ఆఫీషియల్‌: మరో పాన్‌ ఇండియా మూవీకి రానా గ్రీన్‌ సిగ్నల్‌ | Rana Daggubati Signed For Another Pan India Movie | Sakshi
Sakshi News home page

ఆఫీషియల్‌: మరో పాన్‌ ఇండియా మూవీకి రానా గ్రీన్‌ సిగ్నల్‌

Published Fri, Apr 30 2021 6:25 PM | Last Updated on Fri, Apr 30 2021 8:32 PM

Rana Daggubati Signed For Another Pan India Movie - Sakshi

బాహుబలి చిత్రంతో పాన్‌ ఇండియా నటుడిగా ఎదిగాడు హీరో రానా. లీడర్‌ మూవీతో దగ్గుబాటి వారసుడిగా తెలుగు తెరకు పరిచమైన రానా ఆ తర్వాత ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ తనకంటు ప్రత్యేకు గుర్తింపును తెచ్చుకున్నాడు. విభిన్న ప్రాతలను, కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న రానా ప్రస్తుతం అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌ అనే మలయాళం రీమేక్‌ మూవీలో లీడ్‌రోల్‌ పోషిస్తున్నాడు.

ఇప్పటికే బాహుబలి వంటి పాన్‌ చిత్రాల్లో నటించిన ఆచంట గోపినాథ్‌, సీహెచ్‌ రాంబాబులు తెరకెక్కించబోతున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు వెలువడింది. అయితే డైరెక్టర్‌ ఎవరనేది స్పష్టత తెలియాల్సి ఉంది. ఈ మూవీ టైటిల్‌ను ఖరారు చేసి దర్శకుడు ఎవరనేది త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు. అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ మూవీ షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నాడు రానా. ఎప్పుడు విభిన్నన్న కథలతో ప్రేక్షకులను అలరించే రానా ఈ సారి ఎలాంటి కొత్త కథతో రాబోతున్నాడో చూడాలి మరి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement