
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : రెండేళ్ల తరువాత పెళ్లి కబురు చెబుతానని నటి ప్రణీత సుభాష్( అత్తారింటికి దారేది ఫేం) పేర్కొన్నారు. విశాఖలో ఓ ప్రయివేటు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే మంచి సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని, అత్తారింటికి దారేదితో టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడిందన్నారు. తనకు ఇష్టమైన నటుడు పవన్‌కల్యాణ్ అని పేర్కొన్నారు. ఇప్పుడు నా దృష్టంతా కెరీర్‌పైనే ఉందని, రెండేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు. మంచి కథలతో వస్తే భాషతో సంబంధం లేకుండా నటిస్తానన్నారు.
బిగ్‌బజార్‌లో సందడి
ద్వారకానగర్ బిగ్ జార్‌లో ప్రముఖ హీరోయిన్ ప్రణీత (అత్తారింటికి దారేది ఫేం) సందడి చేసింది. ప్రముఖ ఫ్యాబ్రిక్ కేర్ బ్రాండ్‌లో ఒకటైన టైడ్ ప్లస్ అదనపు పవర్‌తో తయారు చేసిన నూతన ‘టైడ్ ప్లస్ ఎగస్ట్రా పవర్’ను ప్రణీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు టైడ్ ఎగస్ట్రా పవర్ వాడాలన్నారు. బిగ్‌బజారు స్టోర్ మేనేజర్ భానుప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ ప్రాడెక్ట్‌కు ప్రణీత ప్రచారకర్తగా ఉన్నారని తెలిపారు. ప్రణీతను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తూ ప్రణీత సందడి చేశారు.