Actor Ponnambalam Revealed Chiranjeevi Helped Rs 40 Lakh For Kidney Surgery Treatment - Sakshi
Sakshi News home page

Actor Ponnambalam About Chiranjeevi: చిరంజీవి అన్నయ్యకు వల్లే బతికాను.. నాకు వైద్యం చేయించారు: నటుడు పొన్నంబలం

Published Wed, Mar 15 2023 8:55 PM | Last Updated on Thu, Mar 16 2023 10:43 AM

Actor Ponnambalam Revealed Chiranjeevi Helped Rs 40 Lakh For Treatment - Sakshi

80,90లలో విలన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి సౌత్‌లో మంచి గుర్తింపు పొందిన నటుడు పొన్నంబలం. తమిళ నటుడైన ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. మెగాస్టార్‌ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో విలన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ప్రతికథానాయకుడిగా మెప్పించాడు. తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి సౌత్‌లో ఇండస్ట్రీలో విలన్‌గా రాణించాడు.

చదవండి: నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్‌ ఇచ్చాడు: నటుడు

ప్రస్తుతం ఆడపదడపా చిత్రాలు చేస్తున్న ఆయన గతేడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో కనీసం వైద్యం కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీంతో పొన్నంబలం ఆర్థిక సాయం కోసం మెగాస్టార్‌ చిరంజీవికి మెసేజ్‌ చేయడంతో ఆయన స్పందించి చేయూత ఇచ్చారని తాజా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. కిడ్నీ సర్జరీ అనంతరం కోలుకున్న ఆయన ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తనకు చిరంజీవి అన్నయ్య వైద్యం చేయించారని తెలిపాడు.

చదవండి: వైరస్‌ వచ్చి నేను తప్ప మగజాతి అంతా పోవాలి: వర్మ సంచలన వ్యాఖ్యలు

‘రెండు సంవత్సరాల క్రితం నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఎవరైనా సాయం చేస్తారాని అని వేచి చూస్తున్నాను. అప్పుడే నాకు చిరంజీవి గుర్తుకు రావడంతో.. నా ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకుని మెగాస్టార్‌ అన్నయ్యకు నా అనారోగ్యం గురించి మెసేజ్‌ చేశాను. వెంటనే ఆన్నయ్య ఫోన్‌ చేసి హైదరాబాద్‌ రమ్మన్నారు. రాలేను అని చెప్పడంతో సరే అని చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వు అని చెప్పారు’ అని తెలిపాడు. మెగాస్టార్ చెప్పినట్లుగానే అక్కడి వెళ్లానని, ఎంట్రీ ఫీజు కూడా లేకుండా నా వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు ఆయనే భరించారు. నా వైద్యానికి మొత్తం  రూ. 40 లక్షలు ఖర్చు అయ్యిందని, ఆ మెుత్తం డబ్బును చిరంజీవి ఇచ్చారు. అడగ్గానే లక్ష రూపాయలో లేదా 2 లక్షలో చిరంజీవి సాయం చేస్తారు అనుకున్నా. గానీ 40 లక్షలు ఇస్తారని అనుకోలేదు అంటూ పోన్నంబలం భావోద్వేగానికి గురైయ్యాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement