సాక్షి, హైదరాబాద్: జూన్ తొలి వారంలో ప్రజా రవాణాను ప్రారంభించేలా కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఇప్పటికిప్పుడు ప్ర జా రవాణా ప్రారంభించటం సరికాదని నిపుణు లు హెచ్చరిస్తున్నా, ఇప్పటికే లాక్‌డౌన్ వల్ల 50 రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యం లో.. ప్రజా రవాణా ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున, జూన్ మొదటి వారంలో ప్రారంభిం చాలని కేంద్రం భావిస్తోంది. ఆర్టీసీలపై రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేసింది. ఇటీవలే గ్రీన్‌జోన్‌లలో బస్సులు తిప్పుకునేందుకు వెసులుబాటు కలిగించిన విషయం తెలిసిందే. వాటిని తిప్పాలా వద్దా అన్నది మాత్రం రాష్ట్రాలకే వదిలేసింది. ఆరెంజ్, రెడ్ జోన్లలో మాత్రం అనుమతి ఇవ్వలేదు.
ఇక తన పరిధిలో ఉన్న రైల్వే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈనెలాఖరు వరకు రైళ్లను తిప్పొద్దని స్వయంగా రైల్వే బోర్డు అభిప్రాయపడింది. దీంతో జూన్ మొదటివారంలో రైళ్లను ప్రారంభించాలని భావిస్తోం ది. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గల వలస కూలీలను సొం త ప్రాంతాలకు తరలిం చేందుకు వీలుగా శ్రామిక్ స్పెషల్స్ పేరుతో సాధారణ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక సాధారణ రైళ్లను ప్రారంభిస్తే, ప్రయాణికుల మధ్య భౌతిక దూరం నిబంధన అంతగా అమలయ్యే అవకాశం లేదు. ఇదే భయం కేంద్రాన్ని వెంటాడుతోంది. ఈనెల 17 కేంద్రం లాక్‌డౌన్ విషయంలో సమీక్షించనుంది. ఆ సందర్భంగా రైళ్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకరిద్దరు మంత్రులు మాత్రం 17 తర్వాత రైళ్లను నడపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నిర్వహించే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
గ్రీన్‌జోన్లు పెరగటంతో..: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను నడిపే విషయంలో ప్రభుత్వం ఇంకా తేల్చుకోలేదు. బస్సులు తిప్పుకునేందుకు కేంద్రం అ నుమతించినా, రాష్ట్రంలో గ్రీన్‌జోన్ పరిధి తక్కువ గా ఉండటం, వాటి మధ్య ఆరెంజ్, రెడ్ జోన్లు ఉండటంతో బస్సులు తిప్పే అవకాశం లేదు. ప్రస్తుతం గ్రీన్ జోన్ల సంఖ్య పెరగటంతో ఇప్పుడు కొంత సానుకూలత ఏర్పడింది. త్వరలో ఈ సం ఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున మరిం త అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, హైదరాబాద్‌తో అనుసంధానం లేకుండా బస్సు లు తిప్పటం కష్టమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా హైదరాబాద్–జిల్లాల మధ్యనే ఎక్కువగా ప్రయాణిస్తారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం రెగ్యులర్‌గా కొత్త కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నందున ఇప్పట్లో అది గ్రీన్‌జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. పక్కపక్కనే గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు ఉన్నందున.. బస్సులు తిప్పేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా, గ్రీన్ జోన్లలో కూడా కొత్త పాజిటివ్ కేసులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 15న మరోసారి సమీక్షించి బస్సుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. అప్పటికి గ్రీన్‌జోన్ పరిధిలో దాదా పు 25 జిల్లాలు వచ్చే అవకాశం ఉన్నందున బ స్సులు తిప్పేందుకు సానుకూలత వస్తుంది. ఆ రెంజ్, రెడ్‌జోన్ సరిహద్దుగాలేని జిల్లాల్లో బస్సు లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
డిపోల్లో థర్మో స్క్రీనింగ్ పరికరాలు: బస్సులు ప్రారంభించాక ప్రత్యే క జాగ్రత్తలు తీసుకోనున్నట్టు అధికారులు చెబు తున్నారు. సిబ్బందిలో ఎవరికైనా జ్వరం లక్షణా లుంటే అనుమతించకూడదని నిర్ణయించారు. ఇందుకోసం నిత్యం ప్రతి ఒక్కరిని థర్మో స్క్రీనిం గ్ ద్వారా శరీర ఉష్ణోగ్రత చెక్ చేయాలని నిర్ణయిం చారు. ప్రతి డిపో, కార్యాలయాల్లో వీటిని అందుబాటులో ఉంచేందుకు కొత్తవి కొంటున్నారు. ఇక సిబ్బంది చేతులు కడుక్కోవటం, శానిటైజర్ కో సం కాలితో నొక్కితే నీళ్లు, శానిటైజర్ వచ్చే పరికరాలను సమకూరుస్తున్నారు. వీటిని ఆర్టీసీనే సొంతంగా రూపొందిస్తోంది. ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సిబ్బంది విధులకు హాజరయ్యేలా ఇప్పటికే ఉత్తర్వు జారీ అయింది. ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా లేనందున, సిబ్బంది పెద్ద సంఖ్య లో డిపోలకు వస్తే భౌతికదూరం నిబంధన గల్లం తై కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్నారు.
సగం మంది ప్రయాణికులతో..
ఒక కోచ్‌లో 72 మంది ప్రయాణికుల(బెర్తులు)కు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాన్నే అనుసరిస్తే భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించినట్టవుతుంది. దీంతో ఈ సంఖ్యను తగ్గించాలని యోచి స్తున్నారు. ఒక కోచ్‌లో 9 కూపేలుంటాయి. ఒక కూపేలో ఎదురెదురుగా మూడు బెర్తులు(అప్పర్, మిడిల్, లోయర్), సైడ్‌కు మరో రెండు బెర్తులు ఉంటాయి. సైడ్ బెర్తులో ఒకరు, ఎదురెదురుగా ఉండే బెర్తుల్లో నలుగురు ఉండేలా ఏర్పాట్లు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అంటే ఒక కూపేలో 8 మందికి బదులుగా 5గురు ఉంటారన్న మాట. ఇదే జరిగితే రైల్వే ఆదాయం భారీగా పడిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment