Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. తనయుడు ఆకాష్ పూరి, చార్టెడ్ అకౌంటెంట్‌తో కలిసి పూరి జగన్నాథ్ ఈడీ కార్యాలయ్యానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై ఈడీ ఆయన్ను ప్రశ్నించనుంది.విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే 'ఫెమా' కేసులూ నమోదు చేసే యోచనలో ఉంది.
విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో పూరీ జగన్నాథ్‌తో పాటు రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు.
ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖులు, విచారణ తేదీ
1.పూరి జగన్నాథ్ – ఆగస్టు 31
2.ఛార్మి – సెప్టెంబర్ 2
3.రకుల్‌ప్రీత్ సింగ్ – సెప్టెంబర్ 6
4.రాణా దగ్గుబాటి – సెప్టెంబర్ 8
5.రవితేజ – సెప్టెంబర్ 9
6.శ్రీనివాస్ – సెప్టెంబర్ 9
7.నవదీప్ – సెప్టెంబర్ 13
8 ఎఫ్ క్లబ్ జీఎం – సెప్టెంబర్ 13
9.ముమైత్ ఖాన్ – సెప్టెంబర్ 15
10.తనీష్ – సెప్టెంబర్ 17
11.నందు – సెప్టెంబర్ 20
12.తరుణ్ – సెప్టెంబర్ 22
చదవండి : జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను విచారించిన ఈడీ
డ్రగ్స్ కేసు: సెలబ్రిటీల ఇంట్లో సోదాలు చేసే అవకాశం?
Comments
Please login to add a commentAdd a comment