ముగ్గురు భామలతో కమల్
విశ్వనాయకుడు కమలహాసన్ తన చిత్రంలో ఈ మధ్య ముగ్గురు హీరోయిన్లకు తక్కువ నటించడం లేదు. ఆ మధ్య నటించిన దశావతారం చిత్రంలో ఆశిన్, జయప్రద, మల్లికా షెరావత్ అంటూ ముగ్గురు హీరోయిన్లతో నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తరువాత విశ్వరూపం చిత్రంలో ఆండ్రియా, పూజాకుమార్‌లతో డ్యూయెట్స్ పాడారు. ఆ చిత్రం విజయాన్ని చూసింది. అయితే ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే విశ్వరూపం-2 చిత్రం చేశారు. అందులోనూ ఆ ఇద్దరే హీరోయిన్లు.
ఇక ఇటీవల విడుదలైన ఉత్తమవిలన్ చిత్రంలో ఆండ్రియా, పూజాకుమార్, ఊర్వశి, పార్వతి నాయర్, పార్వతి మీనన్ అంటూ ఐదుగురు కథానాయికలతో నటించారు. ఈ చిత్రం విమర్శకులను మెప్పించింది. విశ్వరూపం-2 విడుదల కావలసి ఉంది.కమల్ నటించిన తాజా చిత్రం పాపనాశనం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో నటి గౌతమి ఒక్కరే నాయకి. కమల్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్‌కు రెడీ అవుతున్నారు. ఈ చిత్ర కథ జేమ్స్‌బాండ్ చిత్రాల తరహాలో ఉంటుందని తెలిసింది.
ఆ తరహా చిత్రం అంటే ఖచ్చితంగా హీరోయిన్లు ఇద్దరికి మించే ఉంటారు. ఈ చిత్రానికి తూంగావనం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో నటి త్రిష హీరోయిన్‌గా ఎంపికయ్యారు. తాజాగా మనీషాకొయిరాలా, అనైకసోటి నటించనున్నట్లు సమాచారం. త్రిష ఇప్పటికే కమలహాసన్ సరసన మన్మథన్ అన్భులో నటించారు. మనీషా కొయిరాలా ముంబయి ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటించారు. అనైక మాత్రం కమల్‌తో తొలిసారిగా నటించే లక్కీచాన్స్ కొట్టేసింది. విశ్వరూపం సీక్వెల్స్‌ను, ఉత్తమ విలన్ చిత్రంలోనూ వరుస అవకాశాలు కల్పించిన ఆండ్రియా, పూజాకుమార్‌లకు చిత్రంలో కమల్ స్థానం కనిపించలేదు.