ప్రణీత
మామూలుగా అమ్మాయిలు చాలామంది ‘సైజ్ జీరో’ని టార్గెట్‌గా పెట్టుకుంటారు. అందుకోసం బోలెడన్ని వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తారు. కానీ ప్రణీత దృష్టంతా ఇప్పుడు ‘వేస్ట్ జీరో’ మీద ఉంది. ‘కరోనా సమయంలో ఉన్న సరుకులను పొదుపుగా వాడుకోవాలి. వృథా తగదు. అనవసరమైన వేస్ట్ అసలే వద్దు’ అంటున్నారు ప్రణీతా సుభాష్. ‘జీరో వేస్ట్ కుకింగ్’ (వ్యర్థం ఎక్కువపోకుండా వంట చేయడం) విధానాన్ని పాటించడం మొదలుపెట్టారామె.
మామూలుగా చాలామంది కూరగాయల తొక్కలను పడేస్తారు. కానీ అది కూడా వేస్ట్ కాకుండా జాగ్రత్తపడాలనుకుంటున్నారట ప్రణీత. ‘‘కూరగాయలను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత ఆ తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చు. ఆ విధంగా ఇలాంటి కష్ట సమయంలో నిత్యావసరాలను పొదుపు చేసుకుందాం’’ అంటున్నారు ప్రణీత.
Comments
Please login to add a commentAdd a comment