డ్రగ్స్ కేసులో హీరోయిన్లకు నోటీసులు
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సినీతారల లిస్ట్ పెరుగుతోంది. ఇప్పటికే 15 మందికి నోటీసులు పంపిన సిట్ అధికారులు, తాజాగా మరో ముగ్గురు హీరోయిన్లకు కూడా నోటీసులు పంపించారు. ఈ నెల 19 నుంచి వీరిని సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న గాయనీ భర్త, బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న యువ నటుడు, నిర్మాతగా మారిన ఓ నటుడు, మరో డాషింగ్ డైరెక్టర్ ఉన్నట్టుగా సమాచారం.