నేనే విలన్‌ | Rasikhanna villain character in malayalam movie | Sakshi
Sakshi News home page

నేనే విలన్‌

Published Mon, Apr 10 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

నేనే విలన్‌

నేనే విలన్‌

కమర్షియల్‌ సినిమాల్లో కథానాయికల సీన్‌ ఎంత? ఎక్కువగా అందాల కొలతలు చూపించేంత మాత్రమే! అప్పుడప్పుడూ అందంతో పాటు అభినయం చూపించడానికి ఆస్కారమున్న పాత్రలు లభిస్తే... ఎవరూ వదులుకోరు. తమ టాలెంట్‌ చూపించాలనుకుంటారు. చూపిస్తారు కూడా. ఇప్పుడు తనకు అటువంటి ఛాన్స్‌ వచ్చిందంటున్నారు రాశీఖన్నా.

‘సుప్రీమ్‌’, ‘శివమ్‌’ సినిమాల్లో అందంతో పాటు తనలోని కామెడీ యాంగిల్‌ చూపించారీ సుందరి. ఇప్పుడు ఏకంగా విలన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. మమ్ముట్టి హీరోగా బి. ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మలయాళ సినిమాలో రాశీఖన్నా రఫ్‌ అండ్‌ టఫ్‌ పోలీసాఫీసర్‌గా విలన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ‘‘వెండితెరపై ఇప్పటివరకూ నాలో చూడని కొత్త కోణం చూపిస్తా. విలనిజంతో మెప్పిస్తా. మలయాళంలో నా మొదటి చిత్రమిది. చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అన్నారామె. తెలుగు నటుడు శ్రీకాంత్, విశాల్, హన్సిక నటిస్తున్న ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో మరికొందరు నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌లో కనిపిస్తారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement