ఏజెంట్‌గా ఉన్న హీరో ఓ మిషన్‌ కోసం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా మారతారట. ఈ కథ బాగా నచ్చడంతో ప్రవీణ్‌ సత్తార్‌కు నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. ఆ తర్వాత ఇలియానాని కూడా చిత్రబృందం సంప్రదించిందట. ఈ చిత్రానికి ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement