వెంకటయ్య..వెరీ లక్కీ | Drainage Cleaner Venkataiah Invited Hotel Anniversary | Sakshi
Sakshi News home page

వెంకటయ్య..వెరీ లక్కీ

Published Tue, Nov 21 2017 8:41 AM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM

Drainage Cleaner Venkataiah Invited Hotel Anniversary - Sakshi

వెంకటయ్యతో హోటల్‌ నిర్వాహకులు, సిబ్బంది

సోమాజిగూడ: ఓ సాధారణ పారిశుధ్య కార్మికుడు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. జీహెచ్‌ఎంసీ కార్మికుడు వెంకటయ్యకు ఆ అదృష్టం దక్కింది. చిత్తశుద్ధితో పారిశుధ్య విధులు నిర్వహించి దేశవ్యాప్త గుర్తింపు పొందిన వెంకటయ్యను సోమాజిగూడలోని మెర్క్యుర్‌ హోటల్‌ నిర్వాహకులు సోమవారం జరిగిన వార్షికోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించారు. అంకితభావంతో విధులు నిర్వహించే వారికి సమాజంలో మంచి గౌరవం ఉంటుందనడానికి వెంకటయ్య ఉదాహరణ అని ఈ సందర్భంగా కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. 

నాడు టీచర్‌.. నేడు టాయిలెట్‌ నిర్వాహకుడు  
అశోక్‌ నగర్‌లోని పబ్లిక్‌  టాయిలెట్‌ నిర్వాహకుడైన సంజయ్‌ కుమార్‌ను ప్రపంచ టాయిలెట్‌ డే సందర్భంగా రవీంద్ర భారతిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి ఘనంగా సన్మానించారు. అశోక్‌నగర్‌లోని గౌరవ గృహాన్ని నిర్వహిస్తున్న సంజయ్‌ కుమార్‌ ఝా తన కుటుంబంతో అదే ప్రాంతంలో నివసిస్తూ 24 గంటలు టాయిలెట్‌ను నిర్వహిస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసి గతంలో బీహార్‌లో టీచర్‌గా పని చేసిన సంజయ్‌ ప్రస్తుతం టాయిలెట్‌ నిర్వహణ ద్వారా నెలకు రూ.15 వేలకు పైగా ఆదాయం పొందుతున్నాడని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కమిషనర్‌లు సంజయ్కుమార్‌ ఝాను అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement