ముగ్గురమ్మాయిలతో..? | Three heroines for Allu Arjun? | Sakshi
Sakshi News home page

ముగ్గురమ్మాయిలతో..?

Published Wed, Apr 2 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

ముగ్గురమ్మాయిలతో..?

ముగ్గురమ్మాయిలతో..?

‘రేసు గుర్రం’ తర్వాత అల్లు అర్జున్ చేయనున్న చిత్రానికి రంగం సిద్ధమైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ‘జులాయి’ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే కథ సిద్ధమైంది. ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారనేది ఫిలిమ్‌నగర్ సమాచారం. ఇప్పటికే ఒక కథానాయికగా సమంతను ఎంచుకున్నారు. మరో ఇద్దరు నాయికల అన్వేషణ జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఆరు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసి అక్టోబరులో విడుదల చేసే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్. ‘జులాయి’ నిర్మాతల్లో ఒకరైన రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement