
రానా దగ్గుబాటి హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకుడు. 25 ఏళ్లుగా అడవిలో జీవించే ఒక వ్యక్తి కథ ఇది. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చించే సినిమా. మార్చి 26న చిత్రం విడుదల కానుంది ‘‘నాపై మీరు (ప్రేక్షకులు) చూపించిన ప్రేమ, ఓర్పు, మద్దతుకు ధన్యవాదాలు. మీరందరూ ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు రానా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ అశోక్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment