Metrol rail
-
ఐపీఎస్‌ల ప్రజారవాణా సందేశం
బెంగళూరు : ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగరంలో ఐపీఎస్‌లు కార్లు వదిలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాట పట్టారు. బస్సులు, మెట్రో రైలులో ప్రయాణించి తమ కార్యాలయాలకు చేరుకుని విధులు నిర్వహించారు. బస్సు, మెట్రోరైలులో విధులకు వెళ్లే ఫొటోలను తమ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై మెట్రో నగరాల్లో పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు పెరిగి ట్రాఫిక్, కాలుష్యానికి కారణమవుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోనైతే శీతాకాంలో సరి, బేసి పద్ధతిలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో ఐపీఎస్ ఆఫీసర్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రయాణం మంచి సందేశానిచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. #Bengaluru: On #WorldPublicTransportDay, several IPS officers in the city took public transport while heading to the office. pic.twitter.com/nUwdcM807c — South First (@TheSouthfirst) November 10, 2023 -
ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ఓ పెళ్లికూతురు వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమె తన కారును రోడ్డుపైనే వదిలిపెట్టి మెట్రోలో ప్రయాణించి పెళ్లి మండపానికి చేరుకుంది. సరిగ్గా మూహూర్తం టైంకు అక్కడకు వెళ్లింది. ఎంచక్కా అనుకున్న సమయానికి మనువాడింది. ఒంటినిండా నగలు, మేకప్‌తో పెళ్లికుతూరు తన వాళ్లతో కలిసి మెట్రోలో ప్రయాణించడం చూపరులను ఆకర్షించింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. బెంగళూరులో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం సహజమే. ఈ పెళ్లికుతూరు కారు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఎంతసేపైనా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఓ వైపు ముహూర్తం టైం దగ్గరపడుతోంది. దీంతో ఆమె తెలివిగా ఆలోచించి కారు నుంచి దిగిపోయింది. పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌కు వెళ్లింది. ఎంచక్కా మెట్రో రైలులో ప్రయాణించి పెళ్లి మండపానికి చేరుకుంది. ముహూర్తం టైంకు పెళ్లి చేసుకుంది. Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, & takes Metro to reach Wedding Hall just before her marriage muhoortha time!! @peakbengaluru moment 🔥🔥🔥 pic.twitter.com/LsZ3ROV86H — Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) January 16, 2023 ఈమె మెట్రోలో ప్రయాణించిన వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆమెను కొనియాడారు. ఈ పెళ్లి కూతురు చాలా స్మార్ట్ అని ప్రశంసించారు. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. ట్రాఫిక్ ఉంటుందని తెలుసు కదా.. టైంకి పెళ్లిమండపానికి చేరుకునేలా కాస్త ముందే బయల్దేరవచ్చు కదా.. పంచువాలిటీ లేదా? అని వ్యాఖ్యానించారు. చదవండి: షాకింగ్.. అసెంబ్లీలో లంచం డబ్బు.. నోట్ల కట్టలతో ఆప్ ఎమ్మెల్యే ఆరోపణలు.. -
ఇంకా హాయిగా
సాక్షి, న్యూఢిల్లీ: పలు రూట్లలో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు రైళ్లను నడపనున్నట్టు డీఎంఆర్సీ ప్రకటించింది. మెట్రో ప్రయాణికులకు మరింత చేరువవడంతోపాటు వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు రైళ్ల అందుబాటు సంఖ్యను పెంచనున్నారు. సెప్టెంబర్4న లైన్-6లో బదర్‌పురా-సెంట్రల్సెక్రెటేరియట్ మార్గంలో రెండు అదనపు రైళ్లు పెంచిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో లైన్- 1,2,3,4ల్లో మెట్రోరైళ్ల సంఖ్య పెరగనుంది. లైన్ వన్-1(దిల్షాన్గార్డెన్-రిటాలా)లో: మరో మూడు నుంచి నాలుగు నెలల్లో లైన్-1లో ఆరుకోచ్ల రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ లైన్లో నాలుగు కోచ్‌ల ట్రైన్లు 29 అందుబాటులో ఉన్నాయి. లైన్-2(జహంగీర్‌పురా-హుడాసిటీ సెంటర్)లో: లైన్-2లో ప్రస్తుతం ప్రతి రెండు రైళ్ల మధ్య సమయం రెండు నిమిషాల 38 సెకన్లుగా ఉంది. 27 ఎనిమిది కోచ్‌ల ట్రైన్లు ఈ లైన్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మరో ఆరు కొత్త రైళ్లను అందుటాబులోకి తీసుకురానున్నట్టు డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి అదనంగా రెండు ట్రిప్పులు కశ్మీరీగేట్-గుర్గావ్ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య నడపనున్నట్టు తెలిపారు. లైన్-3,4 (ద్వారకా సెక్టార్-21 నుంచి నోయిడా సిటీ సెంటర్,వైశాలి)లో..: రెండు ఎనిమిదికోచ్ల రైళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మరో 29 ఎనిమిది కోచ్‌ల రైళ్లను త్వరలోనే తేనున్నట్టు డీఎమ్ఆర్సీ తెలిపింది. సోమవారం నుంచి రద్దీ సమయాల్లో జహంగీర్‌పురా వెస్ట్-నోయిడా సెక్టార్-16,ద్వారకా సెక్టార్-21వైపు రెండు రైళ్లను అందుబాటులో ఉంటాయి.