షిల్లాంగ్: కరోనా భయాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తత ప్రకటించాయి. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు ఈ నెల 31 వరకు మూసేయాలని ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా మేఘాలయా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక్కరోజుపాటు పూర్తిగా ప్రజా రవాణాపై ఆంక్షలు విధిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. మార్చి 20 అర్ధరాత్రి నుంచి మార్చి 21 అర్ధరాత్రి వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని తెలిపింది. దాంతోపాటు దుకాణాలు, మార్కెట్లు మూసేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతామని చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా 209 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు చనిపోయారు.
(చదవండి: కరోనా సునామీ: ఒక్క రోజే 33 కేసులు)
(చదవండి: కోవిడ్-19: చైనా కంపెనీ సరికొత్త రికార్డు)
కరోనా: మేఘాలయా ప్రభుత్వం కీలక నిర్ణయం!
Published Fri, Mar 20 2020 1:27 PM | Last Updated on Fri, Mar 20 2020 2:13 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment