పావని, వెంకట్
‘‘రాయలసీమ లవ్‌స్టోరీ’ ట్రైలర్‌లో ‘ఇడియట్’ సినిమా యాటిట్యూడ్ కనపడుతోంది. కర్నూల్‌లో షూట్ చేసిన ఏ సినిమా అయినా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది కర్నూల్ నేపథ్యంలో వస్తున్న ‘రాయలసీమ లవ్‌స్టోరీ’ ఇంకెంత హిట్ అవుతుందో ఊహించుకోవచ్చు. రామ్‌లో మంచి ప్రతిభ, పవర్ కనపడుతున్నాయి. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ మంచి భవిష్యత్ ఉండాలి’’ అని డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి అన్నారు.
వెంకట్, హృశాలి, పావని ప్రధాన పాత్రల్లో రణధీర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరీ’. రాయల్ చిన్నా, నాగరాజు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్, ఆడియో బిగ్ సీడీలను జి.నాగేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. రామ్ రణధీర్ మాట్లాడుతూ– ‘‘మొదటి నుంచి మమ్మల్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ వచ్చిన నాగేశ్వర్ రెడ్డిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక్క లైన్ చెప్పగానే నన్ను నమ్మి పది రోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ చేయించారు నిర్మాతలు. వారు నాకు జీవితం ఇచ్చారు. కథకు తగ్గ కరెక్ట్ టైటిల్ ‘రాయలసీమ లవ్‌స్టోరీ’’ అన్నారు.
‘‘రాయలసీమ అనగానే అందరికీ బాంబులు, ఫ్యాక్షన్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేయడానికే ఈ చిత్రం నిర్మించాం’’ అన్నారు రాయల్ చిన్నా. ‘‘అను కున్న సమయానికి సినిమా పూర్తయింది. ఔట్‌పుట్ కూడా బాగా వచ్చింది. ఈ నెల 27న సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు నాగరాజు. ‘‘నిర్మాతల సహకారం వల్లే మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు సాయి ఎలేంద్ర. వెంకట్, హృశాలి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ మహేందర్.
Comments
Please login to add a commentAdd a comment