న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసుల్లేని గ్రీన్ జోన్లలో ఈ నెల 20 నుంచి పూర్తి స్థాయిలో ఈ కామర్స్ కార్యకలాపాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. కేవలం నిత్యావసరాలకే తప్ప (ఆహారోత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు), ఇతర ఉత్పత్తుల విక్రయాలకు ఈ కామర్స్ కంపెనీలకు అనుమతి లేదంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుందన్న ప్రశ్నకు.. అత్యవసరం కాని వస్తువుల విక్రయాలకు ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను అనుమతించడం వల్ల లౌక్‌డౌన్ పటిష్ట అమలుపై ప్రభావం చూపిస్తుందని గ్రహించడంతో నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగినట్టు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పున్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. ఈ కామర్స్ సంస్థలను అనుమతించినట్టు, తమను కూడా విక్రయాలకు అనుమతించాలని రిటైల్ వర్తకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే కేంద్రం తన విధానాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment