సిద్ధార్థ్‌ ఛాన్స్‌ ఇచ్చారు | Siddharth gave Chance to rasi | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ్‌ ఛాన్స్‌ ఇచ్చారు

May 19 2017 1:49 AM | Updated on Sep 5 2017 11:27 AM

సిద్ధార్థ్‌ ఛాన్స్‌ ఇచ్చారు

సిద్ధార్థ్‌ ఛాన్స్‌ ఇచ్చారు

నటుడు సిద్ధార్ద్‌ ఛాన్స్‌ ఇచ్చారని తెగ సంబరపడిపోతోంది నటి రాశీఖన్నా.

నటుడు సిద్ధార్ద్‌ ఛాన్స్‌ ఇచ్చారని తెగ సంబరపడిపోతోంది నటి రాశీఖన్నా. ఈ భామ అంతగా ఆనందపడిపోవడానికి కారణం ఏమిటనేగా మీ ఆసక్తి. బాలీవుడ్‌లో నటిగా పరిచయం అయిన రాశీఖన్నా, ఆ తరువాత టాలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. అక్కడ అవకాశాలను బాగానే రాబట్టుకున్న ఈ బ్యూటీకి తాజాగా కోలీవుడ్‌పై కన్ను పడింది. అంతే ఇప్పుడు ఒకేసారి ఏకంగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. అందులో ఒక చిత్రం ఇమైకా నోడిగళ్‌. ఇందులో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే రాశీఖన్నా పాత్ర ఏమిటనేగా మీ సందేహం తను నటుడు అధర్వతో రొమాన్స్‌ చేస్తోంది. మరో చిత్రం సైతాన్‌ కీ బచ్చా. ఇందులో సిద్ధార్థ్‌ కథానాయకుడు.

ఈ చిత్రాల గురించి రాశీఖన్నా తెలుపుతూ తాను తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నా కోలీవుడ్‌లో పరిచయం అవ్వాలన్న కోరిక చాలా కాలంగా ఉండేదని చెప్పింది. ఆ విషయాన్ని ఒకసారి నటుడు సిద్ధార్థ్‌కు చెప్పానని, అది జ్ఞాపకం ఉంచుకున్న ఆయన సైతాన్‌ కీ బచ్చా చిత్రంలో అవకాశం కల్పించారని చెప్పింది. ఇందులో తనది చాలా జాలీగా ఉండే పాత్ర అని తెలిపింది. ఇమైకా నోడిగళ్‌ చిత్రంలో ఆందుకు పూర్తి భిన్నమైన పాత్ర అని చెప్పుకొచ్చింది. అయినా రెండు చిత్రాల్లోనూ నటించడానికి స్కోప్‌ ఉన్న పాత్రలు లభించడం చాలా సం తోషంగా ఉందని అంది.

మలయాళంలోనూ విలన్‌ అనే చి త్రం ద్వారా పరిచయం కానున్నానని చెప్పింది. ప్రస్తుతం మలయాళ భాష నేర్చుకుంటున్నానని, మలయాళం భాష తెలిస్తే తమిళ భాష నేర్చుకోవడం సులభం అంటున్నారని, తదుపరి తమిళ భాష నేర్చుకుంటానని రాశీఖన్నా అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement