సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రా మెట్రో రైల్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖారారైంది. డిసెంబర్ 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం కానుంది. తొలి విడతగా మూడు మెట్రో స్టేషన్లను ప్రారంభించనున్నారు. వర్చువల్ పద్దతిలో జరిగే ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రముఖులు పాల్గొంటారని ఆగ్రా జిల్లా మెజిస్టే్ట్ ఎన్ ప్రభుసింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షిస్తున్నామన్నారు. తొలివిడతలో తాజ్‌ఈస్ట్‌గేట్, బసాయ్, ఫతేహాబాద్ రోడ్డు స్టేషన్లు ఉన్నాయి. రూ.273 కోట్లతో ఫతేహాబాద్ 26 నెలల్లో పూర్తవుతుందని అంచనా.
కేంద్ర క్యాబినెట్ మెట్రో ప్రాజెక్ట్‌కి ఫిబ్రవరి 28, 2019లోనే ఆమోదం తెలిపింది. అనుకూలమైన అర్బన్, సిటీ ప్రాంతాల్లో మొదటగా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజారవాణాకు అనుగుణంగా షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాలను ఎంచుకుని తోలి విడతలో ఫతేహాబాద్‌లో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీఆర్‌పీ ప్రకారం రెండు కారిడార్లు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాయి. నగరంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాలైనా తాజ్‌మహల్, ఆగ్రాపోర్ట్, ఎత్‌మదుల్లా, సికింద్రాతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, మార్కెట్లు ఉన్నాయి. మొత్తం నగరంలో 27 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. నగరంలో29.4 కి.మీ మేర మెట్రో రైల్వే కారిడార్‌ను నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment