Essentials
-
కాలం చెల్లిన సరుకులు...కుళ్లిన గుడ్లు
సాక్షి, హైదరాబాద్: పురుగులు పట్టిన బియ్యం, కుళ్లిన గుడ్లు, పాడైపోయిన కూరగాయలు, గడువు తీరిపోయిన (ఎక్స్పైర్ అయిన) నిత్యావసరాలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో వాటి నిల్వ... ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. ఇదేమిటని అధికారులు ప్రశి్నస్తే... కాంట్రాక్టర్ల నుంచి నాణ్యతలేని సరుకులు వస్తున్నాయని, ఇదేమిటంటే రాజకీయ నేతల పేర్లు చెప్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామనే సమాధానాలు వస్తున్నాయి. అదే సమయంలో విద్యా సంస్థల్లో అపరిశుభ్ర పరిసరాలు, నిర్లక్ష్యం కూడా అధికారుల తనిఖీలలో స్పష్టంగా బయటపడుతోంది.కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి అధికారులు మొదలుకొని కలెక్టర్ల వరకూ తనిఖీలు ప్రారంభించారు. అటు రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులు కూడా పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు, హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.కాంట్రాక్టర్లు కారణమంటూ.. ⇒ నాణ్యత లోపించిన ఆహారం కనిపించినా, కలుషితమైన ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనా... సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు), ఇతర క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం పరిపాటి అయిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. నాణ్యతలేని సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదిలిపెట్టి తమను వెంటాడితే ఫలితం ఏమిటని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలకు పాలు, పండ్లు, అల్లం, వెల్లుల్లి, కూరగాయలు, గుడ్లు, చికెన్ ఇతర నిత్యావసరాలను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో జీసీసీ ద్వారా హాస్టళ్లకు కూడా కాంట్రాక్టర్లే సరుకులు ఇస్తున్నారు.గడువు తీరిన నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు పల్లీపట్టీలు, మసాలా దినుసులు ఎక్కడ కొనుగోలు చేసి, తెస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని.. అరటిపండ్లను దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తుండటంతో విద్యా సంస్థలకు చేరేలోగా కుళ్లిపోతున్నాయని అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వాటిని గుర్తించి, తిరస్కరిస్తే కాంట్రాక్టర్లు ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. ప్రతి కాంట్రాక్టర్ ఏదో ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు కావడం, ఆ నేతల పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా తమను బలి చేస్తే ఆహార నాణ్యత ఎలా పెరుగుతుందని ప్రశి్నస్తున్నారు. విద్యాసంస్థలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంలోనూ పురుగులు ఉంటున్నాయని చెబుతున్నారు.పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలెన్నో ⇒ ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడి మాదర వసతి గృహంలో చిన్నారులకు చెంచాలతో పాలు పోస్తున్న తీరు తనిఖీల్లో బయటపడింది. ఇక్కడ పాలలో రాగిమాల్ట్, బెల్లం వంటివేవీ కలిపి ఇవ్వడం లేదు. ⇒ కెరమెరి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గడువు తీరిన ఉప్పు ప్యాకెట్‌ను కలెక్టర్ గుర్తించారు. అలాగే గడువు తీరిన ఉప్పు ప్యాకెట్లు ఆసిఫాబాద్ జీసీసీ గోదాంలో 12 క్వింటాళ్లు, చిక్కీలు 12 క్వింటాళ్లు ఉన్నట్టు తేలింది. ⇒ విద్యార్థులకు వారంలో నాలుగుసార్లు గుడ్డు ఇవ్వాలి. అది కనీసం 50 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉండాలి. కానీ 40 గ్రాముల కన్నా తక్కువ ఉండే చిన్న గుడ్లు ఇస్తున్నారని, అందులోనూ పలుచోట్ల కుళ్లిపోయిన గుడ్లు వస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. కాంట్రాక్టర్లను నోటిమాటగానే హెచ్చరిస్తున్నారని, ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ⇒ మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులు తనిఖీ చేశారు. చాలా చోట్ల 3, 4 రోజులకోసారి కూరగాయలు తీసుకొస్తున్నారు. వండే సమయానికి అవి చెడిపోతున్నాయని, పురుగులు, దోమలు వాలుతున్నట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ⇒ ధన్వాడలోని కేజీబీవీని నారాయణపేట కలెక్టర్ రాత్రివేళ తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉంచిన వంకాయలు మెత్తబడిపోయి ఉన్నట్టు గుర్తించారు. మరికల్ తహసీల్దార్ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించారు. నేలపై కూరగాయలు కుప్పలుగా పోసి నిల్వచేసి ఉన్నాయి. దీనితో కలుషి తమై, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట చేసే ఆవరణ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థులు చేతులు, కంచాలు కడిగే చోట దుర్వాసన వస్తోంది. వెల్దుర్తి మండలం కుకునూరు ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో.. భోజనం సమయంలో కుక్కలు, పందులు వస్తున్నాయి. -
లోడెత్తడంతోనే సరి..
సాక్షి, అమరావతి: వరద సహాయక కార్యక్రమాల్లో ఆర్భాటపు ప్రకటనలు తప్ప.. ఆచరణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. నిత్యావసరాల పంపిణీ విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. బుధవారం సాయంత్రం సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో రేపటి (గురువారం) నుంచే వరద ముంపు బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో గురువారం మొత్తం బాధితులంతా సహాయం కోసం ఎదురు చూశారు. తీరా సాయంత్రానికి.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా ముందుకు వచ్చి రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి నిత్యావసరాలు అందిస్తామని మరో ప్రకటన చేశారు. కానీ, క్షేత్ర స్థాయిలోకి వెళ్లి నిత్యావసరాలు అందించాల్సిన వాహనాలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కూడా లోడింగ్ అవుతూనే కనిపించాయి.రూట్‌మ్యాప్ లేకుండా ఎలా?ఎండీయూ వాహనాలు చేరుకోవాల్సిన గమ్యస్థానాల వివరాలను వీఆర్వోలు ఇస్తారంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చెబుతూనే ఉన్నారు. కానీ, ఉదయం 11 గంటలకు లోడింగ్ చేసుకున్న వాహనాలు రూట్‌మ్యాప్ లేక రాత్రయినా సరే ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎండీయూ వాహనాల్లోనే రెండు లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి వద్దే, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది నిత్యావసరాలు అందిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి విరుద్ధంగా శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చౌక దుకాణాల వద్దే రేషన్ ఇస్తామని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికీ చాలా కాలనీల్లో మోకాలి లోతుపైగా నీళ్లు నిలిచి ఉన్నాయి. ఇక చాలా మంది బాధితులు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితులను పట్టించుకోకుండా ప్రభుత్వం నిత్యావసరాలపై నిర్ణయం తీసుకుంది. చౌకదుకాణాలే నీటమునినగిప్పుడు నిత్యావసరాలను ఎలా పంపిణీ చేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.ఎండీయూల ఆకలి వెతలు..వరద బాధితులకు సాయం కోసం వచ్చిన ఎండీయూ వాహనాల ఆపరేటర్లను ప్రభుత్వం గాలికొదిలేసింది. రెండు రోజులుగా తిండితిప్పలు లేక.. నీళ్లు అందించే నాథుడు లేక తీవ్ర అవస్థలు పడ్డారు. గురువారం మధ్యాహ్నం విజయవాడ నగరానికి చేరుకున్న ఎండీయూలకు శుక్రవారం సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహారం అందలేదు. ‘సాయం చేద్దామని వచ్చాం.. మేమే వరద బాధితులుగా మిగిలాం’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.చాలా మంది ఎండీయూ ఆపరేటర్లు షుగర్, బీపీ తదితర దీర్ఘకాలిక అనారోగ్య బాధితులు ఉన్నారు. ఆహారంతో పాటు మందులకు కూడా దొరక్క వారు నానా అవస్థలు పడ్డారు. దీనికితోడు వరద సహాయక చర్యలకు వచ్చిన ఎండీయూలకు ఎటువంటి రెమ్యూనరేషన్ ప్రకటించలేదు. చాలా వాటిల్లో అరకొరగానే ఆయిల్ కొట్టించి పంపించారు. సొంత ఖర్చులతో ఆయిల్ పట్టించుకుని వచ్చామని, రాకపోతే ఎక్కడ టార్గెట్ చేస్తారేమో అని భయపడ్డామని కొందరు చెప్పారు. 1,100 రేషన్ వాహనాల రాకవరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి వివిధ జిల్లాల నుంచి సుమారు 1,100 ఎండీయూ(రేషన్ పంపిణీ వాహనాలు) వాహనాలను తీసుకొచ్చినట్టు సమాచారం. గురువారం మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్న వాహనాలు శుక్రవారం సాయంత్రం వరకు రోడ్లపైనే దర్శనమిచ్చాయి. ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డుకు ఇరువైపులా ఎండీయూ వాహనాలు నిలిపారు. ఒక్కో వాహనంలో 40 మంది బాధితులకు సరుకులు పంపిణీ చేసేలా విధులు కేటాయించారు.ఇందులో 25 కిలోల బియ్యం బస్తాలు, రెండు కిలోల చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కిలో చొప్పున కందిపప్పు, పంచదార, లీటర్ పామాయిల్ ప్యాకెట్లను బ్యాగుల్లో వేసి ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే ఉదయం నుంచి ఎండీయూల్లో బియ్యం బస్తాలు లోడ్ చేసినప్పటికీ.. ఇతర నిత్యావసరాల బ్యాగులు రాలేదు. కానీ, మంత్రులు మాత్రం పత్రికల్లో వార్తల కోసం ఉత్తుత్తినే జెండాలు ఊపి వాహనాలు ప్రారంభించినట్టు చేశారని బాధితులు విమర్శిస్తున్నారు. మంచినీళ్లు ఇచ్చే నాథుడు లేడుఎండీయూ వ్యవస్థ వృథా అన్నారు. వరద బాధితుల కోసం మేమే రెండు రోజులుగా రోడ్లపై పడి ఉన్నాం. గురువారం సాయంత్రం విజయవాడకు వచ్చాం. మా వాహనంలో శుక్రవారం మధ్యాహ్నమైనా సరుకులు లోడింగ్ పూర్తి కాలేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. మాకు కనీసం అన్నం పెట్టి, – దేవదానం, ఎండీయూ ఆపరేటర్, గుంటూరు గోరంట్లమేమే బాధితులుగా మారాం..బియ్యం బస్తాలు వేశారు. మిగిలిన సరుకుల సంచులు ఇవ్వలేదు. వాటిని ఇచ్చినా ఎక్కడికి వెళ్లాలో వేరే ఎవరో వచ్చి చెబుతారట. వాళ్లు ఎవరో.. ఎప్పుడొస్తారో తెలీదు. ఉదయం టిఫిన్ లేదు.. మధ్యాహ్నం భోజనం లేదు. రాత్రి నిద్రలేదు. సహాయం చేయడానికి వచ్చి మేమే వరద బాధితులుగా మారిపోయాం. – శంకర్, ఎండీయూ ఆపరేటర్, నూజివీడు -
నిత్యావసరాలకు ఆన్‘లైన్’ కడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: తాము చెల్లించే డబ్బుకు పూర్తి విలువతో పాటు కొనుగోలు చేసే వస్తువుల్లో నాణ్యతే గీటురాయిగా ఆన్లైన్ కోనుగోలుదారులు పరిగణిస్తున్నారు. దేశంలో ఆన్లైన్ మాధ్యమాల ద్వారా నిత్యావసరాలను కొనుగోలు చేసేవారిలో 86 శాతం నాణ్యతతో కూడిన వస్తువులకే అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆన్లైన్లో ఆయా సంస్థలు, వేదికలు (ప్లాట్‌ఫామ్స్‌ను) ఎంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 227 జిల్లాల్లో 70 వేల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ‘లోకల్ సర్కిల్స్’నిర్వహించిన అధ్యయనంలో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా గతంలోని కస్టమర్ల అలవాట్లతో పోలి్చతే కొన్నింటిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా గుర్తించారు.గతం నుంచి భారతీయులకు నెలవారీగా ఆయా వస్తువులు, నిత్యావసరాలను కొనుగోలుచేసే అలవాటు ఉండగా ఆన్లైన్ కొనుగోళ్లలో మార్పులు వచి్చనట్లుగా చెబుతున్నారు. ఆన్లైన్ మాధ్యమాల ద్వారానే నెలకు ఒక్కసారే కాకుండా, తమకు అవసరమున్నప్పుడల్లా వీలైనన్ని ఎక్కువ సార్లు నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టమైంది. 2023లో ఇలా అవసరానికి తగ్గట్లుగా కొనుగోలు చేస్తున్న వారు 23 «శాతం కాగా.. 2024లో వీరి సంఖ్య 57 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది. డెలివరీ టైమ్ 24 గంటల్లోపు కోరుకుంటున్నవారు 67 శాతం ఉండగా, అరగంటలోనే ఈ వస్తువులు కావాలని కోరుకుంటున్నవారు 17 శాతం ఉన్నట్లుగా వెల్లడైంది. ఆన్లైన్ గ్రాసరీ సెక్టార్లో కస్టమర్ సపోర్ట్ విధానాన్ని కూడా వినియోగదారులు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్లుగా తేలింది. నిత్యావసరాల అమ్మకాల్లో అమెజాన్ ఫ్రెష్, బిగ్‌బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ వంటివి పుంజుకోవడంతో పాటు వీలైనంత త్వరితంగా ఆయా వస్తువులను కస్టమర్లకు చేర్చే విషయంలో పోటీపడుతున్నట్లు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. ఆన్లైన్ నిత్యావసర వస్తువుల మార్కెట్ విస్తరిస్తున్న క్రమంలో టైర్–3, టైర్–4 నగరాల్లో నాణ్యత, విలువ, డెలవరీ స్పీడ్ వంటి వాటి విషయంలో కొంత ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్విక్ కామర్స్ పాŠల్ట్ఫామ్స్ ద్వారా వేగంగా తాము కోరుకుంటున్న నాణ్యతతో కూడిన వస్తువులను ఇంటిగుమ్మం వద్దకు తెప్పించుకోవడం, నాణ్యతా ప్రమాణాలను సరిచూసుకోవం వంటి వాటితో వినియోగదారుల మారుతున్న ప్రాధాన్యాలు స్పష్టమవుతున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అయితే పండ్లు, కూరగాయల వంటి వాటి విషయంలో కృత్రిమ మేధతో (ఏఐ) కూడిన క్యాలిటీ చెక్‌లకు అవకాశమున్నా.. వేగంగా అమ్ముడయ్యే వినిమయ వస్తువులు (ఎఫ్ఎంసీజీ)ల విషయంలో నాణ్యతను సరిచూసుకోవడం అనేది సవాళ్లతో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మిత్రులు సాధించిన విజయమిది.. స్టార్టప్ కంపెనీ సూపర్ సక్సెస్
వ్యాపారం చేయాలంటే అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటే సరిపోదు. నాలుగు గోడలు దాటి బయటి ప్రపంచంలోకి రావాలి. జనవాణి వినాలి. సృజనాత్మక వ్యూహాలు రూపొందించుకోవాలి. ఈ మిత్రులు అదే చేశారు. ‘ఎకోసోల్ హోమ్’తో ఘన విజయం సాధించారు... సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలతో మూడు సంవత్సరాల క్రితం రాహుల్ సింగ్, ప్రియాంకలు బోస్టన్ నుంచి నోయిడాకు వచ్చారు. ‘ఇదేమిటీ వింత’ అన్నట్లుగా చూశారు చుట్టాలు పక్కాలు. ‘ఇటు నుంచి అటు వెళతారుగానీ, అటు నుంచి ఇటు రావడం ఏమిటి?’ అనేది వారి ఆశ్చర్యంలోని సారాంశం. ‘రిస్క్ చేస్తున్నారు. అమెరికాలో సంపాదించిన డబ్బులను వృథా చేయడం తప్ప సాధించేది ఏమీ ఉండదు’ అన్నారు కొందరు. అయితే ఆ ప్రతికూల మాటలేవీ ఈ దంపతులపై ప్రభావం చూపలేకపోయాయి. ఇండియాకు రావడానికి ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వారికి బోలెడు సమయం దొరికింది. ‘మనం తీసుకున్న నిర్ణయం సరిౖయెనదేనా?’ నుంచి ‘ఎలాంటి వ్యాపారం చేయాలి...’ వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు.వ్యాపారమైనా సరే... అది కొత్తగా, సృజనాత్మకంగా, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేలా ఉండాలనుకున్నారు. అలా వారి ఆలోచనలో నుంచి పుట్టిందే... ఎకోసోల్ హోమ్. అరవింద్ గణేషన్‌తో కలిసి రాహుల్ సింగ్ మొదలు పెట్టిన ఈ ఎకో–ఫ్రెండ్లీ హోమ్ ఎసెన్షియల్స్ కంపెనీ సూపర్ సక్సెస్ అయింది. రాహుల్, అరవింద్‌లు అమెరికాలోని ఇ–కామర్స్ కంపెనీ ‘వేఫేర్’లో పని చేశారు. ‘వేఫేర్లో పనిచేసిన అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడింది. వినియోగదారుల ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది? ఏది చేయాలి? ఏది చేయకూడదు? అనే విషయంలో స్పష్టత రావడానికి ఆ అనుభవం ఉపయోగపడింది. పర్యావరణ హితానికి సంబంధించిన వస్తువులకు డిమాండ్ పెరుగుతున్నట్లు విషయాన్ని గ్రహించాం. ఆ సమయంలోనే ఎకోసోల్ కంపెనీ ఆలోచన వచ్చింది’ అంటున్నాడు ఎకోసోల్ హోమ్ కో–ఫౌండర్ అరవింద్ గణేశన్. ‘అవగాహన కలిగించేలా, అందుబాటులో ఉండేలా, అందంగా ఉండేలా మా ఉత్పత్తులు ఉండాలనే లక్ష్యంతో బయలుదేరాం. ప్లాస్టిక్ వల్ల జరిగే హాని గురించి చాలామందికి అవగాహన ఉంది. అయితే దీనికి ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు ధరలు ఆకాశంలో ఉండకూడదు. అందుకే మా వస్తువులకు అందుబాటులో ఉండే ధరలు నిర్ణయించాం’ అంటాడు రాహుల్ సింగ్. ఒకవైపు కోవిడ్ కల్లోలం భయపెడుతున్నా మరో వైపు ఇండియా, చైనా, థాయిలాండ్, మెక్సికోలలో తమ ఉత్పత్తులకు సంబంధించి సప్లై చైన్‌ను నిర్మించుకోవడానికి రంగంలోకి దిగారు. అయితే అది అంత తేలికైన విషయం కాదని అర్థమైంది. రా మెటీరియల్ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ వరకు అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ఒక్కొక్క సవాలును అధిగమిస్తూ 2021లో తాటి ఆకులతో తయారుచేసిన ప్లేట్లతో సహా 20 ఉత్పత్తులను విక్రయించడం మొదలు పెట్టారు. మనం రోజూ వినియోగించే ప్లాస్టిక్ ఫోర్క్‌లు, కప్‌లు, స్ట్రాలు, ప్లేట్స్... మొదలైన వాటికి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలు ఇందులో ఉన్నాయి. కంపెనీ నిర్మాణ సమయంలో వివిధ జిల్లాలకు చెందిన రైతులతో కలిసి పనిచేశారు రాహుల్, అరవింద్‌లు. వారు ఎన్నో అద్భుతమైన సలహాలు ఇచ్చారు. ‘తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే అడుగు తీసి అడుగు వేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు’ అంటారు రాహుల్, అరవింద్. కిచెన్,డైనింగ్, టేబుల్‌టాప్, బాత్, పర్సనల్ కేర్....మొదలైన విభాగాల్లో 42 రకాలైన ఉత్పత్తులను అందిస్తోంది ఎకోసోల్ హోమ్. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో అయిదు వేల స్టోర్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పదివేల స్టోర్స్ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.‘మా ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. కంపెనీ ప్రారంభంలో వెంచర్ క్యాపిటల్స్‌ను సంప్రదించినప్పుడు ఎవరూ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఒక రిటైలర్ మాత్రం లక్ష రూపాయల చెక్ ఇచ్చాడు. అది మాకు ఎంతో విశ్వాస్వాన్ని ఇచ్చింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్, అరవింద్‌లు. More junk food, more plastic means more pollution! However, we can lessen the use of plastic with plastic-free products that are made with perfect high-quality that can be used for any events. Happy National Junk Food Day!https://t.co/yloDJONQ7I#NationalJunkFoodDay #SaveEarth pic.twitter.com/1chFc25XcX — EcoSoulHome (@EcoSoulHome1) July 21, 2021 A beautiful environment starts with you. Make the switch to reusable and 100% organic products and help our planet. Start with EcoSoul Home. Use the code ecosoul10 at checkout for 10% off all our products! 😍 #EcoSoul #LiveGreen #SaveTheEarth pic.twitter.com/fRDesyalby — EcoSoulHome (@EcoSoulHome1) May 24, 2021 -
తక్కువ ధరకే నిత్యావసరాల పంపిణీ
సాక్షి, అమరావతి: ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధరల కంటే తక్కువ రేట్లకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు నెలలుగా బియ్యం, కందిపప్పు ధరల్లో పెరుగుదల నమోదైందని, ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో టోకు వ్యాపారులు, వాణిజ్య మండలి ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వ్యాపారులు, మిల్లర్లు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తక్కువ రేట్లకు నిత్యావసరాలు విక్రయించేందుకు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేయగా సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. మరోవైపు ధరల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకు నిల్వలను భారత ప్రభుత్వ వెబ్ సైట్ http://fcain foweb.nic.in/psp లో నమోదు చేయాలని సూచించినట్టు తెలిపారు. ధరల జాబితా ప్రదర్శించడంతో పాటు వినియోగదారులకు బిల్లులు ఇవ్వాలన్నారు. కొంత మంది వ్యాపారులు జీఎస్టీ మినహాయింపు కోసం 24, 26 కిలోల పరిమాణంలో వస్తువులను ప్యాకింగ్ చేసి విక్రస్తున్నారని, వినియోగదారుల నుంచి పన్నుతో కలిపి ధరను వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి, సరుకు నిల్వలు లేకపోవడం, స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి సరుకులను కొనుగోలు చేయడంతో ధరలు పెరిగినట్టు తెలిపారు. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో కందుల దిగుమతులు మందగించాయన్నారు. బీపీటీ, సోనా మసూరి వంటి నాణ్యమైన రకాల బియ్యాన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేయడం కూడా ఒక ప్రధాన కారణంగా అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. -
యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ నిత్యావసర సరుకుల పంపిణీ
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ క్యాంపులో ఆదివారం (ఏప్రిల్ 16) అక్కడి కార్మికులకు తెలుగు అసోసియేషన్ వారు (tauae.org) నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, పప్పు దినుసులు, నూనె, పండ్లు తదితర నిత్యావసర సరుకులతో కూడిన కిట్స్ అందజేశారు. తెలుగు అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ సహాయ కార్యక్రమం పట్ల కార్మికులు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్లు రవి ఉట్నూరి, సాయి ప్రకాష్ సుంకు సంయుక్త ఆధ్వర్యంలో విజయ భాస్కర్, భీం శంకర్, శరత్ చంద్ర, శ్రీమతి ఉషాదేవి, శ్రీమతి లతానగేష్ కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ కుమార్ ఉగ్గిన, ఉపాధ్యక్షుడు మసిఉద్దీన్, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు యండూరి, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేడ్కర్, లీగల్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల, ఫహీమ్, మోహన కృష్ణ, సీహెచ్ శ్రీనివాస్, చైతన్య తదితరులు కార్యక్రమానికి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
తెలుసుకున్నాకే ఫోన్ కొంటున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ ఇప్పుడు అత్యవసర వస్తువుల జాబితాలోకి వచ్చి చేరింది. పొద్దున లేవగానే, అలాగే పడుకునేప్పుడు ఫోన్ ముట్టుకోకుండా ఆ రోజు పూర్తి కాదంటే అతిశయోక్తి కాదేమో. మరి అంతటి ప్రత్యేకత కలిగిన ఫోన్ కొనుగోలు విషయంలో బడెŠజ్ట్ ఒక్కటే కాదు కోరుకునే ఫీచర్లనుబట్టి మోడల్ ఎంపిక జరుగుతోందట. స్తోమత లేనివారు, ఫోన్ వాడకం పెద్దగా అవసరం లేనివారు బేసిక్ ఫోన్లను వాడుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో 60 కోట్ల మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్ల వైపు వినియోగదార్లు మళ్లుతుండడం, 5జీ విస్తరణ కారణంగా 2023లో ఈ సంఖ్య 100 కోట్లను దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ రంగంలో ధరల శ్రేణి, కోరుకుంటున్న ఫీచర్లు, వినియోగదార్ల అభిరుచులు వేటికవే ప్రత్యేకం. విలువ ఉండాల్సిందే.. ధర ప్రాధాన్యం కాదు.. డబ్బుకు తగ్గ విలువ ఉండాల్సిందేనన్నది భారతీయుల ఆలోచన. రూ.15 వేలల్లో ఫోన్ కొనాలని భావించిన కస్టమర్ ముందు ఎక్కువ ఫీచర్లున్న ఫోన్ రూ.18 వేలకు లభిస్తే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఇక రూ.7 వేల లోపు, అలాగే రూ.30 వేలకుపైగా ఖరీదు చేసే ఫోన్ల ను 2–5 ఏళ్లు వాడుతున్నారట. అదే రూ.15–30 వేల సెగ్మెంట్లో ఆరు నెలలకే మార్చేస్తున్నారు. కారణం యువ కస్టమర్లు కావడం. ఆన్లైన్లో కొనుగోలు చేసే వినియోగదారులకే మొబైల్స్ పట్ల అవగాహన ఎక్కువ. రూ.15 వేల లోపు లభించే ఫోన్లే అధికంగా ఆఫ్‌లైన్‌లో అమ్ముడవుతున్నాయి. రూ.15–30 వేల ధరల శ్రేణి మోడళ్ల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా ఎక్కువ. ప్రపంచంలోనే ముందంజ.. స్మార్ట్ఫోన్ల పట్ల అవగాహన ఉన్న కస్టమర్లు భారత్‌లోనే అత్యధికం. కొనుగోలు కంటే ముందే ఆన్లైన్లో మోడళ్ల ఫీచర్లు, రివ్యూలను చూస్తున్నారట. ఈ విధంగా ముందే అవగాహనకు వచ్చి ఫోన్లను చేజిక్కించుకోవడంలో ప్రపంచంలో భారత్ ముందంజలో ఉందని రియల్మీ గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీ హరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మొబైల్ కొనుగోలు నిర్ణయంలో యువత కీలకపాత్ర పోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు స్మార్ట్‌ఫోన్ కొనే ముందు వీరిని సంప్రదిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న మోడళ్లు, ఫీచర్లు, రేటింగ్స్ వంటి విషయాలపై యువతకు ముందే అవగాహన ఉంటోంది’ అని వివరించారు. ధర పరంగా చూస్తే.. ► రూ.7,000 లోపు: ఈ విభాగంలో వినియోగదార్లకు కావాల్సింది ఏదైనా స్మార్ట్‌ఫోన్. వీరికి ఫీచర్లతో పనిలేదు. అత్యధికంగా ఫీచర్ ఫోన్ నుంచి ఇటువైపు మళ్లినవారే. ఇంకో విషయం ఏమంటే వినోదం కోసం పూర్తిగా వీళ్లు ఆధారపడేది ఈ స్మార్ట్ఫోన్పైనే. ► రూ.7–15 వేలు: స్మార్ట్‌ఫోన్ రంగంలో ఈ విభాగం వాటా ఏకంగా 50 శాతం ఉంది. అధిక బ్యాటరీ, 6.5 అంగుళాలు, ఆపైన సైజున్న డిస్ప్లే, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ కోరుకుంటున్నారు. ► రూ.15–30 వేలు: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ విభాగంలో పట్టణ కస్టమర్లు ఎక్కువ. ముఖ్యంగా యూత్ అధికంగా కొనుగోలు చేసే ధరల శ్రేణి ఇది. మంచి డిజైన్, రెండు లేదా ఎక్కువ కెమెరాలు, అధిక రిజొ ల్యూషన్, ఫుల్ హెచ్డీ, అమోలెడ్ డిస్ప్లే, కర్వ్, 5జీ, ఫాస్ట్ చార్జింగ్, తక్కువ మందం ఉండాల్సిందే. ► రూ.30 వేలు ఆపైన: ఇక్కడ ఫీచర్లు ప్రాధాన్యం కాదు. పెద్ద బ్రాండ్ అయి ఉండాలి. ఈ విభాగంలో కంపెనీలు ఎలాగూ ఒకదాన్ని మించి ఒకటి ఫీచర్లను జోడిస్తాయి అన్నది కస్టమర్ల మనోగతం. -
వరద బాధితులకు నగదు సాయం
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత ఇస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని రీతిలో బాధిత కుటుంబాలకు పెద్ద ఎత్తున నగదు సాయాన్ని అందించింది. ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 93,745 కుటుంబాలకు పంపిణీ చేసింది. ఈ సాయాన్ని నేరుగా ఆ కుటుంబ పెద్ద బ్యాంకు ఖాతాలో జమచేశారు. ఖాతాలో డబ్బులు జమచేసిన తర్వాత వలంటీర్లు, వీఆర్వోలు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారుల ద్వారా ప్రతి ఒక్కరికి డబ్బులు చేరాయో లేదో తనిఖీ చేయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోను డబ్బులు వేసిన వారి జాబితాను త్వరలో ప్రదర్శించనున్నారు. గతంలో వరద బాధితులకు ఏ ప్రభుత్వం ఇలా నగదు సాయాన్ని అందించలేదు. విపత్తుల సమయంలో నగదు సాయం చేసినట్లు కాగితాల్లో చూపించడమే తప్ప ఎప్పుడూ ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం బాధితులకు ఆ సొమ్ము ఇవ్వడమే కాకుండా.. అది వారికి నిజంగా అందిందో లేదో కూడా విస్తృతంగా తనిఖీలు చేయిస్తోంది. విస్తృతంగా నిత్యావసరాల పంపిణీ అలాగే నిత్యావసర వస్తువుల పంపిణీ విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటివరకు 98,982 కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ నూనె, బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను ప్రభుత్వం బాధితులకు అందించింది. మొత్తం 150 టన్నుల కందిపప్పు, 152 టన్నుల ఉల్లిపాయలు, 159 టన్నుల బంగాళాదుంపలు, 1,28,933 లీటర్ల ఆయిల్, 1,36,800 లీటర్ల పాలు బాధితులకు అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా వరద తగ్గకుండానే బాధితులకు సాయాన్ని పంపిణీ చేసిన ఉదంతాలు లేవు. వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయినప్పటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం విరామం లేకుండా పనిచేసింది. ముంపు గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అక్కడి నుంచి సహాయక శిబిరాలకు తీసుకెళ్లడం, అక్కడ వారికి భోజన సౌకర్యాలు కల్పించడం వరకు ప్రతి పనిని పకడ్బందీగా నిర్వహించింది. సహాయక చర్యలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 14.50 లక్షల ఆహార పొట్లాలు, 40 లక్షలకుపైగా వాటర్ ప్యాకెట్లను బాధిత గ్రామాల్లో పంపిణీ చేసింది. విస్తృతంగా పారిశుధ్య పనులు ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు పెద్దఎత్తున చేయిస్తున్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన సిల్ట్, గార్బేజ్‌ను యంత్రాల సాయంతో తొలగించారు. నీళ్ల ట్యాంకులు శుభ్రం చేయడం, పైపులైన్లు క్లియర్ చేయడం, మోటార్లు రిపేరు చేసి పరిశుభ్రమైన మంచినీరు అందించే పనుల్ని పూర్తిచేశారు. 555 వైద్య శిబిరాలు నిర్వహించడంతోపాటు ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే చేస్తున్నారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలుంటే వెంటనే చికిత్స అందిస్తున్నారు. నగదు సాయం, నిత్యావసరాల పంపిణీ, సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఆగమేఘాల మీద రూ.43.50 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు రూ.14 కోట్లు, అల్లూరి జిల్లాకు రూ.10.50 కోట్లు, ఏలూరు జిల్లాకు రూ.9 కోట్లు, పశ్చిమగోదావరికి రూ.6 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాకు రూ.4 కోట్లు విడుదల చేసింది. దెబ్బతిన్న తాగునీటి సరఫరా వ్యవస్థలు, విద్యుత్, రోడ్లు, చిన్నతరహా తాగునీటి పథకాలను వెంటనే పునరుద్ధరించేలా చేసింది. ఇందుకోసం రూ.18 కోట్లు అదనంగా విడుదల చేసింది. -
మాట మార్చిన రష్యా! సంబంధాలు యథావిధిగా మెరుగవుతాయి
Communication is essential: రష్యా ఉక్రెయిన్‌తో దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటినుంచి తొలుత పశ్చమ దేశాలతో సంబంధాలు చాలావరకు దూరమయ్యాయి. యూఎస్‌తో సంబంధాల కూడా అంతగా లేవు. అదీగాక యూఎస్ రష్యా యుద్ధానికి దిగుతుందంటూ.. ముందుగానే ఉక్రెయిన్‌ని హెచ్చరించింది. పైగా రష్యాని కూడా ఇలాంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టందంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది . అయినా రష్యా ప్రంపంచ దేశాలన్ని మూకుమ్ముడిగా యుద్ధం వద్దని చెప్పిన తనదారి తనదే అంటూ.. ఉక్రెయిన్‌తో తలపడేందుకు రెడీ అయిపోయింది. దీంతో యూఎస్ దాని మిత్రదేశాలతో సహా ఆర్థిక ఆంక్షలు విధించి రష్యాని ఒంటరిని చేయాలని చూసిన రష్యా ఏ మాత్రం దిగిరాలేదు. దీంతో మరిన్ని కఠినతరమైన ఆంక్షలు సైతం ప్రంపంచ దేశాలు విధించాయి. ఆఖరికి రష్యా తీరుని చూసి చాలా దేశాలు దూరం పెట్టడం మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో మాస్కో ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌తో సంబంధాల విషయమై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..."యూఎస్‌తో సంబంధాలు మెరుగు పరుచుకుంటామంటూ.. షాక్ అయ్యేలా సమాధానం ఇచ్చారు. ఈ యుద్ధం కారణంగా ఏ దేశాలు మాకు దూరంగా ఉండవు. యూఎస్ ఎక్కడికిపోదు, పశ్చిమదేశాలు కూడా దూరండా ఉండవు. మేము తిరిగి యూఎస్, పశ్చిమ దేశాలతో సంబంధాలను తిరిగి కొనసాగిస్తాం. మాకు యూఎస్‌తో సంబంధాలు కొనసాగించడం అత్యంత ముఖ్యం. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాకి యూఎస్‌తో ఉన్న సంబంధాలు దెబ్బతినవు, ఇదేమంతా పెద్ద విషయం కాందని తేల్చి చెప్పేశారు." ఐతే యూఎస్ అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని ప్రపంచ వేదికపై తిట్టి పోయేడమే కాకుండా ప్రపంచదేశాల నుంచి బహిష్కరిస్తానని కూడా ప్రకటించారు. పైగా పుతిన్ కూడా యూఎస్ ఆర్థిక యుద్ధం చేస్తుందంటూ నిప్పులు చెరిగారు. కానీ రష్యా ఈ యుద్ధం కారణంగా యూఎస్‌తో సంబంధాలు ఏమి చెడిపోవని, రెండు దేశాల మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం, గౌరవం ఉంటాయని చెప్పాడం గమనార్హం. (చదవండి: పాక్ మంత్రి సంచలన విజ్ఞప్తి!.. ప్లీజ్.. ఛాయ్ తాగడం తగ్గించండి) -
Russia-Ukraine War: ఇండియన్ నన్స్‌కు ఇక్కట్లు
ఐజ్వాల్: రష్యా దాడితో రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో భారత్‌కు చెందిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ మిజోరాం విభాగానికి చెందిన నన్స్ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. యుద్ధం తీవ్రం కావడంతో రాజధానిలో సేవలనందిస్తున్న ఈ నన్స్ నిత్యావసరాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక శిబిరంలో తాము సేవలనందిస్తున్న నిరాశ్రయులతో కలిసి క్షేమంగా ఉన్నామని, అయితే కనీసావసరాల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు. ఎన్ని బాధలైనా పడతామని, సేవా కార్యక్రమం విరమించి వెనక్కురామని సిస్టర్ రోసెలా నూతంగి, సిస్టర్ ఆన్ ఫ్రిదా స్పష్టం చేశారు. వీరితో పాటు వేరే దేశాలకు చెందిన మరో ముగ్గురు నన్స్ కలిసి 37 మంది నిరాశ్రయులను, ఒక కేరళ విద్యార్థిని సంరక్షిస్తున్నారు. వీరంతా క్షేమమేనని, కానీ ఆహారం కొరతతో బాధపడుతున్నారని రోసెలా బంధువు సిల్వీన్ చెప్పారు. కీవ్‌లో తాము బాగానే ఉన్నామని రోసెలా చెప్పారని సిల్వీన్ తెలిపారు. సంస్థలో రోసెలా 1981లో చేరారు. 1991లో ఒక మిషన్ కోసం సోవియట్‌కు వెళ్లారు. అక్కడ ఆమె 10 ఏళ్లు పనిచేశారు. 2013లో ఆమె ఉక్రెయిన్ చేరారని, రష్యన్ భాషలో ఆమెకు పట్టు ఉందని సిల్వీన్ తెలిపారు. గతంలో రెండుమార్లు మాత్రమే ఆమె ఇండియాకు వచ్చారన్నారు. మరో నన్ ఫ్రిడా 1995లో సంస్థలో చేరారు. అనంతరం అనేక దేశాల్లో సేవలనందించి 2019లో ఉక్రెయిన్ చేరారు. తమ సంస్థకు చెందిన ఐదుగురు నన్స్ ఉక్రెయిన్‌లో సేవలనందిస్తున్నారరని సంస్థ సుపీరియర్ జనరల్ సిస్టర్ మేరీ జోసెఫ్ చెప్పారు. వీరిని వెనక్కురమ్మని తాము కోరామని, కానీ సేవను విరమించి వచ్చేందుకు వీరు అంగీకరించలేదని తెలిపారు. స్థానికులకు సాయం అందిస్తూ వీరు కీవ్‌లో తలదాచుకుంటున్నారన్నారు. వీరి భద్రతపై రష్యా, ఉక్రెయిన్, భారత ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. -
రెండో రోజూ విజిలెన్స్ దాడులు
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నెపంతో వంటనూనెలు, నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజూ కొరడా ఝుళిపించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 126 చోట్ల తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫో ర్స్మెంట్ సోమవారం మరో 142 చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పరిమితికి మించి నిల్వలు కలిగి ఉన్న నలుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రెండు రోజుల్లో ఈ చట్టం కింద మొత్తం 20 కేసులు నమోదు చేసినట్లయ్యింది. అదే విధంగా తూనికలు కొలతల చట్టానికి విరుద్ధంగా గరిష్ట చిల్లర ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్న వారిపై 73 కేసులు నమోదు చేశారు. ఈ చట్టం కింద రెండు రోజుల్లో 127 కేసులు నమోదు చేశారు. ఆహార భద్రతా చట్టం కింద నాణ్యత సరిగాలేకపోవడంతో 15 కేసులు నమోదు చేశారు. దీంతో రెండు రోజుల్లో ఈ కేసుల సఖ్య 27కి చేరింది. మొత్తం మీద రెండు రోజుల్లో వంట నూనెలు, పప్పుధాన్యాల నిల్వలపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో మొత్తం 174 కేసులను రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసింది. ధరలు పెంచి విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
తీవ్ర సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలపొడి రూ.1,195
కొలంబో: ఏడాది కాలంగా శ్రీలంక ఆహార, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ మొరపెట్టుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు మీద శ్రీలంక ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేయడమే దీనికి ప్రధాన కారణం. గత శుక్రవారం వంట గ్యాస్ సిలిండర్ (12.5 కేజీలు) ధర రూ.1,400 ఉండగా ప్రస్తుతం రూ. 1,257 పెరిగి రూ. 2,657కు చేరుకుంది. ఒక కిలో పాలపొడి ధర వారం క్రితం రూ.250కాగా, ఇప్పుడు ఐదు రెట్లు పెరిగి రూ.1,195గా ఉంది. ఇవి మాత్రమే కాకుండా గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్ సహా దాదాపు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత గురువారం దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్షతన కేబినెట్ సమావేశమై ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని, తద్వారా నిత్యావసరాల సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చదవండి: (బాప్రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు!) ఈ పరిస్థితికి కారణం ఏంటంటే.. ప్రభుత్వం నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. ప్రభుత్వ నిషేధంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది. చదవండి: (వైరల్: అరటి గెల మీద పడిందని రూ.4 కోట్లు రాబట్టాడు) -
నిత్యావసర సరుకుల డెలివరీకి జొమాటో గుడ్‌బై
న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలను సెపె్టంబర్ 17 నుంచి నిలిపివేస్తున్నట్టు జొమాటో ప్రకటించింది. ‘జొమాటోలో మా వినియోగదార్లకు ఉత్తమ సేవలను, వ్యాపార భాగస్వాములకు అతిపెద్ద వృద్ధి అవకాశాలను అందించాలని భావిస్తున్నాము. ఇందుకు ప్రస్తుత మోడల్ ఉత్తమ మార్గం అని మేము నమ్మడం లేదు. అందుకే ఈ పైలట్ గ్రాసరీ డెలివరీ సేవలను నిలిపివేయాలని అనుకుంటున్నాము’ అని కంపెనీ తన భాగస్వాములకు ఈ–మెయిల్ ద్వారా తెలిపింది. ‘స్టోర్లలో వస్తువుల జాబితా క్రియాశీలకం. నిల్వ స్థాయిలూ తరచూ మారుతున్నాయి. దీని కారణంగా ఆర్డర్లలో అంతరం ఏర్పడి పేలవమైన కస్టమర్ల అనుభూతికి దారితీస్తోంది. మా వేదిక ద్వారా ఇకపై సరుకుల డెలివరీని ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టబోం. 10 నిముషాల్లోనే సరుకుల డెలివరీతో గ్రోఫర్స్ అధిక నాణ్యమైన సేవగా నిలిచింది. జొమాటో వేదిక ద్వారా సరుకుల డెలివరీ ప్రయత్నాల కంటే గ్రోఫర్స్లో కంపెనీ పెట్టుబడులు భాగస్వాములకు మెరుగైన ఫలితాల ను ఇస్తాయి’ అని జొమాటో స్పష్టం చేసింది. జొమాటో నిత్యావసర సరుకుల డెలివరీ సేవలను ఎంపిక చేసిన నగరాల్లో పైలట్ ప్రా జెక్ట్ కింద గతేడాది ప్రారంభించింది. కాగా, గ్రోఫర్స్లో మైనారిటీ వాటా కోసం రూ.745 కోట్లు వెచి్చంచినట్టు జొమాటో గతంలో తెలిపింది. -
‘కార్డుదారులకు సజావుగా బియ్యం పంపిణీ’
గుడివాడ: ఆంధ్రప్రదేశ్‌లో 36,31,216 కార్డుదారులకు రేషన్ డీలర్ల ద్వారా పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. గురువారం గుడివాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 1,48,56,590 బియ్యం కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల్లోని ఒక్కో కుటుంబ సభ్యుడికి 5 కేజీలు చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ సక్రమంగా సాగుతోందన్నారు. కర్నూలు జిల్లాలో 29.16%, ప్రకాశం జిల్లాలో 24.08%, వైఎస్సార్ కడప జిల్లాలో 25.71%, అనంతపురం జిల్లాలో 27.60%, పశ్చిమ గోదావరి జిల్లాలో 24.60%, చిత్తూరు జిల్లాలో 27.92%, గుంటూరు జిల్లాలో 25.50%, విజయనగరం జిల్లాలో 24.15%, శ్రీకాకుళం జిల్లాలో 17.76%, నెల్లూరు జిల్లాలో 17.46% పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. -
ఆహారం..విషపూరితం!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విజృంభణ ఒకవైపు..నిత్యం ఆహారంలో వినియోగించే నిత్యావసరాల్లోనూ పెస్టిసైడ్స్(క్రిమి సంహారకాలు) ఆనవాళ్లు మరోవైపు గ్రేటర్ సిటీజన్లను బెంబేలెత్తిస్తున్నాయి. రోజువారీగా వినియోగిస్తున్న నిత్యావసరాలు, పలు రకాల ఆహార పదార్థాల నమూనాల్లోనూ ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్దేశించిన పరిమితికి మించి రసాయనాలు, క్రిమిసంహారక ఆనవాళ్లు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. మహానగరం పరిధిలో బహిరంగ మార్కెట్లు, దుకాణాల్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో మొత్తంగా సుమారు 30 శాతం మేర పెస్టిసైడ్స్ ఆనవాళ్లు బయటపడడం గమనార్హం. మరోవైపు ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని సేంద్రియ ఆహారపదార్థాలను విక్రయిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న పలు సంస్థలు తమ ఆర్గానిక్ స్టోర్లలో విక్రయిస్తున్న నమూనాల్లోనూ ఈ అనవాళ్లుండడం గమనార్హం. ఆయా స్టోర్లలో సేకరించిన పలు రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్లోనూ విష రసాయనాల ఆనవాళ్లు వెలుగుచూడడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా వీటి ఆనవాళ్లు బయటపడ్డాయి. చివరకు కూరల్లో వాడే కరివేపాకులోనూ వీటి ఉనికి ఉండడం గమనార్హం. ఈ నమూనాలను నగరంలోని పలు బహిరంగ మార్కెట్లలో సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. క్రిమిసంహారకాల ఆనవాళ్లిలా.. ►క్రిమిసంహారకాల్లో ప్రధానంగా ఆర్గానో క్లోరిన్, ఎసిఫేట్, ఎసిటామిప్రిడ్, అజోక్సీస్టార్భిన్, కార్భన్‌డిజం, ఇమిడాక్లోప్రిడ్, టిబ్యుకొనజోల్ తదితర క్రిమిసంహారక ఆనవాళ్లు బయటపడ్డాయి. ► ఇవన్నీ ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన పరిమితులకు మించి ఉండడం గమనార్హం. ► ఎసిఫేట్, లిండేన్ వంటి క్రిమిసంహారకాల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వాటి ఆనవాళ్లుండడం ఆందోళన కలిగిస్తోంది. ముప్పు ఇలా... ►దేశంలో సరాసరిన 10 శాతం మధుమేహ బాధితులుండగా..హైదరాబాద్ నగరంలో సుమారు 16 నుంచి 20 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దేశంలో గ్రేటర్ సిటీ డయాబెటిక్ క్యాపిటల్‌గా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ►ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే క్రిమిసంహారకాలు ఆహారపదార్థాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తే సుమారు 20 ఏళ్లపాటు అలాగే తిష్టవేసే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ► కొన్ని రకాల క్రిమిసంహారకాల అవశేషాలు దేహంలోని కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయని..పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతాయని స్పష్టం చేశారు. ► బహిరంగ మార్కెట్లలో కొనుగోలు చేసిన కూరగాయలను తొలుత ఉప్పునీళ్లతో బాగా కడిగి ఆ తర్వాత..బాగా ఉడికించి తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: సినారెకు సీఎం కేసీఆర్ నివాళి వచ్చేనెల 25, 26వ తేదీల్లో బోనాలు -
సినీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
సాక్షి, చెన్నై: కరోనా మహమ్మారి సినీ కళాకారులను మరోసారి ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా షూటింగ్‌లు రద్దు అవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా నడిగర్ సంఘం ఎన్నికలు జరిగినా ఫలితాలు నిలిపివేయడంతో రెండేళ్లకు పైగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. దీంతో ఆ సంఘానికి చెందిన పేద సభ్యులకు ఎలాంటి సాయం అందని పరిస్థితి. దీంతో సంఘం సమస్యను పరిష్కరించాల్సిందిగా విశాల్ ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఆ సంఘం మాజీ అధ్యక్షుడు నాజర్ కూడా సంఘం సభ్యులను ఆర్థికసాయంతో ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న సినీ, నాటక రంగ కళాకారులకు నడిగర్ సంఘం ట్రస్ట్ సభ్యుడు పూచి మురుగన్ సోమవారం బియ్యం, కాయగూరలు వంటి నిత్యావసర వస్తువులను అందించారు. సుమారు 300కు పైగా సంఘ సభ్యులు ఈ కరోనా సాయాన్ని అందుకున్నారు. పూచి మురుగన్‌తో పాటు నటి కోవై సరళ, నటుడు దాడి బాలాజీ పాల్గొన్నారు. చదవండి: తమిళనాడు: ఆ ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయి? -
ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం డోర్ డెలివరీపై సీఎం జగన్ సమీక్ష
-
ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం వద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్ చేయాలని, అన్ని అంశాలపై వ్యవసాయ సలహా కమిటీలకు పూర్తి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. క్రాప్ ప్లానింగ్ మొదలు రైతులకు అండగా ఆ కమిటీలు ఉండాలన్నారు. ఈ ప్రక్రియలో మహిళా రైతులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని స్పష్టం చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలన్నది అధికారులే నిర్ణయించాలన్నారు. ఎక్కడా రైతులకు ఏ విధంగానూ నష్టం కలగకూడదని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పక్కాగా ధాన్యం సేకరణ జరగాలని, రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండొద్దని అధికారులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం డోర్ డెలివరీపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల ప్రమేయం వద్దు: ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు. ఏ ఊరి పంట ఏ మిల్లర్ దగ్గరకు వెళ్తోంది అన్న విషయం అధికారులకు మాత్రమే తెలియాలి. అందుకు అవసరమైతే జిల్లాల కలెక్టర్లు సొంతంగా గోనె సంచులు సేకరించాలి. ధాన్యం కొనుగోలులో తేమ చూడడం కోసం, ఆర్బీకేల వద్ద ఆ మీటర్లు కూడా ఉన్నాయి. మిల్లుల వద్దకు ధాన్యం రవాణా చేయడంలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్ వద్దకు పంపించవద్దు. అందుకోసం జిల్లా యూనిట్‌గా తీసుకుని, ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలి. మనం కొనుగోలు చేస్తామని చెప్పిన టైంకు మనమే కొనుగోలు చేయాలి. మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలి. రెండు శాఖలు ఓన్ చేసుకోవాలి: ఆర్బీకేకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో, పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి రైతు కోరిన విత్తనాలు పౌర సరఫరాల శాఖ ఇవ్వాలి. అందుకోసం పౌర సరఫరాల శాఖ కూడా ఆర్బీకేను ఓన్ చేసుకోవాలి. రైతులు బయట విత్తనాలు కొని మోసపోకుండా వ్యవసాయ శాఖ చూడాలి. వారికి అవసరమైన విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ క్రాపింగ్ నుంచి మార్కెటింగ్ వరకూ రెండూ కలిసి పనిచేయాలి వ్యవసాయ సలహా కమిటీలు: వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్ చేయాలి. ఆ మేరకు ఆ కమిటీలకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాలి. క్రాప్ ప్లానింగ్ మొదలు ఆ కమిటీలు రైతులకు అండగా నిలవాలి. వ్యవసాయ సలహా కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండాలి. ఆ కమిటీల బాధ్యతలు. వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షిస్తారు. ఎక్కడా రైతు ఇబ్బంది పడకూడదు. రైతులకు ప్రత్యామ్నాయం చూపాలి: ఏ విత్తనం వేస్తే బాగుంటుంది? ఏది సాగు చేస్తే పంట కొనుగోలు చేస్తారన్నది రైతులకు ఆ కమిటీలు ముందే చెప్పాలి. అలాగే రైతులకు ధాన్యంతో తగిన ఆదాయం రాకపోతే (ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గడం వంటి కారణాల వల్ల), ఏ పంట వేస్తే తగిన ఆదాయం వస్తుందన్న విషయాన్ని రైతులకు చెప్పాలి. ఆ మేరకు వారికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతే తప్ప రైతుల ఆదాయం మాత్రం తగ్గకూడదు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ: రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలి. బియ్యం తీసుకోవడంలో ఎవరూ మిస్ కాకుండా చూడాలి. ఆ మేరకు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్)లు పని చేయాలి. ప్రతి నెలా నిర్ణీత వ్యవధిలోగా తప్పనిసరిగా బియ్యం పంపిణీ జరగాలి. కావాల్సినన్ని వేయింగ్ స్కేల్స్ (తూకం యంత్రాలు) కొనుగోలు చేయండి. బియ్యం క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, ఎవరైనా ఇంటి వద్ద రేషన్ మిస్ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. దీనికి అవసరమైన కార్యాచరణ సిద్దం చేయండి. చదవండి: ‘సీఎం జగన్ అత్యంత బాధ్యతగా వ్యవహరించారు’ ఏలూరు కార్పొరేషన్ ఎలక్షన్: కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతి -
ఎంటర్‌ప్రెన్యూర్‌లా కాదు.. పొలిప్రెన్యూర్‌గా
సాక్షి, హైదరాబాద్: బూమ్ ఉందంటే చాలు ఇన్వెస్టర్లే కాదు డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, బ్యూరోక్రాట్స్, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ పెట్టుబడులు పెట్టి మార్కెట్లో డిమాండ్‌ను సృష్టిస్తుంటారు. ప్రతి ఏటా 15–20 శాతం ధరలు పెరగడం ఆరోగ్యకరమైన వృద్ధి. అలాకాకుండా అబ్నార్మల్గా పెరిగితే మాత్రం అది బూమ్. ఇది ప్రభుత్వ అభివృద్ధి ప్రకటనలు, భవిష్యత్తు ప్రాజెక్ట్‌లను, ప్రాంతాలను బట్టి పెరుగుతుంటుంది. రియల్టీ బూమ్ ఇన్వెస్టర్లు ఉన్నంత కాలమే ఉంటుంది. ఒక్కసారి ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోగానే బద్దలైపోతుంది. ఇదేమీ కొత్తకాదు. 2008లో వచ్చిన రియల్టీ బూమ్ ఇలాంటిదే. 2015-16 వరకు కోలుకోలేదు. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ హైదరాబాద్ డెవలపర్లు ధైర్యంగా, బలంగా నిలబడటానికి కారణం నిజమైన కొనుగోలుదారులు తోడుగా నిలవటమే. ప్రతి సంవత్సరం నగరంలో 25 వేల గృహాలు విక్రయం అవుతుంటాయి. ఇదే స్థాయిలో లాంచింగ్స్ కూడా ఉంటాయి. కొనేవాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో.. గృహాల సప్లయి కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఒకవైపు రోజువారీ నిత్యావసర ఖర్చులు మోస్తూనే.. మరోవైపు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, ఆదాయ పన్నులను భరించి ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవటం కొనుగోలుదారులకు కష్టమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, నిర్మాణ అనుమతులు, బ్యాంక్ వడ్డీలు, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక నాయకుల ఒత్తిళ్లు.. వీటన్నింటినీ దాటుకొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం డెవలపర్‌కు సవాలే... ఇలా నిజమైన కొనుగోలుదారులు, డెవలపర్లకు మధ్యలో రాత్రికి రాత్రే ప్రాజెక్ట్‌లను ప్రారంభించేసి.. అడ్డదారిలో విక్రయాలు చేస్తూ రియల్టీ మార్కెట్లో కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నారు కొందరు తాత్కాలిక బిల్డర్లు. ♦ ఒకవైపు రోజువారీ నిత్యావసర ఖర్చులు మోస్తూనే.. మరోవైపు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, ఆదాయ పన్నులను భరించి ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవటం కొనుగోలుదారులకు కష్టమే. ♦ ఆకాశాన్నంటిన భూముల ధరలు, నిర్మాణ అనుమతులు, బ్యాంక్ వడ్డీలు, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక నాయకుల ఒత్తిళ్లు.. వీటన్నింటినీ దాటుకొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం డెవలపర్‌కు సవాలే. ♦ ఇలా నిజమైన కొనుగోలుదారులు, డెవలపర్లకు మధ్యలో రాత్రికి రాత్రే ప్రాజెక్ట్‌లను ప్రారంభించేసి.. అడ్డదారిలో విక్రయాలు చేస్తూ రియల్టీ మార్కెట్లో కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నారు కొందరు తాత్కాలిక బిల్డర్లు. పొలిప్రెన్యూర్ అయితేనే.. పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నలాజికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్... ఈ వ్యాపారం చేయాలన్నా ఉండాల్సిన ప్రధాన అంశాలివే. ఆయా అంశాలలో తెలంగాణ బలంగా ఉండటం వల్లే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌లా కాకుండా పొలిప్రెన్యూర్‌గా ఉంటేనే రాణించగలమని కిస్మత్‌పూర్‌కు చెందిన ఓ డెవలపర్ తెలిపారు. పొలిటికల్ కనెక్షన్స్ బాగా ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌ను పొలిప్రెన్యూర్స్ అంటారు. సాధారణ డెవలపర్లు చెప్పులు అరిగేలా తిరిగినా పరిష్కారంకాని సమస్యలన్నీ పొలిప్రెన్యూర్స్కు మాత్రం కూర్చున్న చోటే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. భూమి అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి ప్రాజెక్ట్‌ను మార్కెట్లోకి తెచ్చే వరకు సుమారు మూడేళ్ల సమయం పడుతుంది. ఈ కాలంలో వడ్డీ భారం డెవలపర్లదే. తీరా లాంచింగ్ చేశాక మార్కెట్ ప్రతికూలంలో ఉంటే మరింత భారమే. డెవలపర్లలో పోటీ భయం నెలకొంది.. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ఇప్పుడు కొనకపోతే ముందుముందు కొనలేమనే భయం ఎలాగైతే కొనుగోలుదారుల్లో ఉందో.. అలాగే కొత్త డెవలపర్లే పెద్ద ప్రాజెక్ట్‌లు చేసి మార్కెట్‌ను క్యాష్ చేసుకుంటుంటే మనం వదలుకుంటున్నామనే భయం సీనియర్ డెవలపర్లలో నెలకొంది. ప్రీలాంచ్లో విక్రయాలు, యూడీఎస్ బుకింగ్స్ చేస్తూ అడ్డదారులలో కొందరు డెవలపర్లు మార్కెట్‌ను పాడు చేస్తుంటే.. న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తూ, కొనుగోలుదారులు సొంతిల్లు కలను నిజం చేస్తున్న డెవలపర్లకు సమస్యలు వస్తున్నాయి. దీంతో డెవలపర్లు మానసికంగా నలిగిపోతున్నారని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కొనేముందు ఇవి చూడాలి.. ఎంపిక చేసిన ప్రాజెక్ట్ గురించి న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. ఎన్ని బ్యాంక్‌ల నుంచి ప్రాజెక్ట్లోన్ తీసుకున్నారు వివరాలు తెలుసుకోవాలి. హెచ్ఎండీఏ, లోకల్ బాడీ, ఫైర్, ఎన్విరాన్మెంటల్, ఎయిర్పోర్ట్ వంటి ప్రభుత్వ విభాగాల అనుమతులున్నాయా? లేవా? రెరాలో నమోదు చేశారా లేదా చూసుకోవాలి. ప్రాజెక్ట్‌ను కట్టే ఆర్థిక స్తోమత నిర్మాణ సంస్థకు ఉందా? లేదా? బిల్డర్‌కు నిర్మాణ రంగంలో సాంకేతిక అనుభవం ఉందా లేదా చూసుకోవాలి. నిర్మాణ సంస్థ విలువలు, డెవలపర్ గత చరిత్ర గురించి ఆరా తీయాలి. ప్రాజెక్ట్ నాణ్యత, గడువులోగా పూర్తవుతుందా లేదా పరిశీలించాలి. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? సోషల్ ఇన్ఫ్రా ఎలా ఉందో గమనించాలి. -
టీడీపీ నేత అయ్యన్న తనయుడి రచ్చ రచ్చ..
విశాఖపట్నం: వైఎస్సార్సీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. టీడీపీ నేతలకు కాళ్లు చేతులు ఆడట్లేదు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌కు, వైఎస్సార్సీపీ అభ్యర్థులకు నర్సీపట్నం ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అందుకే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.విజయ్ ఆదివారం మార్చి నెలకు సంబంధించి నిత్యావసరాల పంపిణీని అడ్డుకున్నారు. దురుద్దేశంతో ఆటంకం కలిగించారు. 26వ వార్డులో ఎప్పటి మాదిరిగానే వాహనదారుడు సరకులు పంపిణీ చేస్తుండగా విజయ్ అనుచరులు వ్యాన్ దగ్గరకు వెళ్ళి పంపిణీని అడ్డుకుని వ్యాన్‌ను మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. డ్రైవర్ వద్ద ఉన్న రూ.10 వేల గురించి గొడవ చేశారు. అది నాలుగు రోజుల నుంచి నిత్యావసర సరుకులు అమ్మగా వచ్చిన సొమ్మని వ్యాన్ డ్రైవర్ పోలీసులకు వివరించారు. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పినప్పటికీ సంతృప్తి చెందని విజయ్ మున్సిపల్ కార్యాలయం వద్ద నాటకీయ పరిణామాలకు తెర తీశారు. అధికారులు సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. కొందరు వ్యక్తులు తమ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగాలని చూస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా 26వ వార్డులో తన తల్లి పద్మావతి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆవేశంతో ఊగిపోయారు. పోలీసులు, మున్సిపల్ కమిషనర్‌పై విరుచుకుపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా రోడ్డు మీద పడుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని ఉపన్యసించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎలక్షన్లో ఎవరి వ్యూహాలు వారివి.. దీన్ని ఇంత రచ్చ చేయడం అనవసరమని పట్టణ ప్రజలు చర్చించుకున్నారు. పట్టణ సీఐ హామీతో ఆందోళన విరమించిన అయ్యన్న పట్టణ సీఐ స్వామినాయుడు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ హామీ ఇచ్చినా చాలని అయ్యన్నపాత్రుడు పేర్కొనడంతో సీఐ స్వామినాయుడు మైక్ తీసుకుని మాట్లాడారు. ఈ నెల 10న జరగనున్న ఎన్నికల్లో పట్టణ ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు వేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇవ్వడంతో అయ్యన్నపాత్రుడు ఆందోళన విరమించారు. చదవండి: ఎంపీ కేశినేనిని దూరంపెట్టిన చంద్రబాబు.. పాచి పనులకు పోతారా? -
ధరల పెరుగుదలపై ఇంత నిరాసక్తతా?
