green zones
-
జూన్‌లో రైళ్ల కూత.. బస్సులపై అస్పష్టత
సాక్షి, హైదరాబాద్: జూన్ తొలి వారంలో ప్రజా రవాణాను ప్రారంభించేలా కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఇప్పటికిప్పుడు ప్ర జా రవాణా ప్రారంభించటం సరికాదని నిపుణు లు హెచ్చరిస్తున్నా, ఇప్పటికే లాక్డౌన్ వల్ల 50 రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యం లో.. ప్రజా రవాణా ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున, జూన్ మొదటి వారంలో ప్రారంభిం చాలని కేంద్రం భావిస్తోంది. ఆర్టీసీలపై రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేసింది. ఇటీవలే గ్రీన్జోన్లలో బస్సులు తిప్పుకునేందుకు వెసులుబాటు కలిగించిన విషయం తెలిసిందే. వాటిని తిప్పాలా వద్దా అన్నది మాత్రం రాష్ట్రాలకే వదిలేసింది. ఆరెంజ్, రెడ్ జోన్లలో మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఇక తన పరిధిలో ఉన్న రైల్వే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈనెలాఖరు వరకు రైళ్లను తిప్పొద్దని స్వయంగా రైల్వే బోర్డు అభిప్రాయపడింది. దీంతో జూన్ మొదటివారంలో రైళ్లను ప్రారంభించాలని భావిస్తోం ది. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గల వలస కూలీలను సొం త ప్రాంతాలకు తరలిం చేందుకు వీలుగా శ్రామిక్ స్పెషల్స్ పేరుతో సాధారణ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక సాధారణ రైళ్లను ప్రారంభిస్తే, ప్రయాణికుల మధ్య భౌతిక దూరం నిబంధన అంతగా అమలయ్యే అవకాశం లేదు. ఇదే భయం కేంద్రాన్ని వెంటాడుతోంది. ఈనెల 17 కేంద్రం లాక్డౌన్ విషయంలో సమీక్షించనుంది. ఆ సందర్భంగా రైళ్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకరిద్దరు మంత్రులు మాత్రం 17 తర్వాత రైళ్లను నడపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నిర్వహించే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. గ్రీన్జోన్లు పెరగటంతో..: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను నడిపే విషయంలో ప్రభుత్వం ఇంకా తేల్చుకోలేదు. బస్సులు తిప్పుకునేందుకు కేంద్రం అ నుమతించినా, రాష్ట్రంలో గ్రీన్‌జోన్ పరిధి తక్కువ గా ఉండటం, వాటి మధ్య ఆరెంజ్, రెడ్ జోన్లు ఉండటంతో బస్సులు తిప్పే అవకాశం లేదు. ప్రస్తుతం గ్రీన్ జోన్ల సంఖ్య పెరగటంతో ఇప్పుడు కొంత సానుకూలత ఏర్పడింది. త్వరలో ఈ సం ఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున మరిం త అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, హైదరాబాద్‌తో అనుసంధానం లేకుండా బస్సు లు తిప్పటం కష్టమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా హైదరాబాద్–జిల్లాల మధ్యనే ఎక్కువగా ప్రయాణిస్తారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం రెగ్యులర్‌గా కొత్త కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నందున ఇప్పట్లో అది గ్రీన్‌జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. పక్కపక్కనే గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు ఉన్నందున.. బస్సులు తిప్పేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా, గ్రీన్ జోన్లలో కూడా కొత్త పాజిటివ్ కేసులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 15న మరోసారి సమీక్షించి బస్సుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. అప్పటికి గ్రీన్‌జోన్ పరిధిలో దాదా పు 25 జిల్లాలు వచ్చే అవకాశం ఉన్నందున బ స్సులు తిప్పేందుకు సానుకూలత వస్తుంది. ఆ రెంజ్, రెడ్‌జోన్ సరిహద్దుగాలేని జిల్లాల్లో బస్సు లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డిపోల్లో థర్మో స్క్రీనింగ్ పరికరాలు: బస్సులు ప్రారంభించాక ప్రత్యే క జాగ్రత్తలు తీసుకోనున్నట్టు అధికారులు చెబు తున్నారు. సిబ్బందిలో ఎవరికైనా జ్వరం లక్షణా లుంటే అనుమతించకూడదని నిర్ణయించారు. ఇందుకోసం నిత్యం ప్రతి ఒక్కరిని థర్మో స్క్రీనిం గ్ ద్వారా శరీర ఉష్ణోగ్రత చెక్ చేయాలని నిర్ణయిం చారు. ప్రతి డిపో, కార్యాలయాల్లో వీటిని అందుబాటులో ఉంచేందుకు కొత్తవి కొంటున్నారు. ఇక సిబ్బంది చేతులు కడుక్కోవటం, శానిటైజర్ కో సం కాలితో నొక్కితే నీళ్లు, శానిటైజర్ వచ్చే పరికరాలను సమకూరుస్తున్నారు. వీటిని ఆర్టీసీనే సొంతంగా రూపొందిస్తోంది. ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సిబ్బంది విధులకు హాజరయ్యేలా ఇప్పటికే ఉత్తర్వు జారీ అయింది. ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా లేనందున, సిబ్బంది పెద్ద సంఖ్య లో డిపోలకు వస్తే భౌతికదూరం నిబంధన గల్లం తై కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. సగం మంది ప్రయాణికులతో.. ఒక కోచ్‌లో 72 మంది ప్రయాణికుల(బెర్తులు)కు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాన్నే అనుసరిస్తే భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించినట్టవుతుంది. దీంతో ఈ సంఖ్యను తగ్గించాలని యోచి స్తున్నారు. ఒక కోచ్‌లో 9 కూపేలుంటాయి. ఒక కూపేలో ఎదురెదురుగా మూడు బెర్తులు(అప్పర్, మిడిల్, లోయర్), సైడ్‌కు మరో రెండు బెర్తులు ఉంటాయి. సైడ్ బెర్తులో ఒకరు, ఎదురెదురుగా ఉండే బెర్తుల్లో నలుగురు ఉండేలా ఏర్పాట్లు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అంటే ఒక కూపేలో 8 మందికి బదులుగా 5గురు ఉంటారన్న మాట. ఇదే జరిగితే రైల్వే ఆదాయం భారీగా పడిపోతుంది. -
మాస్క్ లేకుంటే జరిమానా రూ. 1,000
కరోనా వైరస్ నిర్మూలనకు రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మే 7 నుంచి 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, దీనిని ఉల్లంఘించిన ప్రతిసారీ రూ.1000 జరిమా నా విధిస్తారని స్పష్టంచేశారు. వీటికి రాష్ట్రమంతటా అనుమతి... నిత్యావసర వస్తువులైన ఆహార పదార్థాల క్రయ విక్రయాలు, ఉత్పత్తి, రవాణా, వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి వస్తువుల విక్రయాలు, వ్యవసాయ కార్యకలాపాలు, అంతర్రాష్ట్ర, రాష్ట్రం అంతర్భాగంలో వస్తువుల రవాణా, ఆస్పత్రులు, క్లినిక్స్, మందుల దుకాణాలు, వైద్య పరీక్షల కేంద్రాల నిర్వహణ, ఉపాధి హామీ పనులు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికం, ఇంటర్నెట్, పోస్టల్ సేవలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, అత్యవసర వస్తువుల సప్లై చైన్ కొనసాగింపు, పెట్రోల్ పంపులు, ఎల్పీజీ– వీటి నిల్వలు, రవాణా సంబంధిత కార్యకలాపాలు రాష్ట్రమంతా కొనసాగుతాయి. ♦ గ్రామీణ ప్రాంతాలు, ఆరెంజ్, గ్రీన్ జోన్ల పరిధిలో అన్ని నిర్మాణ పనులకు అనుమతి. జీహెచ్ఎంసీతో సహా ఇతర రెడ్‌జోన్ ప్రాంతాల్లో వర్క్ సైట్ల వద్ద కార్మికుల లభ్యత ఉంటేనే పనులకు అనుమతి ♦ గ్రామీణ ప్రాంతాలు, ఆరెంజ్, గ్రీన జోన్ల పరిధిలో అన్ని రకాల పరిశ్రమలకు అనుమతి. స్టోన్ క్రషర్స్, ఇటుకల బట్టీలు, చేనేత, రిపేర్ పనులు, బీడీల తయారీ, ఇసుక ఇతరత్రా మైనింగ్, సిరామిక్ టైల్స్, రూఫ్ టైల్స్, సిమెంట్ పరిశ్రమలు, జిన్నింగ్ మిల్స్, ఐరన్, స్టీల్ పరిశ్రమలు, ప్లాస్టిక్, శానిటరీ పైపులు, పేపర్ పరిశ్రమలు, కాటన్ పరుపులు, ప్లాస్టిక్, రబ్బర్ పరిశ్రమలు, నిర్మాణ పనులకు అనుమతి. ♦ గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో అన్ని రకాల వస్తువుల ఈ–కామర్స్‌కు అనుమతి. జీహెచ్ఎంసీలో నిత్యావసర వస్తువుల ఈ–కామర్స్‌కు మాత్రమే అనుమతి. ♦ గ్రామీణ ప్రాంతాలతో పాటు గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో మాల్స్ మినహా అన్ని రకాల షాపులకు అనుమతి. రెడ్ జోన్లలో మినహాయించి మిగిలిన అన్ని పురపాలికల్లో ఒక రోజు విడిచి ఒక రోజు దుకాణాలను తెరవాలి. ఒకే రోజు పక్క పక్క షాపులు తెరవరాదు. రెడ్‌జోన్ పరిధిలోని జీహెచ్ఎంసీతో పాటు ఇతర పురపాలికల్లో నిత్యావసర వస్తువుల షాపులతో పాటు కేవలం నిర్మాణ సామాగ్రి, హార్డ్‌వేర్, వ్యవసాయ పరికరాలు/యంత్రాలకు అనుమతి. ♦ రెడ్ జోన్ పట్టణ ప్రాంతాల్లోని సెజ్‌లు, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పులు, ఔషధాలు, వైద్య పరికరాలు, వైద్య, ఔషధ సంబంధ ముడిసరుకులు తదితర నిత్యావసర, అత్యవసర వస్తువుల ఉత్పత్తి యూ నిట్లు, నిరంతరం నడవాల్సిన పరిశ్రమలు, ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తి, ప్యాక్డ్ వస్తువుల తయారీకి అనుమతి. ♦ జీహెచ్ఎంసీతో సహా ఇతర రెడ్‌జోన్ పరిధిలోని ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, ఇతర ప్రైవేటు కార్యాలయాలు 33 శాతం ఉద్యోగులతో పనిచేయాలి. మిగిలిన వారు ఇంటి నుంచే పని చేయాలి. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో పూర్తి ఉద్యోగుల సామర్థ్యంతో పనిచేసేందుకు అనుమతి. ♦ గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి ఉద్యోగుల సామర్థ్యంతో పని చేయవచ్చు. అయితే, రెడ్జోన్ల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 100 శాతం మంది డిప్యూటీ సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులతో పని చేయాలి. అవసరాన్ని బట్టి మిగిలిన సిబ్బందిలో 33 శాతం మంది విధులకు హాజరు కావచ్చు. రక్షణ, భద్రత, వైద్య, కుటుంబ సంక్షేమ, పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ స్టాంపులు, రెవెన్యూ, జైళ్లు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ, ఎన్ఐసీ, కస్టమ్స్, ఎఫ్‌సీఐ, ఎన్సీసీ, ఎన్‌వైకే, మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖలు ఎలాంటి ఆంక్షలు లేకుండా పనిచేయవచ్చు. అత్యవసర సేవలు కొనసాగాలి. ఆ మేరకు సిబ్బందిని వినియోగించుకోవాలి. ♦ రెడ్ జోన్ల పరిధిలో రెస్టారెంట్లు, బార్బర్ షాపులు, స్పా, సెలూన్స్‌కు అనుమతి లేదు. ట్యాక్సీలు, క్యాబ్, ఆటోరిక్షాలకు సైతం అనుమతి లేదు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి. ఆరెంజ్ జోన్లలో మాత్రమే కేవలం ఇద్దరు ప్రయాణికులతో ట్యాక్సీలకు అనుమతి. జోన్లతో సంబంధం లేకుండా వీటిపై నిషేధం.. ♦ దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ♦ రైలు ప్రయాణాలు (చిక్కుకుపోయిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లకు మినహాయింపు) ♦ అంతర్రాష్ట్ర బస్సులతో ప్రజారవాణా. ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తుల రాకపోకలు (ప్రత్యేకంగా అనుమతి పొందినవారికి మినహాయింపు) ♦ అంతర్ జిల్లాతో పాటు జిల్లా లోపల బస్సు సేవలు ♦ మెట్రో రైళ్లు ♦ పాఠశాలలు, కళాశాలలు, విద్యా/శిక్షణ సంస్థలు ♦ హోటళ్లు, లాడ్జీల వంటి ఆతిథ్య సేవలు (వైద్య, పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు, చిక్కుకుపోయిన వ్యక్తులకు బస కల్పించే వాటికి మినహాయింపు) ♦ బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, అమ్యూజ్మెంట్, జూ పార్కులు, మ్యూజియంలు, ఆడిటోరియంలు ♦ సామూహికంగా నిర్వహించే అన్ని రకాల సామాజిక, రాజకీయ, క్రీడల, వినోద, విద్య, సాంస్కృతిక కార్యకలాపాలు ♦ అన్ని ప్రార్థన స్థలాలు, మతపరమైన స్థలాలు ♦ అన్ని సామూహిక మతపర కార్యక్రమాలు ♦ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు ఎలాంటి జన సంచారానికి అనుమతి లేదు. అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు. ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా ఇతర దుకాణాలు/వ్యాపార సంస్థలను సాయంత్రం 6 తర్వాత మూసేయాలి. -
అసలు సవాలు ఇప్పుడే!
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాల్లో లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు బయటకు రావడం మొదలైంది. వాణిజ్య, వ్యాపార, ఇతర వృత్తుల వారు కార్యకలాపాలను ప్రారంభించారు. బతుకుదెరువు కోసం వీధి వ్యాపారులు రోడ్లపైకి వస్తున్నారు. రెడ్‌జోన్ జిల్లాల్లోనూ కొన్నింటికి సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల మద్యం దుకాణాలకు, కొన్ని వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. అంటే లాక్డౌన్ సడలింపుల తో వివిధ వర్గాల ప్రజలు బయటకు వచ్చి రోజు వారీ కార్యకలాపాల్లో నిమగ్నమైపోతున్నారు. ఇప్పటికే ఉపాధి కోల్పోయి, ఆసరా లేకుండా ఉన్నవారు సడలింపులతో ఎంతో ఊరట చెందారు. అయి తే కరోనా వైరస్‌ను ఇప్పటివరకు లాక్‌డౌన్‌తో కట్ట డి చేశారు. తాజా సడలింపులతో ఎలాంటి పరిణా మాలు ఎదురవుతాయోనన్న భయాందోళన వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలను వెంటాడుతోంది. సడలిం పుల అనంతరం తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడం వైద్య, ఆరోగ్య శాఖకు సవాలుగా మారింది. ప్రజలను చైతన్యం చేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇన్నాళ్లూ కట్టడిలోనే ఉన్నామని, లాక్‌డౌన్‌లోనూ ఇచ్చిన వెసులుబాటులోనూ జాగ్రత్తలతో కట్టడి పాటించాలని కోరుతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ ‘కరోనాతో కలసి జీవనం సాగిం చాల్సిందే’నని, ఆ ప్రకారం ముందుకు సాగ క తప్పదంటున్నారు. జనబాహుళ్యంలో హెర్డ్ ఇమ్యునిటీ రావాల్సిన అవసరముందన్న చర్చ జరుగుతోంది. ఆ ప్రకారం యువకులు బయటకు రావాలి. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతరత్రా అనారోగ్యాలతో ఉన్న వారు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాస్‌రావు బుధవారం కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు. ► భౌతికదూరం: ఇతరుల నుంచి కనీసం 6 అడుగుల భౌతికదూరం పాటించాలి. అపరిచితులతో సన్నిహిత సంబంధాన్ని నివారించాలి. మార్కెట్లు, కార్యాలయాలు, ప్రయాణ సమయాల్లోనూ సురక్షితమైన దూరాన్ని పాటించాలి. ► ఫేస్ మాస్క్‌లు: ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరిం చాలి. ఇన్ఫెక్షన్ నుంచి రక్షించే విషయంలో ఇదే అత్యంత కీలకమైన అంశం. ఇంట్లో తయారుచేసిన డబుల్ లేయర్డ్ ఫేస్ మాస్క్‌లు ఇన్ఫెక్షన్ను నివారించడంలో బాగా పనిచేస్తాయి. మాస్క్‌లను తరచుగా పైన తాకడం, సర్దుబాటు చేయడం మంచిది కాదు. రోజూ ఉతికిన తర్వాత తిరిగి వాడాలి. ► ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యం: ఫ్లూ లక్షణాలు అంటే దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒంటి నొప్పులు, తలనొప్పి వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలి. ► సొంతంగా రావొచ్చు: కరోనా పాజిటివ్ వ్యక్తితో లేదా వారితో పరిచయమున్న వ్యక్తులతో కాంటాక్ట్ అయితే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలి. ► అనవసర ప్రయాణాలు వద్దు: ప్రజలు అనవస ర ప్రయాణాలను నివారించాలి. ఇంట్లో ఉండటం కరోనా నియంత్రణకు ఉత్తమ నివారణ వ్యూహం. ► ఆహారపు అలవాట్లు: సరిగ్గా వండిన ఆహారాన్ని తినాలి. సురక్షితమైన మంచి నీటిని తాగాలి. రోజూ తాజా పండ్లు తినాలి. పుష్కలంగా నీరు తాగాలి. ► వృద్ధులు: వృద్ధులు ఇళ్లల్లోనే ఉండాలి. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలుంటే అవసరమైన మందులు తప్పక వాడాలి. ఏవైనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ► వ్యక్తిగత పరిశుభ్రత: వ్యక్తిగత పరిశుభ్రత ము ఖ్యం. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. దగ్గినపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ► మానసిక ప్రశాంతత: యోగా, ధ్యానం ద్వారా శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. దీంతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ► కరోనా సంబంధ సమాచారం కావాల్సిన వారు 104కి కాల్ చేయాలి. ► మానసిక ఆరోగ్యంపై కౌన్సెలింగ్ సేవలు అవసరమైనవారు 108కి కాల్ చేయాలి. -
ప్రగతి చక్రం ముందు ప్రశ్నలెన్నో!
సాక్షి, హైదరాబాద్: గ్రీన్జోన్ల పరిధిలో ఆర్టీసీ బస్సుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా అది కదిలే పరిస్థితి కనిపించడంలేదు. ఈ నెల 7తో రాష్ట్రంలో రెండో విడత లాక్డౌన్ ముగియాల్సి ఉన్నా, కేంద్రం ఈ నెల 17 వరకు మూడో విడత లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అప్పటి వరకు బస్సులు తిరిగే అవకాశం దాదాపు లేనట్లే. అయితే గ్రీన్ జోన్ల పరిధిలో సామర్థ్యంలో 50 శాతం మందితో బస్సులు తిప్పుకునేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్రంలో గ్రీన్ జోన్ పరిధిలో 9 జిల్లాలున్నా వాటి మధ్య బస్సులు తిప్పడం అంత సులువు కాదని ఆర్టీసీ భావిస్తోంది. ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గ్రీన్ జోన్ల పరిధిలో కూడా బస్సులు తిప్పొద్దని అధికారు లు సిఫారసు చేసేలా ఉన్నారు. ఆరెంజ్, రెడ్ జోన్ల నుంచి కూడా జనం వచ్చే ప్రమాదం ఉంటుందని, వారిలో వైరస్ సోకినవారుంటే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని అధికారులంటున్నారు. దీంతో గ్రీన్ జోన్లలో బస్సులు తిప్పే విషయంలో కూడా ఆచితూచే నిర్ణయం తీసుకోనున్నారు. నెలాఖరు వరకు పొడిగిస్తే.. ఈనెల 17తో కేంద్రం విధించిన లాక్డౌన్ పూర్తవుతుంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త ఎక్కువే ఉన్నందున, ఒకవేళ కేంద్రం తదుపరి లాక్‌డౌన్‌ను విధించకున్నా రాష్ట్రంలో నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగించటమే ఉత్తమమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత లాక్డౌన్ ఉన్నా, ఆంక్షలతో సడలించినా... బస్సులను తిప్పే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లాక్డౌన్ ఎత్తేసి జనం పనులకు వెళ్లటం ప్రారంభిస్తే బస్సుల్లేకుండా ఎలా అన్నది పెద్ద సమస్య. బస్సులు తిప్పితే ప్రయాణికులను నియంత్రించడం అంత సులువు కాదు, అలాంటప్పుడు మళ్లీ వైరస్ విస్తృతికి బస్సులు కారణమవుతాయని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ఎప్పటి నుంచి ప్రారంభించాలన్నది పెద్ద సవాల్‌గా మారింది. గ్రీన్ జోన్లో తిప్పాలన్నా సవాళ్లెన్నో.. రాష్ట్రంలో గ్రీన్‌జోన్‌ను ఆనుకునే ఆరెంజ్, రెడ్ జోన్లున్నాయి. బస్సు మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఒక్కోసారి రెడ్‌జోన్ దాటుకుని వెళ్లాలి. వరంగల్ అర్బన్ రెడ్ జోన్, వరంగల్ రూరల్ గ్రీన్ జోన్.. ఇక్కడ జనం అటూఇటూ కలిసినా గుర్తించలేరు. రెడ్‌జోన్ నుంచి వచ్చి గ్రీన్జోన్లో బస్సెక్కితే కండక్టర్లు పసిగట్ట లేరు. ఇక 50 శాతం సీట్లకే ప్రయాణికులను పరిమితం చేయాలన్న నిబంధన అమలు కూడా కష్టమే. కొందరు కండక్టర్లను బెదిరించి బస్సెక్కే పరిస్థితి ఉంటుంది. ఇక బస్సులో ప్రయాణించిన ఏ వ్యక్తికైనా కరోనా ఉన్నట్లు తేలితే, అందులో ప్రయాణించిన వారందరినీ క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ వారి వివరాలు దొరకడం సులభం కాదు. ఇవన్నీ ఆర్టీసీ అధికారులు సంధిస్తున్న ప్రశ్నలు. వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిపుణుల సూచనలివి... ఇప్పటికిప్పుడు బస్సులు రోడ్డెక్కడం శ్రేయస్కరం కాదు. కనీసం నెల రోజుల తర్వాతే బస్సులను ప్రారంభించాలి. కరోనా బాధితులు హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎంతమందిలో వైరస్ ఉందో చెప్పలేని పరిస్థితి. అందుకని నెలాఖరుకు బస్సులు ప్రారంభించినా, హైదరాబాద్ నుంచి తిప్పొద్దు. కనీసం ఆరు నెలలు నడపొద్దు కరోనా విస్తరిస్తూ పోతే తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రస్తుతం వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, కనీసం ఆరు నెలల పాటు ప్రజా రవాణాను నిలిపివేయాలి. ఈలోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశంతో పాటు వైరస్ ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది. ఆరు నెలల పాటు ప్రజా రవాణాను నిలిపివేయటమంటే ఆయా సంస్థలను దాదాపు దివాలా తీయించడమే. ప్రజా రోగ్యం, ప్రజారవాణా సంస్థలు.. రెండింటిలో ప్రజారోగ్యానికే ప్రాధాన్యం. ఆ సంస్థలను బతికించుకోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాలి. – పాదం సుదర్శన్, పుణేలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు, మాజీ డైరెక్టర్ ఇప్పటికి ఇప్పుడు నడపొద్దు.. ప్రస్తుతం బస్సులు తిప్పే పరిస్థితి లేదు, తిప్పితే ప్రమాదకరం కూడా. నెల తర్వాత లాక్డౌన్ సడలిస్తే కచ్చితంగా బస్సులు తిప్పాలి. ఎందుకంటే, బస్సులు లేకుంటే జనజీవనం ముందుకు సాగదు. లిమిటెడ్ సర్వీసులనే తిప్పుతూ సీటుకు ఒకరు చొప్పున ఉండేలా చూడాలి. ప్రయాణికులు కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించి వచ్చేలా నిబంధనలు విధించాలి. బస్సుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. అనారోగ్యంతో ఉన్నవారిని ఎక్కనీయకుండా చూడాలి. ఇలాంటి జాగ్రత్తలతో కొంతకాలం తక్కువ బస్సులు తిప్పుతూ, అనుకూలమైన వాతావారణం వచ్చేకొద్దీ వాటి సంఖ్యను పెంచుతూ పోవాలి. – నాగరాజు, ఆర్టీసీ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పకడ్బందీ జాగ్రత్తలతో తిప్పాలి.. బస్సులు తిప్పేందుకు నిర్దిష్టంగా కొన్ని నిబంధనలు రూపొందించాలి. ఏమాత్రం అజాగ్రత్త, నిర్లక్ష్యానికి తావి వ్వొద్దు. ఆర్టీసీ బస్టాండ్లలో ఎక్కడా జనసమూహం భారీగా ఉండకుండా చూడాలి. బస్సుల్లో ఒక సీటును వదిలి తదుపరి సీటులో ప్రయాణికులు కూర్చునేలా చూడాలి. ప్రతి బస్సు బయలు దేరేముందు, గమ్యం చేరి తిరిగి అక్కడ బయలుదేరేముందు శానిటైజ్ కావాలి. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేస్తూ బస్సులను కూడా ప్రారంభించాలి. – ఆర్టీసీ విశ్రాంత ఎండీ బస్సులతో అత్యంత ప్రమాదం.. కరోనా పాజిటివ్ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తే, ఆ బస్సులో ఉన్న మిగతావారందరికీ ప్రమాదం పొంచి ఉన్నట్టే. మాస్కు సరిగా లేకుండా ఆ వ్యక్తి తుమ్మినా, దగ్గినా మిగతావారికి వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే తుమ్మినప్పుడు పడే తుంపర్లు బస్సు హోల్డింగ్ రాడ్స్‌పై పడ్డా, సీటుపై పడ్డా చాలామంది ఆ ప్రాంతాల్లో చేతులు పెట్టే అవకాశం ఉంటుంది. వెంటనే చేతులు శుభ్రం చేసుకోని పక్షంలో కచ్చితంగా వైరస్ వారిలోకి చేరుతుంది. – డాక్టర్ పి.ఎస్.మూర్తి, సీనియర్ సర్జన్ -
ఈ నగరాల్లో జోన్లను బట్టి సడలింపులు: కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్నందున లాక్‌డౌన్‌ను మే 17 వరకు పోడగించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్ కేసులు తగ్గిన ప్రాంతాలను వివిధ జోన్లుగా కేటాయించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన సడలింపులను ఇచ్చింది. ఈ క్రమంలో మెట్రో నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ ప్రాంతాలకు కేంద్రం కొన్ని సడలింపు ఇస్తూ మార్గదర్శకాలను వెల్లడించింది. (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ) నగరంలో అవసరమైన కార్యకలాపాల కోసం ప్రయణాలు చేయొచ్చా.. దేశ వ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ అవసరమైన కార్యకలాపాల ప్రయణాలపై కేంద్రం దేశవ్యాప్తంగా నిషేధం విధించినట్లు శుక్రవారం పేర్కొంది. ఇక అటువంటి ప్రయాణాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉన్నట్లు పేర్కొంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా ప్రాంతాలకు నిర్థిష్ట పరిమితులు విధించడానికి రాష్ట్రా ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అధికారం ఉన్నట్లు కూడా కేంద్రం వెల్లడించింది. ఇక ఉదయం, సాయంత్రం వాకింగ్‌కి అనుమతి? సాంకేతికపరంగా అనుమతి ఉన్నప్పటికీ అది ఆయా రాష్ట్ర, నగరాల నిర్దిష్ట మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటి పనులకు పనిమనిషి రావడానికి అనుమతి ఉందా? సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య అనవసరమైన ప్రయాణాన్ని నిషేధించినప్పటికీ.. రోజులో పగటిపూట గృహ సహాయాలకు, పని మనుషులకు అనుమతి ఉన్నట్లు పేర్కొంది. స్నేహితుల దగ్గరకు వెళ్లేందుకు అనుమతి? అనవసర కార్యకలాపాలకు నిషేధం విధించిన సమయంలో స్నేహితులు లేదా సన్నిహితులను కలుసుకునేందుకు నిషేధం ఉంది. నిషేధం సమయంలో కాకుండా మిగతా సమయాల్లో స్నేహితులను, బంధువులను కలుసుకోవచ్చు. అయితే అది వారున్న ప్రాంతాల్లోని నిర్థిష్ట మార్గదర్శకాలను బట్టి ఉంటుంది. అయితే కేంద్రం సామాజిక, మతపరమైన సమావేశాలపై నిషేధం విధించింది. చదవండి: ప్రధానీ కీలక భేటీ: రెండో ప్యాకేజీ సిద్దం! ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉందా? రెడ్ జోన్ల ప్రాంతాలలో ప్రభుత్వం వాహనాలతో అనుమతించబడిన కార్యకలాపాలకు అనుమతిస్తుందని కేంద్రం వెల్లడించింది. అయితే డ్రైవర్‌తో పాటు కేవలం ఇద్దరు ప్రయాణీకులతో మాత్రమే అనుమతి ఉంది. కానీ ద్విచక్ర వాహనాలకు పిలియన్-రైడింగ్ అనుమతించబడవు. ప్రజా రవాణా సంగతేంటి? రెడ్‌జోన్ ప్రాంతాల నివాసితులకు కనీసం సైకిల్ రిక్షాలు, ఆటో-రిక్షాలకు కూడా అనుమతించబడవు. ఇక దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లను నిషేధించబడ్డాయి. ఇక ఆరెంజ్ జోన్లలో ఇంటర్ ఇంట్రా-డిస్ట్రిక్ట్ బస్సు కార్యకలాపాలు నిషేధించబడ్డాయి, కాని డ్రైవర్‌తో పాటు కేవలం ఇద్దరు ప్రయాణీకులతో ప్రైవేట్ వాహనాల్లో కదలికను అనుమతిస్తారు. కాగా గ్రీన్ జోన్లలో మాత్రం బస్సులో 50 శాతం ప్రయాణాకులతో నడపడానికి అనుమతినిచ్చింది. తెరిచే దుకాణాలు ఏవేవి? నగర పరిధిలో ఉన్న అన్ని మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ మూసివేయబడతాయి. కానీ నిత్యవసర వస్తువులు అమ్మే కిరాణా దుకాణాలకు మినహాయింపు ఉంటుంది. అన్ని స్వతంత్ర దుకాణాలు, పొరుగు దుకాణాలు, నివాస సముదాయాలలో ఉన్న దుకాణాలకు అవసరమైనవా లేదా అనే దానితో సంబంధం లేకుండా అనుమతించబడతాయి, అయితే భౌతిక దూరం మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ గురించి ఏమిటి? అవసరమైన వాటి కోసం మాత్రమే రెడ్ జోన్లలో ఇ-కామర్స్ అనుమతించబడిందని కేంద్రం ఉత్తర్వులలో పేర్కొంది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో అనవసరమైన (ఆన్లైన్ షాపింగ్స్) విక్రయాలకు కూడా అనుమతి ఉంటుందని పెర్కొంది. ఆరోగ్య సేతు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాదా? ప్రైవేటు, ప్రభుత్వ రంగాల ఉద్యోగులు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఆప్‌ను ప్రతీ ఉద్యోగి ఉపయోగించేలా చూడటం సదరు సంస్థ నిర్వాహకుడి బాధ్యత. రెడ్, ఆరెంజ్ జోన్ల వారు మాత్రమే కాకుండా సడలింపులు లేని అని కంటైన్మెంట్ జోన్లకు కూడా ఆరోగ్య సేతు తప్పనిసరి అని కేంద్రం పేర్కొంది. రెడ్ జోన్స్: వీటిని హాట్ స్పాట్స్ అని కూడా పిలుస్తారు. కరోనా వైరస్(కోవిడ్ -19) కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలు. ఒక ప్రాంతాన్ని రెడ్‌జోన్ ప్రకటించే ముందు, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, రెట్టింపు రేటును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రస్తుతం భారతదేశంలో 130 రెడ్జోన్లు ఉన్నాయి. ఆరెంజ్ జోన్లు: రెడ్, గ్రీన్ లేని ప్రదేశాలు. తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలు. ప్రస్తుతం ఈ విభాగంలో 284 జిల్లాలు ఉన్నాయి. గ్రీన్ జోన్స్: కేసులు లేని ప్రదేశాలు, 21 రోజుల్లో కేసు నమోదు కాని ప్రదేశాలు. ప్రస్తుతం దేశంలో 319 గ్రీన్ జోన్లు ఉన్నాయి. -
తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలపై సడలింపులు ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. రాష్టాల వారిగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని ఆరు జిల్లాలు రెడ్ జోన్లుగా గుర్తించింది. అలాగే దేశంలో రెండు వారాల క్రితం సుమారు 170 హాట్‌స్పాట్ జిల్లాలను ప్రస్తుతం 129కి తగ్గించింది. (రికార్డు స్థాయిలో కరోనా కేసులు) తెలంగాణలోని రెడ్ జోన్లు.. హైదరాబాద్ సూర్యాపేట రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికరాబాద్ వరంగల్ మరోవైపు కరోనా తీవ్రతను బట్టి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా వర్గీకరించింది. తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాలకు ఈ జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే రెండు వారాల కింద ఆరెంజ్ జోన్లు సంఖ్య 207గా ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 297కు పెరిగింది. అదే విధంగా తెలంగాణలో ఆరెంజ్ జోన్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని 18 జిల్లాలను ఆరెంజ్ జోన్లుకు గుర్తించింది ఆరెంజ్ జోన్లు జాబితా.. నిజామాబాద్ జోగులాంబ గద్వాల నిర్మల్ నల్గొండ అదిలాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఆసిఫాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్‌నగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల మెదక్ భూపాలపల్లి జనగామ నారాయణ్‌పేట మంచిర్యాల తెలంగాణలో కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న తొమ్మిది జిల్లాలను గ్రీన్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే దేశంలో 219 జిల్లాలకు గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. తెలంగాణలో గ్రీన్ జోన్లు పెద్దపల్లి నాగర్ కర్నూల్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సిద్దిపేట వరంగల్ రూరల్ వనపర్తి యాదాద్రి భువనగిరి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నిత్యావసరాలకే ఈ–కామర్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసుల్లేని గ్రీన్ జోన్లలో ఈ నెల 20 నుంచి పూర్తి స్థాయిలో ఈ కామర్స్ కార్యకలాపాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. కేవలం నిత్యావసరాలకే తప్ప (ఆహారోత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు), ఇతర ఉత్పత్తుల విక్రయాలకు ఈ కామర్స్ కంపెనీలకు అనుమతి లేదంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుందన్న ప్రశ్నకు.. అత్యవసరం కాని వస్తువుల విక్రయాలకు ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను అనుమతించడం వల్ల లౌక్‌డౌన్ పటిష్ట అమలుపై ప్రభావం చూపిస్తుందని గ్రహించడంతో నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగినట్టు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పున్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. ఈ కామర్స్ సంస్థలను అనుమతించినట్టు, తమను కూడా విక్రయాలకు అనుమతించాలని రిటైల్ వర్తకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే కేంద్రం తన విధానాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. -
హరిత క్షేత్రాల రక్షణకు సహ అస్త్రం
ప్రకృతి సహజంగా ఏర్పడిన హరిత క్షేత్రాలను విజయనగర రాజులు లక్షల ఎకరాలకు పెంచి కాపాడేవారు. వీటిని విధ్వంసం చేసే వారిని శిక్షించేవారు. మన ప్రభుత్వాలకు వేలాది ఎకరాల భూములను పరిశ్రమలకు అప్పగించడంపైనే ఎక్కువ ఆసక్తి. సహ చట్టం ఇచ్చిన హక్కు సమాచారం అడగడానికే కాని సమస్యలకు పరిష్కారాలు కోరడానికి కాదు, ప్రశ్నలకు సమాధానాలు సంపాదించడా నికి కాదు అన్నది చాలా వరకు చట్టం చెప్పేమాటే. కాని సమ స్యలేనిదే సమాచారం అడ గరు. ప్రశ్న పుట్టకపోతే ఆర్టీఐ అభ్యర్థన రాదు. ఆర్టీఐ కింద ఏమడిగినా దానికి ఏదో ఒక సమస్య మూలాధారమవుతుందన్నది సామాజిక వాస్తవం. చాలా సందర్భాలలో రాజ్యాంగ న్యాయస్థానాల తీర్పులకే దిక్కులేదు, ఇక ట్రిబ్యునల్ ఆదేశాలను అడిగే దెవరు? జాతీయ పర్యావరణ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు పాటించారా లేదా అనే వివరాలను కర్ణాటక పర్యావరణ మిత్రుడొకరు ఆర్టీఐ కింద పర్యావరణ మం త్రిత్వశాఖను అడిగారు. సాధారణంగా సమాచారం ఇచ్చే పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ప్రశ్నను మాత్రం పక్కకుబెట్టింది. మొదటి అప్పీలుకు కూడా స్పందన కరువైతే కమిషన్ ముందు రెండో అప్పీలు తప్పలేదు. కర్ణాటక రాష్ర్టంలోని చిత్రదుర్గ జిల్లా చెల్లకెరె తాలూకాలో అమృత్ మహల్ కావల్స్ ప్రాంతం అద్భు తమైన పచ్చదనాన్ని చిందే జన, జంతు, జల, జీవ కేంద్రం. తూర్పు కనుమలలో ఇదొక పర్యావరణ రక్షక కేంద్రం. ఇక్కడ అనేకానేక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు వేలాది ఎకరాల భూమిని ధారా దత్తం చేస్త్తున్నది కర్ణాటక ప్రభుత్వం. దీంతో సహజ మైన జలవనరులు నానాటికీ క్షీణించి నీటి సంక్షోభం ఏర్పడే దశ వచ్చిందని ఐసీఏఆర్ పరిశోధన తెలిపింది. కర్ణాటక కాలుష్య నివారణ మండలి చెల్లకెరె అమృత్ మహల్ కావల్స్ భూములలో రకరకాల పరిశ్ర మలు తదితర కార్యక్రమాలను సాగిస్త్తున్న సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా పరి శ్రమల విస్తరణ కార్యక్రమాలను చేపట్టడం కూడదని, వెంటనే అనుమతి కోరుతూ దరఖాస్తులు చేసుకోవాలని మండలి ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఇస్రో, బార్క్, భారతీయ విజ్ఞాన సంస్థ, ఏరోనా టికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, సాజిటార్ వెంచర్స్ లిమిటెడ్ వంటి సంస్థలకు కర్ణాటక ప్రభుత్వం దాదాపు 10 వేల ఎకరాల భూమిని ఇచ్చేసింది. వారు కాలుష్య నియంత్రణ మండలికి తమ పనుల వివరా లను ఇవ్వలేదు. అనుమతులు కోరలేదు కాని పనులు ప్రారంభించారు. 1980 అడవుల రక్షణ చట్టం కింద అనుమతి లేకుండా అటవీ భూములను మరే ఇతర పను లకు కేటాయించే వీల్లేదు. కాని ఈ నిబంధనను పట్టిం చుకునే వారు తక్కువ. పెద్ద చెట్లు, దట్టమైన అడవులు, పొదలు కాకుండా పచ్చని గడ్డి విస్తారంగా కనిపించే భూములను గ్రాస్ లాండ్స్ అంటారు. అటువంటి భూముల్లో అమృత్ మహల్ కావల్స్ హరిత నేలలు చాలా విశిష్టమైనవని శాస్త్రజ్ఞులు వివరించారు. విజయనగర రాజులు ఈ హరిత క్షేత్రాలను లక్షల ఎకరాలకు పెంచి కాపాడేవారు. వీటిని విధ్వంసం చేసే వారిని కఠినంగా శిక్షించే వారు. మన ప్రభుత్వాలు మాత్రం వేలాది ఎకరాల భూము లను పరిశ్రమలకు అప్పగించడంలో ఆసక్తి చూపుతు న్నారేతప్ప, హరిత క్షేత్రాలుగా ఉండనీయడం లేదు. ప్రతి నియమాన్ని, చట్టాన్ని ధిక్కరించి, అక్కడ నివ సించే ఆదిమవాసుల హక్కులను పట్టించుకోకుండా పశుపక్ష్యాదులను బతకనీయకుండా, పుష్పవనాలు, తీగలు డొంకలు, పొదలు, నీటివనరులను కాపాడే బదులు హరిస్త్తున్నారని పర్యావరణవాదులు విమర్శిస్తు న్నారు. ఈ హరిత క్షేత్రాలలో అభివృద్ధి వాదులు కోట గోడల వంటి ప్రహరీలు నిర్మించి, నీటి ప్రవాహాలను అడ్డుకోవడమే కాకుండా, వీటిపై ఆధారపడి జీవించే ఆదిమవాసుల బతుకు హక్కులను కూడా హరిస్తు న్నారని వారు ఆరోపించారు. విదేశాల నుంచి అందమైన పక్షులు ఇక్కడ జీవించ డానికి వలస వచ్చేవి. కాని ఇక్కడ పచ్చదనం కరువై జలవనరులు ఇంకిపోవడంతో, పక్షులు రావడం లేదు. నీటి ఊటలు తగ్గిపోయాయి. పశువులకు మేత కూడా కరువయ్యే పరిస్థితి వచ్చింది. చుట్టుపక్కల పంటల దిగుబడి తగ్గింది. ఈ జిల్లాలో పదేళ్లలో దాదాపు 101 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మనుషులు బతకలేక, పశువులు గడ్డి లేక నానా తంటాలు పడడానికి కారణం ఈ పచ్చదనం కరువు కావడమే. మనుషులతోపాటు పూలవనాలు, జలాశ యాలు, భూగర్భజల నిలయాలు కూడా వసివాడి పోతున్నాయి. ఇక్కడ జనజీవనం ఒక నాటి హరిత క్షేత్రాలను వదిలేసి వలస పోయే పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి హరిత క్షేత్రాలు ఎన్నో జాతుల పశువులను పోషిస్తూ, పూలవనాలకు ఆవాసమవుతూ జీవవైవిధ్య కేంద్రాలుగా ఉన్నాయని, కాని ప్రస్త్తుతం ఇవి శరవేగంగా తరిగిపోతున్నాయని, వీటిని రక్షించుకో వలసిన బాధ్యత కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వంపైన ఉందని, ఇకనుంచి అమృత్ మహల్ కావల్స్ భూములను పరిశ్రమల కోసం లేదా మరే ఇతర అభివృద్ధి కోసం ఇవ్వకూడదని హైకోర్ట్టు తీర్పు చెప్పింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సవివరమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను అమలు చేశారో లేదో, చేయకపోతే ఎందుకు చేయలేదో చెప్పవలసిన అవసరం ఉందని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. (డేవిస్ జార్జి థామస్ వర్సెస్ పర్యావరణ మంత్రిత్వశాఖ కేసులో అక్టోబర్ మూడో వారంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com