ప్రతి ఇంట్లో ఒకడుంటాడు! | ram movie title confirmed with Santosh Srinivas direction hyper | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంట్లో ఒకడుంటాడు!

Published Sun, Jul 31 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

ప్రతి ఇంట్లో ఒకడుంటాడు!

ప్రతి ఇంట్లో ఒకడుంటాడు!

‘‘రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌కి, సినిమాలో క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్లుండే టైటిల్. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ‘హైపర్’గా ఉండేవారు ఒకరుంటారు. అలాంటి కుర్రాడి కథ ఇది’’ అన్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి ‘హైపర్’ టైటిల్ పరిశీలనలో ఉందన్న సంగతి తెలిసిందే. శనివారం ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.. అనేది ఉపశీర్షిక.

ఆగస్టు 3న ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘కుటుంబ నేపథ్యంలో జరిగే యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: హరీశ్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయినపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement