hotel anniversary
-
వెంకటయ్య..వెరీ లక్కీ
సోమాజిగూడ: ఓ సాధారణ పారిశుధ్య కార్మికుడు ఫైవ్ స్టార్ హోటల్ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. జీహెచ్ఎంసీ కార్మికుడు వెంకటయ్యకు ఆ అదృష్టం దక్కింది. చిత్తశుద్ధితో పారిశుధ్య విధులు నిర్వహించి దేశవ్యాప్త గుర్తింపు పొందిన వెంకటయ్యను సోమాజిగూడలోని మెర్క్యుర్ హోటల్ నిర్వాహకులు సోమవారం జరిగిన వార్షికోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించారు. అంకితభావంతో విధులు నిర్వహించే వారికి సమాజంలో మంచి గౌరవం ఉంటుందనడానికి వెంకటయ్య ఉదాహరణ అని ఈ సందర్భంగా కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. నాడు టీచర్.. నేడు టాయిలెట్ నిర్వాహకుడు అశోక్ నగర్‌లోని పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకుడైన సంజయ్ కుమార్‌ను ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అశోక్‌నగర్‌లోని గౌరవ గృహాన్ని నిర్వహిస్తున్న సంజయ్ కుమార్ ఝా తన కుటుంబంతో అదే ప్రాంతంలో నివసిస్తూ 24 గంటలు టాయిలెట్‌ను నిర్వహిస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసి గతంలో బీహార్‌లో టీచర్‌గా పని చేసిన సంజయ్ ప్రస్తుతం టాయిలెట్ నిర్వహణ ద్వారా నెలకు రూ.15 వేలకు పైగా ఆదాయం పొందుతున్నాడని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కమిషనర్లు సంజయ్‌కుమార్ ఝాను అభినందించారు. -
ఉప్మా 40 పైసలు, ఫిల్టర్ కాఫీ 15 పైసలే!
ముంబై: తమ వ్యాపారాలు ప్రారంభించాకా వార్షికోత్సవాలను జరుపుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి విశేష సందర్భాన్ని ఆసక్తికరమైన రీతిలో సెలబ్రేట్ చేసుకుంది ముంబైలోని మతుంగా మద్రాస్ కేఫ్. 1940లో మొదలైన ఈ కేఫ్ ఇటీవలే 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తమ కేఫ్‌కు వచ్చే వాళ్లకు ఈ సందర్భం గుర్తుండిపోయేలా చేశారు దాని నిర్వాహకులు. తమ కేఫ్ ప్రారంభమైన సమయంలో తినుబండారాలు ఏ ధరకు అందించారో.. 75 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా వాటిని అవే ధరలకు అందించారు. ఉప్మా కేవలం 40 పైసలకు, ఫిల్టర్ కాఫీని పదిహేను పైసలకు అందించారు. ఇవేగాక ఈ మద్రాస్ కేఫ్‌లో దక్షిణాది స్పెషల్స్ అయిన రసం, బటర్ ఇడ్లీ, దోసె, అప్పలం, మైసూర్ పాక్ వంటి వాటిని కూడా 1940 నాటి ధరలకు అందించారు. తమ రెస్టారెంట్‌కు వచ్చిన వారికి పాతధరలతో కొత్త అనుభవాన్ని ఇచ్చారు. అయితే ఈ ఆఫర్ పరిమిత సమయం మాత్రమే.