గత నలభై ఏళ్లుగా రాజకీయాలను, ప్రభుత్వ విధానాలను గమనిస్తున్నవారందరికీ గుర్తుండిపోయే విషయాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా ఇంధన ధరలు ఒక పావలా పెరిగినప్పుడు, బస్సు చార్జీలు కిలోమీటరుకు రెండు నయాపైసలు పెంచినపుడు, రైలు చార్జీలు ఐదుశాతం పెరిగినపుడు, నూనెల ధరలు అయిదు రూపాయలు పెరిగినపుడు దేశం మొత్తం గగ్గోలెత్తిపోయేది. విపక్షాలన్నీ కలసికట్టుగా దేశవ్యాప్త ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించేవి. ఈ ధర్నాలు నిర్వహించడానికి కమ్యూనిస్టు పార్టీలు ముందంజలో నిలిచేవి. పెట్రోల్ ధరలు పెరగగానే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు దూరదర్శన్ వారు కెమెరాలతో చిత్రీకరిస్తుండగా కొంచెం దూరం సైకిల్ తొక్కుతూ అసెంబ్లీ భవనానికి వెళ్లేవారు. మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవారు. మరికొందరైతే తమ ఇళ్లలో లాంతర్లు వెలిగించి నిరసన తెలిపేవారు. గ్యాస్ ధర పది రూపాయలు పెరిగితే రోడ్ల మీద కట్టెలతో వంటలు చేస్తూ నిరసనలు తెలిపేవారు. ఈ ఆందోళనల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనేవారు. లాఠీ చార్జీలు జరిగినా, బాష్పవాయువు ప్రయోగించినా, బుల్లెట్లు కురిపించినా బెదిరేవారు కారు. విపక్ష నాయకులు ఆందోళనల్లో ముందుండి ఉద్యమాలను నడిపేవారు. పెంచిన ధరలు తగ్గించాల్సిందే అని ప్రతిపక్షాలు, నయాపైసా కూడా తగ్గించేది లేదని ప్రభుత్వాలు భీష్మించుకునేవి. ఎప్పుడో ఒకటోఅరో సందర్భాల్లో పెంచిన ధరలను ఒక్క శాతం తగ్గించేవి ప్రభుత్వాలు. అప్పటికే పదిశాతం ధరలు పెరిగాయనే వాస్తవాన్ని విస్మరించి తామేదో ఘనవిజ యాన్ని సాధించినట్లు, ప్రభుత్వం మెడలు వంచినట్లు విపక్షాలు సంబరపడిపోయేవి. ఇలాంటి గిమ్మిక్కులనే ఎద్దేవా చేస్తూ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ అనే సినిమాను నిర్మించారు. సినిమాలో ముఖ్యమంత్రి ఏ వస్తువు మీదైనా ధరలు పెంచాలంటే ముందుగా రూపాయి వస్తువును మూడు రూపాయలకు పెంచడం, దానిమీద ప్రతిపక్షాలు మండిపడి ఆందోళనలు చేస్తే ఒక రూపాయిని తగ్గించడం, దాంతో విపక్షాలు శాంతించి ఆందోళన విరమించడం జరిగేవి. రూపాయి వస్తువు రెండు రూపాయలు అయిందనే స్పృహ అటు ప్రజలకూ ఉండేది కాదు, విపక్షాలకూ ఉండేది కాదు. ఎపుడో నలభై ఏళ్ళక్రితం దాసరి నారాయణరావు తీసిన అలాంటి సంఘటనలు ఆ తరువాత నిజజీవితంలో కూడా కొన్ని సార్లు జరిగాయి. ఇంధనధరలను పెంచితే వెంటనే దేశవ్యాప్తంగా లారీ యజమానులు సమ్మెకు దిగేవారు. ఎక్కడి లారీలు అక్కడే స్తంభించిపోయేవి. రవాణా స్తంభించిపోవడంతో కూరగాయలు, పండ్లు చెడిపోవడం, రైతులకు కోట్లలో నష్టం వాటిల్లడం జరిగేవి. దాంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోవడం, ఆ తరువాత లారీ యజమానుల సంఘం వారు ప్రభుత్వంతో చర్చలు జరపడం, అందులో వారికేవో కొన్ని హామీలు లభించడం, ఫలితంగా సమ్మెను విరమించడం షరా మామూలుగా సాగిపోతుండేది. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుండేది. ఉల్లిపాయల ధర పెరగడంతో కేంద్ర ప్రభుత్వాలనే దించేసిన ఉదంతాలు ఉన్నాయి మనదేశంలో. గత కొద్దికాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు దినదినప్రవర్ధమానం అవుతున్నాయి. ప్రతిరోజూ ధరలు పెంచేస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇంధనం ధరలు, గ్యాస్ ధరలు పది రూపాయలు పెంచగానే బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేసేది. బీజేపీ అగ్రనేతలు సిలిండర్లను రోడ్లమీద పెట్టి కట్టెలతో వంటలు చేసేవారు. నూనె ధరలు రెండు రూపాయలు పెరిగితే నీళ్లతో తిరగమోతలు పెడుతూ నిరసన తెలిపేవారు. మన్మోహన్ ప్రభుత్వం వంటగ్యాస్ ధరను పాతిక రూపాయలు పెంచినపుడు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ పెంచిన భారాన్ని తమ ప్రభుత్వం మోస్తుందని ప్రకటించి ప్రజలను శాంతిం పజేశారు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఆ భారాన్ని ప్రజలే భరించాల్సి వచ్చింది. ఇక కమ్యూనిస్ట్ పార్టీలైతే ప్రతిరోజూ మన్మోహన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక చోట ఆందోళనలు చేస్తూనే ఉండేది. మన్మోహన్ ప్రభుత్వం దిగిపోయాక మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం గద్దె ఎక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము ప్రదర్శించిన ధర్నాలు, ఆందోళనలను వాటంగా విస్మరించి అనునిత్యం ధరలు పెంచడమే పరమావధిగా పెట్టుకుంది. ముఖ్యంగా గత రెండేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయిదారు నెలలక్రితం ఉన్న ధరలకు దాదాపు రెట్టింపు అయ్యాయి. పప్పు దినుసులు, నూనెలు, వంట గ్యాస్ ధరలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూ సామాన్యుల గుండెలను దడదడలాడిస్తున్నాయి. పెట్రోల్ ధర దాదాపు వందరూపాయలకు చేరువలో ఉన్నది. గత మూడు నెలల్లో వంట గ్యాస్ ధర రెండు వందల రూపాయల మేర పెరిగింది. నాలుగైదు నెలల క్రితం వరకూ నూట యాభై రూపాయల వరకూ సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో జమ అయ్యేది. ఇప్పుడు అదికూడా పోయింది. ఒకప్పుడు ధరలు పెంచడం అంటే బడ్జెట్ సమావేశాల్లో మాత్రమే జరిగేది. ముందుగా కేబినెట్ మీటింగ్‌లో చర్చించి పార్లమెంట్లో ప్రవేశపెట్టి పెంచేవారు. ఇప్పుడు అలాంటి సంప్రదాయాలు లేవు. ప్రతిరోజూ పెంచేస్తున్నారు. అయినా ఆశ్చర్యం! ఎక్కడా ఆందోళనలు లేవు. సమ్మెలు లేవు. ధర్నాలు లేవు. కరెంట్ చార్జీలు పెంచినా, రవాణా చార్జీలు పెంచినా, ఇంటి పన్నులు పెంచినా, కూరగాయల ధరలు పెరిగినా, ఆరోగ్యకారక మందుల ధరలు పెంచినా, ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచినా కిమన్నాస్తి. ప్రజలు కానీ, పార్టీలు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. గతంలో పెరిగిన ధరలపై చెలరేగిన ఆందోళనలు, ఉద్యమాల వాతావరణం ఇప్పుడు కనిపించలేదు. విద్యార్థులతో సహా అన్ని వర్గాలూ ధరల పెరుగుదలపై, ఇతర సమస్యలపై పూర్తిగా నిరాసక్తత ప్రదర్శిస్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు తమ చిత్తం వచ్చినట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా, ఇంధన ధరలు పెంచినా ఒకరోజు గుండెలు బాదుకుని మరునాడు ఎంత పెరుగుతుందా అని ఎదురు చూడటం తప్ప మరో గత్యం తరం కనిపించడం లేదు. ఇలపావులూరి మురళీ మోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
మూడు స్తంభాల ‘సూపర్ షాప్’
కరోనా విజృంభిస్తున్న సమయం.. ఇళ్లల్లోంచి అడుగు బయట పెట్టాలంటే ఆందోళన.. మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెచ్చుకుందామన్నా భయం.. ఇలాంటి విపత్కర సమయాన్ని అవకాశంగా మార్చుకున్నారు ఆ ముగ్గురు యువకులు. తమ గ్రామస్తులకు ఆన్లైన్ ప్లాట్ ఫాంను అందుబాటులో ఉంచి, వారు బుక్ చేసుకున్న సరుకులను హోం డెలివరీ చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆ విధంగా అండగా ఉండటంతో పాటు.. వారూ ఉపాధి పొందుతున్నారు.. కొమరోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పామూరుపల్లెకు చెందిన నారాయణరెడ్డి, నాగూర్‌బాషా, తిరుమల కొండారెడ్డి బీటెక్ చదివి ఇళ్ల వద్ద ఖాళీగా ఉంటున్నారు. ముగ్గురూ కలిసి వినూత్నంగా ఏదన్నా వ్యాపారం చేద్దామనుకుంటున్నారు. అయితే ఏం చేయాలా.. అని కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో కరోనా విజృంభించింది. జనం నిత్యావసర సరుకుల కోసం ఇళ్లల్లోంచి బయటకు రావడానికి ఇబ్బందిపడుతున్నారు.. ఆ సమయంలో వారికి ఓ ఆలోచన మెరిసింది. ఆ నిత్యావసర సరుకులను వారి ఇళ్లకు తామే సరఫరా చేస్తే ఎలా ఉంటుందని. వెంటనే దానిని ఆచరణలో పెట్టారు. ‘çççసూపర్ షాప్’ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. తమ గ్రామస్తులు బుక్ చేసుకున్న నిత్యావసర వస్తువులను ఉచితంగా హోం డెలివరీ చేస్తున్నారు. బుక్ చేసిన 10 నుంచి 15 నిమిషాల్లో సరుకులతో వారి ఇళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నారు. కొమరోలు నుంచి 10 కి.మీ దూరం వరకు ఏ గ్రామానికైనా ఉచితంగా సరకులను చేరవేస్తున్నారు. కిరాణా, ఫ్యాన్సీ షాపులతో ఒప్పందం కొమరోలులోని కిరాణా, ఫ్యాన్సీ షాపులు, రెస్టారెంట్లతో ముందుగానే ఈ యువకులు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు కస్టమర్లు కోరిన సరుకులు, కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్‌ను తక్కువ ధరకే ఆయా షాపుల నుంచి కొనుగోలు చేస్తారు. తాము కూడా తక్కువ లాభాలు మాత్రమే తీసుకుంటూ ఎక్కువ ప్రయోజనాన్ని కస్టమర్లకే అందిస్తున్నారు. దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే దానికంటే ఆన్లైన్లో వీరి వద్ద కొన్న వస్తువులు రెండు, మూడు రూపాయలు తక్కువకే వస్తుండటం, పైగా డోర్ డెలివరీ చేస్తుండటంతో గ్రామస్తులు వీరిని ప్రోత్సహిస్తున్నారు. అన్నీ తామై.. కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువుల కొనుగోలు దగ్గర్నుంచి.. వాటిని హోం డెలివరీ చేసే వరకూ అన్ని పనులూ ఆ ముగ్గురే తామై చక్కబెడుతున్నారు. సూపర్ షాప్ పేరుతో యాప్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. ప్రస్తుతం తమ గ్రామం, చుట్టుపక్కల గ్రామాలకు అందిస్తున్న తమ సేవలను.. తర్వాత మండలం, ఆ తర్వాత జిల్లాకు విస్తరిస్తామని చెబుతున్నారు. సేవ చేస్తున్నామన్న సంతృప్తి.. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్ వంటివి విజయవంతం కావని పలువురు చెప్పారు. ఆయినా మేం నిరుత్సాహ పడలేదు. సాహసం చేసి ముందుకు సాగుతున్నాం. సత్ఫలితాలొస్తున్నాయ్.. మున్ముందు ఆన్లైన్ ద్వారా మరిన్ని వస్తువులను సరఫరా చేసే ఆలోచన చేస్తున్నాం. ప్రజలకు మా స్థాయిలో సేవ చేస్తున్నామన్న తృప్తితో పాటు, మా కాళ్లమీద మేం నిలబడ్డామన్న సంతృప్తి మాకుంది. – నారాయణరెడ్డి, నాగూర్‌బాషా, కొండారెడ్డి -
వరద బాధితులకు అదనంగా ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: గోదావరి ముంపు బాధిత కుటుంబాలకు సాధారణంగా (రెగ్యులర్) ఇచ్చే రేషన్‌కు అదనంగా నిత్యావసరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌కు ఇది అదనంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ సరుకులను సెప్టెంబర్ 7వ తేదీకల్లా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ‘స్పందన’లో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరద సహాయక చర్యలపై సమీక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ► సెప్టెంబర్ 7వ తేదీలోగా గోదావరి ముంపు బాధితుల్లో ఒక్కో కుటుంబానికి రూ.2 వేల చొప్పున అదనపు సహాయం ఇచ్చేలా ప్రణాళిక వేసుకోండి. ఇంతే కాకుండా 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళా దుంపలు రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌కు అదనంగా ఇవ్వాలి. ► వరదల కారణంగా దెబ్బ తిన్న చోట్ల వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున మందులు అందుబాటులో ఉంచుకోవాలి. ► వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి.. రోగాలు రాకుండా మనం పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా వెంటనే వైద్య శిబిరాలను ప్రారంభించాలి. మండల స్థాయిలో నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో నిల్వ చేసుకోవాలి. పారిశుధ్య కార్యక్రమాలు, తాగు నీటి క్లోరినేషన్ కోసం చర్యలు తీసుకోవాలి. ► దేవుడి దయతో గోదావరిలో వరదలు తగ్గుముఖం పట్టాయి. గోదావరిలో 10 లక్షల క్కూసెక్కుల కంటే తక్కువ వరద ఉందన్న సమాచారం వస్తోంది. కృష్ణా నదిలో కూడా వరదలు తగ్గుముఖం పడుతున్నాయి. ► శ్రీశైలంలో గేట్లు కూడా మూసివేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ► సెప్టెంబర్ 7లోగా పంట నష్టంపై అంచనాలు రూపొందించి, కలెక్టర్లు ఆ మేరకు బిల్లులు సమర్పించాలి. దీనిపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. కృష్ణా జిల్లా సహా మిగిలిన చోట్ల ఎక్కడ పంటలు దెబ్బ తింటే.. అక్కడ వెంటనే చర్యలు చేపట్టాలి. వరద వేళ బాగా పని చేసిన ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు అభినందనలు. -
మంచి రోజులు ముందున్నాయి
స్టార్ హీరోల పుట్టినరోజంటే హంగామా, సందడి అంతా వేరు. సామాజిక సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ వేడుకలు సర్వసాధారణం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సామూహికంగా పాల్గొనే కార్యక్రమాలు నిర్వహించడం కరెక్ట్ కాదని వాయిదా వేస్తున్నారు. అయితే అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా చూపిస్తున్నారు. సంబరాలన్నీ ఇంటర్నెట్ సాక్షిగా జరుపుకుంటున్నారు. ఓ స్టార్ హీరో బర్త్‌డే అంటే ప్రత్యేకంగా డిజైన్ చేసిన సీడీపీ (కామన్ డిస్ప్లే పిక్చర్), మరియు హ్యాష్‌ట్యాగ్ విడుదల చేసి, ఆ సీడీపీనే తమ అకౌంట్స్ పిక్చర్స్‌గా మార్చుకుని ఆ ట్యాగ్‌ను ఉపయోగించి తమ ప్రేమను సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తుంటారు. ఈ ఏడాది చిరంజీవి బర్త్‌డే కామన్ డీపీను సుమారు వందమంది సెలబ్రీటీలతో విడుదల చేయిస్తున్నారు. వంద మందికి పైగా సెలబ్రీటీలు కామన్ డీపీను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ సీడీపీ విడుదల చేసే వారిలో చిరుతో నటించినవారి దగ్గర నుంచి యంగ్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. ఇది తాత్కాలిక కష్టమే ‘‘సినిమా షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు.. ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. పని లేక, చేతిలో డబ్బు లేక సినీ కార్మికుల పరిస్థితి కష్టంగా ఉంది. అందుకే ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సీసీసీ) తరపున మూడోసారి కూడా కార్మికులకు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని నిర్ణయించుకుని, ఇప్పటికే పంపిణీ మొదలుపెట్టాం’’ అని హీరో చిరంజీవి అన్నారు. సీసీసీ మూడో విడత నిత్యావసర సరుకుల పంపిణీ సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి చిరంజీవి ఓ వీడియో షేర్ చేశారు. ‘‘హైదరాబాద్‌లోని అన్ని అసోసియేషన్లు , యూనియన్లు, సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రాలో ఉన్న సినీ వర్కర్స్‌కి ఎప్పటిలాగా ఇస్తాం. అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లోని రెప్రజంటేటివ్లకు, పోస్టర్ అతికించే కార్మికులకు కూడా అందివ్వాలని నిర్ణయించాం. ఇప్పుడున్న ఈ పరిస్థితి శాశ్వతం కాదు.. తాత్కాలిక కష్టమే. మంచి రోజులు ముందున్నాయి. పని చేసుకొంటూ సంతోషంగా గడిపే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కి, మామూలు పరిస్థితులు నెలకొనాలని ఆ వినాయకుడికి మొక్కుదాం’’ అన్నారు. ఈ సమావేశంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, దర్శకుడు మెహర్ రమేశ్, నటుడు బెనర్జీ తదితరులు మాట్లాడారు. -
పేదలకు రూ.1,500 నగదు సాయం ఆపొద్దు
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడు నెలలు రేషన్ బియ్యం తీసుకోని తెల్ల రేషన్ కార్డు దారులకు రూ.1,500 నగదు సాయం ఆపేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లాక్డౌన్ లాంటి కష్టకాలంలో నగదు సాయం ఎలా నిలిపేస్తారని ప్రశ్నించింది. మూడు సార్లు బియ్యం తీసుకున్న వారికే కాకుండా బియ్యం తీసుకోని వారికీ నగదు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వరుసగా 3 నెలలు రేషన్ బియ్యం తీసుకోని వారికి రూ.1,500 నగదు సాయం నిలిపివేత అన్యాయమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎ.సృజన రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి బుధవారం విచారణ చేపట్టింది. లాక్డౌన్ వేళ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు రూ.1,500 వంతున ఆర్థిక సాయం అందించాల్సిందేనని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం ఆదేశించింది. రేషన్‌కార్డుదారులకు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పిన జవాబు పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ ఏడాది మార్చి 20న జారీ చేసిన జీవో 45 ప్రకారం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రూ.1,500 వంతున అందజేయాలంది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. 8 లక్షల కార్డుల్నిఎలా రద్దు చేస్తారు.. విచారణ సందర్భంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘రాష్ట్రంలో 8 లక్షల కార్డుల్ని ఒక్కసారిగా ఎలా రద్దు చేస్తారు.. వారికి నోటీసు లేకుండా రద్దు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. లాక్డౌన్ వేళ కార్డు లేదని బియ్యం ఇవ్వకపోయినా, నిత్యావసరాలకు నగదు పంపిణీ చేయకపోయినా ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుతుంది. ధనవంతులు బాగానే ఉంటారు. పేదరికంలోని వారికే దయనీయ స్థితి. కార్డుదారుల అర్హతలన్నీ చూశాకే తెల్ల కార్డుల్ని జారీ చేసినప్పుడు రద్దు చేసేప్పుడు వారి వివరణ కోరాలి కదా ’అని వ్యాఖ్యానించింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. పిటిషనర్ చెబుతున్న స్థాయిలో కార్డులు రద్దు కాలేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం సమయం కావాలని కోరడంతో విచారణను కోర్టు జూన్ 2కి వాయిదా పడింది. కార్డులు లేకపోయినా ఇవ్వండి లాక్డౌన్ వేళ పేదలకు రేషన్ కార్డులున్నా లేకున్నా నెలకు 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని మరో పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెల్ల కార్డు చూపిస్తేనే రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారని, పెద్ద ఎత్తున రద్దు చేసిన కార్డులను పునరుద్ధరించాలని అభ్యర్థిస్తూ సామాజిక కార్యకర్త ఎస్.క్యూ మసూద్ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి బుధవారం మరోసారి విచారించింది. అటవీ ప్రాంతంలోగానీ, లాక్డౌన్ అమలు ఉన్న ప్రాంతాల్లోని పేదలు, కూలీలు, వలస కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీకి విధిగా బయోమెట్రిక్ కింద వేలి ముద్రల కోసం ఒత్తిడి చేయరాదని, అది లేకుండానే నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.