సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలుతో రోడ్డెక్కని బస్సులు సహా ప్రజా రవాణాను త్వరలో అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. కొద్దిపాటి నియంత్రణలతో ప్రజా రవాణాను అనుమతిస్తామని రహదారులు, హైవే మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న గడ్కరీ పేర్కొన్నారు. భారత బస్, కార్ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈ మేరకు వెల్లడించారు. నిర్ధిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా రవాణా తిరిగి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. (76 శాతం గుండె జబ్బులు ఎందుకు తగ్గాయి?)
బస్సులు, కార్లు నడిపే క్రమంలో ప్రజలు తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఫేస్ మాస్క్‌లు ధరించడం వంటి భద్రతా చర్యలు చేపట్టాలని, భౌతిక దూరం పాటించాలని గడ్కరీ సూచించారు. అయితే ప్రజా రవాణాను ఎప్పటి నుంచి అనుమతిస్తారనేది మంత్రి వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు మే 17 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుంది. కాగా గ్రీన్‌జోన్లలో ప్రభుత్వం ఇప్పటికే పలు సడలింపులను ప్రకటించన సంగతి తెలిసిందే. కోవిడ్-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలోఉత్తేజం కల్పించేందుకు కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. చదవండి : లాక్‌డౌన్ ఎఫెక్ట్ : అశ్లీల సైట్లకి పెరిగిన ట్రాఫిక్
Comments
Please login to add a commentAdd a comment