నేను ప్రేమిస్తున్నదెవరినో తెలుసా? | I love u cinema industry says Pranitha Subhash | Sakshi
Sakshi News home page

నేను ప్రేమిస్తున్నదెవరినో తెలుసా?

Sep 30 2016 12:50 AM | Updated on Mar 22 2019 5:33 PM

నేను ప్రేమిస్తున్నదెవరినో తెలుసా? - Sakshi

నేను ప్రేమిస్తున్నదెవరినో తెలుసా?

ప్రతి మనిషి జీవితంలోనూ ఒక భాగమైన ప్రేమ గురించి ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.

ప్రతి మనిషి జీవితంలోనూ ఒక భాగమైన ప్రేమ గురించి ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.నటి ప్రణీతను తన అభిప్రాయాన్ని తెలపమన్నప్పుడు ప్రేమ అన్నది ఏదో ఒక దశలో ప్రతిఒక్కరికి కలుగుతుందన్నారు.అయితే తనకు మాత్రం ఇంకా ఆ దశ రాలేదన్నారు.తమిళంలో ఉదయన్ చిత్రంతో పరిచయం అయిన ఈ భామ ఆ తరువాత శకుని,మాస్ తదితర చిత్రాలలో నటించారు.అయితే ఇప్పటికీ మంచి విజయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారన్నది గమనార్హం.తమిళంలో ఎక్కువగా నటించడం లేదే అన్న ప్రశ్నకు ప్రణీత బదులిస్తూ మంచి అవకాశాలు లభిస్తే తానెందుకు నటించనూ,అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాననీ అన్నారు.

అయితే తాను తెలుగు,కన్నడం భాషా చిత్రాలతో బిజీగానే ఉన్నాననీ చెప్పారు.ముఖ్యంగా తెలుగులో తను హోమ్లీ ఇమేజ్ ఉందని అన్నారు.జూనియర్ ఎన్గీఆర్,పవన్‌కల్యాణ్,మహేశ్‌బాబు లాంటి ప్రముఖ హీరోలతో నటించాననీ,ఇప్పుడు కూడా నటిస్తున్నాననీ తెలిపారు.కోలీవుడ్‌లో ఎక్కువగా నటించక పోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అయితే ప్రస్తుతం తమిళంలో జయ్‌కి జంటగా ఎనక్కు వాయ్‌Oద అడిమైగళ్,అధర్వతో కలిసి జెమినీగణేశనుమ్ సురళిరాజానుమ్ చిత్రాల్లో నటిస్తున్నానీ తెలిపారు.

ఈ చిత్రలు విడుదలనంతరం తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానని అన్నారు.సరే మీతో కలిసి నటించిన నటి సమంత లాంటి వాళ్లు ప్రేమించి పెళ్లికి సిద్ధం అవుతున్నారు.మీరు ఎవరినైనా ప్రేమించారా?అన్న ప్రశ్నకు తాను ప్రేమిస్తున్నాను.ఎవరినో తెలుసా సినిమాని అని తెలివిగా బదులిచ్చారు.ప్రస్తుతానికి సినిమాను తప్ప వేరెవరినీ తాను ప్రేమిచండం లేదని ప్రణీత పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement