సాక్షి, న్యూఢిల్లీ: పలు రూట్లలో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు రైళ్లను నడపనున్నట్టు డీఎంఆర్‌సీ ప్రకటించింది. మెట్రో ప్రయాణికులకు మరింత చేరువవడంతోపాటు వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు రైళ్ల అందుబాటు సంఖ్యను పెంచనున్నారు. సెప్టెంబర్4న లైన్-6లో బదర్‌పురా-సెంట్రల్‌సెక్రెటేరియట్ మార్గంలో రెండు అదనపు రైళ్లు పెంచిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో లైన్- 1,2,3,4ల్లో మెట్రోరైళ్ల సంఖ్య పెరగనుంది.
లైన్ వన్-1(దిల్షాన్‌గార్డెన్-రిటాలా)లో:
మరో మూడు నుంచి నాలుగు నెలల్లో లైన్-1లో ఆరుకోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ లైన్‌లో నాలుగు కోచ్‌ల ట్రైన్లు 29 అందుబాటులో ఉన్నాయి.
లైన్-2(జహంగీర్‌పురా-హుడాసిటీ సెంటర్)లో:
లైన్-2లో ప్రస్తుతం ప్రతి రెండు రైళ్ల మధ్య సమయం రెండు నిమిషాల 38 సెకన్లుగా ఉంది. 27 ఎనిమిది కోచ్‌ల ట్రైన్లు ఈ లైన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మరో ఆరు కొత్త రైళ్లను అందుటాబులోకి తీసుకురానున్నట్టు డీఎంఆర్‌సీ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి అదనంగా రెండు ట్రిప్పులు కశ్మీరీగేట్-గుర్గావ్ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య నడపనున్నట్టు తెలిపారు.
లైన్-3,4 (ద్వారకా సెక్టార్-21 నుంచి నోయిడా సిటీ సెంటర్,వైశాలి)లో..:
రెండు ఎనిమిదికోచ్‌ల రైళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మరో 29 ఎనిమిది కోచ్‌ల రైళ్లను త్వరలోనే తేనున్నట్టు డీఎమ్‌ఆర్‌సీ తెలిపింది. సోమవారం నుంచి రద్దీ సమయాల్లో జహంగీర్‌పురా వెస్ట్-నోయిడా సెక్టార్-16,ద్వారకా సెక్టార్-21వైపు రెండు రైళ్లను అందుబాటులో ఉంటాయి.
ఇంకా హాయిగా
Published Mon, Sep 9 2013 12:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement