ఉప్మా 40 పైసలు, ఫిల్టర్ కాఫీ 15 పైసలే! | Back to 40s: Mumbai's Cafe Madras celebrates 75 years anniversary with old prices | Sakshi
Sakshi News home page

ఉప్మా 40 పైసలు, ఫిల్టర్ కాఫీ 15 పైసలే!

Published Fri, Nov 27 2015 8:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

ఉప్మా 40 పైసలు, ఫిల్టర్ కాఫీ 15 పైసలే!

ఉప్మా 40 పైసలు, ఫిల్టర్ కాఫీ 15 పైసలే!

ముంబై: తమ వ్యాపారాలు ప్రారంభించాకా వార్షికోత్సవాలను జరుపుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి విశేష సందర్భాన్ని ఆసక్తికరమైన రీతిలో సెలబ్రేట్ చేసుకుంది ముంబైలోని మతుంగా మద్రాస్ కేఫ్. 1940లో మొదలైన ఈ కేఫ్ ఇటీవలే 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తమ కేఫ్‌కు వచ్చే వాళ్లకు ఈ సందర్భం గుర్తుండిపోయేలా చేశారు దాని నిర్వాహకులు.

తమ కేఫ్ ప్రారంభమైన సమయంలో తినుబండారాలు ఏ ధరకు అందించారో.. 75 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా వాటిని అవే ధరలకు అందించారు. ఉప్మా కేవలం 40 పైసలకు, ఫిల్టర్ కాఫీని పదిహేను పైసలకు అందించారు. ఇవేగాక ఈ మద్రాస్ కేఫ్‌లో దక్షిణాది స్పెషల్స్ అయిన రసం, బటర్ ఇడ్లీ, దోసె, అప్పలం, మైసూర్ పాక్ వంటి వాటిని కూడా 1940 నాటి ధరలకు అందించారు. తమ రెస్టారెంట్‌కు వచ్చిన వారికి పాతధరలతో కొత్త అనుభవాన్ని ఇచ్చారు. అయితే ఈ ఆఫర్ పరిమిత సమయం మాత్రమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement