Bengaluru Bride Takes Metro On Her Wedding Day To Avoid Traffic - Sakshi
Sakshi News home page

ఈ వధువు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి.. వీడియో వైరల్..

Jan 19 2023 11:04 AM | Updated on Jan 19 2023 2:23 PM

Bengaluru Bride Takes Metro On Her Wedding Day To Avoid Traffic - Sakshi

బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ఓ పెళ్లికూతురు  వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమె తన కారును రోడ్డుపైనే వదిలిపెట్టి మెట్రోలో ప్రయాణించి పెళ్లి మండపానికి చేరుకుంది. సరిగ్గా మూహూర్తం టైంకు అక్కడకు వెళ్లింది. ఎంచక్కా అనుకున్న సమయానికి మనువాడింది.

ఒంటినిండా నగలు, మేకప్‌తో పెళ్లికుతూరు తన వాళ్లతో కలిసి మెట్రోలో ప్రయాణించడం  చూపరులను ఆకర్షించింది.  అయితే దీనికి కారణం లేకపోలేదు. బెంగళూరులో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం సహజమే. ఈ పెళ్లికుతూరు కారు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఎంతసేపైనా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఓ వైపు ముహూర్తం టైం దగ్గరపడుతోంది.  దీంతో ఆమె తెలివిగా ఆలోచించి కారు నుంచి దిగిపోయింది. పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌కు వెళ్లింది. ఎంచక్కా మెట్రో రైలులో ప్రయాణించి పెళ్లి మండపానికి చేరుకుంది. ముహూర్తం టైంకు పెళ్లి చేసుకుంది.

ఈమె మెట్రోలో ప్రయాణించిన వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆమెను కొనియాడారు. ఈ పెళ్లి కూతురు చాలా స్మార్ట్ అని ప్రశంసించారు. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. ట్రాఫిక్ ఉంటుందని తెలుసు కదా.. టైంకి పెళ్లిమండపానికి చేరుకునేలా కాస్త ముందే బయల్దేరవచ్చు కదా.. పంచువాలిటీ లేదా? అని వ్యాఖ్యానించారు.
చదవండి: షాకింగ్.. అసెంబ్లీలో లంచం డబ్బు.. నోట్ల కట్టలతో ఆప్ ఎ‍మ్మెల్యే ఆరోపణలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement