three heroines
-
డ్రగ్స్ కేసులో హీరోయిన్లకు నోటీసులు
-
డ్రగ్స్ కేసులో హీరోయిన్లకు నోటీసులు
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సినీతారల లిస్ట్ పెరుగుతోంది. ఇప్పటికే 15 మందికి నోటీసులు పంపిన సిట్ అధికారులు, తాజాగా మరో ముగ్గురు హీరోయిన్లకు కూడా నోటీసులు పంపించారు. ఈ నెల 19 నుంచి వీరిని సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న గాయనీ భర్త, బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న యువ నటుడు, నిర్మాతగా మారిన ఓ నటుడు, మరో డాషింగ్ డైరెక్టర్ ఉన్నట్టుగా సమాచారం. -
ముగ్గురు భామలతో కమల్
విశ్వనాయకుడు కమలహాసన్ తన చిత్రంలో ఈ మధ్య ముగ్గురు హీరోయిన్లకు తక్కువ నటించడం లేదు. ఆ మధ్య నటించిన దశావతారం చిత్రంలో ఆశిన్, జయప్రద, మల్లికా షెరావత్ అంటూ ముగ్గురు హీరోయిన్లతో నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తరువాత విశ్వరూపం చిత్రంలో ఆండ్రియా, పూజాకుమార్‌లతో డ్యూయెట్స్ పాడారు. ఆ చిత్రం విజయాన్ని చూసింది. అయితే ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే విశ్వరూపం-2 చిత్రం చేశారు. అందులోనూ ఆ ఇద్దరే హీరోయిన్లు. ఇక ఇటీవల విడుదలైన ఉత్తమవిలన్ చిత్రంలో ఆండ్రియా, పూజాకుమార్, ఊర్వశి, పార్వతి నాయర్, పార్వతి మీనన్ అంటూ ఐదుగురు కథానాయికలతో నటించారు. ఈ చిత్రం విమర్శకులను మెప్పించింది. విశ్వరూపం-2 విడుదల కావలసి ఉంది.కమల్ నటించిన తాజా చిత్రం పాపనాశనం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో నటి గౌతమి ఒక్కరే నాయకి. కమల్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్‌కు రెడీ అవుతున్నారు. ఈ చిత్ర కథ జేమ్స్‌బాండ్ చిత్రాల తరహాలో ఉంటుందని తెలిసింది. ఆ తరహా చిత్రం అంటే ఖచ్చితంగా హీరోయిన్లు ఇద్దరికి మించే ఉంటారు. ఈ చిత్రానికి తూంగావనం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో నటి త్రిష హీరోయిన్గా ఎంపికయ్యారు. తాజాగా మనీషాకొయిరాలా, అనైకసోటి నటించనున్నట్లు సమాచారం. త్రిష ఇప్పటికే కమలహాసన్ సరసన మన్మథన్ అన్భులో నటించారు. మనీషా కొయిరాలా ముంబయి ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటించారు. అనైక మాత్రం కమల్‌తో తొలిసారిగా నటించే లక్కీచాన్స్ కొట్టేసింది. విశ్వరూపం సీక్వెల్స్‌ను, ఉత్తమ విలన్ చిత్రంలోనూ వరుస అవకాశాలు కల్పించిన ఆండ్రియా, పూజాకుమార్లకు చిత్రంలో కమల్ స్థానం కనిపించలేదు. -
ముగ్గురు ముద్దుగుమ్మల మధ్య పోటీ!
టాలీవుడ్ జులాయి సరసన నటించేందుకు ముగ్గురు అందమైన భామలు పోటీపడుతున్నారు. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు లీడ్ రోల్ చెయ్యడానికి గొడవపడుతున్నారనుకునేరు. అదేంకాదు. మూడో హీరోయిన్గా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌తో చిందులేయనున్నారు. ఈ చిత్రంలో బన్నీతో కలిసి నటించడానికి టాలీవుడ్ హీరోయిన్లు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. జులాయి తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడో హీరోయిన్గా నటించే ఛాన్స్ కోసం ఈ ముగ్గురు హీరోయిన్లు పోటీపడుతున్నారు. మలయాళ బ్యూటీ నయనతార, ఉహలు గుసగుసలాడే ఫేమ్ రాశీ ఖన్నా, ప్రణీత ఈ రేస్‌లో ఉన్నారని సమాచారం. ఈ మూవీలో అల్లు అర్జున్ ముగ్గురు హాట్ బ్యూటీస్‌తో రొమాన్స్ చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమంత లీడ్ రోల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్గా రెండో హీరోయిన్గా నటించే అవకాశాన్ని హార్ట్ఎటాక్ ఫేమ్ ఆదా శర్మా సొంతంచేసుకుంది. మూడో హీరోయిన్ ఎంపిక జరుగవలసి ఉంది. ఈ పాత్రకు దాదాపు ప్రణీత ఫిక్స్ అయిందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ** -
ముగ్గురమ్మాయిలతో..?
‘రేసు గుర్రం’ తర్వాత అల్లు అర్జున్ చేయనున్న చిత్రానికి రంగం సిద్ధమైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ‘జులాయి’ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే కథ సిద్ధమైంది. ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారనేది ఫిలిమ్‌నగర్ సమాచారం. ఇప్పటికే ఒక కథానాయికగా సమంతను ఎంచుకున్నారు. మరో ఇద్దరు నాయికల అన్వేషణ జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఆరు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసి అక్టోబరులో విడుదల చేసే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్. ‘జులాయి’ నిర్మాతల్లో ఒకరైన రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.