బెంగళూరు : ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగరంలో ఐపీఎస్‌లు కార్లు వదిలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బాట పట్టారు. బస్సులు, మెట్రో రైలులో ప్రయాణించి తమ కార్యాలయాలకు చేరుకుని విధులు నిర్వహించారు. బస్సు, మెట్రోరైలులో విధులకు వెళ్లే ఫొటోలను తమ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు.
ఇటీవలి కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై మెట్రో నగరాల్లో పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు పెరిగి ట్రాఫిక్, కాలుష్యానికి కారణమవుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోనైతే శీతాకాంలో సరి, బేసి పద్ధతిలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో ఐపీఎస్ ఆఫీసర్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రయాణం మంచి సందేశానిచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
#Bengaluru: On #WorldPublicTransportDay, several IPS officers in the city took public transport while heading to the office. pic.twitter.com/nUwdcM807c
— South First (@TheSouthfirst) November 10, 2023
Comments
Please login to add a commentAdd a comment