Public transport
-
ఐపీఎస్‌ల ప్రజారవాణా సందేశం
బెంగళూరు : ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగరంలో ఐపీఎస్‌లు కార్లు వదిలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాట పట్టారు. బస్సులు, మెట్రో రైలులో ప్రయాణించి తమ కార్యాలయాలకు చేరుకుని విధులు నిర్వహించారు. బస్సు, మెట్రోరైలులో విధులకు వెళ్లే ఫొటోలను తమ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై మెట్రో నగరాల్లో పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు పెరిగి ట్రాఫిక్, కాలుష్యానికి కారణమవుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోనైతే శీతాకాంలో సరి, బేసి పద్ధతిలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో ఐపీఎస్ ఆఫీసర్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రయాణం మంచి సందేశానిచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. #Bengaluru: On #WorldPublicTransportDay, several IPS officers in the city took public transport while heading to the office. pic.twitter.com/nUwdcM807c — South First (@TheSouthfirst) November 10, 2023 -
ఆటోకి మూడు చక్రాలే ఎందుకుంటాయంటే...
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఏదైనా వాహనం అవసరం అవుతుందనే సంగతి మనకు తెలిసిందే. కొంతమంది ఇందుకోసం తమ సొంతవాహనాన్ని వినియోగిస్తారు. చాలామంది ఈ విషయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే చాలా వాహనాలకు నాలుగు చక్రాలు ఉంటుండగా ఆటోకు మాత్రం మూడు చక్రాలే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆటోకు నాలుగు చక్రాలు ఎందుకు అమర్చలేదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? రండి... దీని వెనుకనున్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు చక్రాలతో కన్నా మూడు చక్రాలతో వాహనాన్ని రూపొందిస్తే ఖర్చు తగ్గుతుంది. అలాగే తక్కువ ఇంజినీరింగ్ వర్క్ సరిపోతుంది. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నదిగా రూపొందుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్ చేయడానికైనా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మూడు చక్రాల వాహనం వలన ఇంధన వినియోగం కూడా భారీగా అవదు. ఆటోను నడిపించేందుకు ఇంజనుకు తక్కువ శక్తి సరిపోతుంది. సాధారణంగా మూడు చక్రాల వాహనాన్ని ప్రయాణికులను తరలించేందుకు, లేదా సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. అటువంటప్పుడు వాహనాన్ని అన్నిరకాలదారులలో త్వరగా ముందుకు తీసుకువెళ్లవచ్చు. అయితే కొన్ని పరిస్థితులలో నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం అనువైనదికాదనిపిస్తుంది. మంచుతో కూడిన ప్రాంతాలలో లేదా కార్నరింగ్ ప్రదేశాలలో ఆటో డ్రైవ్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలాగే నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం తక్కువ సామర్థ్యం కలిగివుంటుంది. అలాగే తక్కువ సరుకును లేదా కొద్దిమంది ప్రయాణికులను మాత్రమే తరలించేందుకు అనువుగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే మూడు చక్రాల ఆటో వలన కొన్ని లాభాలు, మరికొన్ని నష్టాలు ఉన్నాయి. -
Hyderabad: ద్విచక్ర వాహనాలే టాప్.. మెట్రోకు ఆదరణ అంతంతే !
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ ప్రజా రవాణాలో సింహభాగం వాటా ద్విచక్ర వాహనాలదే కావడం విశేషం. నిత్యం సిటీలో వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగించే వారు 39 శాతం ఉండగా.. బస్సుల్లో జర్నీ చేసే వారు 34 శాతం ఉన్నారు. ఇక ఆటోలు, క్యాబ్‌ల్లో రాకపోకలు సాగించేవారు 17 శాతం మంది.. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో జర్నీ చేసేవారు కేవలం 10 శాతం మించకపోవడం గమనార్హం. నగరంలో కాలుష్యాన్ని, కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మెట్రో ప్రజల ఆదరణను చూరగొనలేకపోయింది. ఇవే శాపం.. ► నగర మెట్రో నిర్మాణ, నిర్వహణ వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. ఒక కిలోమీటరు మేర ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.272 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నగర మెట్రో నిత్యం రూ.కోటి నష్టంతో నెట్టుకొస్తోంది. మెట్రో డిపోలు, స్టేషన్లు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, సాంకేతిక నష్టాలను అరికట్టేందుకు ఎక్కువ వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ► ఇక రెండో దశ మెట్రో ఏర్పాటుకు అవసరమైన రూ.8,400 కోట్లు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఆ స్థాయిలో నిధులు విడుదల చేసే పరిస్థితులో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రెండో దశ మెట్రో మార్గాన్ని పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశంపై పలు అనుమానాలు నెలకొంటున్నాయి. మెట్రోతో కాలుష్యం తగ్గిందిలా.. ► గతేడాది సరాసరి లెక్కను పరిశీలిస్తే సుమారు 3.8 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు నగర వాతావరణంలో చేరకుండా మెట్రో నివారించడం విశేషం. నగర మెట్రో రైళ్లు విద్యుత్ ఆధారంగా పని చేస్తున్న విషయం విదితమే. స్టేషన్లలో విద్యుత్ అవసరాలకు సౌర విద్యుత్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. మెట్రో రైళ్లు గతేడాది సుమారు 1.6 కోట్ల లీటర్ల ఇంధనాన్ని సైతం ఆదా చేసినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ► మూడు బోగీలుండే మెట్రో రైలులో ఏకకాలంలో 975 మంది ప్రయాణించవచ్చు. ఇక కాలుష్య ఉద్గారాల విషయానికి వస్తే 30 కిలోమీటర్లు మెట్రోలో జర్నీ చేస్తే కేవలం 190 కిలోల కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం విడుదల అవుతుంది. అదే బస్సులో కేవలం 50 మంది ప్రయాణించవచ్చు. కాగా.. ఒక మెట్రో రైలులో ప్రయాణించేవారి సంఖ్య 20 సిటీ బస్సులతో సమానం. వీటిలో జర్నీ చేస్తే ఏకంగా 405 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలై పర్యావరణ హననం జరుగుతోంది. ► ద్విచక్ర వాహనంపై ఇద్దరు జర్నీ చేసే వీలుంది. సుమారు 975 మంది జర్నీ చేయాలంటే 488 వాహనాలు అవసరం. వీటిపై 30 కిలోమీటర్లు జర్నీ చేస్తే 730 కిలోల సీఓ 2 కాలుష్యం విడుదల అవుతుంది. కారులో నలుగురు వ్యక్తులు జర్నీ చేయవచ్చు. 975 మంది 30 కి.మీ మేర జర్నీ చేసేందుకు 244 కార్లు అవసరం అవుతాయి. ఇన్ని కార్లలో జర్నీ చేస్తే ఏకంగా 1200 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు చెబుతున్నాయి. అంటే బస్సు, కారు, ద్విచక్రవాహనాలతో సిటీ కిక్కిరిసిపోయి.. పొగచూరుతుండగా.. మెట్రోతో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. (క్లిక్ చేయండి: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ) -
తెరపైకి మెట్రో నియో, రెండో దశ, బీఆర్టీఎస్
సాక్షి, హైదరాబాద్: జెట్ స్పీడ్‌తో విస్తరిస్తోన్న గ్రేటర్ సిటీ ప్రజారవాణా వ్యవస్థలో మెట్రో శకం మొదలైంది. ఆధునిక రవాణా సదుపాయాల కల్పన ద్వారానే ట్రా‘ఫికర్’ తగ్గించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెట్రో నియో, రెండోదశ ప్రాజెక్టులతో పాటు కేవలం బస్సులే ప్రత్యేక మార్గంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా బీఆర్టీఎస్ ప్రాజెక్టులు చేపట్టాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ దిశగా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. వీటిని పట్టాలెక్కించేందుకు నిధుల లేమి శాపంగా పరిణమిస్తోంది. నగరంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య 75 లక్షలకు చేరువ కావడం, ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం 40 శాతానికి మించకపోవడంతో రహదారులపై నిత్యం ట్రాఫిక్ నరకం సిటీజన్లకు పట్టపగలే చుక్కలు చూపుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా నిలుస్తూ.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు దిక్సూచిగా మారిన పలు ప్రాజెక్టులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మెట్రో నియో ఇలా... మెట్రో నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి మెట్రో నియో చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానంలో మెట్రో ప్రాజెక్టు తరహాలోనే రహదారి మధ్యలో పిల్లర్లు ఏర్పాటుచేసి దానిపై రహదారిని ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ సిస్టం (ఈబీఆర్టీఎస్) లేదా మెట్రో నియో మార్గం అని పిలుస్తారు. ఈ మార్గంలో కేవలం బ్యాటరీ బస్సులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. ట్రాఫిక్రద్దీ అధికంగా ఉండే ఐటీ కారిడార్ సహా పలు రూట్లలో ఇది అనువైన ప్రాజెక్టు. ఈ రూట్లో అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నప్పటికీ.. కేవలం ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన బ్యాటరీ బస్సులను మాత్రమే అనుమతించాలి. దీంతో ట్రాఫిక్ చిక్కులు, కాలుష్య ఆనవాళ్లు ఉండవు. ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం బయలుదేరిన వారు ట్రాఫిక్ చిక్కులు లేకుండా సమయానికి గమ్యస్థానం చేరుకునే వీలుంటుంది. నగరంలో కేపీహెచ్‌బీ–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్– కోకాపేట్ మార్గంలో సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మెట్రోనియో ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం తాజాగా అనుమతించడం గమనార్హం. బీఆర్టీఎస్ సైతం.. అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే రహదారులను విస్తరించి.. ఈ రహదారికి మధ్యలో కేవలం బస్సులు మాత్రమే రాకపోకలు సాగించేందుకు వీలుగా రెండు లేన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకవైపు బస్సులు రావడానికి, మరోవైపు వెళ్లడానికి ఈ మార్గం అనువుగా ఉంటుంది. బీఆర్టీఎస్ ఏర్పాటుకు కిలోమీటర్‌కు రూ.110 కోట్లు వ్యయం అవుతుంది. శివారు ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ అవసరం ఉండని కారణంగా కిలోమీటరుకు రూ.20 కోట్లు ఖర్చు చేసి బీఆర్టీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. రెండో దశ మార్గం ఇదీ.. ప్రస్తుతం ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మార్గాల్లో 69.2 కి.మీ మేర మెట్రో అందుబాటులో ఉంది. నగరంలో సుమారు 270 కి.మీ మార్గంలో మెట్రో ఏర్పాటు చేయాల్సి ఉందని గతంలో లీ అసోసియేట్స్ నివేదిక స్పష్టంచేసింది. (క్లిక్ చేయండి: నగరంపై ‘కారు’ మబ్బులు!) ఈ నివేదిక మేరకు మెట్రో రెండోదశ మార్గాలను.. రాయదుర్గం– శంషాబాద్ విమానాశ్రయం, ఎంజీబీఎస్–ఫలక్‌నుమా, బీహెచ్ఈఎల్– గచ్చిబౌలి– లక్డీకాపూల్, నాగోల్– ఎల్బీనగర్, బీహెచ్ఈఎల్–పటాన్చెరు, జేఎన్టీయూ– ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బీహెచ్ఈఎల్–పటాన్చెరు, ఎల్బీనగర్– అబ్దుల్లాపూర్‌మెట్, జేబీఎస్– కూకట్పల్లి వై జంక్షన్, తార్నాక– కీసర–ఓఆర్ఆర్, నానక్‌రాంగూడ– బీహెచ్ఈఎల్, బోయిన్పల్లి– మేడ్చల్, ఎల్బీనగర్–చాంద్రాయణగుట్ట– శంషాబాద్, ఎంజీబీఎస్–ఘట్కేసర్ మార్గాలున్నాయి. ఒక కిలోమీటరు మార్గంలో మెట్రో ప్రాజెక్టు పూర్తిచేసేందుకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం వ్యయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు సైతం ఏ సంస్థా ముందుకు రాకడంలేదు. -
దేశవ్యాప్త సమ్మె పాక్షికం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన రెండురోజుల దేశవ్యాప్త సమ్మె సోమవారం ప్రారంభమయ్యింది. సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్, ప్రజా రవాణా వ్యవస్థ సేవలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో సమ్మె పాక్షికంగా విజయవంతమయ్యింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగాయి. అత్యవసర సేవలకు ఎలాంటి విఘాతం కలగలేదు. సానుకూల స్పందన: ఏఐటీయూసీ దేశవ్యాప్త సమ్మెలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ తదితర జాతీయ కార్మిక సంఘాలు పాలుపంచుకున్నాయి. సమ్మెకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. అస్సాం, హరియాణా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, బిహార్, పంజాబ్, రాజస్తాన్, గోవా, ఒడిశా తదితర రాష్ట్రాల్లో సమ్మెకు ప్రజలు మద్దతు తెలిపారని వెల్లడించారు. దేశవ్యాప్త సమ్మె మంగళవారం కూడా కొనసాగనుంది. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ) కింద పనిచేసే కూలీలకు వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత
కొందరికి రైలెక్కడం సరదా, ఇంకొందరికి విమానం ఎక్కడం సరదా. టర్కీకి చెందిన బోజీ అనే ఈ శునకరాజానికి నగర సంచారం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలెక్కడం సరదా. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో సంచరించే ప్రయాణికులందరికీ చిరపరిచిత నేస్తం బోజీ. గత పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, కనిపించిన బస్సు లేదా లోకల్ ట్రెయిన్ ఎక్కి ఊరంతా బలాదూర్ తిరగడం ఈ శునకరాజం హాబీ. దీనిని గమనించిన అధికారులు ఇంతకూ ఇదెక్కడకు వెళుతుందో తెలుసుకోవడానికి దీని చెవికి ఒక ట్రాక్ చిప్ అమర్చారు.ఇస్తాంబుల్ నగరంలోని చారిత్రిక కట్టడాలను చూడటానికి ఈ శునకరాజం రోజూ బస్సు, మెట్రో, బోటు సహా ప్రతి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహానాన్నీ పావనం చేస్తోంది. దొరక్కుంటే ఏ బస్సులోనో అడ్జస్టయిపోతుందనుకోండి! మెట్రోస్టేషన్లలోని లిఫ్టులు, ఎస్కలేటర్లను కూడా ఈ జాగిలం మిగిలిన ప్రయాణికులతో కలసి దర్జాగా ఉపయోగించుకోవడం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టక తప్పదు. ఇస్తాంబుల్ జనాలకు పదేళ్లుగా ఈ జాగిలం బాగా అలవాటైపోవడంతో, ఇది ఏ వాహనంలోకి చొరబడినా ఎవరూ దీనిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం లేదు. పైగా, ఇది సుఖంగా కూర్చోవడానికి వీలుగా తప్పుకుని మరీ దారి కూడా ఇస్తున్నారు.సమయానికి సమయం, శ్రమకు శ్రమ ఆదా చేసే మెట్రో ట్రెయినంటేనే దీనికి కాస్త మక్కువ ఎక్కువ. ఎక్కువగా మెట్రోలో ప్రయాణించడానికే ఇష్టపడుతుంది. చదవండి: అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే.. -
వరల్డ్ కార్ ఫ్రీ డే: ఈ విశేషాలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: రోజుకు రోజుకు కాలుష్యం పెను భూతంలా విస్తరిస్తోంది. విచ్చలవిడిగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు భూతాపాన్ని మరింత పెంచేస్తున్నాయి. ఫలితంగా ఈ భూ ప్రపంచంపై మానువళి మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ పెను ముప్పుపై అవగాహన కల్పించేందుకు వచ్చిందే వరల్డ్ కార్ ఫ్రీ డే. ప్రతీ ఏడాది సెప్టెంబర్ 22 న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ విశేషాలేంటో మీకోసం వరల్డ్ కార్ ఫ్రీ డే. అంటే వాహనదారులు ఈ ఒక్కరోజు కార్లను పక్కనపెట్టేసి మన కాళ్లకు పని చెప్పడన్నమాట. నడుచుకుంటూ వెళ్లడమో లేదంటే ఎంచక్కా సైకిళ్లనో, లేదా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం. తద్వారా పర్యావరణ వాయు కాలుష్యంపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం. దీని వల్ల కలిగే ప్రయోజనాలను హైలైట్ చేసేలా ప్రతీ ఏడాది ఈ డేను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) అధికారిక వెబ్సైట్ ప్రకారం ఆ ఈవెంట్ పౌరులకు కారులేకుండా వెళ్లడాన్ని పోత్సహిస్తుంది. సురక్షితమైన వాతావరణంలో నడక సైక్లింగ్‌ను ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో సెప్టెంబర్ 2015న ఈ డేను పాటించగా ఉద్గార ప్రభావం 40 శాతం తగ్గిందట.ముఖ్యంగా మనం రోజూ వాడే కార్లు, బైక్స్ నుంచి విడుదలయ్యే ఉద్గారాలు మొత్త కాలుష్యంలో 8శాతాన్ని ఆక్రమించాయంటేనే కాలుష్యతీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 1990ల నుండి ఐస్‌ల్యాండ్, యూకే మొదలైన దేశాలలో ఈ డేనునిర్వహిస్తుండగా, 2000లో కార్బస్టర్స్ (వరల్డ్ కార్‌ఫ్రీ నెట్వర్క్) ప్రారంభించిన వరల్డ్ కార్-ఫ్రీ డేతో ఈ ప్రచారం ప్రపంచవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా ఆయా సిటీ ప్లాన్లరు, రాజకీయ నాయకులు దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2007లో, ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా, తన మొదటి కార్-ఫ్రీ డేని నిర్వహించింది. అంతేకాదు మే 2012 నుండి జకార్తాలో ప్రతి ఆదివారం కార్ రహిత దినోత్సవం నిర్వహించడం విశేషం. -
Telangana: బస్సులు, మెట్రో రైళ్లు తిరిగే సమయాలివే..
సాక్షి, హైదరాబాద్/హయత్‌నగర్: లాక్డౌన్ నేపథ్యంలో నేటి నుంచి ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకే బస్సులు నడుస్తాయని ఆర్టీసీ పేర్కొంది. సిటీ బస్సులు, జిల్లా సర్వీసులు కూడా ఈ సమయంలోనే నడుస్తాయని, ఆయా డిపోల పరిధిలో బస్సుల సమయాల్లో మార్పులు చేస్తారని పేర్కొంది. ఇతర రాష్టాలకు బస్సులు నడపమని వెల్లడించింది. ఈ సడలింపు 4 గంటల వ్యవధిలో గమ్యస్థానాలకు వెళ్లగలిగిన ప్రాంతాలకే బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మెట్రో సేవలు ఇలా... మెట్రో రైళ్లు ఉదయం 7 నుంచి 9:45 గంటల వరకు రాకపోకలు సాగించనున్నాయి. తొలి రైలు ఉదయం 7 గంటలకు ఎల్బీనగర్ నుంచి మొదలుకానుంది. చివరి రైలు 8:45 ఎల్బీ నగర్ నుంచి బయలుదేరి 9:45కు మియాపూర్ చేరుకుంటుందని ఎల్అండ్టీ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, సురక్షిత మెట్రో ప్రయాణానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. టికెట్ చూపించి విమానాశ్రయానికి... లాక్డౌన్ నేపథ్యంలో మళ్లీ ప్రజారవాణా స్తంభించనుంది. 4 గంటలు మాత్రమే ప్రజారవాణాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ప్రైవేట్ బస్సులు, క్యాబ్‌లు, ఇతర రవాణా వాహనాలకు బ్రేక్ పడనుంది. హైదరాబాద్‌లో సుమారు 1.40 లక్షల ఆటో రిక్షాలు, 50 వేల క్యాబ్‌లు లాక్డౌన్ తో స్తంభించనున్నాయి. ఆటో రిక్షాలు, క్యాబ్‌లు కూడా లాక్డౌన్ మార్గదర్శకాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే రాకపోకలు సాగించనున్నాయి. ఈ రంగంపై ఆధారపడ్డ 2 లక్షల మంది కార్మికులు లాక్డౌన్ తో ఉపాధి కోల్పోయే అవకాశముంది. నగరంలో 2,750 ఆర్టీసీ బస్సులు ఉండగా, లాక్డౌన్ వల్ల 1,000 బస్సులకు మించి తిరిగే అవకాశం లేదు. దీంతో గ్రేటర్లో ఆర్టీసీకి రూ.2 కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా... విమానాలు, రైళ్లలో ప్రయాణించే వారు టికెట్‌ను చూపడం ద్వారా విమానాశ్రయం, రైల్వేస్టేషన్లకు చేరుకోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. సడలింపు సమయాల్లో బస్సులు.. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రధాన రూట్లలో బస్సులను నడిపిస్తాం. ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి. ప్రయాణికులకు వైరస్ సోకకుండా బస్సులను శానిటైజ్ చేస్తున్నాం. సిబ్బందికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి విధులకు పంపుతున్నాం. ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చదవండి: (నేటి నుంచి 10 రోజుల లాక్డౌన్.. మినహాయింపు వాటికే!) -
ఆగ్రా మెట్రోని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రా మెట్రో రైల్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖారారైంది. డిసెంబర్ 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం కానుంది. తొలి విడతగా మూడు మెట్రో స్టేషన్లను ప్రారంభించనున్నారు. వర్చువల్ పద్దతిలో జరిగే ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రముఖులు పాల్గొంటారని ఆగ్రా జిల్లా మెజిస్టే్ట్ ఎన్ ప్రభుసింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షిస్తున్నామన్నారు. తొలివిడతలో తాజ్‌ఈస్ట్‌గేట్, బసాయ్, ఫతేహాబాద్ రోడ్డు స్టేషన్లు ఉన్నాయి. రూ.273 కోట్లతో ఫతేహాబాద్ 26 నెలల్లో పూర్తవుతుందని అంచనా. కేంద్ర క్యాబినెట్ మెట్రో ప్రాజెక్ట్‌కి ఫిబ్రవరి 28, 2019లోనే ఆమోదం తెలిపింది. అనుకూలమైన అర్బన్, సిటీ ప్రాంతాల్లో మొదటగా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజారవాణాకు అనుగుణంగా షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాలను ఎంచుకుని తోలి విడతలో ఫతేహాబాద్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీఆర్పీ ప్రకారం రెండు కారిడార్లు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాయి. నగరంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాలైనా తాజ్‌మహల్, ఆగ్రాపోర్ట్, ఎత్మదుల్లా, సికింద్రాతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, మార్కెట్లు ఉన్నాయి. మొత్తం నగరంలో 27 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. నగరంలో29.4 కి.మీ మేర మెట్రో రైల్వే కారిడార్‌ను నిర్మించనున్నారు. -
రేపటి నుంచి ప్రజా రవాణా ప్రారంభం
చంఢీగర్: శుక్రవారం నుంచి హర్యానాలో ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రజా రవాణాను ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఈ మేరకు సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మార్చి 25న దేశ వ్యాప్తంగా మొదటి దశ లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే మూడవ దశ లాక్డౌన్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని కార్యకలపాలకు అనుమతిచ్చాయి. కానీ ప్రజా రవాణా వ్యవస్థను మాత్ర పునరుద్ధరించలేదు. (ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ ఛాన్స్!) అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచి హర్యానాలో ప్రజా రవాణాను ప్రారంభిస్తున్నట్లు ఖట్టర్ ప్రకటించారు. ఇందుకోసం బస్సులను శానిటైజ్ చేయడమే కాక సామాజిక దూరాన్ని పాటించేలా సీట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణ సమయంలో ప్రజలంతా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.(5 లక్షల సలహాల్లో ఎక్కువ వాటికే: కేజ్రీవాల్) -
జూన్‌లో రైళ్ల కూత.. బస్సులపై అస్పష్టత
సాక్షి, హైదరాబాద్: జూన్ తొలి వారంలో ప్రజా రవాణాను ప్రారంభించేలా కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఇప్పటికిప్పుడు ప్ర జా రవాణా ప్రారంభించటం సరికాదని నిపుణు లు హెచ్చరిస్తున్నా, ఇప్పటికే లాక్డౌన్ వల్ల 50 రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యం లో.. ప్రజా రవాణా ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున, జూన్ మొదటి వారంలో ప్రారంభిం చాలని కేంద్రం భావిస్తోంది. ఆర్టీసీలపై రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేసింది. ఇటీవలే గ్రీన్జోన్లలో బస్సులు తిప్పుకునేందుకు వెసులుబాటు కలిగించిన విషయం తెలిసిందే. వాటిని తిప్పాలా వద్దా అన్నది మాత్రం రాష్ట్రాలకే వదిలేసింది. ఆరెంజ్, రెడ్ జోన్లలో మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఇక తన పరిధిలో ఉన్న రైల్వే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈనెలాఖరు వరకు రైళ్లను తిప్పొద్దని స్వయంగా రైల్వే బోర్డు అభిప్రాయపడింది. దీంతో జూన్ మొదటివారంలో రైళ్లను ప్రారంభించాలని భావిస్తోం ది. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గల వలస కూలీలను సొం త ప్రాంతాలకు తరలిం చేందుకు వీలుగా శ్రామిక్ స్పెషల్స్ పేరుతో సాధారణ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక సాధారణ రైళ్లను ప్రారంభిస్తే, ప్రయాణికుల మధ్య భౌతిక దూరం నిబంధన అంతగా అమలయ్యే అవకాశం లేదు. ఇదే భయం కేంద్రాన్ని వెంటాడుతోంది. ఈనెల 17 కేంద్రం లాక్డౌన్ విషయంలో సమీక్షించనుంది. ఆ సందర్భంగా రైళ్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకరిద్దరు మంత్రులు మాత్రం 17 తర్వాత రైళ్లను నడపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నిర్వహించే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. గ్రీన్జోన్లు పెరగటంతో..: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను నడిపే విషయంలో ప్రభుత్వం ఇంకా తేల్చుకోలేదు. బస్సులు తిప్పుకునేందుకు కేంద్రం అ నుమతించినా, రాష్ట్రంలో గ్రీన్‌జోన్ పరిధి తక్కువ గా ఉండటం, వాటి మధ్య ఆరెంజ్, రెడ్ జోన్లు ఉండటంతో బస్సులు తిప్పే అవకాశం లేదు. ప్రస్తుతం గ్రీన్ జోన్ల సంఖ్య పెరగటంతో ఇప్పుడు కొంత సానుకూలత ఏర్పడింది. త్వరలో ఈ సం ఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున మరిం త అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, హైదరాబాద్‌తో అనుసంధానం లేకుండా బస్సు లు తిప్పటం కష్టమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా హైదరాబాద్–జిల్లాల మధ్యనే ఎక్కువగా ప్రయాణిస్తారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం రెగ్యులర్‌గా కొత్త కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నందున ఇప్పట్లో అది గ్రీన్‌జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. పక్కపక్కనే గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు ఉన్నందున.. బస్సులు తిప్పేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా, గ్రీన్ జోన్లలో కూడా కొత్త పాజిటివ్ కేసులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 15న మరోసారి సమీక్షించి బస్సుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. అప్పటికి గ్రీన్‌జోన్ పరిధిలో దాదా పు 25 జిల్లాలు వచ్చే అవకాశం ఉన్నందున బ స్సులు తిప్పేందుకు సానుకూలత వస్తుంది. ఆ రెంజ్, రెడ్‌జోన్ సరిహద్దుగాలేని జిల్లాల్లో బస్సు లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డిపోల్లో థర్మో స్క్రీనింగ్ పరికరాలు: బస్సులు ప్రారంభించాక ప్రత్యే క జాగ్రత్తలు తీసుకోనున్నట్టు అధికారులు చెబు తున్నారు. సిబ్బందిలో ఎవరికైనా జ్వరం లక్షణా లుంటే అనుమతించకూడదని నిర్ణయించారు. ఇందుకోసం నిత్యం ప్రతి ఒక్కరిని థర్మో స్క్రీనిం గ్ ద్వారా శరీర ఉష్ణోగ్రత చెక్ చేయాలని నిర్ణయిం చారు. ప్రతి డిపో, కార్యాలయాల్లో వీటిని అందుబాటులో ఉంచేందుకు కొత్తవి కొంటున్నారు. ఇక సిబ్బంది చేతులు కడుక్కోవటం, శానిటైజర్ కో సం కాలితో నొక్కితే నీళ్లు, శానిటైజర్ వచ్చే పరికరాలను సమకూరుస్తున్నారు. వీటిని ఆర్టీసీనే సొంతంగా రూపొందిస్తోంది. ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సిబ్బంది విధులకు హాజరయ్యేలా ఇప్పటికే ఉత్తర్వు జారీ అయింది. ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా లేనందున, సిబ్బంది పెద్ద సంఖ్య లో డిపోలకు వస్తే భౌతికదూరం నిబంధన గల్లం తై కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. సగం మంది ప్రయాణికులతో.. ఒక కోచ్‌లో 72 మంది ప్రయాణికుల(బెర్తులు)కు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాన్నే అనుసరిస్తే భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించినట్టవుతుంది. దీంతో ఈ సంఖ్యను తగ్గించాలని యోచి స్తున్నారు. ఒక కోచ్‌లో 9 కూపేలుంటాయి. ఒక కూపేలో ఎదురెదురుగా మూడు బెర్తులు(అప్పర్, మిడిల్, లోయర్), సైడ్‌కు మరో రెండు బెర్తులు ఉంటాయి. సైడ్ బెర్తులో ఒకరు, ఎదురెదురుగా ఉండే బెర్తుల్లో నలుగురు ఉండేలా ఏర్పాట్లు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అంటే ఒక కూపేలో 8 మందికి బదులుగా 5గురు ఉంటారన్న మాట. ఇదే జరిగితే రైల్వే ఆదాయం భారీగా పడిపోతుంది. -
గుడ్ న్యూస్: త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ అమలుతో రోడ్డెక్కని బస్సులు సహా ప్రజా రవాణాను త్వరలో అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. కొద్దిపాటి నియంత్రణలతో ప్రజా రవాణాను అనుమతిస్తామని రహదారులు, హైవే మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న గడ్కరీ పేర్కొన్నారు. భారత బస్, కార్ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈ మేరకు వెల్లడించారు. నిర్ధిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా రవాణా తిరిగి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. (76 శాతం గుండె జబ్బులు ఎందుకు తగ్గాయి?) బస్సులు, కార్లు నడిపే క్రమంలో ప్రజలు తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఫేస్ మాస్క్‌లు ధరించడం వంటి భద్రతా చర్యలు చేపట్టాలని, భౌతిక దూరం పాటించాలని గడ్కరీ సూచించారు. అయితే ప్రజా రవాణాను ఎప్పటి నుంచి అనుమతిస్తారనేది మంత్రి వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు మే 17 వరకూ లాక్డౌన్ కొనసాగుతుంది. కాగా గ్రీన్జోన్లలో ప్రభుత్వం ఇప్పటికే పలు సడలింపులను ప్రకటించన సంగతి తెలిసిందే. కోవిడ్-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలోఉత్తేజం కల్పించేందుకు కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. చదవండి : లాక్డౌన్ ఎఫెక్ట్ : అశ్లీల సైట్లకి పెరిగిన ట్రాఫిక్ -
ఆ తర్వాత కూడా ఇవి నిషేధమే..!
న్యూఢిల్లీ: విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, ప్రజా రవాణా.. తదితర ప్రజలు గుమికూడే ప్రదేశాలపై మే 3 తరువాత కూడా నిషేధం కొనసాగే అవకాశముందని అధికారులు సోమవారం తెలిపారు. ఈ మేరకు ప్రధాని, ముఖ్యమంత్రుల సమావేశంలో సంకేతాలు వచ్చాయన్నారు. అయితే, లాక్డౌన్ కొనసాగింపుపై ఈ వారాంతంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గ్రీన్ జోన్ జిల్లాల్లో ప్రైవేటు వాహనాలను కొంతవరకు అనుమతించవచ్చన్నారు. రైల్వే, విమానయానానికి మాత్రం మే 3 తరువాత కూడా అనుమతి లభించకపోవచ్చన్నారు. కరోనా వ్యాప్తిని సమీక్షించిన తరువాత మే మూడో వారంలో నియమిత ప్రాంతాలకు వీటిని అనుమతించే విషయం ప్రతిపాదనలో ఉందన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎంలలో ఒడిశా, గోవా, మేఘాలయ సహా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరారని, కొందరు మాత్రం హాట్‌స్పాట్స్‌ను మినహాయించి, మిగతా ప్రాంతాల్లో దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని సూచించారని సమాచారం. వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సొంత ప్రాంతాలకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు సీఎంలు కోరారని అధికారులు తెలిపారు. -
మినహాయింపునిచ్చినా ఇబ్బందులే!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అత్యవసర సేవలతో పాటు, ఐటీ రంగానికి మినహాయింపునిచ్చింది. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు (వర్క్ ఫ్రం హోం)ను కల్పించాలని, పరిస్థితిని బట్టి కార్యకలాపాలు నిలిపేయాలని ఐటీ కంపెనీలకు సూచించింది. హైదరాబాద్ కేంద్రంగా 1,283 ఐటీ కంపెనీల్లో సుమారు ఐదున్నర లక్షల మంది పనిచేస్తుండగా, ప్రభుత్వ సూచన మేరకు 70 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానంలో ప నిచేస్తున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించగా, హైదరాబాద్‌లో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. మరోవైపు ప్రైవేటు వాహనాల రాకపోకలను కూడా పోలీసులు నియంత్రిస్తున్నారు. గతంలో క్యాబ్‌ల ద్వారా రవాణా సదుపాయాన్ని కల్పించిన ఐటీ సంస్థలు అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు సొంత వాహనాల్లో విధులకు రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాయి. సొంత ఖర్చుతో విధులకు హాజరయ్యేవారికి ట్రావెల్ అలవెన్స్ వేతనంతో కలిపి ఇస్తామని చెబుతోంది. అడుగడుగునా తనిఖీలతో ఇబ్బందులు ఓ వైపు ప్రజా రవాణా లేక మరోవైపు వ్యయ ప్రయాసలతో విధులకు వెళ్తున్న ఐటీ ఉద్యోగులు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, తనిఖీలతో ఇబ్బందులు పడుతున్నారు. తాము పనిచేస్తున్న ఐటీ కంపెనీల గుర్తింపు కార్డులు చూపుతున్నా విధులకు అనుమతించడం లేదని టెకీలు చెప్తున్నా రు. సోమవారం రాత్రి విధులకు వెళ్తున్న ఇద్దరు ఐటీ ఉద్యోగులపై సైబరాబాద్ పోలీసులు లాఠీలు ఝళిపించారు. తమ కంపెనీ అమెరికాలోని ఓ బ్యాంకుకు ఐటీ సేవలు అందిస్తోందని చెప్పినా వినకుండా చితకబాదారని టెకీలు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశా రు. అమెజాన్, గూగుల్ వంటి పెద్ద కంపెనీల పేర్లు తప్ప చిన్నా, చితక ఐటీ కంపెనీల్లో పనిచేస్తూ విధులకు వెళ్తున్న ఐటీ ఉద్యోగులు మరింత సమస్య ఎదుర్కొంటున్నారని తెలంగాణ ఐటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీటా) ప్రతినిధులు వెల్లడించారు. వీరికి ప్రత్యేక పాస్‌లు జారీ చేయా లని టీటా అధ్యక్షుడు సందీప్ కుమార్ డిమాండ్ చేశారు. పని సామర్థ్యంపై ఐటీ కంపెనీల ఆందోళన గతంలో అరుదుగా ఇంటి నుంచే ఆఫీసు పని (వర్క్ ఫ్రం హోం)కు అనుమతించిన ఐటీ కంపెనీలు కరోనా ప్రభావంతో మెజారిటీ ఉద్యోగులకు అవకాశం కల్పించింది. అయితే వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటుండటంతో పని సామర్థ్యం తగ్గి ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందని ఐటీ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. డేటా కనెక్టివి టీ సమస్యలు ఎదురవుతుండటంతో తరచూ అంతరాయం కలుగుతోందని టెకీలు చెప్తున్నారు. దీంతో ఉద్యోగులు సాంకేతిక సమస్యలతో పూర్తి స్థాయిలో పనిచేయలేక పోతుండటంతో కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. -
కరోనా: ఒక్కరోజు బస్సులు బంద్!
షిల్లాంగ్: కరోనా భయాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తత ప్రకటించాయి. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు ఈ నెల 31 వరకు మూసేయాలని ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా మేఘాలయా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక్కరోజుపాటు పూర్తిగా ప్రజా రవాణాపై ఆంక్షలు విధిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. మార్చి 20 అర్ధరాత్రి నుంచి మార్చి 21 అర్ధరాత్రి వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని తెలిపింది. దాంతోపాటు దుకాణాలు, మార్కెట్లు మూసేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతామని చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా 209 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు చనిపోయారు. (చదవండి: కరోనా సునామీ: ఒక్క రోజే 33 కేసులు) (చదవండి: కోవిడ్-19: చైనా కంపెనీ సరికొత్త రికార్డు) -
రైలు బోగీల్లో ఏసీ 25 డిగ్రీలే..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజా రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో సాధారణంగా ఏసీ బోగీల్లో ఉష్ణోగ్రత 17, 18 డిగ్రీలుగా ఉండేలా చూస్తారు. కానీ కోవిడ్ వైరస్ నేపథ్యంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండొద్దని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఏసీ బోగీల్లో ఉండే కర్టెన్లు అన్నింటినీ తొలగించాలని ఆదేశించింది. కర్టెన్లను నిత్యం మార్చరు. కొన్ని రైళ్లలో పక్షం రోజులకోసారి, కొన్నింటిలో నెలకోసారి మార్చి ఉతికినవి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత పరిస్థితిలో అవి ఉండటం క్షేమం కాదని అధికారులు నిర్ణయించారు. అలాగే ఏసీ బోగీల్లో సాధారణ బెడ్షీట్లను అందుబాటులో ఉంచుతారు. వాటిని నిత్యం మార్చి ఉతికిన జతను సరఫరా చేస్తున్నందున వాటిని అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు ఇచ్చే బ్లాంకెట్లను మాత్రం తొలగించారు. వీటిని రోజూ ఉతకరు. మరీ చలిని తట్టుకోలేని వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మాత్రం రెండు మూడు ఉతికి శుభ్రంగా ఉన్నవి అందుబాటులో ఉంచుతారు. ఇక రైళ్లను అప్పటికప్పుడు శుభ్రపరిచే చర్యలు తీసుకుంటున్నారు. టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని, అక్కడ చేతులు కడుక్కోవడానికి వీలుగా సబ్బు ద్రావణం, ఇతర క్రిమి సంహారక ద్రావణాలు ఉంచాలని రైల్వే శాఖ ఆదేశించింది. -
స్విట్జర్లాండ్‌లోనే మొదటి సారిగా ‘ఈ టిక్కెట్లు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ బస్సుల్లో, మెట్రో రైళ్లలో ప్రయాణించేవారు తమ తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు ముందుగానే టిక్కెట్లు తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఇదే విధానం ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది. ఆటోలకు, క్యాబీలకు మాత్రమే ఎంతైందని లెక్కించి గమ్య స్థానాలకు చేరుకున్నాక చార్జీలు చెల్లిస్తాం. క్యాబుల్లాగా ఎందుకు గమ్యస్థానాలకు చేరుకున్నాకే చార్జీలు వసూలు చేయకూడదు! అని స్విట్జర్లాండ్ ప్రభుత్వం భావించేదేమోగానీ ప్రయాణికులు దిగేటప్పుడు చార్జీలు వసూలు చేసే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ ఆటోమేటిక్ టిక్కెటింగ్ వ్యవస్థను తాము ప్రయోగాత్మకంగా 2018లోనే ప్రవేశపెట్టామని, ఇప్పటికీ ఈ వ్యవస్థలో 90 వేల మంది ప్రయాణికులు చేరారని, 2020 జనవరి నెల నుంచి ప్రయాణికులందరికి ఈ వ్యవస్థనే ప్రవేశపెడతామని ప్రాజెక్ట్ మేనేజర్ సిల్వియా కండేరా మీడియాకు తెలియజేశారు. ప్రపంచంలో ఓ ప్రభుత్వ రవాణా వ్యవస్థలో ఇలా ఆటోమేటిక్ టిక్కెట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఏకైక దేశం ఇప్పటికీ స్విట్జర్లాండే. దీని వల్ల ప్రయాణికులుగానీ, కండక్టర్‌గానీ చిల్లర కోసం వెతుక్కోనక్కర్లేదు. కాగితపు టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాప్ ద్వారా చార్జీలు ఎవరికి వెళ్లాలో వారికే వెళతాయి. మోసం చేయడానికి కూడా ఆస్కారం తక్కుతుంది. పైగా ప్రయాణికులు తాము దిగాల్సిన గమ్యస్థానాలను చివరి నిమిషంలో కూడా మార్చుకోవచ్చు. ఈ ఆటోమేటిక్ టిక్కెట్ వ్యవస్థ కోసం బీఎల్ఎస్, ఫేయిర్‌టిక్, ఎస్బీబీ, జూచర్, టీసీఎస్ అనే యాప్స్‌ను ప్రవేశపెట్టినట్లు సిల్వియా కండేరా వివరించారు. -
ప్రజా రవాణాకు జీపీఎస్ తప్పనిసరి!
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), పానిక్ బటన్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి త్వ శాఖ ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు నిబంధనలను మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం... ఆటో రిక్షాలు, ఈ– రిక్షాలు మినహా సెం ట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్– 1989 కిందకు వచ్చే అన్ని బస్సు లు, స్కూల్ బస్సులు, టాక్సీ వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ (వీఎల్టీ) పరికరాలు తప్పనిసరిగా ఉం డాలి. నేషనల్ పర్మిట్ ఉన్న కమర్షియల్ వాహనాలను సైతం ఈ నిబంధన కిందకు చేర్చా రు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, పానిక్ బటన్ ఉంటేనే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇవి ఉంటేనే పాత వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. దేశవ్యాప్తంగా 2.5 కోట్ల వాహనాలు.. భారత్‌లో ప్రస్తుతం 1.8 కోట్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఉన్నట్టు సమాచారం. అలాగే నేషనల్ పర్మిట్ ఉన్న ట్రక్స్ 75 లక్షలు ఉన్నాయని జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు తయారు చేసే వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు కోణార్క్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ఇప్పటి వరకు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు తమ వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సంస్థలే వాహన రాకపోకలను ట్రాక్ చేస్తున్నాయి. తాజా విధానంలో ప్రభుత్వమే రంగంలోకి దిగుతుంది. పన్ను ఎగ్గొట్టే వాహనాలను గుర్తించవచ్చు కూడా. మహిళలు, విద్యార్థులు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనను తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. వాహనం ప్రమాదానికి గురైతే ఎక్కడ జరిగిందో సులువుగా గుర్తించవచ్చు కూడా. ఏఐఎస్ ధ్రువీకరణ ఉంటేనే.. టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఏఐఎస్– 140 నేషనల్ వెహికిల్ ట్రాకింగ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ట్రాకింగ్ డివైస్ వివరాలు, చాసిస్ నంబరును వాహన పోర్టల్‌కు అనుసంధానిస్తారు. దీంతో వాహనాల కదలికలన్నీ డేటా సెంటర్లో నిక్షిప్తం అవుతాయి. అవసరమైతే ట్రాన్స్పోర్ట్, పోలీసు శాఖలకు మాత్రమే ఈ సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. వీటి పర్యవేక్షణకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇక నూతన నిబంధనల ప్రకారం ఏఐఎస్– 140 ధ్రువీకరణ ఉన్న జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను మాత్రమే ఇందుకు వినియోగించాలి. తెలుగు రాష్ట్రా ల నుంచి వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ పరికరా లు ఈ సర్టిఫికేషన్ పొందినట్లు కోణార్క్ చెప్పారు. -
నీలాంటి మగాళ్ల వల్లే!
ట్వీటర్లో సోనమ్ కపూర్ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమెకు కోటి 20 లక్షల మంది ట్వీటర్ ఫాలోయర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్‌గా ట్వీటర్ నుంచి తప్పుకుంటున్నా అనేశారు సోనమ్. ‘‘నా ట్వీటర్ అకౌంట్‌ను ఆపేస్తున్నాను. నెగిటివిటీ బాగా పెరిగిపోయింది’’ అని పేర్కొన్నారు సోనమ్. తనుశ్రీ దత్తా వివాదం విషయంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉన్నారు సోనమ్. ఓ నెటిజన్ చేసిన విమర్శలే సోనమ్ ట్వీటర్‌కి ఫుల్స్టాప్ పెట్టడానికి కారణమని బాలీవుడ్ సినీ జనాలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ముంబైలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగిపోవడం వల్లే గమ్యం చేరుకోవడానికి తనకు బాగా ఆలస్యం అవుతోందని అర్థం వచ్చేలా సోనమ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఓ నెటిజన్ స్పందిస్తూ– ‘‘సోనమ్... ఈ పరిస్థితి మీ లాంటి వారి వల్లే. మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించరు. బాగా ఇందనం ఖర్చయ్యే వాహనాలనే వాడతారు. మీ ఇంట్లో దాదాపు 10 నుంచి 20 ఏసీలు వాడతారు. ఇలా గ్లోబల్ వార్మింగ్‌కి కారణం అవుతారు. ఫస్ట్ మీ పాపులేషన్‌ని కంట్రోల్ చేసుకో’’ అని బదులు చెప్పాడు. సోనమ్ కూడా ఏం తగ్గలేదు. ‘‘మీ లాంటి మగవారి వల్లే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణిస్తే లైంగిక వేధింపులకు గురి అవుతామేమోనని మహిళలు భయపడుతున్నారు’’ అని రెస్పాండ్ అయ్యారు సోనమ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆమె ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. దాదాపు కోటీ నలభై లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. -
2047 నాటికి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే!
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ సమాఖ్య ‘సియామ్’ తాజాగా 2047 నాటికి దేశంలో విక్రయమయ్యే వెహికల్స్ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే అయ్యిండాలని పేర్కొంది. నగరాల్లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఈ గడువును 2030గా నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 2030 నాటికి దేశంలో విక్రయమ్యే కొత్త వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతంగా ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కాగా 2030 నాటికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను, పర్సనల్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో 40 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్దేశిత లక్ష్యాల సాకారం కోసం పరిశ్రమ, ప్రభుత్వం, కంపెనీలు సంయుక్తంగా ముందుకెళ్లాలని సియామ్ ప్రెసిడెంట్ అభయ్ ఫిరొడియా అభిప్రాయపడ్డారు. దేశంలో వందో స్వాతంత్ర వేడుకల నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడానికి సియమ్ రోడ్‌మ్యాప్ రూపొందించింది. -
బస్సులో ప్రయాణిస్తే భారీ డిస్కౌంట్
సరి-భేసి విధానంతో కాలుష్యానికి చెక్ పెట్టాలని భావించిన ఢిల్లీ సర్కారుకు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరో వినూత్న ఆఫర్‌తో ప్రజల ముందుకొచ్చింది. ప్రజలు వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించి, ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణించే వారికి టిక్కెట్ ధరలో 75 శాతం డిస్కౌంట్‌ను ఢిల్లీ ప్రభుత్వం అందించబోతుంది. దీంతో దేశ రాజధానిలో బస్సు ప్రయాణం మరింత చౌకగా మారబోతుంది. రెండు రోజుల్లోనే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జనవరి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయని సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టి-మోడల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(డీఐఎమ్‌టీఎస్) ఆపరేట్ చేసే డీటీసీ, క్లస్టర్ బస్సులన్నింటిలోనూ ఈ కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త ధరల ప్రకారం నాన్-ఏసీ క్లస్టర్ బస్సు ఫ్లాట్ చార్జీ రూ.5, ఎయిర్-కండిషన్డ్ బస్సు ఫ్లాట్ చార్జీ రూ.10గా ఉండబోతుంది. ప్రస్తుతం నాన్-ఏసీ బస్సులో ఢిల్లీ నగరంలో ప్రయాణిస్తే రూ.5 నుంచి రూ.15 మధ్యలో టిక్కెట్ ధరలున్నాయి. అదేవిధంగా ఏసీ బస్సులో రూ.10 నుంచి రూ.25 మధ్యలో చార్జీలున్నాయి. 21 సంవత్సరాలు కంటే తక్కువ వయసున్న విద్యార్థులకు, వితంతువులకు, సీనియర్ సిటిజన్లకు ఉచిత ట్రావెల్ పాస్‌లను ప్రభుత్వం అందించనుంది. మహిళ ట్రావెల్ పాస్‌లకు శాశ్వతంగా 75 శాతం డిస్కౌంట్‌ను ప్రభుత్వం తీసుకొస్తోంది. రూ.800, రూ.1000కు లభ్యమవుతున్న నెలవారీ నాన్-ఏసీ, ఏసీ బస్సు పాస్‌లు ఇక రూ.250కే లభ్యం కానున్నాయి. రాజధాని ప్రాంతంలో రోడ్లపై వాహనాల శాతాన్ని తగ్గించి బస్సు ప్రయాణాలు పెంచడానికి ఈ డిస్కౌంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని అధికారులు చెబుతున్నారు. -
రాజధానిలో మరో 10 వేల ఆటోలు, 6 వేల బస్సులు..
దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యాన్ని నివారించేందుకు సరికొత్త పద్ధతులను అవలంభిస్తున్న ఆప్ సర్కార్.. ప్రజా రవాణా వ్యవస్థ(పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్)ను బలోపేతంచేసేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు నగర పరిధిలో కొత్తగా 10 వేల ఆటోలు, 6 వేల బస్సులకు అనుమతి మంజూరుచేసింది. దీంతో ఢిల్లీలో ఇప్పుడున్న ఆటోల సంఖ్య 80 వేల నుంచి 90 వేలకు చేరుకోనుంది. ఈ ప్రజారవాణా వాహనాలు జనవరి 1 నుంచి అదుబాటులోకి వస్తాయని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. కొత్తగా రోడ్లెక్కనున్న వాహనాలన్నీ సీఎన్ జీతో నడిచేవేనని, తద్వారా సాధ్యమైనంతమేరలో కాలుష్యాన్ని తగ్గించినట్లువుతుందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో జనవరి 1 నుంచి అమలు కానున్న సరి- బేసి విధానంపై సాధారణ ప్రజలు, వీఐపీలు సానుకూలంగా స్పందించడంతో, ఈ తరహా విధానాలు మరికొన్నింటిని అమలుచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు అన్ని ఆటోలు ఒకేసారి రోడ్లపై వచ్చేకంటే షిఫ్టుల వారీగా అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆమేరకు ఇప్పటికే అధికారులు ఆటో డ్రైవర్ల సంఘాలతో చర్చలు మొదలుపెట్టారు. సరి బేసి విధానంలో వాహనాల రిజిస్ట్రేషన్ చివరి నంబర్ ను బట్టి, రోజు విడిచి రోజు సరి-బేసి సిరీస్ వాహనాలకు రోడ్డుపైకి రావడానికి అనుమతి ఇస్తారు. దీనివల్ల ఒకే ప్రాంతంలో నివసించే సరి-బేసి వాహనదారులు ఒకే కారులో ప్రయాణించేలా చేయాలన్నిది ఢిల్లీ సర్కార్ ఆలోచన. అయితే ఈ విధానంపై విమర్శలు లేకపోలేదు. ఇప్పటికే ఒక కారు ఉండి, మరో కారు కొనగలిగే స్థోమత ఉన్నవారు సరి, బేసి నంబర్ల కార్లు కొనుగోలుచేసే అవకాశం ఉంటుందని, దీనివల్ల కార్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుదని కొందరు వాదిస్తున్నారు. -
నవ్యనగరికి నవోదయం
- సన్‌రైజ్ క్యాపిటల్ బ్లూ ప్రింట్ సిద్ధం - జలమార్గాలు, స్కైవాక్‌లు - ఇళ్ల వద్దే ఉద్యోగాల కల్పన - ఎంఆర్టీఎస్, మెట్రోతో ప్రజారవాణా - సింగపూర్ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదనలు - 50 ఏళ్లకు పూర్తయ్యే అవకాశం సాక్షి, విజయవాడ బ్యూరో : అద్భుత పర్యాటక ప్రాంతంగా, ఆర్థికాభివృద్ధి కేంద్రంగా నూతన రాజధాని అమరావతిని నిర్మించేందుకు సింగపూర్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అత్యాధునిక నగరాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని హంగులను ప్రణాళికలో పొందుపరిచింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 219 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం ఎలా ఉండాలి, అందులో ఏమేమి ఉండాలనే మాస్టర్ ప్లాన్‌ను సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వం అందించింది. రాజధాని నగరం ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు ప్రాంతీయ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్, ఐటీ, ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలను సన్‌రైజ్ క్యాపిటల్ ప్లాన్‌లో ప్రతిపాదించారు. అందులో భాగంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను నెలకొల్పుతారు. ఇందులోనే పారిశ్రామిక పార్కులు కూడా ఉంటాయి. నగరం మధ్యలోని ప్రాంతాన్ని కమర్షియల్ జోన్లుగా విభజించి వ్యాపార అవకాశాలు కల్పిస్తారు. రాజధాని నగరంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేందుకు హోమ్ జాబ్స్ విధానాన్ని సింగపూర్ ఏజెన్సీలు సూచించాయి. ప్రజలు ఇళ్ల వద్దే పనిచేస్తూ సంపాదించుకునేందుకు గృహావసర వ్యాపారాలను ప్రోత్సహిస్తారు. - రాజధాని నగరానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు అనుగుణంగా రైలు, రోడ్డు మార్గాల నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేస్తారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తారు. బీఆర్టీఎస్ తర్వాత మోడల్ అయిన ఎంఆర్టీఎస్ (మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)ను ప్రవేశపెట్టనున్నారు. అంటే రైలు మార్గాల మాదిరిగానే బస్సులకే ప్రత్యేక మార్గాలను ఏర్పాటుచేసి తిప్పుతారు. - మెట్రోరైలు రాజధాని నగరంలో కీలకం. వీటిద్వారా నగరంలో వ్యక్తిగతంగా ఎవరూ కార్లు, స్కూటర్లు, బైక్‌లను వినియోగించకుండా అందరూ ప్రజారవాణా వ్యవస్థనే వినియోగించే విధానాన్ని ప్రోత్సహిస్తారు. తద్వారా నగరంలో కాలుష్యం లేకుండా చూడాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. - మోటారు వాహనాలకు ప్రత్యామ్నాయంగా నగరంలో జలమార్గాలను అభివృద్ధి చేస్తారు. కాలువలు, రిజర్వాయర్లలో బోట్ల ద్వారా ప్రయాణించే ఏర్పాట్లు చేస్తారు. సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్‌లు ప్రత్యేకంగా ఉంటాయి. - పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లు, షాపింగ్‌మాల్స్, లైబ్రరీ, యూనివర్సిటీ వంటి వాటిని నివాస ప్రాంతాలకు దగ్గరే ఏర్పాటుచేస్తారు. దీనివల్ల స్థానికులు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా చూస్తారు. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నగరాన్ని పర్యాటక అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్లాన్‌లో ప్రతిపాదించారు. నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను నిర్మించి స్థానికులు, పర్యాటకులు ఆహ్లాదంగా గడిపే వాతావరణాన్ని సృష్టిస్తారు. అందమైన పార్కులు, గార్డెన్లు, రిక్రియేషన్ క్లబ్బులు ఏర్పాటుచేస్తారు. అమరావతి నగరం కృష్ణానది ఒడ్డు నుంచి చూస్తే అద్భుత దృశ్యంగా ఉండేలా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణమైన అన్ని హంగులూ ఏర్పాటు చేయాలని ప్లాన్‌లో ప్రతిపాదించారు. నగరంలోనే పలు టూరిజం సర్క్యూట్లు ఏర్పాటుచేస్తారు. నగరాన్ని ఆకాశం నుంచి చూసేందుకు స్కైవాక్‌లు కూడా ఉంటాయి. - నగర సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదువేల ఎకరాలను రిజర్వు చేసుకోవాలని ప్లాన్‌లో సూచించారు. - నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ వేలు ఏర్పాటు చేస్తారు. - చెత్త నిర్వహణకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలను నెలకొల్పుతారు. - కొండవీటి వాగు ముంపు నుంచి రాజధానిని తప్పించి దాన్ని పర్యాటకానికి ఉపయోగిస్తారు. - రాజధాని నగరం నుంచి మచిలీపట్నం పోర్టుకు కారిడార్‌ను నిర్మిస్తారు. ఇవన్నీ 50 ఏళ్లలో రాజధానిలో ఏర్పాటు చేసుకోవాలని సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలు సూచించాయి. -
కొసరి కొసరి నేర్పించండి
కేరెంటింగ్ నేటి బాలలే రేపటి పౌరులు. అయితే, నేటి బాలలను ఉత్త పౌరులుగా కాకుండా, ఉత్తమ పౌరులుగా తయారు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉంది. అందుకు ఏం చేయాలంటే... పెద్దలు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలా తయారవుతారు. అందుకే ముందు మనం హుందాగా, నీతి నిజాయితీలతో నడుచుకుంటూ ఉంటే వారు మన నుంచి ఆ మంచిని అలవర్చుకుంటారు.పెద్దలను గౌరవించడం, చిన్నవారితో ప్రేమగా నడుచుకోవడం, తోటివారితో స్నేహంగా మసలుకోవడం ముందు మన నుంచే మొదలు కావాలి.బాల్యం నుంచీ చిన్నారులకు నీతికథలు, రామాయణ, భారత, భాగవతాలు, దేశభక్తి కథలు, ఈసప్ టేల్స్ వంటివి చెప్పడం వల్ల వారికి నైతికత అలవడుతుంది. సృజనాత్మకంగా తయారవుతారు. ఇంటినీ, ఒంటినీ, పరిసరాలనూ ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో... వీధులను, రోడ్లను కూడా అదేవిధంగా శుభ్రంగా ఉంచడం అవసరమనే విషయాన్ని వారికి తెలియజెప్పండి. వీధి దీపాలు, వీధి పంపులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి వాటిని దుర్వినియోగం చేయకుండా, వాటిని కాపాడటాన్ని బాధ్యతగా గ్రహించేలా చేయాలి. విద్యుత్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, ఇంటిపన్ను, ఆస్తి పన్ను వంటి వాటిని సకాలంలో చెల్లించటం ఎంత అవసరమో చెబుతూ, మంచి పౌరునికి ఉండవలసిన లక్షణాలేమిటో వారంతట వారే తెలుసుకునేలా చేయండి.హింస, అశ్లీలత ఉండే సినిమాలు, టీవీ సీరియల్స్ వంటివి చూడకుండా జాగ్రత్త పడండి.ఆపదలో ఉన్నవారికి సాయం చేయటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్న వారికి సాయపడటంలో ఉన్న ఆనందాన్ని వారు అనుభవించేలా చేయండి. -
ప్రజా రవాణాపై సర్కారు నిర్లక్ష్యం
⇒కుదిస్తున్న పల్లెవెలుగు బస్సులతో విద్యార్థులకు కష్టం ⇒50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉన్న రూట్లలో తగ్గిస్తున్న బస్సులు ⇒ఆర్టీసీ రీజియన్లలో పర్యటించని సేఫ్టీ ఆడిట్ టీంలు ⇒రోడ్ల అధ్వాన్న నిర్వహణపై లోపాలు చూపుతున్నా పట్టని ధోరణే సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణాపై సర్కారు ఎంత అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో ‘అనంత’ దుర్ఘటన అద్దం పడుతోంది. 2013లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రోడ్ల అధ్వాన్న నిర్వహణను ఎత్తి చూపినా గత అనుభవాల నుంచి పాలకులు పాఠాలు నేర్వడం లేదు. అటు రోడ్డు లోపాలతో పాటు ఆర్టీసీ బస్సుల అధ్వాన్న పరిస్థితి ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతోంది. బుధవారం అనంతపురం జిల్లా పెనుగొండ-మడకశిర మార్గంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆర్టీసీ రవాణా లోపాలను బట్టబయలు చేస్తోంది. సంస్థలో రోడ్డు ప్రమాదాల రేటు 2014-15 సంవత్సరానికి 0.09గా ప్రకటించి నా బస్సుల నిర్వహణ, నడిపే విధానంలో అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా పల్లెలకు తిరిగే బస్సుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. నష్టాల పేరుతో పల్లెవెలుగు బస్సులు కుదిస్తూ ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు. ప్రయాణికుల నిష్పత్తి 66 శాతానికి పెరుగుతున్నా, బస్సులను మాత్రం అందుకు తగ్గట్టు నడపడం లేదు. అనంతలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి రోడ్డు నిర్వహణతో పాటు విద్యార్థులు, ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులను నడపకపోవడమేనన్నది ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు టాప్‌పైనా పదుల సంఖ్యలో కూర్చొని ప్రయాణిస్తున్నారంటే బస్సుల నిర్వహణా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రీయింబర్స్‌మెంట్‌కే రూ.750 కోట్లు కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం బస్‌పాస్ రాయితీల రూపంలో రెండు రాష్ట్రాల్లో రూ.750 కోట్ల మేర ప్రతి ఏడాది చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే.. అందుకు తగ్గట్టు పలు ప్రధాన రూట్లలో బస్సులను మాత్రం ఆర్టీసీ నడపడం లేదు. ‘అనంత’ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది ఎక్కువ మంది విద్యార్థులే కాావడం గమనార్హం. బస్సులకు ‘పచ్చ’ రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ బస్సుల నిర్వహణలో కనిపించడం లేదు. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులపై ఆర్టీసీకున్న నిర్లక్ష్య ధోరణి ఈ దుర్ఘటనతో తేటతెల్లమవుతోంది. పల్లెవెలుగు బస్సులు నడిపితే 50 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) కంటే తక్కువ ఉందని బస్సుల్ని రద్దు చేస్తున్నారు. ప్రతి రోజూ సగటున 46.26 లక్షల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రతి లక్ష కిలోమీటర్లకు ప్రమాదాల రేటు 0.09గా ఉంది. పల్లెవెలుగు బస్సులకు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సరిగా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. అధికారులు, సూపర్వైజర్లు క్రమబద్ధంగా బస్సులను తనిఖీ చేయకపోవడం కూడా బ్రేక్ డౌన్లకు కారణమవుతోంది. కానరాని సేఫ్టీ ఆడిట్ బృందాల జాడ అత్యధిక ప్రమాదాల రికార్డు కలిగిన రీజియన్లలో ప్రమాదాలు జరగడానికి కారణాలు, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశాల్ని పరిశీలించేందుకు ఆయా రీజియన్లలో రోడ్ సేఫ్టీ ఆడిట్ టీంలను ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణ కోసం సర్క్యులర్ సూచనలు అమలు చేయడంతో పాటు ఈ బృందం సూచనలు, సలహాలు అందించాల్సి ఉంది. అయితే ఆయా రీజియన్లలో ఈ బృందాల జాడ కనిపించడం లేదు.