స్క్రీన్ టెస్ట్
1 ఇన్‌సెట్ ఫొటోలో కళ్లజోడు పెట్టుకున్న అమ్మాయి ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. పక్కనున్నది ఆమె సోదరుడు అమన్. ఆ హీరోయిన్ పేరు చెప్పగలరా?
ఎ) రకుల్‌ప్రీత్ సింగ్ బి) రాశీ ఖన్నా
సి) కాజల్ అగర్వాల్ డి) అనుష్క
2 ‘రోగ్’లో ఓ హీరోయిన్‌గా నటించిన ఏంజెలా అంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో ఐటమ్ సాంగ్ చేశారు. ఆ సినిమా పేరు?
ఎ) ఇజమ్ బి) లోఫర్ సి) జ్యోతిలక్ష్మీ డి) టెంపర్
3 నాగార్జున ‘కింగ్’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేసిన హీరోయిన్లు ఎంతమంది?
ఎ) ఐదు బి) ఆరు సి) ఏడు డి) ఎనిమిది
4 ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఖాన్‌దాదాగా నటించిన సినిమా?
ఎ) క్షణక్షణం బి) మనీ
సి) మనీ మనీ డి) అనగనగా ఒక రోజు
5 అల్లు అర్జున్ బాలనటుడిగా నటించిన తొలి సినిమా ఏది?
ఎ) చంటబ్బాయి బి) విజేత
సి) వేట డి) అడవి దొంగ
6 మహేశ్‌బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు నటించిన సినిమా?
ఎ) యువరాజు బి) టక్కరి దొంగ
సి) నాని డి) బ్రహ్మోత్సవం
7 వీవీ వినాయక్, రాజమౌళి... ఇద్దరి దర్శకత్వంలోనూ మూడేసి సినిమాలు చేసిన హీరో?
ఎ) అల్లు అర్జున్ బి) నితిన్ సి) ఎన్టీఆర్ డి) ప్రభాస్
8 మందుకొట్టే సీన్స్‌లో మత్తుగా కనిపించడానికి పెరుగన్నం ఎక్కువగా తిని నటించిన హీరో ఎవరు?
ఎ) ‘అందరివాడు’లో చిరంజీవి బి) ‘ఆగడు’లో మహేశ్‌బాబు
సి) ‘యమదొంగ’లో జూనియర్ ఎన్టీఆర్ డి) ‘దేవదాసు’లో అక్కినేని
9 ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన లేడీ కొరియోగ్రాఫర్ ఎవరు?
ఎ) స్వర్ణ బి) సుచిత్రా చంద్రబోస్ సి) బృంద డి) కళ
10 మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా ఏది?
ఎ) గీతాంజలి బి) సఖి సి) దొంగ దొంగ డి) అమృత
11 ఈ కింది వాటిలో సీనియర్ ఎన్టీఆర్‌తో చిరంజీవి‡కలసి నటించిన సినిమా ఏది?
ఎ) కొండవీటి సింహం బి) బొబ్బిలి పులి
సి) యమగోల డి) తిరుగులేని మనిషి
12 ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను..’ పాట రాసింది ఎవరు?
ఎ) ఆత్రేయ బి) సీతారామశాస్త్రి సి) వేటూరి డి) ఆరుద్ర
13 టి. కృష్ణ దర్శకత్వంలో శోభన్‌బాబు హీరోగా నటించిన సినిమా?
ఎ) రేపటి భారతం బి) వందేమాతరం
సి) దేవాలయం డి) మనిషికో చరిత్ర
14 ‘అడవి రాముడు’ సినిమాలో రాజబాబు వేసిన వేషం?
ఎ) వంటవాడు బి) ఫారెస్ట్ గార్డ్
సి) ఎన్టీఆర్ స్నేహితుడు డి) గూడెం మనిషి
15 ‘మాతృదేవోభవ’ చిత్ర దర్శకుడు ఎవరు?
ఎ) క్రాంతికుమార్ బి) కె. విశ్వనాథ్
సి) కె. అజయ్‌కుమార్ డి) కె. రాఘవేంద్రరావు
16 ‘ఆకాశంలో బస్సు మబ్బులు’ వంటి వింత పద ప్రయోగాలతో నవ్వించిన హాస్యనటి ఎవరు?
ఎ) శ్రీలక్ష్మి బి) రమాప్రభ
సి) కోవై సరళ డి) మనోరమ
17 తన స్వీయ జీవిత కథతో రూపొందిన సినిమాతో నటిగా
పరిచయమైన క్రీడాకారిణి ఎవరు?
ఎ) పీటీ ఉష బి) అశ్వినీ నాచప్ప సి) మేరీ కోమ్ డి) మిథాలీ రాజ్
18 హిందీ నటుడు అనిల్ కపూర్ నటించిన తెలుగు సినిమా?
ఎ) గోరంత దీపం బి) వంశవృక్షం
సి) తూర్పు వెళ్లే రైలు డి) రాజాధి రాజు
19 19జేడీ చక్రవర్తి అసలు పేరేంటి?
ఎ) జొన్నవిత్తుల ధార్మిక చక్రవర్తి
బి) జొన్నలగడ్డ ధర్మేంద్ర చక్రవర్తి
సి) నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి
డి) నల్లమలుపు శ్రీనివాస చక్రవర్తి
సమాధానాలు: 1) ఎ 2) సి (‘సైజ్ జీరో’లోనూ ఏంజెల ఐటమ్ సాంగ్ చేశారు)
3) డి 4) బి 5) బి 6) డి 7) సి (వీవీ వినాయక్‌తో ‘ఆది’, ‘సాంబ’,
‘అదుర్స్’... రాజమౌళితో ‘స్టూడెంట్ నెం1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’) 8) డి 9) బి
10) ఎ 11) డి 12) సి 13) సి 14) ఎ 15) సి 16) ఎ 17) బి 18) బి 19) సి 20) ఎ
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచి
20 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!