బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన బంగ్లాదేశ్ కోర్టు
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై చట్టోగ్రామ్ కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. గురువారం కోర్టులో జరిగిన విచారణకు కృష్ణదాస్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన తరఫున 11 మంది లాయర్లు వాదనలు వినిపించారు.
కేసు దర్యాప్తు దశలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు లాయర్ కోరారు. దీంతో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి మొహమ్మద్ సైఫుల్ ఇస్లామ్ నిర్ణయం తీసుకున్నారు. కృష్టదాస్‌ను గత ఏడాది నవంబర్ 25న ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment