
ఈ మధ్యే తొలి బాలీవుడ్ సినిమా చేయడానికి అంగీకరించారు ప్రణీతా సుభాష్. అజయ్ దేవగణ్, సంజయ్ దత్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ ద్వారా హిందీ తెరకు పరిచయం కానున్నారామె. ఈ సినిమా పూర్తికాకముందే మరో హిందీ సినిమా అంగీకరించారు ప్రణీత. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఏడేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న హిందీ చిత్రం ‘హంగామా 2’లో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు ఈ బ్యూటీ.
ఈ చిత్రం గురించి ప్రణీత మాట్లాడుతూ – ‘‘నేను ఇప్పటివరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రం చేయలేదు. ఎక్కువ శాతం పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో లేదా హీరోని బాగా ప్రేమించే అమ్మాయిలానే కనిపించాను. వాటికి భిన్నంగా ఉంటే ‘హంగామా 2’ నాకో కొత్త అనుభవంలా ఉండబోతోంది’’ అన్నారు. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు ఒకే రోజున (వచ్చే ఏడాది ఆగస్ట్ 14 రిలీజ్ కాబోతున్నాయి. ఆ విధంగా హిందీ స్క్రీన్‌పై ఒకేసారి డబుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రణీత.
Comments
Please login to add a commentAdd a comment