తెలుగింటి పచ్చడి భలే టేస్టీ.. | Now my second place in Hyderabad | Sakshi
Sakshi News home page

తెలుగింటి పచ్చడి భలే టేస్టీ..

Published Tue, Jan 19 2016 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

తెలుగింటి పచ్చడి భలే టేస్టీ..

తెలుగింటి పచ్చడి భలే టేస్టీ..

రెండేళ్లుగా హైదరాబాద్ నా హోమ్ టౌన్ అయిపోయింది. నా సొంత ఊరు ఢిల్లీకి చుట్టపు చూపుగా వెళ్లి రావడం తప్ప.. అక్కడున్న రోజులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అందుకే ఇక్కడికి మకాం మార్చేయాలనుకున్నా. ప్రస్తుతానికైతే అద్దె ఇంట్లో ఉంటున్నా. త్వరలో సొంత ఇల్లు కొనుక్కుంటాను. తెలుగు పరిశ్రమకు దగ్గరగా ఉండాలనే ఆకాంక్షతో పాటు ఈ సిటీ చాలా నచ్చింది. అందుకే ఇక్కడే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిపోయా. తెలుగు కూడా కొంచెం కొంచెం మాట్లాడగలుగుతున్నా.

షూటింగ్‌లో భాగంగా నేను హైదరాబాద్‌లో చాలా ప్లేసెస్‌కి వెళ్లాను. వంటకాల గురించి చెప్పాలంటే.. తెలుగింటి పచ్చళ్లు భలే రుచిగా ఉంటాయి. నాకిక్కడ ఎక్కువగా నచ్చేవి అవే. పండగలప్పుడు సిటీ చాలా సందడిగా ఉంటుంది. వినాయక చవితి చెప్పక్కర్లేదు. రంజాన్ మాసంలో ఓల్డ్ సిటీకి కొత్త కళ వచ్చేస్తుంది. నేను ఢిల్లీ అమ్మాయినే అయినా ఇప్పుడు ‘హైదరాబాదీ గాళ్’ అనిపించుకోవడం కూడా ఆనందంగా ఉంది. ఓవరాల్‌గా హైదరాబాద్‌లో నా జీవితం చాలా హాయిగా ఉంది.                రాశిఖన్నా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement