![Arogya Reddy Group Delivering Food Supply For Poor People - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/31/arogya_Reddy_Group.jpg.webp?itok=LCJpEGe2)
హైదరాబాద్: అన్నం పరబ్రహ్మ స్వరూపం... ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నదానం చేయటంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఆరోగ్యరెడ్డి మిత్ర బృందం. ప్రతి రోజు ఏదో ఓ ప్రాంతంలో పేద ప్రజలకు అన్నం, నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, దుప్పట్లు, ఇతర వస్తువులు పంపిణీ చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, వైద్యులు, ఉద్యోగులు మిత్రులతో కలిసి వ్యాపారవేత్త ఆరోగ్యరెడ్డి నేతృత్వంలో ఓ బృందంగా ఏర్పడ్డారు.
దాదాపు 30 మంది కలిసి బృందంగా ఏర్పడి సేవాకార్యక్రమాలు ముందుకు వెళుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో చేతనైనంత సాయం చేయాలని భావించి అండగా ఉంటున్నారు. నాలుగు మెతుకులు కదా బయట పడేద్దామని అనుకుంటాం.. కానీ ఆ నాలుగు మెతుకులే దొరక్క ఆకలితో అలమటించేవారు అనేక మంది నరక యాతన అనుభవిస్తున్న వారి మనస్సును అర్థం చేసుకొని వీరు ఆదుకుంటున్నారు. గత సంవత్సరం లాక్ డౌన్‌లోనూ తిరిగి ప్రస్తుతం రెండవ దశలో 11 రోజుల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలైన అమీర్‌పేట్, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్ గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, బాలానగర్ వంటి ప్రాంతాల్లో బృందాలుగా ఏర్పడి ఉదయం, సాయంత్రం వేళల్లో సహాయ సహకారాలు అందజేస్తు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment