'మద్రాస్ కేఫ్' లో సచ్ఛీలత లేదు | 'Madras Cafe' not an honest film: Sri Lankan filmmaker Prasanna Vithanage | Sakshi
Sakshi News home page

'మద్రాస్ కేఫ్' లో సచ్ఛీలత లేదు

Published Tue, Nov 12 2013 9:29 PM | Last Updated on Sat, Sep 2 2017 12:33 AM

'Madras Cafe' not an honest film: Sri Lankan filmmaker Prasanna Vithanage

కోల్కతా: జాన్ అబ్రహాం, నర్గీస్ ఫక్రీ ప్రధాన పాత్రధారులుగా సూజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొందిన మద్రాస్ కేఫ్ చిత్రంలో ఎటువంటి సచ్ఛీలత లేదని శ్రీలంక ఫిల్మ్ మేకర్ ప్రసన్నా విత్నేజ్ అభిప్రాయపడ్డాడు. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించనప్పటికీ ఈ చిత్రంలో సచ్చీలత లేదని పేర్కొన్నాడు. 19వ కోల్కతా ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన ప్రసన్న సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమాలో ఏ ఒక్క సన్నివేశం కూడా మనసును కదిలించలేదని పేర్కొన్నాడు. కాగా, పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం విజయంపట్ల ప్రభుత్వం చాలా సంతోషంగా ఉందన్నాడు.

 

శ్రీలంకలో జరిగే సివిల్ వార్ ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందినా, సినిమా పూర్తిగా ఆకట్టుకోలేక పోయిందన్నాడు. బాలీవుడ్ చిత్రాలతో తమ సినిమాలు పోటీ పడుతుండటం లేదని తెలిపాడు. కాగా, శ్రీలంక చిత్రాలకు బాలీవుడ్ నుంచి మంచి పోటీ ఉందన్నాడు. దీనికి ఈ మధ్యనే విడుదలైన క్రిష్ -3ని ఉదాహరణగా పేర్కొన్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం లంకలో భారీ విజయాన్ని సొంత చేసుకుందని తెలిపాడు. లంక సినిమాలకు భారత్ లో పెద్దగా మార్కెట్ లేకపోవడం వల్ల తాను చింతించడంలేదన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement