Villain Artist
-
గుండెపోటుతో ప్రముఖ విలన్ కన్నుమూత!
ఈ మధ్య కాలంలో పలువురు నటీనటుల చనిపోవడం.. ఇండస్ట్రీతోపాటు సినీ ప్రేక్షకులకు తీరని శోకాన్ని మిగులుస్తోంది. సీనియర్ నటుడు శరత్ బాబు, సంగీత దర్శకుడు రాజ్, 'ఆర్ఆర్ఆర్' నటుడు రే స్టీవెన్ సన్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు మనల్ని వదిలి వెళ్లిపోతున్నారు. పలు సినిమాల్లో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఓ ప్రముఖ నటుడు కూడా ఇప్పుడు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) తమిళ, మలయాళ సినిమాల్లో విలన్ రోల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న కజాన్ ఖాన్.. జూన్ 12న అంటే సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ఎమ్ బాదుషా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 1992లో సెంతమిళ్ పట్టు (తెలుగులో 'అమ్మకొడుకు') అనే మూవీతో కజాన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఓవరాల్ మూవీ కెరీర్ లో గంధర్వం, సీఐడీ ద మూస, ద కింగ్, వర్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధిరాజా లాంటి మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. 2015లో వచ్చిన 'లైలా ఓ లైలా' చిత్రంలో చివరగా కనిపించారు. ఇప్పుడు ఆయన గుండెపోటుతో చనిపోవడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. (ఇదీ చదవండి: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్) -
నటుడి రెండో పెళ్లి.. మొదటి భార్య పోస్టులు వైరల్..
పోకిరి విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైన నటుడు ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రేమకు వయసుతో పని లేదని చెప్తూ 60 ఏళ్ల వయసులో ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాను పెళ్లాడాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ల పెళ్లి టాపికే నడుస్తోంది. ఈ క్రమంలో ఆశిష్ మొదటి భార్య రాజోషి(పిలూ విద్యార్థి) సోషల్ మీడియాలో పెట్టిన వరుస పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. రెండో భార్య రూపాలితో ఆశిష్ విద్యార్థి చిరునవ్వులు చిందిస్తున్న సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రాజోషి 'జీవితం అనే పజిల్లో గందరగోళానికి లోనవద్దు' అని రాసుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. 'నిన్ను అర్థం చేసుకునేవాడు ఎప్పుడూ నిన్ను ప్రశ్నించడు. నిన్ను బాధపెట్టే పనుల జోలికి అస్సలు వెళ్లడు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి' అని రాసుకొచ్చింది. మరో స్టోరీలో.. 'అతిగా ఆలోచిస్తూ అనవసర సందేహాలు పెట్టుకున్నావేమో కానీ ఇక మీదట అవి ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన క్లారిటీతో ఈ గందరగోళమంతా తుడిచిపెట్టుకుపోతుంది. నువ్వు చాలాకాలంగా స్ట్రాంగ్‌గా ఉన్నావు. ఇప్పుడు అందరి ఆశీర్వాదాలు తీసుకునే సమయం వచ్చింది. అందుకు నువ్వు పూర్తి అర్హురాలివి' అని రాసుకొచ్చింది. మొదటి భార్య రాజోషితో ఆశిష్ విద్యార్థి ఈ పోస్టులు చూసిన నెటిజన్లు తనసలు సంతోషంగానే ఉందా? ఆశిష్‌తో విడాకుల తీసుకున్న బాధ నుంచి బయటపడినట్లు అనిపించడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆశిష్ రెండో వివాహాంపై ఆమె పాజిటివ్‌గానే ఉన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రముఖ బెంగాలీ నటి శకుంతల బారువా తనయురాలే రాజోషి. గతంలో ఆశిష్..రాజోలీని పెళ్లాడగా వీరికి 23 ఏళ్ల ఆర్త్ అనే కుమారుడు ఉన్నాడు. ఆశిష్- రాజోషికి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో వీరు విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Piloo Vidyarthi (@piloovidyarthi) చదవండి: ప్రేమ అంటే గుడ్డిదేమో.. ఆశిష్ విద్యార్థిపై నెటిజన్ల సెటైర్లు ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్ 2 -
నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు
తమిళ నటుడు పొన్నంబలం ఇండస్ట్రీలో స్టంట్ మ్యాన్‌గా, విలన్‌గా గుర్తింపు పొందాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో విలన్‌గా నటించిన ఆయన సౌత్ ఇండస్ట్రీల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు. 80,90లో ప్రతికథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన అనంతరం సినిమాలకు దూరమయ్యాడు. చదవండి: చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు ప్రస్తుతం ఆడపదడపా సినిమాలు చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన గతేడాది తీవ్ర అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరాడు. సర్జరీ అనంతరం కోలుకున్న పొన్నంబలం ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సొంతవాళ్లే తనని చంపాలని చూశారంటూ షాకింగ్ విషయం బయటపెట్టారు. ‘నేను అతిగా తాగడం వల్లే నా కిడ్నీలు పాడయ్యాయని అందరు అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నా తమ్ముడే నాకు స్లో పాయిజన్ ఇచ్చి నన్ను చంపాలని చూశాడు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: హైదరాబాద్ చేరుకున్న తారక్.. ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్ హంగామా చూశారా? ‘మా నాన్నకు నలుగురు భార్యలు. మూడో భార్య కొడుకు నా మేనేజర్‌గా పని చేసేవాడు. నా ఎదుగుదలను తట్టుకోలేక నా ఆహారంలో, డ్రింక్స్‌లో స్లో పాయిజన్ కలిపాడు. ఆ విషయాన్ని వైద్యులు గుర్తించారు. అది తెలియక నేను వాడిని చాలా నమ్మాను. నేను వాడి బాగు కోరుకుని ఉద్యోగం ఇస్తే. నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్ను చంపాలని చూశాడు. అంతేకాదు నా మీద చేతబడి కూడా చేయించాడు. ఆ విషయం నాకు ఇటీవలే తెలిసింది’ అంటూ అని చెప్పుకొచ్చాడు. -
చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు
80,90లలో విలన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి సౌత్‌లో మంచి గుర్తింపు పొందిన నటుడు పొన్నంబలం. తమిళ నటుడైన ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ప్రతికథానాయకుడిగా మెప్పించాడు. తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి సౌత్‌లో ఇండస్ట్రీలో విలన్‌గా రాణించాడు. చదవండి: నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు ప్రస్తుతం ఆడపదడపా చిత్రాలు చేస్తున్న ఆయన గతేడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో కనీసం వైద్యం కూడా చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీంతో పొన్నంబలం ఆర్థిక సాయం కోసం మెగాస్టార్ చిరంజీవికి మెసేజ్ చేయడంతో ఆయన స్పందించి చేయూత ఇచ్చారని తాజా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. కిడ్నీ సర్జరీ అనంతరం కోలుకున్న ఆయన ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తనకు చిరంజీవి అన్నయ్య వైద్యం చేయించారని తెలిపాడు. చదవండి: వైరస్ వచ్చి నేను తప్ప మగజాతి అంతా పోవాలి: వర్మ సంచలన వ్యాఖ్యలు ‘రెండు సంవత్సరాల క్రితం నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఎవరైనా సాయం చేస్తారాని అని వేచి చూస్తున్నాను. అప్పుడే నాకు చిరంజీవి గుర్తుకు రావడంతో.. నా ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకుని మెగాస్టార్ అన్నయ్యకు నా అనారోగ్యం గురించి మెసేజ్ చేశాను. వెంటనే ఆన్నయ్య ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మన్నారు. రాలేను అని చెప్పడంతో సరే అని చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వు అని చెప్పారు’ అని తెలిపాడు. మెగాస్టార్ చెప్పినట్లుగానే అక్కడి వెళ్లానని, ఎంట్రీ ఫీజు కూడా లేకుండా నా వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు ఆయనే భరించారు. నా వైద్యానికి మొత్తం రూ. 40 లక్షలు ఖర్చు అయ్యిందని, ఆ మెుత్తం డబ్బును చిరంజీవి ఇచ్చారు. అడగ్గానే లక్ష రూపాయలో లేదా 2 లక్షలో చిరంజీవి సాయం చేస్తారు అనుకున్నా. గానీ 40 లక్షలు ఇస్తారని అనుకోలేదు అంటూ పోన్నంబలం భావోద్వేగానికి గురైయ్యాడు. నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక @KChiruTweets గారినడిగితే 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే - నేనున్నా అని చెప్పి 5ని||లో దగ్గరలో ఉన్న అపోలో కి వెళ్ళమని అడ్మిట్ అవ్వమన్నారు - అక్కడ నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు మొత్తం 40లక్షలయ్యంది ఆయనే చూస్కున్నారు🙏 pic.twitter.com/HHdBcSiwPm — 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) March 15, 2023 -
అందరూ చూస్తుండగానే కత్తిపోట్లు
హైదరాబాద్: పట్టపగలు ఓ యువకుడు కత్తిపోట్లకు గురై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు. అందరు చూస్తుండగానే జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. హుమాయున్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం... చింతల్‌బస్తీ ప్రేమ్‌నగర్‌లో నివసించే రవూఫ్ కుమారుడు ఫయాజ్ (25) బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఆయన వదిన షీమా నవాజ్‌కు బంజారాహిల్స్ రేషంబాగ్లో ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అబ్దుల్ రహమాన్ అలియాస్ బాబా అద్దెకు ఉంటున్నాడు. ఇతనిని ఏడాదిగా ఖాళీ చేయాలని షీమా కోరుతోంది. వినకపోవడంతో మరిది ఫజాయ్కు తెలిపింది. అతను చెప్పినా రహమాన్ వినలేదు. బాధితుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు రహమాన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో రహమాన్ ఫయాజ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం ఫయాజ్ తన కారు మరమ్మతుల కోసం మాసాబ్‌ట్యాంక్‌లోని చాచానెహ్రు పార్కు సమీపంలోని మెకానిక్ దుకాణానికి వచ్చాడు. రహమాన్ అక్కడకు వచ్చి ఫయాజ్ఫై ఒక్కసారిగా కత్తితో దాడిచేసి విచక్షణ రహితంగా పొడిచాడు. చుట్టుపక్కల వారు భయంతో పరుగులు పెట్టారు. బంధువులు ఫయాజ్ను బంజారాహిల్స్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. సినిమాల్లో విలన్... కాగా అబ్దుల్ రహమాన్ అలియాస్ బాబా పలు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు.