villain character
-
కలర్ ఫోటో సుహాస్ ని విలన్ ని చేసిన కీర్తి సురేష్
-
చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు
80,90లలో విలన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి సౌత్‌లో మంచి గుర్తింపు పొందిన నటుడు పొన్నంబలం. తమిళ నటుడైన ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ప్రతికథానాయకుడిగా మెప్పించాడు. తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి సౌత్‌లో ఇండస్ట్రీలో విలన్‌గా రాణించాడు. చదవండి: నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు ప్రస్తుతం ఆడపదడపా చిత్రాలు చేస్తున్న ఆయన గతేడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో కనీసం వైద్యం కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీంతో పొన్నంబలం ఆర్థిక సాయం కోసం మెగాస్టార్ చిరంజీవికి మెసేజ్ చేయడంతో ఆయన స్పందించి చేయూత ఇచ్చారని తాజా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. కిడ్నీ సర్జరీ అనంతరం కోలుకున్న ఆయన ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తనకు చిరంజీవి అన్నయ్య వైద్యం చేయించారని తెలిపాడు. చదవండి: వైరస్ వచ్చి నేను తప్ప మగజాతి అంతా పోవాలి: వర్మ సంచలన వ్యాఖ్యలు ‘రెండు సంవత్సరాల క్రితం నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఎవరైనా సాయం చేస్తారాని అని వేచి చూస్తున్నాను. అప్పుడే నాకు చిరంజీవి గుర్తుకు రావడంతో.. నా ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకుని మెగాస్టార్ అన్నయ్యకు నా అనారోగ్యం గురించి మెసేజ్ చేశాను. వెంటనే ఆన్నయ్య ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మన్నారు. రాలేను అని చెప్పడంతో సరే అని చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వు అని చెప్పారు’ అని తెలిపాడు. మెగాస్టార్ చెప్పినట్లుగానే అక్కడి వెళ్లానని, ఎంట్రీ ఫీజు కూడా లేకుండా నా వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు ఆయనే భరించారు. నా వైద్యానికి మొత్తం రూ. 40 లక్షలు ఖర్చు అయ్యిందని, ఆ మెుత్తం డబ్బును చిరంజీవి ఇచ్చారు. అడగ్గానే లక్ష రూపాయలో లేదా 2 లక్షలో చిరంజీవి సాయం చేస్తారు అనుకున్నా. గానీ 40 లక్షలు ఇస్తారని అనుకోలేదు అంటూ పోన్నంబలం భావోద్వేగానికి గురైయ్యాడు. నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక @KChiruTweets గారినడిగితే 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే - నేనున్నా అని చెప్పి 5ని||లో దగ్గరలో ఉన్న అపోలో కి వెళ్ళమని అడ్మిట్ అవ్వమన్నారు - అక్కడ నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు మొత్తం 40లక్షలయ్యంది ఆయనే చూస్కున్నారు🙏 pic.twitter.com/HHdBcSiwPm — 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) March 15, 2023 -
‘సాహో’తో మళ్లీ వస్తున్నాడోచ్!
లాల్... మలయాళంలో మంచి పేరున్న నటుడీయన. రచయిత కూడా! ఈయనకు ప్రభాస్ అండ్ టీమ్ నుంచి కబురు వెళ్లింది. మేటర్ ఏంటంటే... ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’లోని ఓ కీలక పాత్రలో నటించమని అడిగితే, లాల్ వెంటనే ఓకే చెప్పేశారట. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘సాహో’ షూటింగులో త్వరలో లాల్ పాల్గొంటారని సమాచారం. అన్నట్టు... తెలుగు తెరపై ఈయన కనిపించనున్న మూడో చిత్రమిది. అంతకు ముందు పవన్ కల్యాణ్ ‘అన్నవరం’, రవితేజ ‘ఖతర్నాక్’ సిన్మాల్లో విలన్‌గా చేశారు. ‘సాహో’లోనూ ఈయనది విలన్ పాత్రేనట! సుమారు 11 ఏళ్ల తర్వాత ‘సాహో’తో మళ్లీ విలన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు లాల్ వస్తున్నారన్న మాట! ఇప్పుడీయన చేయబోయే పాత్రకు ముందు మోహన్‌లాల్‌ను అనుకున్నారట! మరి ఏమైందో? చివరకు, ఈయన వచ్చారు. -
నేనే విలన్
కమర్షియల్ సినిమాల్లో కథానాయికల సీన్ ఎంత? ఎక్కువగా అందాల కొలతలు చూపించేంత మాత్రమే! అప్పుడప్పుడూ అందంతో పాటు అభినయం చూపించడానికి ఆస్కారమున్న పాత్రలు లభిస్తే... ఎవరూ వదులుకోరు. తమ టాలెంట్ చూపించాలనుకుంటారు. చూపిస్తారు కూడా. ఇప్పుడు తనకు అటువంటి ఛాన్స్ వచ్చిందంటున్నారు రాశీఖన్నా. ‘సుప్రీమ్’, ‘శివమ్’ సినిమాల్లో అందంతో పాటు తనలోని కామెడీ యాంగిల్ చూపించారీ సుందరి. ఇప్పుడు ఏకంగా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. మమ్ముట్టి హీరోగా బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న మలయాళ సినిమాలో రాశీఖన్నా రఫ్ అండ్ టఫ్ పోలీసాఫీసర్‌గా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ‘‘వెండితెరపై ఇప్పటివరకూ నాలో చూడని కొత్త కోణం చూపిస్తా. విలనిజంతో మెప్పిస్తా. మలయాళంలో నా మొదటి చిత్రమిది. చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అన్నారామె. తెలుగు నటుడు శ్రీకాంత్, విశాల్, హన్సిక నటిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో మరికొందరు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో కనిపిస్తారట! -
విలన్ పాత్ర చేద్దామనుకున్నా: హృతిక్
ఇండోర్: సోషియా ఫాంటసీ సినిమా 'క్రిస్ 3'లో సూపర్ హీరో పాత్ర పోషించిన హృతిక్ రోషన్ విలన్ క్యారెక్టర్లో నటించాలనుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ సినిమాలో విలన్ వేషం వేయాలకున్నానని, కానీ తన తండ్రి రాకేష్ రోషన్ అందుకు ఒప్పుకోలేదని తెలిపాడు. ఈ పాత్రను వివేక్ ఒబరాయ్తో చేయించారని చెప్పాడు. తన తండ్రి నమ్మకాన్ని వివేక్ వమ్ము చేయలేదని అన్నాడు. 'కాల్' పాత్రలో వివేక్ నటన చూసిన తర్వాత తన తండ్రి తీసుకున్న నిర్ణయం కరెక్టని అనిపించిందని హృతిక్ వివరించాడు. ఇండోర్‌లో 'క్రిస్ 3' ప్రమోషన్ కార్యక్రమంలో హృతిక్, రాకేష్ రోషన్ పాల్గొన్నారు. నవంబర్ 1న 'క్రిస్ 3' చిత్రం విడుదలకానుంది.