చంఢీగర్: శుక్రవారం నుంచి హర్యానాలో ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రజా రవాణాను ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఈ మేరకు సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మార్చి 25న దేశ వ్యాప్తంగా మొదటి దశ లాక్‌డౌన్ ప్రకటించిన నాటి నుంచి ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే మూడవ దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని కార్యకలపాలకు అనుమతిచ్చాయి. కానీ ప్రజా రవాణా వ్యవస్థను మాత్ర పునరుద్ధరించలేదు. (ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ ఛాన్స్!)
అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచి హర్యానాలో ప్రజా రవాణాను ప్రారంభిస్తున్నట్లు ఖట్టర్ ప్రకటించారు. ఇందుకోసం బస్సులను శానిటైజ్ చేయడమే కాక సామాజిక దూరాన్ని పాటించేలా సీట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణ సమయంలో ప్రజలంతా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.(5 లక్షల సలహాల్లో ఎక్కువ వాటికే: కేజ్రీవాల్)
Comments
Please login to add a commentAdd a comment