
ఈ మధ్య కాలంలో పలువురు నటీనటుల చనిపోవడం.. ఇండస్ట్రీతోపాటు సినీ ప్రేక్షకులకు తీరని శోకాన్ని మిగులుస్తోంది. సీనియర్ నటుడు శరత్ బాబు, సంగీత దర్శకుడు రాజ్, 'ఆర్ఆర్ఆర్' నటుడు రే స్టీవెన్ సన్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు మనల్ని వదిలి వెళ్లిపోతున్నారు. పలు సినిమాల్లో విలన్ గా నటించి గుర‍్తింపు తెచ్చుకున్న ఓ ప్రముఖ నటుడు కూడా ఇప్పుడు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.
(ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా)
తమిళ, మలయాళ సినిమాల్లో విలన్ రోల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న కజాన్ ఖాన్.. జూన్ 12న అంటే సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ఎమ్ బాదుషా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 1992లో సెంతమిళ్ పట్టు (తెలుగులో 'అమ్మకొడుకు') అనే మూవీతో కజాన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఓవరాల్ మూవీ కెరీర్ లో గంధర్వం, సీఐడీ ద మూస, ద కింగ్, వర‍్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధిరాజా లాంటి మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. 2015లో వచ్చిన 'లైలా ఓ లైలా' చిత్రంలో చివరగా కనిపించారు. ఇప్పుడు ఆయన గుండెపోటుతో చనిపోవడం ఇండస్ట‍్రీలో విషాదాన్ని నింపింది.
(ఇదీ చదవండి: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్)
Comments
Please login to add a commentAdd a comment