సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాల్లో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు బయటకు రావడం మొదలైంది. వాణిజ్య, వ్యాపార, ఇతర వృత్తుల వారు కార్యకలాపాలను ప్రారంభించారు. బతుకుదెరువు కోసం వీధి వ్యాపారులు రోడ్లపైకి వస్తున్నారు. రెడ్‌జోన్ జిల్లాల్లోనూ కొన్నింటికి సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల మద్యం దుకాణాలకు, కొన్ని వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. అంటే లాక్‌డౌన్ సడలింపుల తో వివిధ వర్గాల ప్రజలు బయటకు వచ్చి రోజు వారీ కార్యకలాపాల్లో నిమగ్నమైపోతున్నారు. ఇప్పటికే ఉపాధి కోల్పోయి, ఆసరా లేకుండా ఉన్నవారు సడలింపులతో ఎంతో ఊరట చెందారు. అయి తే కరోనా వైరస్‌ను ఇప్పటివరకు లాక్‌డౌన్‌తో కట్ట డి చేశారు.
తాజా సడలింపులతో ఎలాంటి పరిణా మాలు ఎదురవుతాయోనన్న భయాందోళన వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలను వెంటాడుతోంది. సడలిం పుల అనంతరం తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడం వైద్య, ఆరోగ్య శాఖకు సవాలుగా మారింది. ప్రజలను చైతన్యం చేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇన్నాళ్లూ కట్టడిలోనే ఉన్నామని, లాక్‌డౌన్‌లోనూ ఇచ్చిన వెసులుబాటులోనూ జాగ్రత్తలతో కట్టడి పాటించాలని కోరుతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ ‘కరోనాతో కలసి జీవనం సాగిం చాల్సిందే’నని, ఆ ప్రకారం ముందుకు సాగ క తప్పదంటున్నారు. జనబాహుళ్యంలో హెర్డ్ ఇమ్యునిటీ రావాల్సిన అవసరముందన్న చర్చ జరుగుతోంది. ఆ ప్రకారం యువకులు బయటకు రావాలి. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతరత్రా అనారోగ్యాలతో ఉన్న వారు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాస్‌రావు బుధవారం కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు.
► భౌతికదూరం: ఇతరుల నుంచి కనీసం 6 అడుగుల భౌతికదూరం పాటించాలి. అపరిచితులతో సన్నిహిత సంబంధాన్ని నివారించాలి. మార్కెట్లు, కార్యాలయాలు, ప్రయాణ సమయాల్లోనూ సురక్షితమైన దూరాన్ని పాటించాలి.
► ఫేస్ మాస్క్‌లు: ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరిం చాలి. ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షించే విషయంలో ఇదే అత్యంత కీలకమైన అంశం. ఇంట్లో తయారుచేసిన డబుల్ లేయర్డ్ ఫేస్ మాస్క్‌లు ఇన్‌ఫెక్షన్‌ను నివారించడంలో బాగా పనిచేస్తాయి. మాస్క్‌లను తరచుగా పైన తాకడం, సర్దుబాటు చేయడం మంచిది కాదు. రోజూ ఉతికిన తర్వాత తిరిగి వాడాలి.
► ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యం: ఫ్లూ లక్షణాలు అంటే దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒంటి నొప్పులు, తలనొప్పి వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలి.
► సొంతంగా రావొచ్చు: కరోనా పాజిటివ్ వ్యక్తితో లేదా వారితో పరిచయమున్న వ్యక్తులతో కాంటాక్ట్ అయితే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలి.
► అనవసర ప్రయాణాలు వద్దు: ప్రజలు అనవస ర ప్రయాణాలను నివారించాలి. ఇంట్లో ఉండటం కరోనా నియంత్రణకు ఉత్తమ నివారణ వ్యూహం.
► ఆహారపు అలవాట్లు: సరిగ్గా వండిన ఆహారాన్ని తినాలి. సురక్షితమైన మంచి నీటిని తాగాలి. రోజూ తాజా పండ్లు తినాలి. పుష్కలంగా నీరు తాగాలి.
► వృద్ధులు: వృద్ధులు ఇళ్లల్లోనే ఉండాలి. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలుంటే అవసరమైన మందులు తప్పక వాడాలి. ఏవైనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
► వ్యక్తిగత పరిశుభ్రత: వ్యక్తిగత పరిశుభ్రత ము ఖ్యం. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. దగ్గినపుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
► మానసిక ప్రశాంతత: యోగా, ధ్యానం ద్వారా శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. దీంతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
► కరోనా సంబంధ సమాచారం కావాల్సిన వారు 104కి కాల్ చేయాలి.
► మానసిక ఆరోగ్యంపై కౌన్సెలింగ్ సేవలు అవసరమైనవారు 108కి కాల్ చేయాలి.
అసలు సవాలు ఇప్పుడే!
Published Thu, May 7 2020 2:23 AM | Last Updated on Thu, May 7 2020 2:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment