
సాక్షి, మహబూబాబాద్: మానుకోట (ప్రస్తుత మహబూబాబాద్) జిల్లా కేంద్రంలో టాలీవుడ్ నటి ప్రణీత సందడి చేశారు. ఆదివారం ఓ షాపింగ్ మాల్ ప్రారంభ వేడుకకు ఆమె హాజరయ్యారు. నటి ప్రణీతను చూసేందుకు ఆమె అభిమానులతో పాటు జిల్లావాసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ వివరాలిలా.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎం.వి షాపింగ్ మాల్ (శారీస్ క్లాత్ మార్చంట్) సిద్ధంగా ఉంది. అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయాల్సిందిగా దాని నిర్వాహకులు నటి ప్రణీతను సంప్రదించారు. అందుకు అంగీకరించిన ప్రణీత ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ఎంవి షాపింగ్ మాల్‌ను ప్రారంభించి, అందులోని కొన్ని శారీల నాణ్యతను పరిశీలించి, వాటి ధరలను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రణీత రాకను తెలుసుకున్న అభిమానులు, స్థానికులు అక్కడికి భారీ సంఖ్యలో రావడంతో నటి హర్షం వ్యక్తం చేశారు. వారికి అభివాదం చేస్తూ ప్రణీత సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment