red zone
-
రెడ్ జోన్ గా ప్రకటన
-
Europe Heatwave: మండిపోతున్న యూరప్.. చరిత్రలో తొలిసారి
లండన్: యూరప్‌ను ఎండలు అల్లాడిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం లింకన్షైర్లోని కోనింగ్స్‌బైలో ఏకంగా 40.3 డిగ్రీలు, హీత్రూలో 40.2 డిగ్రీలు నమోదైంది! దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా అసాధారణ స్థాయిలో ఎండలు మండిపోయాయని వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం రాత్రి నమోదైన 26 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఒక రికార్డేనని తెలిపింది. లండన్‌తోపాటు ఇంగ్లండ్‌లోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ విభాగం ప్రమాద హెచ్చరికలు చేసింది. సోమవారం జారీ చేసిన రెడ్ వార్నింగ్‌ను అధికారులు మంగళవారం కూడా కొనసాగించారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో తూర్పు లండన్‌లోని వెన్నింగ్టన్ గ్రామంలో గడ్డికి అంటుకున్న మంటలు ఇళ్లకు వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూరప్‌లో పలు దేశాలు ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం ఫ్రాన్సు, స్పెయిన్, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఎక్కువగా ఉంది. ఫ్రాన్సు, స్పెయిన్, పోర్చుగల్, గ్రీసుల్లో అడవులను వారం రోజులుగా మంటలు దహించి వేస్తున్నాయి. ఇంగ్లండ్‌లో లండన్‌లోని కేంబ్రిడ్జిలో 2019లో నమోదైన 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటిదాకా రికార్డు. వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు జనం జలాశయాలను ఆశ్రయిస్తున్నారు. రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కువ సేపు ఎండ ప్రభావానికి గురైతే అనారోగ్యం తప్పదంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వేసవి తీవ్రత నేపథ్యంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ నిలిచిపోవడంతో రహదారులను మూసివేశారు. కొన్ని రైళ్లను ఆలస్యంగా నడిపారు. కొన్నిటిని రద్దు చేశారు. 40 డిగ్రీల ఎండలుంటే రైలు పట్టాలపై ఉష్ణోగ్రతలు 50, 60, 70 డిగ్రీల వరకు వెళ్తుంది. అలాంటి సమయాల్లో పట్టాలు అతుక్కుపోయి, రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదముందని రైల్వే శాఖ తెలిపింది. ఎండలతో తలెత్తే డిమాండ్ కారణంగా ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నీటి సరఫరా సంస్థలు తెలిపాయి. -
హైకోర్టును రెడ్‌జోన్‌గా ప్రకటించడం సాధ్యం కాదు
సాక్షి, అమరావతి: పలువురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినందున హైకోర్టును రెడ్‌జోన్‌గా ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫెడరేషన్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా హైకోర్టు రిజిస్ట్రీ చర్యలు తీసుకుందని తెలిపింది. రోడ్‌జోన్‌గా ప్రకటించడమంటే హైకోర్టును మూసివేయడమేనని, తద్వారా న్యాయం తలుపులు మూసేవేసినట్లవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం గుర్తు చేసింది. అలాగే కరోనా నిరోధానికి పారా మిలిటరీతో కర్ఫ్యూ విధించేలా ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. (ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది: కోన రఘుపతి) -
'పాజిటివ్'పై తగ్గిన నెగెటివిటీ!
సాక్షి, హైదరాబాద్: కరోనా భౌతికదూరాన్ని శాసిస్తే.. కరుణ మానసిక సాన్నిహిత్యాన్ని చాటుతోంది. కోవిడ్ మనుషులను విడగొడితే.. మానవత్వం మనుషులను కూడగడుతోంది. పాజిటివ్ వచ్చినవారి పట్ల పాజిటివ్‌గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ ఆపత్కాలంలో ప్రజల ప్రవర్తనలో మెల్లగా మార్పు గోచరిస్తోంది. కొన్ని నెలల క్రితం కరోనా అనగానే పరిగెట్టేవారు. ఆ వైరస్ సోకితే ఇక భూమిపై నూకలు చెల్లినట్టేనని, అది ఎక్కడ తమకు సోకుతుందోనని,ఏమైపోతామోనని భయకంపితులయ్యేవారు. పాజిటివ్ వచ్చిందని తెలిస్తే చాలు బాధితులను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెలివేసినట్టుగా చూసేవారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాత రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చినా దూరంగా ఉంచుతూ అనుమానాస్పదంగా చూసేవారు. అయితే ఇప్పుడు కోవిడ్ మహమ్మారి విషయంలో మనుషుల తీరు, వ్యవహారశైలిలో మార్పు వస్తోంది. పాజిటివ్ వచ్చినవారి పట్ల మానవత్వంతో వ్యవహరిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఏదో ఒక రూపంలో ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయినా ‘నేనున్నాననీ... నీకేం కాదనీ’అనే విధంగా బం«ధువులు, మిత్రులు, ఇరుగుపొరుగువారు ముందుకు వచ్చి బాధితులకు ధైర్యం నూరిపోస్తున్నారు. జాగ్రత్తల గురించి చెబుతున్నారు. కరోనా రోగులకు ఇది టానిక్‌గా పనిచేస్తుండడంతో త్వరగా కోలుకుని మళ్లీ మామూలు మనుషులుగా మారడానికి దోహదపడుతున్నారు. బంధువులు, ఆఫీస్ బాసుల భరోసా బంధువుల్లో ఎవరికైనా కరోనా సోకితే రోజుకు రెండు, మూడుసార్లు ఫోన్ చేస్తూ ఆర్యోగం గురించి ఆరా తీస్తున్నారు. గతంలో వచ్చినవారు తీసుకున్న జాగ్రత్తలు, పోషక విలువలున్న ఆహారం, సరైన మందులు, ఇతర విషయాల గురించి చెబుతూ ధైర్యం నూరిపోస్తున్నారు. ఆయా ఆఫీసుల్లోని ఉద్యోగులకు కరోనా సోకినట్టు తెలియగానే వెంటనే బాస్‌లు తమ హోదా, దర్పాన్ని పక్కన పెట్టేసి తెల్లవారుజాము నుంచే ఫోన్లు చేసి భుజం తట్టి ధైర్యం చెబుతున్నారు. ఆఫీసు చింత పక్కన పెట్టేసి ముందు పూర్తి ఆరోగ్యాన్ని సాధించే దిశగా దృష్టి మరల్చేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా లభించిన భరోసా వారిలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. కరోనా సోకి ఇబ్బందుల్లో ఉన్నవారికి వారి బంధువులు, మిత్రులు మాట సాయమే కాదు, ఆర్థకంగానూ ఆదుకుంటూ అవసరాలకు అవసరమైన డబ్బులు సాయం చేస్తున్నారు. ప్రత్యేకంగా వివిధ మొబైల్ యాప్‌ల ద్వారా రోగుల అవసరాల మేర డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. డబ్బు సాయానికే పరిమితం కాకుండా బాధిత కుటుంబాలవారికి వివిధ రకాల నిత్యావసరాలు సైతం అందజేస్తూ భరోసా కల్పిస్తున్నారు. బ్యారికేడ్ల నుంచి అవగాహన దాకా... గతంలో పక్క వీధిలో ఎవరికైనా కరోనా వచ్చిందంటేనే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వెంటనే అనధికారిక కంచెలు, బ్యారికేడ్లు వెలిసేవి. ప్రభుత్వ అధికారు లు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ ఏరియాగానో, రెడ్ జోన్‌గానో ప్రకటించడానికి ముందే ‘ఇది రెడ్‌జోన్’ప్రాంతమంటూ ప్రచారం చేసేవారు. దీంతో అటు వైపునకు వెళ్లాలంటేనే ఎవరూ సాహసించేవారు కాదు. నేడు కరోనా వచ్చినవారు పక్కింట్లో ఉన్నా జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా గడుపుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం, ఇతర వస్తువులను అందిస్తున్నారు. -
తగ్గుతున్న వెరీయాక్టివ్ క్లస్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే నెలలో పాజిటివ్ కేసులు తగ్గినట్టే వెరీయాక్టివ్ క్లస్టర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. తాజా కేసుల నమోదును బట్టి చూస్తే 16వ తేదీ నుంచి వెరీయాక్టివ్ క్లస్టర్ల సంఖ్య తగ్గింది. నాలుగు రోజుల కిందట 56 క్లస్టర్లుగా ఉన్న ఈ సంఖ్య.. బుధవారం నాటికి 50కి తగ్గింది. వెరీయాక్టివ్ క్లస్టర్లంటే.. ఒకటి నుంచి ఐదు రోజుల్లోగా కేసులు నమోదైనవి. వీటిని రెడ్ జోన్లో ఉన్న క్లస్టర్లుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న కేసుల్లో ఎక్కువగా కేంద్రీకృతంగా.. అంటే వచ్చిన ప్రాంతాల్లోనే మళ్లీ కేసులు వస్తున్నాయన్నమాట. కేసులు కొత్త ప్రాంతాలకు విస్తరించకపోవడమంటే నియంత్రణ చర్యలు బాగున్నట్టు లెక్క. 28 రోజులు దాటినా కేసులు నమోదు కాని క్లస్టర్ల సంఖ్య కూడా భారీగా పెరగడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. కేసుల నమోదు ఇలా ► 6 నుంచి 14 రోజుల్లో నమోదవుతున్న యాక్టివ్ క్లస్టర్లు కూడా తగ్గుతున్నాయి. ► శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం వంటి జిల్లాల్లో వెరీయాక్టివ్ క్లస్టర్లు లేవు. ► కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా వెరీయాక్టివ్ క్లస్టర్లున్నాయి. ► కర్నూలు, చిత్తూరు, కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అర్బన్ ప్రాంతాలే కేంద్రీకృతంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ► 28 రోజులు దాటినా కేసులు నమోదు కాని క్లస్టర్ల సంఖ్య వారం రోజుల్లో 75 నుంచి 101కి పెరిగింది ► 5 కోట్ల జనాభా దాటిన రాష్ట్రాలతో పోలిస్తే మిగతా రాష్ట్రాల కంటే ఏపీలో కేసుల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ► పాజిటివ్ కేసుల్లో 80 శాతం పైగా 40 ఏళ్ల లోపు వారే ఉండటంతో త్వరగా కోలుకుంటున్నారు ► గత పది రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో కోయంబేడుతో సంబంధం ఉన్నవే ఎక్కువ. రాష్ట్రంలో రికవరీ శాతం 65.08 రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 65.08 శాతంగా ఉంది. బుధవారం 43 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు మొత్తం కరోనాను జయించిన వారి సంఖ్య 1,664గా ఉంది. ఇంకా యాక్టివ్ కేసులు 843 ఉన్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు 9,159 మందికి పరీక్షలు నిర్వహించగా.. 68 మందికి పాజిటివ్ ఉన్నట్టు తేలింది. వీటిలో కోయంబేడుకు సంబంధించిన కాంటాక్టు కేసులు 10 ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసులు 2,560కి చేరగా.. వీరిలో వలస కూలీలు 153 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటు 0.96గా ఉంది. -
కరోనా: 43 కంటైన్మెంట్ జోన్లు
సాక్షి, నెల్లూరు(పొగతోట): కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 43 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసర సరుకులు, కూరగాయల దుకాణాలు తెరిచేందుకు మాత్రమే అనుమతించారు. లాక్‌డౌన్‌ను ఈనెల 31వ తేదీ వరకు పొడిగిసూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిబంధనల అమలుపై అధికారులు కసరత్తు చేశారు. జిల్లావ్యాప్తంగా 43 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం చేశారు. నాన్ కంటైన్మెంట్ జోన్లలో దుస్తులు, బంగారం, చెప్పుల దుకాణాల మినహా మిగిలిన చోట్ల విక్రయాలు కొనసాగించవచ్చు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పాఠశాలలకు అనుమతి లేదు. అన్ని ప్రాంతాలల్లో రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. (ఆ డ్రగ్ వాడుతున్నా.. అవన్నీ వట్టి మాటలే: ట్రంప్) మార్గదర్శకాలు ఇవే.. దుకాణాలు తెరిచే విషయంలో అధికారులు పలు మార్గదర్శకాలను రూపొందించారు. ఒక్కో దుకాణం వద్ద ఐదుగురికి మించి ఉండకుడదు. భౌతిక దూరం పాటించాలి. ప్రజలు మాస్క్‌లు ధరించి బయటకురావాలి. మున్సిపాలిటీల్లో దుకాణాలు రోజు మార్చి తీయాలి. సోమవారం తీసిన షాపు మంగళవారం తెరవకూడదు. మంగళవారం తీసిన దుకాణం బుధవారం మూసివేయాలి. షాపుల మధ్య దూరం పెరిగితే ప్రజలు భౌతిక దూరం పాటించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. దుకాణాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఒకరిద్దరు మినహా సిబ్బంది ఉండకుడదు. పనిచేసేవారు మాస్క్‌లు ధరించి తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. లాక్డౌన్ సమయంలో అధిక ధరలకు విక్రయించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్లు ఇవే.. బోగోలు మండలంలో ఇబ్రహీంపేట, అల్లూరు మండలంలో నార్త్‌మోపూరు, కుర్రులబ్బిపాళెం, కావలి మండలంలో వీఆర్‌నగర్, దగదర్తి మండలంలో ఎల్‌ఎన్‌పురం, కొండాపురం మండలంలో పార్లపల్లి, తడ మండలంలో భీములవారిపాళెం, తడ, అక్కంపేట, నాయుడుపేట మండలంలో బీడీకాలనీ, ఎల్ఏ సాగరం, బాలాజీ గార్డెన్స్, పెద్దమసీద్ వీధి, వెల్కమ్ స్ట్రీట్, ఎల్ఐసీ స్ట్రీట్, ఓజిలి మండలంలో నెమళ్లపూడి, సూళ్లూరుపేట మండలంలో మహదేవయ్యనగర్, మన్నార్‌పోలూరు, వనంతోపు, పెళ్లకూరు మండలంలో శిరసనంబేడు, నెల్లూరు అర్బన్ మండలంలో ఖుద్దూస్‌నగర్, కోటమిట్ట, గాంధీనగర్, మాగుంటలేఅవుట్, మూలాపేట, వెంకటేశ్వరపురం, ట్రంక్‌రోడ్డు, కిసాన్‌నగర్, చంద్రబాబునగర్, స్టోన్‌హౌస్‌పేట, రంగనాయకులపేట, బాలాజీనగర్, ఎన్టీఆర్ నగర్, కోవూరు మండలంలో లక్ష్మీనగర్, లేగుంటపాడు, పోతిరెడ్డిపాళెం, ఇనమడుగు, ఇందుకూరుపేట మండలంలో ఇందుకూరుపేట, టీపీగూడూరు మండలంలో టీపీగూడూరు, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రేబాల, ముత్తుకూరు మండలంలో మల్లూరు, నెల్లూరు రూరల్ మండలంలో కాకుపల్లి, వాకాడు మండలంలో తిరుమూరు, నవాబుపేట, బాలాయపల్లి మండలంలో ఊట్లపల్లి, గూడూరులో 5, 6, 8 వార్డులు. 7 పాజిటివ్ కేసులు నెల్లూరు(అర్బన్): జిల్లాలో సోమవారం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూళ్లూరుపేటలో ఐదు, వింజమూరు మండలం నల్లగొండ్లలో రెండు కేసులు వెలుగు చూశాయి. సూళ్లూరుపేటలో మహదేవయ్యనగర్, వనంతోపుల్లో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అక్కడ కేసుల సంఖ్య 44కు చేరింది. వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోయంబేడు మార్కెట్ లింక్‌లతో కలువాయి, కోవూరు, వింజమూరు, తదితర మండలాల్లో ఇప్పటికే ట్రూనాట్ పద్ధతిలో పాజిటివ్ కేసులు వచ్చాయి. వాటిని తిరుపతికి పంపి నిర్ధారించాల్సి ఉంది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ సోకి కోలుకున్న మొత్తం 9 మందిని సోమవారం నారాయణ ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. అందులో 9 నెలల చిన్నారి, నలుగురు పురుషులు, మరో నలుగురు మహిళలున్నారు. వాకాడు మండలానికి చెందిన ఇద్దరు, నెల్లూరు కోటమిట్ట నుంచి నలుగురు, స్టోన్‌హౌస్‌పేట నుంచి ఇద్దరు, జెండావీధికి చెందిన మరొకరు డిశ్చార్జి అయిన వారిలో ఉన్నారు. ఇప్పటి వరకు 106 మందిని ఇంటికి పంపారు. మరో 58 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. కంటైన్మెంట్ జోన్‌గా మనుబోలు మనుబోలు: మనుబోలు గ్రామంలో కరోనా కేసు వెలుగు చూసిన నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సోమవారం నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ మనుబోలులో పర్యటించారు. పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. పోలీసులకు సూచనలిచ్చారు. సర్వే చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. 28 రోజులపాటు ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, వైద్య సదుపాయాలను నేరుగా ఇళ్ల వద్దే అందజేసే ఏర్పాటు చేస్తామని తెలిపారు. దుకాణాలు మూసివేయించాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ రామృష్ణారెడ్డి, తహసీల్దార్ ఆనందరావు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్వేత, ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులున్నారు. -
అన్ని దుకాణాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు కరోనా లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించడంతోపాటు రాష్ట్రాలకు మరిన్ని సడలింపులు కల్పించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున సడలింపులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలోని కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగతా మొత్తం ప్రాంతాన్ని గ్రీన్‌జోన్‌గా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం నుంచే బస్సులు రోడ్డెక్కుతాయని, అన్ని రకాల వ్యాపార సముదాయాలు తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తామని గతంలోనే ప్రకటించామని, తాజాగా కేంద్రం దేశవ్యాప్తంగా 31 వరకు లాక్డౌన్ 4.0ను ప్రకటించడంతో రాష్ట్రంలోనూ ఈ నెల 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుందన్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దుపోయేవరకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలపై కూలంకషంగా చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇండియా బ్యాక్ టు వర్క్.. దేశవ్యాప్తంగా ఇండియా బ్యాక్ టు వర్క్ అనే మాట వినిపిస్తోందని, ఆ దిశగా పలు రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వాటిల్లో రాష్ట్రానికి అనుకూలమైన అంశాలను ఎంచుకొని అమలుచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చితి నెలకొందని, వైద్యరంగ శాస్త్రవేత్తలు, నిపుణులు కూడా వ్యాక్సిన్ ఇప్పట్లో రాదనే తరహాలో మాట్లాడుతున్నారన్నారు. అందుకే కరోనాతో ఇక కలసి సహజీవనం చేయాల్సిన గత్యంతరంలేని పరిస్థితి నెలకొందని వివరించారు. ఇక ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగించాలని, ఎక్కువకాలం ఇళ్లకే పరిమితం కావడం కూడా సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను బాగా అనుసరించామని, దీనివల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎంతో సహకరించారని, వారందరికీ చేతులెత్తి ధన్యవాదాలు చెబుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇకపైనా కరోనాతో కలసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటించి సమస్య తీవ్రం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దు కాణాల నిర్వాహకులు వారి దుకాణాలను శానిటైజ్ చేసుకోవడంతోపాటు కొనుగోలుదారులకు కూడా శానిటైజర్ అందిస్తూ కరోనా విస్తరించకుండా చూడాలని విన్నవించారు. ఆంక్షలు ఎత్తేశాం కదా అని జనం ఇష్టమున్నట్లు బయటకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ సమస్య పెరుగుతుందని, కరోనా తిరగబెడితే మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని కేసీఆర్ సూచించారు. సర్వసన్నద్ధమయ్యాకే సడలింపులిస్తున్నాం... కొన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇప్పటికే అన్ని రకాల షాపులకు అనుమతిచ్చామని, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోనే కరోనా ఇబ్బంది ఉన్నందున 17 వేల బెడ్లు, అన్ని రకాల పరికరాలతో సర్వసన్నద్ధంగా ఉన్న తర్వాతే సడలింపులు ఇస్తున్నామన్నారు. సమస్య వస్తే మళ్లీ వెనక్కి వెళ్తామని, మున్ముందు పరిస్థితిని బట్టి సమీక్షించుకుంటామని చెప్పారు. కులవృత్తుల వారికి ఇప్పుడే చాలా చేస్తు న్నామని, అత్యవసరమైతే వారిని ఆదుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. లాయర్ల తరహాలో జర్నలిస్టులను ఆర్థికంగా ఆదుకొనే విషయంపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో మాట్లాడి 2, 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫుడ్ హోం డెలివరీ ఓకే! హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతించే విషయంలో సీఎం కేసీఆర్ ఎలాం టి స్పష్టత ఇవ్వలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలకు అనుమతి ఉండదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆహారం వండి హోం డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి ఉంటుందని స్పష్టంచేశాయి. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న లాక్డౌన్ పొ డిగింపు జీవోలో దీనిపై స్పష్టత ఇవ్వనుంది. ఆటోలు, క్యాబ్‌లకు ఓకే.. మెట్రోకు నో కంటైన్మెంట్ జోన్లు తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, కార్లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, ప్రైవేటు వాహనాలను అనుమతిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. క్యాబ్‌లలో డ్రైవర్ కాకుండా ముగ్గురు ప్రయాణికులను అనుమతిస్తామని, ఆటోల్లో డ్రైవర్ కాకుండా ఇద్దరు మాత్రమే ఎక్కాలని వెల్లడించారు. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులకు మాత్రం అనుమతి ఇవ్వట్లేదని పేర్కొన్నారు. కంటైన్మెంట్ ఏరియాలో 1,452 కుటుంబాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులున్న కంటైన్మెంట్ ఏరియాల పరిధిలో 1,452 కుటుం బాలు ఉన్నాయని, ఆ కుటుంబాలకు సంబం ధించిన ఇళ్లు, వాటి పరిసరాలు మాత్రమే ఇక కంటైన్మెంట్ ప్రాంతాలుగా ఉంటాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ ప్రాంతాలను మాత్రమే రెడ్జోన్లుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లోని వారిని ఆ పరిధి దాటి బయటకు అనుమతించబోమని, బయటి వారిని లోనికి అనుమతించబోమన్నారు. ఈ విషయంలో గట్టి నిఘా ఉంటుందని చెప్పారు. కంటైన్మెంట్ ఏరియాల పరిధిలోని కుటుంబాల వారికి కావాల్సిన నిత్యావసరాలను డోర్ డెలివరీ తరహాలో ప్రభుత్వమే సరఫరా చేస్తుందని కేసీఆర్ తెలిపారు. ఇది ఆయా కుటుంబాలు, ఆ ప్రాంతాల సంక్షేమంతోపాటు రాష్ట్ర సంక్షేమానికి సంబంధించిన విషయం అయినందున ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బస్సులకు రైట్‌రైట్... కరోనాతో కలసి జీవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి... రాష్ట్రంలో ప్రజారవాణాకు పచ్చజెండా ఊపారు. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే రోడ్డెక్కుతాయని తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కొన్ని పద్ధతులు రూపొందించారని, వాటి మేరకు బస్సులు తిరుగుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నందున సిటీ బస్సులను మాత్రం అనుమతించట్లేదని, అలాగే అంతర్రాష్ట్ర బస్సులకు కూడా అనుమతి ఇవ్వట్లేదన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు వేరే రాష్ట్రాలకు, వేరే రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు తెలంగాణకు రాకపోకలు సాగించేందుకు అనుమతి ఇవ్వట్లేదన్నారు. ‘జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు వస్తాయి. కానీ ఇమ్లిబన్ (ఎంజీబీఎస్) బస్ స్టేషన్‌కు బస్సులను రానీయరు. జూబ్లీ బస్‌స్టేషన్‌కు రానిస్తరు. కరోనా సమస్య ఉన్న దిల్సుఖ్నగర్ వైపు రానీయరు. సికింద్రాబాద్, జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద సమస్య లేదు. ఎల్బీనగర్ వైపు బస్సులను అనుమతించాలని మంత్రులు కూడా అడిగారు. నేను అనుమతించలేదు. బస్సులన్నీ రాత్రి 7 గంటల్లోపు డిపోలకు తిరిగి వచ్చేయాలి. ఏదైనా కొన్ని బస్సులు దూర ప్రాంతాల నుంచి వచ్చేవి, ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే రాత్రి 8 గంటల వరకు అనుమతిస్తం. ప్రయాణికుల వద్ద టికెట్ ఉంటది. దాన్ని చూసి అనుమతిస్తరు. జిల్లాల మధ్య ప్రైవేటు బస్సులు, స్టేజీ కార్యరియర్లు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, కార్లు కూడా నడుస్తయి. కేంద్రం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలతో అన్ని తెరుచుకుంటున్నయి. వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవచ్చు. ఇబ్బంది ఉండదు. మహారాష్ట్ర, ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడికి బస్సులు నడపట్లేదు. అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాల విషయంలో రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. మేము అంతర్రాష్ట్ర బస్సులు నడిపేందుకు అనుమతించట్లేదు’అని కేసీఆర్ స్పష్టం చేశారు. అనుమతించేవి... కరోనా కేసులున్న ప్రాంతా ల్లోని కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రం మొత్తం అన్ని రకాల దుకాణాలు. జీహెచ్ఎంసీ పరిధిలో సరి–బేసి పద్ధతిలో ఒకరోజు కొన్ని, మరోరోజు ఇంకొన్ని షాపులు. వాటి పూర్తి వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ విడుదల చేస్తారు. కంటైన్మెంట్ జోన్లు తప్ప అన్ని ప్రాంతాల్లో హెయిర్ కటింగ్ సెలూన్లు, ఈ–కామర్స్ సముదాయాలు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు. పరిశ్రమలు, తయారీరంగ యూనిట్లలో పూర్తిస్థాయిలో పనులు. వాటన్నింటిలో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం లాంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి. మూతపడే ఉండేవి ప్రార్థనా మందిరాలు. మతపరమైన సమావేశాలు, ఉత్సవాలు. ఫంక్షన్ హాళ్లు, మాల్స్, సినిమా హాళ్లు. బార్లు, పబ్బులు, క్లబ్బులు, స్టేడియాలు, పార్కులు, స్విమ్మింగ్పూళ్లు, జిమ్‌లు, అమ్యూజ్మెంట్ పార్కులు. అన్ని విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు. రాత్రి కర్ఫ్యూ యథాతథం.. ప్రస్తుతం రాత్రివేళ అమలులో ఉన్న కర్ఫ్యూ యథాతథం. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు గంగుల కమలాకర్, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి -
స్థానిక భాగస్వామ్యం పెంచండి
న్యూఢిల్లీ: పట్టణ నివాస ప్రాంతాల్లో కోవిడ్–19 కేసులు ఎక్కువ సంఖ్యలో బయటపడుతుండటంతో కేంద్రం మరిన్ని వనరులను ఉపయోగించుకునేందుకు యోచిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు స్థానికులతో సన్నిహితంగా ఉండే రాజకీయ, మత నాయకుల సేవలను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరింది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేలా ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను వీరికి అప్పగించాలంది. అదేవిధంగా, ‘పట్టణ ప్రాంతాల్లో ‘సంఘటన ప్రతిస్పందన వ్యవస్థ’ను ఏర్పాటు చేసి, సమర్థుడైన వ్యక్తిని ‘ఇన్సిడెంట్ కమాండర్’గా నియమించాలి. ఈ కమాండర్ కరోనా సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం అందించడంతోపాటు ఆయా కంటైన్మెంట్లలో ప్రణాళిక, నిర్వహణ, రవాణా, ఆర్థిక వ్యవహారాలను అమలు చేస్తుంటారు. ఇన్సిడెంట్ కమాండర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే సమన్వయ కమిటీలో ఆరోగ్య, మహిళాశిశు సంక్షేమ శాఖల అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ఇప్పటికే ఆ ప్రాంతంలో సేవలందిస్తున్న ఎన్జీవోలు సభ్యులుగా ఉంటారు’ అని పేర్కొంది. ‘ప్రజలు తమ నివాస ప్రాంతాలకే పరిమితమయ్యేందుకు సెక్షన్–144 అమలు చేయడంతోపాటు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలి. ఇతర ప్రాంతాల నుంచి కంటైన్మెంట్లలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించాలి. వీటిని ఎంత కచ్చితంగా అమలు చేస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి’అని తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం వరకు ఏపీ, తెలంగాణల్లోని కర్నూలు, గ్రేటర్ హైదరాబాద్‌లతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 30 మున్సిపాలిటీల్లోనే ఉన్న విషయం తెలిసిందే. -
రెడ్ జోన్లలో ఆటో, ఏసీ షాపులకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీతో పాటు రెడ్జోన్ల పరిధిలో ఉన్న ఇతర అన్ని మున్సిపాలిటీల్లో ఆటోమొబైల్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, వాహనాల రిపేర్ గ్యారేజీలు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లకు సంబంధించిన అన్ని రకాల షోరూమ్స్, షాపులను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం రెడ్జోన్ల పరిధిలోని మున్సిపాలిటీల్లో నిత్యావసర వస్తువుల దుకాణాలు, అత్యవసర సేవలతో పాటు నిర్మాణ రంగానికి సంబంధించిన హార్డ్‌వేర్ తదితర షాపులు, వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన పంపుసెట్ల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉండగా, ఇకపై పైన పేర్కొన్న దుకాణాలు, షోరూమ్స్‌ను అనుమతించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
రెడ్‌జోన్‌లో పోలీసులపై దాడి
ముంబై: ఫేస్ మాస్క్ లేకుండా బయటకు వస్తూ, లాక్డౌన్ నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రశ్నించిన పోలీసులపై దాడికి దిగారు కొందరు దుండగులు. ఈ దారుణ ఘటన గురువారం ముంబైలో చోటు చేసుకుంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఆంటోప్ హిల్ ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో ఉంది. అక్కడ గురువారం 15 మంది వ్యక్తులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చారు. దీంతో వారిని గమనించిన పోలీసులు కరోనా వ్యాప్తి నివారణ జాగ్రత్తలు ఏమాత్రం పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (టార్గెట్ ‘ఆర్మీ’ !) ఫేస్ మాస్క్ కూడా ధరించకుండా బయట ఎందుకు తిరుగుతున్నారని వారిని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. వెంటనే ఆవేశంతో దుండగులు పోలీసులపై పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయాలపాలయ్యారు. వారిని ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులపై దాడిని తీవ్రంగా పరిగణించిన పై అధికారులు దీనికి కారణమైన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం) -
ఇంటి ముంగిటే వైద్యం
అనంతపురం హాస్పిటల్: కరోనా కలకలం నేపథ్యంలో ప్రభుత్వం, ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ప్రధానంగా కరోనా వ్యాప్తి చెందకుండా రెడ్‌జోన్ ప్రాంతాల్లోని వారికి ఎప్పటికప్పుడు వైద్య సేవలందించేందుకు వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో పాటు రెడ్‌జోన్ ప్రాంతాల్లోని 8 వేల మందికి, వారికి సేవలందించే వైద్యులు, పోలీసులు తదితర సిబ్బందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులకూ చికిత్స జిల్లాలో 29 రెడ్జోన్లు ఉండగా.. ఆరోగ్యశాఖాధికారులు ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వైద్యులు, ఆశా, ఏఎన్ఎం, వలంటీర్లతో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక, సాధరణ జబ్బులతో బాధపడే వారికి ఈ శిబిరాల్లోనే వైద్యం అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే సంబంధిత సీనియర్ వైద్యులు హాజరై చికిత్సనందిస్తారు. కరోనా అనుమానిత లక్షణాలుంటే నిర్ధారణ పరీక్షలు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే స్థానికంగా విధుల్లో ఉండే పోలీసులు, తదితర సిబ్బందికీ ఇక్కడ వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. 7,190 మందికి పరీక్షలు రెడ్‌జోన్ ప్రాంతాల్లోని 7,190 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరితో పాటు కరోనా లక్షణాలు కల్గిన 964 మందికి, ఆ ప్రాంతంలో ఉండే 4,438 మంది ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. అనుమానిత కేసులను క్వారన్‌టైన్‌కు పంపి సేవలందించారు. మెరుగైన వైద్యం కలెక్టర్ ఆదేశాలతో రెడ్‌జోన్‌ల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. దీర్ఘకాలిక సమస్యలుంటే మా దృష్టికి తీసుకువస్తారు. ఆ తర్వాత సంబంధిత వైద్య నిపుణులతో వైద్యం అందిస్తాం. ఈక్లినిక్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. –కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, జిల్లా వైద్యాధికారి -
11 నుంచి ఇంటర్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీ డియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను మే 11వతేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈమేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో ఇంటర్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి.రమేష్‌లతో కలిసి మంత్రి 13 జిల్లాల ఆర్ఐఓలు, ఆర్జేడీలు, డీవీఈఓలతో చర్చించి పలు సూచనలు చేశారు. 60 లక్షల పత్రాల మూల్యాంకనం... ► మే 11 నుంచి ఆరెంజ్, గ్రీన్జోన్లలో ఇంటర్ జవాబు పత్రాల మూ ల్యాంకనం మొదలవుతుంది. లాక్డౌన్ ముగిసిన అనంతరం రెడ్జోన్లలో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమవుతుంది. 13 జిల్లాల్లోనూ జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటవుతాయి. ► మూల్యాంకనానికి రెండు, మూడు భవనాలను గుర్తించి ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తారు. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి మూల్యాంకన నిర్వహిస్తారు. ► ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ పరీక్షలకు తేదీలు ఖరారు చేసినందున ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తారు. ► మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యారు. ► 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది. -
అసలు సవాలు ఇప్పుడే!
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాల్లో లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు బయటకు రావడం మొదలైంది. వాణిజ్య, వ్యాపార, ఇతర వృత్తుల వారు కార్యకలాపాలను ప్రారంభించారు. బతుకుదెరువు కోసం వీధి వ్యాపారులు రోడ్లపైకి వస్తున్నారు. రెడ్‌జోన్ జిల్లాల్లోనూ కొన్నింటికి సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల మద్యం దుకాణాలకు, కొన్ని వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. అంటే లాక్డౌన్ సడలింపుల తో వివిధ వర్గాల ప్రజలు బయటకు వచ్చి రోజు వారీ కార్యకలాపాల్లో నిమగ్నమైపోతున్నారు. ఇప్పటికే ఉపాధి కోల్పోయి, ఆసరా లేకుండా ఉన్నవారు సడలింపులతో ఎంతో ఊరట చెందారు. అయి తే కరోనా వైరస్‌ను ఇప్పటివరకు లాక్‌డౌన్‌తో కట్ట డి చేశారు. తాజా సడలింపులతో ఎలాంటి పరిణా మాలు ఎదురవుతాయోనన్న భయాందోళన వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలను వెంటాడుతోంది. సడలిం పుల అనంతరం తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడం వైద్య, ఆరోగ్య శాఖకు సవాలుగా మారింది. ప్రజలను చైతన్యం చేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇన్నాళ్లూ కట్టడిలోనే ఉన్నామని, లాక్‌డౌన్‌లోనూ ఇచ్చిన వెసులుబాటులోనూ జాగ్రత్తలతో కట్టడి పాటించాలని కోరుతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ ‘కరోనాతో కలసి జీవనం సాగిం చాల్సిందే’నని, ఆ ప్రకారం ముందుకు సాగ క తప్పదంటున్నారు. జనబాహుళ్యంలో హెర్డ్ ఇమ్యునిటీ రావాల్సిన అవసరముందన్న చర్చ జరుగుతోంది. ఆ ప్రకారం యువకులు బయటకు రావాలి. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతరత్రా అనారోగ్యాలతో ఉన్న వారు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాస్‌రావు బుధవారం కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు. ► భౌతికదూరం: ఇతరుల నుంచి కనీసం 6 అడుగుల భౌతికదూరం పాటించాలి. అపరిచితులతో సన్నిహిత సంబంధాన్ని నివారించాలి. మార్కెట్లు, కార్యాలయాలు, ప్రయాణ సమయాల్లోనూ సురక్షితమైన దూరాన్ని పాటించాలి. ► ఫేస్ మాస్క్‌లు: ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరిం చాలి. ఇన్ఫెక్షన్ నుంచి రక్షించే విషయంలో ఇదే అత్యంత కీలకమైన అంశం. ఇంట్లో తయారుచేసిన డబుల్ లేయర్డ్ ఫేస్ మాస్క్‌లు ఇన్ఫెక్షన్ను నివారించడంలో బాగా పనిచేస్తాయి. మాస్క్‌లను తరచుగా పైన తాకడం, సర్దుబాటు చేయడం మంచిది కాదు. రోజూ ఉతికిన తర్వాత తిరిగి వాడాలి. ► ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యం: ఫ్లూ లక్షణాలు అంటే దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒంటి నొప్పులు, తలనొప్పి వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలి. ► సొంతంగా రావొచ్చు: కరోనా పాజిటివ్ వ్యక్తితో లేదా వారితో పరిచయమున్న వ్యక్తులతో కాంటాక్ట్ అయితే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలి. ► అనవసర ప్రయాణాలు వద్దు: ప్రజలు అనవస ర ప్రయాణాలను నివారించాలి. ఇంట్లో ఉండటం కరోనా నియంత్రణకు ఉత్తమ నివారణ వ్యూహం. ► ఆహారపు అలవాట్లు: సరిగ్గా వండిన ఆహారాన్ని తినాలి. సురక్షితమైన మంచి నీటిని తాగాలి. రోజూ తాజా పండ్లు తినాలి. పుష్కలంగా నీరు తాగాలి. ► వృద్ధులు: వృద్ధులు ఇళ్లల్లోనే ఉండాలి. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలుంటే అవసరమైన మందులు తప్పక వాడాలి. ఏవైనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ► వ్యక్తిగత పరిశుభ్రత: వ్యక్తిగత పరిశుభ్రత ము ఖ్యం. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. దగ్గినపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ► మానసిక ప్రశాంతత: యోగా, ధ్యానం ద్వారా శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. దీంతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ► కరోనా సంబంధ సమాచారం కావాల్సిన వారు 104కి కాల్ చేయాలి. ► మానసిక ఆరోగ్యంపై కౌన్సెలింగ్ సేవలు అవసరమైనవారు 108కి కాల్ చేయాలి. -
కరోనా నియంత్రణకు కఠిన చర్యలు: కలెక్టర్
సాక్షి, విజయవాడ: జిల్లాలోని రెడ్ జోన్లలో ప్రతీ చోట జియోగ్రాఫికల్ క్వారంటైన్‌ను అమలు చేస్తున్నామని కలెక్టర్ ఇంతీయాజ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని చెప్పారు. ఇక జిల్లా వ్యాప్తంగా 37 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నాయని, ఒక్క విజవాడ సిటీలోనే 20 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇక నూజివీడు, జగ్గయ్య పేట, నందిగామ, పెనమలూరు, మచిలీపట్నాలలో కొన్ని క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో ఎటువంటి వెసులుబాటులు లేవన్నారు. అదే విధంగా రెడ్ జోన్ ప్రాంతాలలో పూర్తిగా రాకపోకలు నిషేధించామని, గ్రీన్ జోన్లలో కూడా నిబంధనలకు లోబడే వెసులుబాటు కల్పించామని ఆయన అన్నారు. (సత్ఫలితాలిస్తోన్న జియోగ్రాఫికల్ క్వారంటైన్..) నిబంధనలు ఉల్లంఘిస్తే ఆసుత్రిలోని క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించారు. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయన్నారు. పరిస్థితులకు అనుకూలంగా పరిశ్రమల నిర్వహణ జరుగుతుందని, మిర్చి కోతకు వచ్చిన 3800 మంది వలసకూలీలను ప్రత్యేక రైళ్లలో మహారాష్ట్రకు తరలించామన్నారు. మరో 2200 మందిని బస్సుల ద్వారా స్వగ్రామాలకు చేర్చామని తెలిపారు. మిగిలిన వారిని కూడా స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని కలెక్టర్ పేర్కొన్నారు. (కరోనా: రోజుకు వెయ్యి పరీక్షలు!) -
రెడ్‌జోన్ ఆసుపత్రులు సర్వసన్నద్ధం
విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో క్వారంటైన్ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే సూచనలిచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా సదుపాయాలు ఉండాలని చెప్పాం. వీటిని ఇంకా ఎలా బలోపేతం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలి. వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించే విషయంపై కూడా మార్గదర్శకాలు తయారు చేయాలి. దిశ, టెలి మెడిసిన్, వ్యవసాయం, అవినీతి నిరోధకానికి సంబంధించిన కీలక నంబర్లను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించాలి. వీటిని ఉపయోగించుకునే విషయమై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. మరో రెండు వారాల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండటం మంచిది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కూలీలను మాత్రమే కేంద్రం అనుమతించినందున దాదాపు వారు లక్ష మంది వరకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. వీరందరినీ క్వారంటైన్లో ఉంచి పరీక్షలు చేయించడం కష్టమైన పని. అందువల్ల మిగిలిన వారు సహకరించాలి. సాక్షి, అమరావతి: రెడ్ జోన్లలో ఉన్న ఆసుపత్రులను అన్ని విధాలా సన్నద్ధంగా ఉంచుకోవాలని, కచ్చితమైన మెడికల్ ప్రొటోకాల్ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. టెలి మెడిసిన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కీలకమైన కాల్ సెంటర్ల నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని స్పష్టం చేశారు. కోవిడ్ నివారణ చర్యలు, వలస కూలీల తరలింపు, పరీక్షల సరళిపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పరీక్షల సరళిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల మేరకే అనుమతులు ► రెడ్ జోన్ పరిధిలో ఉండే ఆసుపత్రుల్లో తప్పనిసరిగా మెడికల్ ప్రొటోకాల్ పాటించాలని, వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. పీపీఈ కిట్లు, మందులు, మాస్కులు ఇతరత్రా అవసరమైన వైద్య పరికరాలు నిల్వ ఉండేలా చూసుకోవాలని సూచించారు. ► వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులు, గ్రూపులనే అనుమతిస్తున్నామని అధికారులు వివరించారు. వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకున్న వారిని పరిశీలించి.. ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి, కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల మేరకే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతిస్తున్నామని చెప్పారు. ► వచ్చే వాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఆయా రాష్ట్రాల్లో వాళ్లు గ్రీన్ జోన్లో ఉన్నారా? ఆరెంజ్ జోన్లో ఉన్నారా? రెడ్ జోన్లో ఉన్నారా? అన్న వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు. వీటిని నిర్ధారించుకుని వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ► స్పందన వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ మార్గాల ద్వారా విజ్ఞప్తులు చేసుకున్న వారు కూడా ఉన్నారన్నారు. అయితే వ్యక్తిగతంగా వచ్చే వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కుటుంబ సర్వేలో గుర్తించిన 32,792 మందికి రేపటిలోగా (మంగళవారం) టెస్టులు పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ► ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో పరీక్షలు ► రోజు వారీ పరీక్షల సామర్థ్యం 10 వేలకు పైగా పెరిగింది. ప్రతి పది లక్షల జనాభాకు రాష్ట్రంలో 2,345 పరీక్షలు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో 2,224, తమిళనాడులో 1,929, రాజస్తాన్‌లో 1,402 పరీక్షలు. ► రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,292 పరీక్షలు. ఆదివారం వరకు 1,25,229 పరీక్షలు. ► 24 గంటల్లో 67 పాజిటివ్‌లు నమోదు. యాక్టివ్ కేసులు 1,093. 524 మంది డిశ్చార్జి. మొత్తంగా 1,650 కేసులు, 33 మంది మృతి. ► రాష్ట్రంలో పాజిటివిటీ కేసుల శాతం 1.32. దేశంలో ఇది 3.84 శాతం. రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 2 శాతం. దేశంలో ఇది 3.27 శాతం. ► రాష్ట్రంలోని 11 ల్యాబ్‌ల్లో 22 మిషన్ల ద్వారా కొనసాగుతున్న పరీక్షలు. ప్రతి జిల్లాలో 4 మిషన్లు అందుబాటులో ఉంచే యత్నం. పీరియాడికల్‌గా 3 ల్యాబ్‌లలో ఫ్యుమిగేషన్ (శుద్ధి చేసే ప్రక్రియ). 45 కేంద్రాల్లో 345 ట్రూనాట్ మిషన్ల ద్వారా కూడా పరీక్షలు. -
రెడ్ జోన్లో మినహాయింపులకు నో..
లక్నో : రెడ్ జోన్లో ఎలాంటి మినహాయింపులు ఇచ్చిదిలేదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 19 జిల్లాలను రెడ్ జోన్‌గా గుర్తించామని, వాటిల్లో కఠిన చర్యలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. రెడ్ జోన్లో ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఆరెంజ్ జోన్లను గ్రీన్జోన్లుగా మలిచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివారం స్థానిక మీడియాతో మాట్లాడిన యోగి ఆదిత్యానాథ్ త్వరలోనే యూపీలో కరోనా ఫ్రీ రాష్ట్రంగా తయారుచేస్తామని చెప్పారు. (రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ!) ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు రంగాలకు లాక్డౌన్ నుంచి వెసులుబాటు కల్పిస్తున్నామని సీఎం ప్రకటించారు. నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలన్నీ తెరుచుకుంటాయని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వలస కూలీలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, విడతల వారీగా వారిని పంపుతున్నామన్నారు. కాగా యూపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ కారణంగా 43 మంది మృత్యువాత పడ్డారు. (ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధికి కరోనా) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఈ నగరాల్లో జోన్లను బట్టి సడలింపులు: కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్నందున లాక్‌డౌన్‌ను మే 17 వరకు పోడగించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్ కేసులు తగ్గిన ప్రాంతాలను వివిధ జోన్లుగా కేటాయించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన సడలింపులను ఇచ్చింది. ఈ క్రమంలో మెట్రో నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ ప్రాంతాలకు కేంద్రం కొన్ని సడలింపు ఇస్తూ మార్గదర్శకాలను వెల్లడించింది. (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ) నగరంలో అవసరమైన కార్యకలాపాల కోసం ప్రయణాలు చేయొచ్చా.. దేశ వ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ అవసరమైన కార్యకలాపాల ప్రయణాలపై కేంద్రం దేశవ్యాప్తంగా నిషేధం విధించినట్లు శుక్రవారం పేర్కొంది. ఇక అటువంటి ప్రయాణాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉన్నట్లు పేర్కొంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా ప్రాంతాలకు నిర్థిష్ట పరిమితులు విధించడానికి రాష్ట్రా ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అధికారం ఉన్నట్లు కూడా కేంద్రం వెల్లడించింది. ఇక ఉదయం, సాయంత్రం వాకింగ్‌కి అనుమతి? సాంకేతికపరంగా అనుమతి ఉన్నప్పటికీ అది ఆయా రాష్ట్ర, నగరాల నిర్దిష్ట మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటి పనులకు పనిమనిషి రావడానికి అనుమతి ఉందా? సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య అనవసరమైన ప్రయాణాన్ని నిషేధించినప్పటికీ.. రోజులో పగటిపూట గృహ సహాయాలకు, పని మనుషులకు అనుమతి ఉన్నట్లు పేర్కొంది. స్నేహితుల దగ్గరకు వెళ్లేందుకు అనుమతి? అనవసర కార్యకలాపాలకు నిషేధం విధించిన సమయంలో స్నేహితులు లేదా సన్నిహితులను కలుసుకునేందుకు నిషేధం ఉంది. నిషేధం సమయంలో కాకుండా మిగతా సమయాల్లో స్నేహితులను, బంధువులను కలుసుకోవచ్చు. అయితే అది వారున్న ప్రాంతాల్లోని నిర్థిష్ట మార్గదర్శకాలను బట్టి ఉంటుంది. అయితే కేంద్రం సామాజిక, మతపరమైన సమావేశాలపై నిషేధం విధించింది. చదవండి: ప్రధానీ కీలక భేటీ: రెండో ప్యాకేజీ సిద్దం! ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉందా? రెడ్ జోన్ల ప్రాంతాలలో ప్రభుత్వం వాహనాలతో అనుమతించబడిన కార్యకలాపాలకు అనుమతిస్తుందని కేంద్రం వెల్లడించింది. అయితే డ్రైవర్‌తో పాటు కేవలం ఇద్దరు ప్రయాణీకులతో మాత్రమే అనుమతి ఉంది. కానీ ద్విచక్ర వాహనాలకు పిలియన్-రైడింగ్ అనుమతించబడవు. ప్రజా రవాణా సంగతేంటి? రెడ్‌జోన్ ప్రాంతాల నివాసితులకు కనీసం సైకిల్ రిక్షాలు, ఆటో-రిక్షాలకు కూడా అనుమతించబడవు. ఇక దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లను నిషేధించబడ్డాయి. ఇక ఆరెంజ్ జోన్లలో ఇంటర్ ఇంట్రా-డిస్ట్రిక్ట్ బస్సు కార్యకలాపాలు నిషేధించబడ్డాయి, కాని డ్రైవర్‌తో పాటు కేవలం ఇద్దరు ప్రయాణీకులతో ప్రైవేట్ వాహనాల్లో కదలికను అనుమతిస్తారు. కాగా గ్రీన్ జోన్లలో మాత్రం బస్సులో 50 శాతం ప్రయాణాకులతో నడపడానికి అనుమతినిచ్చింది. తెరిచే దుకాణాలు ఏవేవి? నగర పరిధిలో ఉన్న అన్ని మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ మూసివేయబడతాయి. కానీ నిత్యవసర వస్తువులు అమ్మే కిరాణా దుకాణాలకు మినహాయింపు ఉంటుంది. అన్ని స్వతంత్ర దుకాణాలు, పొరుగు దుకాణాలు, నివాస సముదాయాలలో ఉన్న దుకాణాలకు అవసరమైనవా లేదా అనే దానితో సంబంధం లేకుండా అనుమతించబడతాయి, అయితే భౌతిక దూరం మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ గురించి ఏమిటి? అవసరమైన వాటి కోసం మాత్రమే రెడ్ జోన్లలో ఇ-కామర్స్ అనుమతించబడిందని కేంద్రం ఉత్తర్వులలో పేర్కొంది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో అనవసరమైన (ఆన్లైన్ షాపింగ్స్) విక్రయాలకు కూడా అనుమతి ఉంటుందని పెర్కొంది. ఆరోగ్య సేతు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాదా? ప్రైవేటు, ప్రభుత్వ రంగాల ఉద్యోగులు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఆప్‌ను ప్రతీ ఉద్యోగి ఉపయోగించేలా చూడటం సదరు సంస్థ నిర్వాహకుడి బాధ్యత. రెడ్, ఆరెంజ్ జోన్ల వారు మాత్రమే కాకుండా సడలింపులు లేని అని కంటైన్మెంట్ జోన్లకు కూడా ఆరోగ్య సేతు తప్పనిసరి అని కేంద్రం పేర్కొంది. రెడ్ జోన్స్: వీటిని హాట్ స్పాట్స్ అని కూడా పిలుస్తారు. కరోనా వైరస్(కోవిడ్ -19) కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలు. ఒక ప్రాంతాన్ని రెడ్‌జోన్ ప్రకటించే ముందు, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, రెట్టింపు రేటును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రస్తుతం భారతదేశంలో 130 రెడ్జోన్లు ఉన్నాయి. ఆరెంజ్ జోన్లు: రెడ్, గ్రీన్ లేని ప్రదేశాలు. తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలు. ప్రస్తుతం ఈ విభాగంలో 284 జిల్లాలు ఉన్నాయి. గ్రీన్ జోన్స్: కేసులు లేని ప్రదేశాలు, 21 రోజుల్లో కేసు నమోదు కాని ప్రదేశాలు. ప్రస్తుతం దేశంలో 319 గ్రీన్ జోన్లు ఉన్నాయి. -
కంటైన్మెంట్లు క్లీన్ స్వీప్
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెడ్ జోన్లన్నీ తొలగించారు. నగరంలో రెడ్ జోన్లు ప్రకటించిన కొద్దిరోజులకే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం (జీహెచ్ఎంసీ సర్కిల్–19) పరిధిలోని బోరబండ, రాజీవ్‌నగర్, జయంతినగర్, వెంకటగిరి ప్రాంతాల్లో కరోనా కేసులు రావడం, అందులో రాజీవ్‌నగర్‌లో ఒకరు మృతిచెందారు. దాంతో కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలన్నీ రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయా ఏరియాలను అష్టదిగ్బంధనం చేశారు. నాలుగు ప్రాంతాల్లో కలిపి దాదాపు 3,740 మంది జనాభా ఉన్నారు. ఈ నాలుగు ఏరియాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. వారి ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలను రెడ్జోన్ల పరిధిల్లో ఉన్న ప్రజలకు అందించారు. నిరంతరం కూరగాయలు, మెడిసిన్స్, నిత్యావసర సరుకులు వారికి అందేలా చర్యలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిరంతర పర్యవేక్షణకు పోలీసు అధికారుల సహకారం అందించడంతో మూడు రోజుల కిందట మూడు ప్రాంతాల్లో ఉన్న రెడ్జోన్లు బోరబండ, జయంతినగర్, రాజీవ్నగర్లను తొలగించారు. ప్రస్తుతం తాజాగా శుక్రవారం మిగిలి ఉన్న వెంకటగిరి ప్రాంతాన్ని కూడా తొలగించినట్టు జీహెచ్ఎంసీ, పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా రెండు వారాలకు పైగా కంటైన్మెంట్స్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నందు వల్లనే ఇక్కడ తిరిగి మొదటి పరిస్థితి నెలకొందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చినందుకే ఎత్తేశాం సర్కిల్–19 పరిధిలో కరోనా కేసులు నమోదు కావడం వల్లనే కంటైన్మెంట్లు ఏర్పాటు చేశాం. నాలుగు కంటైన్మెంట్లను అష్టదిగ్బంధనం చేసి లోపల ఉన్న వారిని బయటకు పంపకుండా, బయట వారిని లోనికి అనుమతించకుండా ఆయా ఏరియాల్లో ప్రత్యేక గుడారాలు వేసి నిరంతరం పోలీసుల సహకారంతో మా నోడల్ అధికారులు పర్యవేక్షించారు. వారికి కావాల్సిన కూరగాయలు, సరుకులతో పాటుగా అన్ని వస్తువులు ఇళ్ల వద్దకే అందజేశారు. ప్రజలు కూడా మాకు సహకరించారు. మొత్తం 13 పాజిటివ్ కేసుల్లో ఒకరు చనిపోయారు. ఒకరిని గాంధీకి, మరొకరిని ఛాతీ ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని డిశ్చార్చ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు మామూలుగా మారిపోయాయి. – రమేష్, ఉప కమిషనర్ -
ఏపీలో తగ్గిన రెడ్జోన్లు
ఆంక్షల పరిధి తక్కువే కేంద్రం తాజా మార్గదర్శకాల మేరకు ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి కేసులు ఉన్న ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించుకోవచ్చు. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసు నమోదైతే.. గ్రామీణ ప్రాంతాల్లో 7 కిలోమీటర్ల మేర, పట్టణ, నగర ప్రాంతంలో అయితే 5 కిలోమీటర్ల మేర కంటైన్మెంట్ జోన్/క్లస్టర్‌గా గుర్తించారు. ఇలాంటి క్లస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా 238 ఉన్నాయి. వీటిలోనే రెడ్, ఆరెంజ్ జోన్లు ఉన్నాయి. కేవలం ఈ పరిధిలోనే ఆంక్షలు అమలవుతాయి. ఇవి మినహా రాష్ట్రంలో మిగతా ప్రాంతమంతా గ్రీన్ జోన్ కిందికే వస్తుంది. ఈ 238 క్లస్టర్లలో కూడా ఆరెంజ్ జోన్లు అధికంగా ఉన్నాయి. కనుక ఆ ప్రాంతాల్లో మినహాయింపులు ఎక్కువే. రెడ్ జోన్లలో కూడా కొన్ని సడలింపులను కేంద్రం సూచించింది. ఈ లెక్కన రాష్ట్రంలో చాలా తక్కువ ప్రాంతాల్లోనే ఆంక్షలు ఉంటాయి. అంటే రాష్ట్రంలో ఆంక్షల పరిధి 20 శాతం కూడా మించి ఉండదని స్పష్టమవుతోంది. సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ రెడ్ జోన్లు తగ్గాయి. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 11 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించగా.. తాజాగా ఐదు జిల్లాలను మాత్రమే వెల్లడించింది. మిగిలిన 8 జిల్లాల్లో ఏడు ఆరెంజ్ జోన్లో, ఒకటి గ్రీన్ జోన్లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దేశ వ్యాప్తంగా 130 జిల్లాలను రెడ్ జోన్లో, 284 జిల్లాలు ఆరెంజ్ జోన్లో, 319 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ జోన్ల వర్గీకరణపై తాజా ఉత్తర్వులను రాష్ట్రాలకు పంపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మారిన ప్రాతిపదిక ► గత వారం కేవలం కేసుల (క్యుములేటివ్) సంఖ్య, కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న కాలాన్ని బట్టి జోన్లను వర్గీకరించారు. ► అయితే తాజాగా పాజిటివ్ కేసుల నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరగడంతో ఆ ప్రాతిపదికను మరింత విస్తృతం చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసుల సంఖ్య, డబ్లింగ్ రేటు, టెస్టుల పరిధి వంటి అంశాల ప్రాతిపదికన జిల్లాలను వర్గీకరించినట్లు తెలిపింది. ► ఇప్పటి వరకు కేసులు లేని వాటిని, గడిచిన 21 రోజుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కాని జిల్లాలను గ్రీన్‌జోన్‌లోకి తీసుకుంటారు. వారం వారం మారుతుంది.. ► కొన్ని జిల్లాలను రెడ్ జోన్లోకి చేర్చడాన్ని పలు రాష్ట్రాలు ప్రశ్నించాయని, అయితే.. వారం వారం ఈ జాబితా మారుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్ ఆధారంగా, రాష్ట్ర స్థాయిలో అదనపు విశ్లేషణ ఆధారంగా, రాష్ట్రాలు మరిన్ని రెడ్, ఆరెంజ్ జోన్లను నిర్దేశించవచ్చు. ► కేంద్రం ఇచ్చిన రెడ్, ఆరెంజ్ జోన్ జిల్లాల జోనల్ వర్గీకరణలో రాష్ట్రాలు సడలింపు చేయరాదని పేర్కొన్నారు. జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నప్పుడు కార్పొరేషన్లను, జిల్లాలోని మిగిలిన ప్రాంతాన్ని వేర్వేరు యూనిట్లుగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఒక యూనిట్లో 21 రోజుల పాటు కేసులు లేనిపక్షంలో ఆ యూనిట్ వరకు జోన్ వర్గీకరణను మార్చవచ్చు. ఏపీలో జిల్లాలు ఇలా.. రెడ్‌జోన్‌లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు ఉన్నాయి. ఆరెంజ్ జోన్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఉన్నాయి. గ్రీన్జోన్లో విజయనగరం ఉంది. -
తెలంగాణలో 6 రెడ్ జోన్ జిల్లాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రెడ్ జోన్ కేటగిరీ జిల్లాలు తగ్గాయి. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 9 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించగా తాజాగా 6 జిల్లాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో 18 ఆరెంజ్ జోన్లో, 9 గ్రీన్ జోన్లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3 నుంచి అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా 130 జిల్లాలను రెడ్ జోన్లో, 284 జిల్లాలను ఆరెంజ్ జోన్లో, 319 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతకుముందు వారం దేశవ్యాప్తంగా 170 రెడ్ జోన్లో, 207 ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ జోన్ల వర్గీకరణపై తాజా ఉత్తర్వులను రాష్ట్రాలకు పంపారు. మారిన ప్రాతిపదిక...: గత వారం కేవలం కేసుల (క్యుములేటివ్) సంఖ్య, కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న కాలాన్నిబట్టి జోన్లను వర్గీకరించారు. అయితే తాజాగా ఆ ప్రాతిపదికను మరింత విస్తృతం చేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివ్ కేసుల నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరగడంతో ప్రాతిపదికన విస్తృతం చేసినట్టు తెలిపింది. కేసుల సంఖ్య, డబ్లింగ్ రేటు, టెస్టుల పరిధి, సర్వైలెన్స్ వంటి అంశాల ప్రాతిపదికన జిల్లాలను వర్గీకరించినట్టు తెలిపింది. ఇప్పటివరకు కరోనా కేసులు లేని వాటిని, గడిచిన 21 రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాని జిల్లాలను గ్రీన్ జోన్లోకి పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలిపింది. చదవండి: భారత్ కేంద్రంగా నూతన ప్రపంచం వారం వారం మారుతుంది... కొన్ని జిల్లాలు రెడ్ జోన్లోకి చేర్చడాన్ని రాష్ట్రాలు ప్రశ్నించాయని, అయితే ఈ జాబితా చలనశీలత కలిగినదని, ప్రతి వారం ఈ జాబితా మారుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ ఆధారంగా, రాష్ట్రస్థాయిలో అదనపు విశ్లేషణ ఆధారంగా, రాష్ట్రాలు మరిన్ని రెడ్ జోన్లను, ఆరెంజ్ జోన్లను నిర్దేశించవచ్చని పేర్కొన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాల జోనల్ వర్గీకరణలో రాష్ట్రాలు సడలింపు చేయరాదని పేర్కొన్నారు. జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నప్పుడు కార్పొరేషన్లను, జిల్లాలోని మిగిలిన ప్రాంతాన్ని వేర్వేరు యూనిట్లుగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఒక యూనిట్లో 21 రోజులపాటు కేసులు లేనిపక్షంలో ఆ యూనిట్ వరకు జోన్ వర్గీకరణను మార్చవచ్చన్నారు. అందుకు సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. కాగా, కేంద్రం ప్రకటించినట్లుగా ఆయా జిల్లాలను పూర్తిస్థాయిలో రెడ్జోన్లుగా ఉంచాలా లేక అక్కడ కూడా కంటైన్మెంట్ జోన్ల ప్రకారమే నడుచుకోవాలా అన్న దానిపై రాష్ట్ర అధికారులు శనివారం నిర్ణయం తీసుకోనున్నారు. కరీంనగర్ ప్లాన్‌ను అమలు చేయడం వల్లే ఇప్పటివరకు విజయవంతంగా వైరస్‌ను నియంత్రణలోకి తీసుకురాగలిగామని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రకారమే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. చదవండి: చైనాపై మళ్లీ కారాలు మిరియాలు రెడ్ జోన్లో.. 1. హైదరాబాద్ 2. సూర్యాపేట 3. రంగారెడ్డి 4. మేడ్చల్ 5. వికారాబాద్ 6. వరంగల్ అర్బన్ గ్రీన్ జోన్లో.. 1. పెద్దపల్లి 2. నాగర్‌కర్నూల్ 3. ములుగు 4. భద్రాద్రి కొత్తగూడెం 5. మహబూబాబాద్ 6. సిద్దిపేట 7. వరంగల్ రూరల్ 8. వనపర్తి 9. యాదాద్రి భువనగిరి ఆరెంజ్ జోన్లో.. 1. నిజామాబాద్ 2. గద్వాల 3. నిర్మల్ 4. నల్లగొండ 5. ఆదిలాబాద్ 6. సంగారెడ్డి 7. కామారెడ్డి 8. ఆసిఫాబాద్ 9. కరీంనగర్ 10. ఖమ్మం 11. మహబూబ్‌నగర్ 12. జగిత్యాల 13. రాజన్న సిరిసిల్ల 14. భూపాల్పల్లి 15. మెదక్ 16. జనగాం 17. నారాయణ్‌పేట్ 18. మంచిర్యాల -
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్లు ఇవే
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐదు జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను రెడ్ జోన్లుగా నోటిఫై చేసింది. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు నమోదుకాని విజయనగరాన్ని గ్రీన్‌జోన్‌గా డిక్లేర్ చేసింది. కొత్త జాబితా ప్రకారం దేశంలోని 130 జిల్లాలను రెడ్ జోన్లుగా, 284 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా, 319 జిల్లాలను గ్రీన్ జోన్లుగా కేంద్రం గుర్తించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 19, మహారాష్ట్రలో 14 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్‌జోన్‌లో, 18 ఆరెంజ్ జోన్లో, 9 జిల్లాలు గ్రీన్జోన్లో ఉన్నాయి. ఎక్కువ కరోనా కేసులున్న జిల్లాలను హాట్‌స్పాట్(రెడ్‌జోన్).. తక్కువ కరోనా కేసులున్న ప్రాంతాన్ని నాన్ హాట్‌స్పాట్స్‌గా.. ఇప్పటి వరకు ఎలాంటి కరోనా కేసులు నమోదుకాని జిల్లాలను గ్రీన్ జోన్లుగా పేర్కొంటారనే విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో జోన్ల వివరాలు జిల్లాల వారీగా.. రెడ్ జోన్: కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఆరెంజ్ జోన్: తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం గ్రీన్ జోన్: విజయనగరం చదవండి: 3 తర్వాత లాక్డౌన్ సడలింపు పక్కా.. ఫేస్ మాస్క్ ఉంటేనే పెట్రోల్, డీజిల్ -
కరోనా విజృంభణ: రెడ్ జోన్లో రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మొత్తం 11 జిల్లాల్లోనూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం గుర్తించిన రెడ్జోన్ల జాబితాలో అన్ని జిల్లాలను చేర్చింది. అంతేకాకుండా దేశ రాజధాని పరిధిలోని ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) ప్రాంతంలో హాట్ స్పాట్ జిల్లాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. వీటిలో ఫరీదాబాద్, గౌతమ్ బుద్దా, సోనీపేట్, నోయిడా సిటీలు కూడా ఉండటం గమనార్హం. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల్లో ఆయా జిల్లాలను హాట్‌స్పాట్ జోన్లుగా నోటిఫై చేసింది. (లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ కీలక భేటీ) ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలను కూడా కేంద్రం రెడ్జోన్ల జాబితాలో చేర్చింది. దేశ వ్యాప్తంగా మొత్తం 132 రెడ్జోన్లను కేంద్ర గుర్తించిన విషయం తెలిసిందే. వైరస్ తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా వివిధ ప్రాంతాలను విభజించింది. మరోవైపు ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 3515కు చేరగా.. మృతుల సంఖ్య 59కి పెరిగింది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులు మరింత అప్రమత్తం చేశారు. (తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే) కోటాకు 40 బస్సులు.. ఇక రాజస్తాన్‌లో కోటాలో చికుక్కున్న వారి కోసం ఆప్ సర్కార్ ప్రత్యేకంగా బస్సులను పంపింది. కోటాలో ఉన్న విద్యార్థులను దాదాపు 40 బస్సులతో ఢిల్లీకి తరలించనున్నారు. వారందరినీ స్వస్థలాలకు చేర్చిన తరువాత.. ప్రతి ఒక్కరూ 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు రాష్ట్రంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. దీని కొరకు శుక్రవారం ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలపై సడలింపులు ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. రాష్టాల వారిగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని ఆరు జిల్లాలు రెడ్ జోన్లుగా గుర్తించింది. అలాగే దేశంలో రెండు వారాల క్రితం సుమారు 170 హాట్‌స్పాట్ జిల్లాలను ప్రస్తుతం 129కి తగ్గించింది. (రికార్డు స్థాయిలో కరోనా కేసులు) తెలంగాణలోని రెడ్ జోన్లు.. హైదరాబాద్ సూర్యాపేట రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికరాబాద్ వరంగల్ మరోవైపు కరోనా తీవ్రతను బట్టి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా వర్గీకరించింది. తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాలకు ఈ జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే రెండు వారాల కింద ఆరెంజ్ జోన్లు సంఖ్య 207గా ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 297కు పెరిగింది. అదే విధంగా తెలంగాణలో ఆరెంజ్ జోన్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని 18 జిల్లాలను ఆరెంజ్ జోన్లుకు గుర్తించింది ఆరెంజ్ జోన్లు జాబితా.. నిజామాబాద్ జోగులాంబ గద్వాల నిర్మల్ నల్గొండ అదిలాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఆసిఫాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్‌నగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల మెదక్ భూపాలపల్లి జనగామ నారాయణ్‌పేట మంచిర్యాల తెలంగాణలో కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న తొమ్మిది జిల్లాలను గ్రీన్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే దేశంలో 219 జిల్లాలకు గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. తెలంగాణలో గ్రీన్ జోన్లు పెద్దపల్లి నాగర్ కర్నూల్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సిద్దిపేట వరంగల్ రూరల్ వనపర్తి యాదాద్రి భువనగిరి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మే నెల అత్యంత కీలకం
న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్-19)పై జరుగుతున్న పోరులో మే నెల అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. హాట్‌స్పాట్స్‌ను కఠినంగా నియంత్రించడం, గ్రీన్‌జోన్స్‌ను సురక్షితంగా కాపాడుకోవడమన్న రెండు అంశాలు అమీతుమీ తేల్చేస్తాయని వీరు అభిప్రాయపడ్డారు. రైల్వే, విమాన ప్రయాణం, అంతర్రాష్ట బస్సు సర్వీసులను మే నెల మొత్తం బంద్ చేయడమే మేలని స్పష్టం చేశారు. కరోనాపై పోరు కొనసాగిస్తూ రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలని ప్రధాని వ్యాఖ్యానించడం తెల్సిందే. (రష్యా ప్రధానికి కరోనా) లాక్డౌన్ నుంచి సడలింపులు ఉంటాయన్న వార్తలు వస్తున్న తరుణంలో వైద్య నిపుణులు కంటైన్మెంట్ జోన్లు, గ్రీన్‌జోన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందేనని చెబుతున్నారు. దేశంలో రెండు వారాల క్రితం సుమారు 170 హాట్‌స్పాట్ జిల్లాలు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 129కి తగ్గాయి. ఇదే సమయంలో గ్రీన్జోన్లు 325 నుంచి 307కు, తగ్గిపోగా, ఆరెంజ్ జోన్లు 207 నుంచి 297కు పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వైరస్ నాశనం కాదని, వ్యాప్తిని నియంత్రించగలమన్నది గుర్తించాలని, కాబట్టి రెడ్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించడం మేలని, అదే సమయంలో గ్రీన్జోన్లలో నియంత్రణలు ఎత్తివేసి.. రెడ్జోన్ల వారు అక్కడికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రి అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్ కుమార్ గుప్తా తెలిపారు. (సొంతూరికి దారేది?) శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సర్జన్ అయిన డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ, ప్రజా రవాణా వ్యవస్థలతోపాటు మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, మతపరమైన ప్రాంతాలపై నిషేధం కొనసాగాలని సూచించారు. గ్రీన్జోన్ల సరిహద్దులను మూసివేయడంతోపాటు భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు తొడుక్కోవడం వంటి నిబంధనలను అక్కడ పాటించేలా చూడాలని అరవింద్ తెలిపారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో అవి తగ్గేదాకా లాక్డౌన్ కొనసాగాలని అన్నారు. లాక్డౌన్ మరో నాలుగు వారాలపాటు ఉంటే బాగుంటుందని, కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ దశలో లాక్డౌన్ ఎత్తివేయడం సరికాదని మ్యాక్స్ హెల్త్‌కేర్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రోమెల్ అభిప్రాయపడ్డారు. గ్రీన్జోన్లలో కొంత ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం కల్పించాలని అన్నారు. (ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ) భిన్నాభిప్రాయాలు లాక్డౌన్ ఎత్తివేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ జనాభాలో యువత 44 శాతం ఉండడం, ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైబడి ఉండడం, క్షయ వ్యాధిని నిరోధించే బీసీజీ టీకాలు తీసుకోవడం, కరోనా వైరస్ స్ట్రెయిన్స్‌లో ఉన్న తేడాలు తదితర కారణాలతో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందన్న వాదనలు ఉన్నాయి. అందుకే భౌతిక దూరం, పారిశుద్ధ్యం చర్యల్ని పకడ్బందీగా తీసుకొని దశలవారీగా లాక్డౌన్ ఎత్తేయాలని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ మరో వాదనను వినిపిస్తోంది. భారత్ ఇప్పటివరకు వైరస్‌ని తొక్కి పట్టి ఉంచిందని, 130 కోట్ల జనాభా ఉన్న దేశం లాక్డౌన్ ఎత్తేస్తే వ్యాధి మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ అధ్యక్షుడు సమీర్ శరణ్ హెచ్చరించారు. ఈ వైరస్ పూర్తిస్థాయి నిర్మూలనకి ఏడాది పడుతుందని లాక్డౌన్ ఎత్తేసే సమయంలో కట్టుదిట్టమైన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. -
అష్ట దిగ్బంధంలో నరసరావుపేట
సాక్షి, గుంటూరు : జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ప్రధానంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న గుంటూరు, నరసరావుపేటలో ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట కేంద్రంగా ఎక్కువగా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 253 పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో 109 కేసులు రూరల్ జిల్లాలోనివే. అందులోనూ 75 కేసులు ఒక్క నరసరావుపేటలోనివే. దీంతో నరసరావుపేటలో 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెండు రోజులు ప్రజలెవ్వరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. పట్టణం చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చేవారిని 14 రోజుల క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక బృందాలు పోలీసులు పేటలో నమోదైన పాజిటివ్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 920 ప్రైమర్, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఇంకా 200 మందికిపైగా గుర్తించి క్వారంటైన్ చేయాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో కాంటాక్ట్‌ల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను రూరల్ ఎస్పీ సీహెచ్ విజయరావు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు ప్రత్యేక బృందాల్లో పని చేస్తున్నారు. ‘డ్రోన్’ కన్నుతో నరసరావుపేటలోని వరవకట్టు ప్రాంతంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు లాక్ డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు. సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్, ఏఎన్ఎస్ పోలీసులు పేటలో 24/7 గస్తీ కాస్తున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో భద్రత కోసం మూడు ప్లటూన్ల ప్రత్యేక బృందాలు, ఎనిమిది మంది సీఐలు, 14మంది ఎస్ఐలు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 50 మంది కానిస్టేబుళ్లను నరసరావుపేటకు అదనంగా ఇటీవల కేటాయించారు. ఫలిస్తున్న ప్రణాళికలు రెడ్‌జోన్ ప్రాంతాల నుంచి వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించ కుండా గ్రీన్జోన్లను కాపాడుకునే విధంగా యంత్రాంగం ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగానే రెడ్‌జోన్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అక్కడ ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు క్వారంటైన్లో ఉండటం వల్ల యంత్రాంగం కొంత మేర ఊపిరి పీల్చుకుంటుంది. బయటకు రావొద్దు..దది ‘కరోనాను నిర్మూలించడంలో ప్రజలు తమవంతు సహకారం అందించాలి. ప్రధానంగా రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేస్తే వారి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ప్రజలు సహకరించాలి నరసరావుపేటలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. వైరస్ మూలాలు ఇక్కడి నుంచి రూరల్ జిల్లా మొత్తం వ్యాపిస్తున్నాయి. దీంతో పేటను అష్టదిగ్బంధం చేశాం. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాం. ప్రజలు సహకరించాలి. ప్రతి ఒక్కరు పోలీస్ ఆంక్షలకు లోబడి నడుచుకోవాలని రూరల్ ఎస్పీ, విజయరావు స్పష్టం చేశారు. – విజయరావు, రూరల్ ఎస్పీ -
మా కాలనీకి రావొద్దు!
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ కొందరు తమ వీధుల్లోకి వస్తుండటాన్ని కాలనీవాసులే అడ్డుకునేందుకు నడుం బిగించారు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా, బాధ్యత లేని కొందరు అదే పనిగా రోడ్లపైకి వెళ్తున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనంలో భయం క్రమంగా పెరుగుతోంది. తాము లాక్‌డౌన్‌ను పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నా, వేరే ప్రాంతాలకు చెందిన వారు తమ కాలనీల్లో రాకపోకలు సాగిస్తుండటంతో వైరస్ తమ ప్రాంతాలకు వస్తుందనేది వారి భయం. ప్రధాన రహదారులపై పోలీసు తనిఖీలు ఉంటుండటంతో కాలనీల్లోని అంతర్గత రోడ్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీన్ని నియంత్రించాలంటూ చాలామంది పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 100కు డయల్ చేసి వీటిపై ఫిర్యాదు చేస్తున్నారు. కానీ అన్ని ప్రాంతాల్లో రోడ్లను మూసేయటం సాధ్యం కాకపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో సొంతంగానే రోడ్లను మూసేసుకోవాలని నిర్ణయించారు. గత రెండు రోజులుగా ఈ తరహా ఏర్పాట్లు ఎక్కువయ్యాయి. గ్రామాల తరహాలో.. కరోనా వైరస్ కేసులు నమోదైన తొలినాళ్లలో గ్రామాల్లో రోడ్లను గ్రామస్తులే సొంతంగా దిగ్బంధనం చేసుకున్నారు. బయటివారు గ్రామాల్లోకి రాకుంటే వైరస్ వచ్చే అవకాశమే లేదని, పొలిమేరల్లో రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్లపై కందకాలు తవ్వారు. ఇప్పుడు నగరాల్లోని పలు కాలనీలు, బస్తీల వాసులు గ్రామాల తీరును ఆదర్శంగా తీసుకుని సొంతంగా బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి ఏర్పాటు తర్వాత జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించకుండా ఉండేందుకు.. కొందరు జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలున్న చోట్ల, ఈ స్వీయ బారికేడింగ్‌కు జీహెచ్ఎంసీ కూడా అభ్యంతరం తెలపట్లేదు. ప్రస్తుతం లాక్డౌన్ సందర్భంగా స్థానికులు 3 కిలోమీటర్లకు మించి దూరం ప్రయాణించేందుకు వీల్లేదని ప్రభుత్వం నిబంధన విధించిన సంగతి తెలిసిందే. కానీ కొందరు దీన్ని పట్టించుకోకుండా అంతర్గత రోడ్ల సాయంతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పుడు కాలనీలు, బస్తీల్లో రోడ్లపై కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేయటంతో వారికి అడ్డుగా ఉంది. ఓ రకంగా ఇది లాక్డౌన్ స్ఫూర్తికి అనుకూలంగానే మారటంతో అధికారులు కూడా ఏమీ అనట్లేదు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంకు, ఆసిఫ్‌నగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ప్రాంతాల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఆ ప్రాంతాల్లోని కాలనీల్లో కూడా బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మెహిదీపట్నం ఇది మెహిదీపట్నం ఎన్ఎండీసీ రోడ్డు నుంచి ఆసిఫ్‌నగర్ వైపు వెళ్లే దారిలో ఓ కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న కర్రల బారికేడ్లు. బయటి వ్యక్తులు కాలనీలోకి రాకుండా ఇలా అడ్డుకట్ట వేసుకున్నారు. మాసబ్‌ట్యాంకులోని ఇందిరానగర్ కాలనీ సమీపంలో.. ఇటీవలే ఇక్కడ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా మార్చారు. దీంతో అటువైపు దారితీసే అన్ని రోడ్లకు బారికేడ్లు ఏర్పాటు చేసి లోనివారు బయటకు, బయటివారు లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో వాహనదారులు సమీపంలోని విజయనగర్‌కాలనీ రోడ్డులోకి వెళ్లటంతో ఆ ప్రాంతవాసుల్లో ఆందోళన మొదలైంది. ఇళ్లలో వృద్ధులు ఉండటంతో భయంతో ఆ రోడ్డును కర్రల సాయంతో మూసేశారు. ఇందుకోసం స్థానికులు జీహెచ్ఎంసీ అధికారి దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరటం విశేషం. మా ఇళ్లముందు తిరుగుతారా? ‘మా ఇంట్లో 80 ఏళ్ల వృద్ధులున్నారు. వారు కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండా ల్సి ఉంటుంది. మేం లాక్‌డౌన్‌ను పాటిస్తూ ఇళ్లలో ఉంటుంటే, వేరే ప్రాంతాల నుంచి జనం మా ఇళ్ల ముందు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే మా ప్రాంతంలోని వారంతా మాట్లాడుకుని రోడ్డును మూసేశాం’ – ప్రభాకర్, విజయనగర్ కాలనీ రోడ్డుపై ఉమ్ముతున్నారు.. ‘మాకు సమీపంలో కంటైన్మెంట్ జోన్ ఉంది. అటు రోడ్లను ప్రభుత్వమే మూసేసింది. దీంతో జనం మా బస్తీ రోడ్లను వాడుతున్నారు. ఒక్కోసారి ఇరుకు రోడ్డు రద్దీగా మారుతోంది. ఈ రోడ్డు మీదుగా వెళ్లే జనం ఉమ్ముతున్నారు. ఇవన్నీ మాకు ఇబ్బందిగా మారింది. అందుకే రోడ్డుపై కర్రలు అడ్డుపెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నాం’ – రవీందర్, హుమాయూన్‌నగర్ -
రెడ్‌జోన్లపై ప్రత్యేక దృష్టి
-
కరోనా: బెజవాడంతా రెడ్‌జోన్
సాక్షి, అమరావతి: కరోనా రక్కసి పంజాకు కృష్ణా జిల్లా విలవిలలాడుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి జిల్లాలో 25 మండలాలను రెడ్జోన్లుగా అధికారులు ప్రకటించారు. నేటి నుంచి ఆయా మండలాల్లో పటిష్టంగా లాక్డౌన్ నిబంధనల్ని అమలు చేయనున్నారు. అలాగే గ్రీన్‌జోన్ పరిధిలోకి వచ్చే 37 మండలాల్లో లాక్డౌన్ సడలింపులు వర్తిస్తాయని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు గుర్తించిన ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల పరిధితోపాటు అలాగే దానికి బఫర్‌జోన్‌ను కూడా కలుపుకొని మొత్తం 5 కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా గుర్తించనున్నారు. గ్రామీణ ప్రాంతంలో 7 కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా పరిగణిస్తారు. రెడ్జోన్లుగా గుర్తించిన మండలాలు, మున్సిపాలిటీలు మినహాయిస్తే మిగిలిన 37 మండలాలను గ్రీన్‌జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ జోన్లో లాక్డౌన్ నిబంధనలు సడలించారు. రెడ్‌జోన్‌లో విజయవాడ నగరం జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విజయవాడ నగర పాలక సంస్థను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. నగరపాలక సంస్థ పరిధిలోకి వచ్చే విజయవాడ పశి్చమ, సెంట్రల్, తూర్పు, ఉత్తర, రూరల్ మండలాలు రెడ్‌జోన్‌లోకి వచ్చేశాయి. విజయవాడ పశి్చమ ప్రాంతంలో అధికంగా 20 కేసులు నమోదయ్యాయి. విజయవాడ సెంట్రల్ మండలంలో 18 కేసులు, విజయవాడ తూర్పు మండలంలో 17, విజయవాడ ఉత్తర మండలంలో మరో 8 కేసులు పాజిటివ్‌గా నిర్ధారించారు. మొత్తం మీద 63 కేసులు విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోనే ఉన్నాయి. రెడ్జోన్లుగా గుర్తించిన పురపాలక సంఘాలు.. విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం కార్పొరేషన్, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ, ఉయ్యూరు, పెడన, కొండపల్లి, తిరువూరు, గుడివాడలను రెడ్జోన్లుగా గుర్తించారు. వీటిలో కొన్ని మున్సిపాలిటీల్లో కేసులు నమోదు కానప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా రెడ్జోన్లుగా అధికారులు గుర్తించారు. 37 మండలాల్లో నిబంధనలు సడలింపు గ్రీన్‌జోన్ పరిధిలో ఉన్న ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, క్లీనిక్లన్నీ యథావిధిగా పనిచేస్తాయి. మెడికల్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు, వెటర్నరీ ఆసుపత్రులు, వాటికి సంబంధించిన మెడికల్ షాపులు తెరిచే ఉంటాయి. అలాగే ఆయా రంగాలకు సంబంధించిన పరిశ్రమలు కూడా తమ ఉద్యోగులతో పనిచేయించుకోవచ్చు. వ్యవసాయ పనులు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. పంటకోతలు, నూరి్పళ్లు తదితర పనులన్నీ చేసుకోవచ్చు. చేపలు, రొయ్యలు, కోళ్ల పెంపకం, పాలు తదితర వాటికి అవసరమయ్యే కేంద్రాలన్నీ గ్రీన్‌జోన్ ఏరియాల్లో తెరిచే ఉంటాయి. వాటికి దాణా, మందుల షాపులు కూడా పనిచేస్తాయి. ఉపాధి హామీ పనులు కూడా ఈ జోన్ పరిధిలో జరుగుతాయి. ఇందులో నీటిపారుదల, నీటి సంరక్షణ పనులు చేపడతారు. పెట్రోలియం, గ్యాస్ సంబంధిత విక్రయ దుకాణాలు పనిచేస్తాయి. పోస్టాఫీసులు, ఎయిర్పోర్ట్, రైల్వే గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్‌లు ఉత్పత్తుల ఎగుమతుల, దిగుమతులకు అందుబాటులో ఉంటాయి. గ్రామ, మండల కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు లభించే కిరాణాషాపులు, మిల్్కబూత్లు, మాంసాహార దుకాణాలు తెరిచే ఉంటాయి. రోడ్లు, బిల్డింగులు తదితర నిర్మాణ పనులు చేపట్టవచ్చు. రెడ్, గ్రీన్‌జోన్లకు ఇన్సిడెంట్ కమాండర్స్ జిల్లాలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకు రెడ్, గ్రీన్జోన్ల వారీగా సబ్కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లను ఇన్సిడెంట్ కమాండర్స్‌గా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నియమించారు. గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీల్లో లాక్డౌన్ సడలింపు అధికారులు వారికే ఉంటాయి. మరో ఐదుగురికి పాజిటివ్.. జిల్లాలో సోమవారం మరో ఐదు కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరింది. కొత్తగా వచ్చిన ఐదు కేసులు విజయవాడ నగరం, రూరల్ ప్రాంతాల్లో నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో సంబంధాలు ఉన్నవారు. గొల్లపూడి, ఆటోనగర్, ఖుద్దూస్‌నగర్, కానూరు, అయోధ్యనగర్‌లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్ నిర్ధారణ అయింది. అధికారులు ఆ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. రెడ్జోన్లుగా గుర్తించిన మండలాలు ఇవే.. విజయవాడ నగర పరిధిలోని ఐదు మండలాలతో పాటు మచిలీపట్నం, నూజివీడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, పెనమలూరు, కంకిపాడు, చందర్లపాడు మండలాలు ఉన్నాయి. వీటితోపాటు పశి్చమగోదావరి జిల్లాలోని ఆకివీడు నగరపంచాయతీలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో 7 కిలోమీటర్ల పరిధిలోపు వచ్చే జిల్లాలోని కైకలూరు, కలిదిండి మండలాలను కూడా రెడ్‌జోన్‌గా గుర్తించారు. -
ఏపీ: పేదల ముంగిటకు ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా రెండో విడత అందిస్తున్న సరుకుల పంపిణీ గురువారం సజావుగా ప్రారంభమైంది. రేషన్ దుకాణాల వద్ద రద్దీని నివారించేందుకు టైం స్లాట్‌తో కూడిన కూపన్లు జారీ చేయడంతో నిర్దేశించిన సమయానికి చేరుకుని వేచి చూడాల్సిన పని లేకుండా సరుకులు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో కుటుంబానికి కిలో శనగలు, రేషన్ కార్డులో నమోదైన ప్రతి సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందచేశారు. కరోనా వైరస్ ప్రభావంతో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రభుత్వం నేరుగా లబ్ధి్దదారుల ఇళ్లకే ఉచిత రేషన్ సరుకులను అంద చేసింది. బయోమెట్రిక్ లేకుండా భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. లాక్డౌన్ వల్ల పేదలు ఆకలితో వస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఈ నెలలో మూడు దఫాలు ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మొదటి విడత సరుకులను గత నెల 29 నుంచి ఈ నెల 15 వరకు పంపిణీ చేశారు. పంపిణీ ఇలా.. ► కొందరు డీలర్లు ఉదయం ఆరు గంటల నుంచే సరుకుల పంపిణీ ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ ఉదయం 5 గంటలకే కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు జాయింట్ కలెక్టర్లతో పర్యవేక్షించారు. ► రెండో విడత ఉచిత సరుకులను మొదటిరోజు 18,33,245 కుటుంబాలకు పంపిణీ చేశారు. ► పోర్టబిలిటీ ద్వారా 3,51,185 కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 56,659, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 10 కుటుంబాలు పోర్టబిలిటీని వినియోగించుకున్నాయి. ► రాష్ట్రవ్యాప్తంగా 26,712.441 టన్నుల బియ్యం, 1,714.302 టన్నుల శనగలు తొలిరోజు పంపిణీ చేశారు. ► రేషన్ షాపుల వద్ద శానిటైజర్, సబ్బు, నీటిని అందుబాటులో ఉంచారు. రెడ్ జోన్లలో ఇంటికే రేషన్ – విశాఖ జిల్లాలో 2,179 రేషన్ దుకాణాలతో పాటు 1,817 తాత్కాలిక కౌంటర్ల ద్వారా ఉచిత సరుకుల పంపిణీ చేపట్టారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 1,15,014 మందికి సరుకులు అందచేశారు. రెడ్‌జోన్ ప్రాంతాలైన పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురం, పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లో లబిŠాధ్దరులకు ఇంటి వద్దే వలంటీర్లు ఉచిత సరుకులు పంపిణీ చేశారు. – కరోనా కేసులు అధికంగా నమోదు కావడంతో రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇస్లాంపేటలో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి ఉచిత రేషన్ సరుకులు అందజేశారు. పేదింటిని కాపాడారు.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలేనికి చెందిన భూమాడి సత్తిరాజు చేనేత కార్మికుడు. ఆయన పనిచేసే బట్టల దుకాణం లాక్‌డౌన్‌తో మూత పడటంతో ఆందోళనకు గురయ్యాడు. ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు అందించడంతో పాటు రూ.వెయ్యి నగదు సాయం కూడా చేయడంపై పేదింటిని కాపాడిన దేవుడు ముఖ్యమంత్రి జగన్ అని కృతజ్ఞతలు తెలిపాడు. కరోనా ఉన్నా ఆగలేదు.. ‘కష్టకాలంలో ప్రభుత్వం ఉచితంగా బియ్యం, పప్పులు అందించి ప్రజలను అదుకుంది. మా గ్రామంలో నలుగురికి కరోనా సోకడంతో వలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు ఉచితంగా ఇంటివద్దే అందచేశారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు’ – ఎం.నాగరాజు, వెంకటాపురం, పద్మనాభం మండలం, విశాఖ జిల్లా గుడివాడలో డోర్ టు డోర్ పంపిణీ గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా త్వరలో ప్రారంభించనున్న డోర్ టు డోర్ రేషన్ సరుకుల పంపిణీలో లోటుపాట్లను గుర్తించేందుకు కృష్ణా జిల్లాలోని గుడివాడతోపాటు కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఒక ప్రకటనలో తెలిపారు. కార్డుదారుల ఎదురుగానే తూకం వేసి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు రేషన్ సరుకులు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 56 లక్షల టన్నుల ధాన్యం పండిందని, దీనిలో 33 లక్షల టన్నులు పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ధాన్యం విక్రయించదలచిన రైతులు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కొడాలి నాని ఇంటికే వచ్చింది ప్రకాశం జిల్లా ఒంగోలు ఇస్లాంపేటలో ఇంటింటికి వెళ్లి ఉచిత రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తున్న వలంటీర్లు తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం ఉమ్మిడివరంలో తన ఇంటివద్ద వలంటీర్ రామకృష్ణ అందిస్తున్న బియ్యాన్ని తీసుకుంటున్న పాయం రాధ -
రెడ్‌జోన్లపై అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన రెడ్‌జోన్ జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. రెడ్జోన్లను నిర్ధారించడంలో శాస్త్రీయత లేదని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం సంప్రదించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే వాటితో సంబంధం లేకుండా రాష్ట్రంలో కంటై న్మెంట్ ప్రాంతాల్లోనే ప్రత్యేక చర్యలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ జిల్లాలో ఇటీవల కేసులు పెరగకున్నా దాన్ని రెడ్‌జోన్‌గా కేంద్రం ఎందుకు ప్రకటించిందో అర్థం కావట్లేదని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లాలో ఇటీవల కేసుల సంఖ్య భారీగా పెరిగిందని, రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంటే, ఆరెంజ్ జోన్లో ఉంచడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేటలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల కేంద్రం ప్రకటించిన రెడ్జోన్లు, ఆరెంజ్ జోన్లతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 159 కంటైన్మెంట్ ప్రాంతాలపైనే దృష్టి సారిస్తామని ఓ కీలకాధికారి తెలిపారు. వీటిని కేసుల సంఖ్య, తీవ్రత ఆధారంగా అత్యంత శాస్త్రీయంగా ప్రకటించామని అధికారులు చెబుతున్నారు. కేంద్ర సాయమేదీ? రాష్ట్రంలో 8 జిల్లాలను లార్జ్ ఔట్‌బ్రేక్ హాట్స్పాట్లు (రెడ్జోన్లు)గా కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, మేడ్చల్, కరీంనగర్, నిర్మల్ ఉన్నాయి. రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్)గా నల్లగొండ జిల్లాను ఎంపిక చేశారు. కేసులు నమోదైన మిగిలిన జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించింది. అంటే 8 జిల్లాల్లో తీవ్రమైన కేసులున్నట్లు కేంద్ర సర్కారు గుర్తించింది. అయితే వీటిని గుర్తించే విషయంలో తమను పరిగణనలోకి తీసుకోలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ప్రకటించిన రెడ్‌జోన్ జిల్లాల ప్రకారం కాకుండా, మనం ఏర్పాటు చేసుకున్న కంటైన్మెంట్ ఏరియాలను దిగ్బంధం చేసి, మిగిలిన ప్రాంతాల్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తే సరిపోతుందని కరోనా నియంత్రణ రాష్ట్ర ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం రావట్లేదని కూడా వ్యాఖ్యానించారు. ‘కిట్లు అడిగాం. కానీ 10 శాతం వరకు మాత్రమే వచ్చాయి. ఇక ఆర్థికసాయం అంటూ ఏమీ లేదు‘అని పేర్కొన్నారు. ఆర్థకి సాయం లేనప్పుడు రెడ్జోన్లు ప్రకటిస్తే వచ్చే ప్రయోజనమేంటని ప్రశ్నించారు. దీనివల్ల వైరస్‌ను పారదోలలేమని అంటున్నారు. మార్గదర్శకాలపైనా చర్చ.. లాక్ డౌన్ విషయంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వివిధ దేశాలు ఆర్థిక గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్యాకేజీలు ప్రకటిస్తుంటే, ఆ దిశగా కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటనా జారీ కాలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కఠినంగా తీసుకుంటున్న చర్యలను నీరు గారుస్తున్నట్లు ఉన్నాయని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం కఠినంగా లాక్ డౌన్ ను అమలుచేస్తుంటే కేంద్రం మాత్రం కొన్ని మినహాయింపులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలతో పలు రంగాల్లో లాక్ డౌన్ ఎత్తివేసినట్లవుతుందని పేర్కొంటున్నాయి. అలా జరిగితే వైరస్‌ను ఎదుర్కోవడం కష్టమవుతుందని, ఇప్పటివరకు చేసిన కఠోర శ్రమ వృథా అవుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్‌ను ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 30 వరకు కఠినంగా కొనసాగించాలని యోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ నిబంధనలను సడలించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు పాక్షికంగా ద్వారాలు తెరవడం వల్ల జనం ఇళ్ల నుంచి బయటకు వస్తారని, అప్పుడు మే 3 వరకు లాక్ డౌన్ ఉన్నా లాభం ఉండదని చెబుతున్నారు. కేంద్రం రెడ్జోన్ల ప్రకటన, జాతీయ స్థాయి మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. -
రాష్ట్రంలో 8 రెడ్జోన్లు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో హాట్‌స్పాట్ (రెడ్‌జోన్) జిల్లాలు 8 ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల వివరాలతో రాష్ట్రానికి సర్క్యులర్‌ను జారీ చేసింది. రెడ్‌జోన్‌ను మళ్లీ రెండు విభాగాలుగా వర్గీకరించింది. ఇందులో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలను లార్జ్ ఔట్‌బ్రేక్ హాట్‌స్పాట్ జిల్లాలుగా గుర్తించి, ఇటువంటివి తెలంగాణలో 8 జిల్లాలున్నట్టు తెలిపింది. అలాగే, హాట్‌స్పాట్ క్లస్టర్‌గా నల్లగొండ జిల్లా ఉన్నట్టు పేర్కొంది. ఏపీలో 11.. దేశంలో 170 జిల్లాలు.. దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్‌స్పాట్ (రెడ్‌జోన్) జిల్లాలుగా గుర్తిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది. వీటిలో ఏపీలో 11 జిల్లాలు రెడ్‌జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్)లో ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, వైఎస్సార్, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు నమోదైన కేసుల ఆధారంగా జిల్లాలను హాట్‌స్పాట్ (రెడ్ జోన్), నాన్ హాట్‌స్పాట్ (ఆరెంజ్), నాన్ ఇన్ఫెక్టెడ్ (గ్రీన్ జోన్) జిల్లాలుగా వర్గీకరించింది. దేశవ్యాప్తంగా రెడ్‌జోన్‌లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 207, మిగతావి గ్రీన్ జోన్లో ఉన్నట్టు తెలిపింది. రెడ్‌జోన్‌ను మళ్లీ రెండు రకాలుగా వర్గీకరించింది. విస్తృతి ఎక్కువగా ఉన్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు, క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలుగా గుర్తించింది. రాష్ట్రాలు ఆయా జోన్లవారీగా నిర్ధేశిత కార్యాచరణ ద్వారా వైరస్‌ను అదుపులోకి తీసుకురావాలని సూచించింది. ఇకపై కూడా కేసుల సంఖ్య రెట్టింపయ్యే ప్రాతిపదికన రెడ్ జోన్లను గుర్తించాలని కోరింది. ప్రతి సోమవారం ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు, 28 రోజుల్లో కొత్త కేసులు లేనిపక్షంలో గ్రీన్ జోన్‌కు మార్చాలని సూచించింది. కేస్ లోడ్, నాలుగు రోజుల్లో రెట్టింపు సంఖ్య నమోదైన జిల్లాలు తదితర అంశాల ప్రాతిపదికన జోన్లుగా వర్గీకరించినట్టు తెలిపింది. తెలంగాణ రెడ్‌జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు (8) : హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, మేడ్చల్–మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్. రెడ్‌జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్) జిల్లా (1) : నల్లగొండ. ఆరెంజ్ జోన్ (నాన్–హాట్‌స్పాట్) జిల్లాలు (19) : సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట. -
ఏపీ, తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్, ఆరెంజ్ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్జోన్లు, 207 జిల్లాలను ఆరెంజ్ జోన్లగా గుర్తించింది. 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు, అలాగే 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్చుతామని కేంద్రం పేర్కొంది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి రెండు జాబితాలుగా విభజించింది. (హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు) ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్ జాబితాలో చేర్చింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. ఏపీలో రెడ్‌జోన్ జిల్లాల వారిగా కర్నూలు గుంటూరు నెల్లూరు ప్రకాశం కృష్ణా వైఎస్ఆర్ కడప తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి చిత్తూరు విశాఖపట్నం అనంతపురం ఇక తెలంగాణలో ఎనిమిది జిల్లాలను రెడ్‌జోన్ జాబితాలో చేర్చింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. హాట్‌స్పాట్ క్లస్టర్‌గా నల్లగొండ జిల్లాను కేంద్రం గుర్తించింది. తెలంగాణలో రెడ్‌జోన్ జిల్లాలు హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ అర్బన్ రంగారెడ్డి జోగులాంబ గద్వాల మేడ్చల్ కరీంనగర్ నిర్మల్ తెలంగాణలో 19 జిల్లాలను ఆరెంజ్ జోన్ల జాబితా సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలు ఉన్నాయి. -
ఇళ్లకే పరిమితమైన ప్రజలు
-
రెడ్‌జోన్ ప్రాంతాలను సందర్శించిన మంత్రి
-
25 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్
న్యూఢిల్లీ: తొలుత కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డ 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాలను కంటైన్మెంట్ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. ఆ 25 జిల్లాల్లో గత 14 రోజుల్లో కొత్తగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. జిల్లాల్లో అధికార యంత్రాంగం కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసించారు. ఇందులో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైతం ఉందన్నారు. ఆయా జిల్లాల్లో భవిష్యత్తులోనూ కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ కింద ఏప్రిల్ 10వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా పేదలకు రూ.28,256 కోట్ల ఆర్థిక సహాయం అందజేసినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. అలాగే పీఎం కిసాన్ యోజన కింద రైతులకు రూ.13,855 కోట్లు అందజేశామన్నారు. సామాజిక సాయం కింద వితంతువులు, వయో వృద్ధులు, దివ్యాంగులకు రూ.1,405 కోట్లు బదిలీ చేశామని తెలిపారు. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి పథకం కింద 27 రాష్ట్రాల్లో 78,373 స్వయం సహాయక బృందాల సభ్యులు 1.96 కోట్ల ఫేసు మాస్కులను తయారు చేశారని అన్నారు. ఆరు వారాల పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 2,06,212 పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేసింది. -
రెడ్ జోన్లో 41.. ఆరెంజ్ జోన్లో 45
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి మూడు జోన్లుగా విభజించగా వాటిలో రెడ్‌జోన్‌లో 41 ప్రాంతాలను గుర్తించారు. మరో 45 ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా మ్యాపింగ్ చేశారు. మొత్తం రెడ్, ఆరెంజ్ జోన్లలో 86 ప్రాంతాలున్నాయి. పట్టణప్రాంతాల్లో 43, గ్రామీణ ప్రాంతాల్లో మరో 43 ప్రాంతాలుగా ఉన్నాయి. వైరస్ ప్రభావం లేని.. అంటే గ్రీన్ జోన్ ప్రాంతాలుగా 590 మండలాలను గుర్తించారు. ► కర్నూలు జిల్లాలో అత్యధికంగా 15 రూరల్ మండలాల్లో కరోనా బాధితులు నమోదయ్యారు. ► నెల్లూరు జిల్లాలోనూ 13 మండలాలు వైరస్ ప్రభావానికి లోనయ్యాయి. ► రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ.. ఈ ఐదు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలోనే 146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► వీరిలో 123 మంది ఢిల్లీ వెళ్లివచ్చినవారు, వారి ద్వారా వైరస్ సోకినవారే ఉన్నారు. ► అత్యధికంగా గుంటూరులో 59 కేసులు నమోదు. ► సోమవారం సాయంత్రానికి విడుదలైన బులెటిన్‌లో లెక్క చూస్తే రాష్ట్రం మొత్తమ్మీద ఈ ఐదు కార్పొరేషన్లలోనే 33.2 శాతం కేసులు నమోదైనట్టు తేలింది. -
రెడ్జోన్లలో ఇళ్ల వద్దకే సరుకులు పంపిణీ
-
రెడ్‌జోన్ ఏరియాలో పర్యటించిన ఎమ్మెల్యే రోజా
-
మూడు జోన్లను అమలు చేయనున్న కేంద్రం
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించనున్నట్లు కేంద్రం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చింది. అయితే కొన్ని రంగాలకు మాత్రం కాస్త సడలింపు ఇవ్వనుంది. ఈ జాబితాలోకి ఫుడ్ ప్రాసెసింగ్, ఏవియేషన్, ఫార్మాస్యూటికల్స్, నిర్మాణ రంగం, కొన్ని పరిశ్రమలు ఉండే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కుదేలైన ఆర్థిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శనివారం మోదీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా తీవ్రతను బట్టి పలు ప్రాంతాలను మ్యాపింగ్ చేయనున్నారని తెలిపారు. అంటే కరోనా ఆధారంగా ఆయా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించనున్నారు. ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలను గ్రీన్ జోన్లుగా పరిగణించనున్నారు. పదిహేను కన్నా తక్కువ కేసులు ఉంటే ఆరెంజ్ జోన్‌గా, ఎక్కువ ఉంటే రెడ్ జోన్‌గా పిలవనున్నారు. (సొంతూళ్లకు వెళ్లనీయకపోవడంతో బీభత్సం!) రెడ్ జోన్లలో ప్రజలు అత్యవసరాలకు కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా వారి ఇళ్ల వద్దకే సరఫరా జరిగేలా చూస్తారు. ఏ ఒక్కరినీ బయట తిరగడాన్ని అనుమతించకుండా అష్ట దిగ్బంధనం చేస్తారు. ఆరెంజ్ జోన్ విషయానికొస్తే.. ఇక్కడ కరోనా ప్రభావం కాస్త తక్కువగా ఉన్నందున పరిమిత రవాణా సౌకర్యాలు వంటి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తారు. ఇక గ్రీన్ జోన్.. ఇవి కరోనా గాలి కూడా తగలని ప్రాంతాలు. దాదాపు అనేక గ్రామీణ ప్రాంతాలు ఈ జోన్ కింద వచ్చే అవకాశాలున్నాయి. అలా అని ఈ జోన్లలో జనాలు గుంపులు గుంపులుగా తిరగడానికి మాత్రం అనుమతించరు. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేసే క్రమంలో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని పరిశ్రమల కార్యకలాపాలను కొనసాగించుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. (లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు!) -
రెడ్జోన్లు లాక్; ఆ ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వ సూచనలు మేరకు అధికారులు పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. అక్కడ ప్రజలు ఇంటికే పరిమితమయ్యేలా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు తదితరాలు ఇంటి వద్దకే చేర్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. రెడ్‌జోన్ కాని ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు కొనుగోలుకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు అనుమతి ఉన్నా రెడ్జోన్ల ప్రాంతాల్లో కనీసం పక్కింటికి కూడా వెళ్లకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రజలు లాక్‌డౌన్‌ను పక్కాగా పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. సాక్షి, నెల్లూరు(అర్బన్): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో లాక్డౌన్ అమలు ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు. జిల్లాలో ఇప్పటి వరకు 48 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాలను రెడ్జోన్లుగా డిక్లేర్ చేసి కంటైన్మెంట్ చేశారు. నెల్లూరు నగరంలో 26 కార్పొరేషన్ డివిజన్లతో పాటు జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 17 ప్రాంతాలను రెడ్జోన్లుగా విభజించారు. నెల్లూరు నగరంలో వెంకటేశ్వరపురం, మూలాపేట, చిన్నబజారు, ఖుద్దూస్‌నగర్, పెద్దబజారు, చంద్రబాబునగర్, డైకస్‌రోడ్డు, గాంధీనగర్, నవాబుపేట, మాగుంటలేఅవుట్ తదితర ప్రాంతాల్లోని 26 డివిజన్లలో రెడ్‌జోన్ కొనసాగుతోంది. డివిజన్ల వారీగా చూస్తే 3, 4, 5, 6, 7, 18, 20, 21, 22, 23, 30, 32, 33, 34, 35, 36, 38, 39, 40, 41, 42, 43, 47, 48, 53, 54లను రెడ్జోన్లుగా ప్రకటించారు. జిల్లాలో చూస్తే తడ బీవీపాళెం, నాయుడుపేటలోని బీడీకాలనీ, బాలాజీగార్డెన్స్, ముస్లింవీధి, ఎల్ఐసీ వీధి, ఓజిలి మండలం నెమళ్లపూడి, వాకాడు మండలంలోని తిరుమూరు, నవాబుపేట, గూడూరులో దర్గావీధి, తోటపల్లిగూడూరు మండలం వరిగొండ, ఇందుకూరుపేట, కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం, బుచ్చిరెడ్డిపాళెం మండం రేబాల, అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు, ఇస్కపల్లి కుర్రు, బోగోలు మండలంలోని విశ్వనాథరావుపేట, కావలి పట్టణంలోని సౌత్జనతాపేట, వెంగళ్రావునగర్ ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించి ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ చేశారు. చదవండి: అత్యుత్తమ వైద్యంతో కరోనాను జయించా.. పక్కాగా పారిశుధ్య చర్యలు రెడ్జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో చుట్టూ 3 నుంచి 5 కి.మీ. పరిధిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేసి వైరస్ ప్రబలకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రజలను ఇంటికే పరిమితం చేస్తున్నారు. బయటకు రాకుండా నిత్యం వైద్యశాఖ సిబ్బంది, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కనీసం పక్క ఇళ్లకు కూడా రాకుండా కట్టడి చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని పెద్దాస్పత్రి ఐసొలేషన్ వార్డులో ఉంచారు. నెగెటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను, వారితో కలిసి మాట్లాడిన వారిని పలువురిని హోం క్వారంటైన్ చేశారు. నిత్యావసరాలు ఇంటికే రెడ్జోన్లు ప్రకటించిన ప్రాంతాల్లో కూరగాయలు, ఫల సరుకులు, పాలు, పండ్లు ఇంటి వద్దకే చేర్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం అ«ధికారులు ‘మీ బడ్డీ’ యాప్‌ను రూపొందించారు. ప్రజలు ఈ యాప్‌లో తమకు కావాల్సిన సరుకులు ఆర్డర్ చేస్తే సమీప దుకాణాల నుంచి వారే ఇళ్ల వద్దకే వచ్చి సరుకులు అందజేస్తారు. ఈ సరుకులు కూడా ఇంటి నుంచి ఒకరే బయటకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులు, మంత్రుల పర్యవేక్షణ రెడ్జోన్ల ప్రాంతాల్లో చేపట్టే చర్యలను అధికారులు, మంత్రులు పర్యవేక్షిస్తూ మైక్‌ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శనివారం మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ రెడ్జోన్లు అయిన జెండా వీధి, చిన్నబజారు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని మరో వారం లాక్డౌన్ పక్కాగా పాటిస్తే కోవిడ్ చైన్‌ను తెంచవచ్చని చెబుతున్నారు. దాతల సహకారంతో నిరుపేదలకు, కూలీలకు నిత్యావసరాల సరుకులు అందేలా సైతం చర్యలు చేపడుతున్నారు. క్వారంటైన్ నుంచి స్వస్థలాలకు మత్స్యకారులు గూడూరురూరల్: గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 250 మంది మత్స్యకారులను శనివారం కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు సూచనలు మేరకు గూడూరు సబ్‌కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ వారి స్వస్థలాలకు చేర్చారు. గూడూరు డిపోకు చెందిన 10 బస్సుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని వారి స్వస్థలాలకు తరలించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఉంటున్న జిల్లాకు చెందిన మత్స్యకారులు లాక్‌డౌన్‌తో అక్కడ చిక్కుకుపోయారన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 30న ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల చొరవతో మత్స్యకారులను ఆదిశంకర కళాశాలలో క్వారంటైన్లో ఉంచామన్నారు. వీరందరికి తిరుపతిలోని స్విమ్స్‌లో పరీక్షలు నిర్వహించగా అన్ని రిపోర్టులు నెగెటివ్ రావడంతో వారిని ఇళ్లకు పంపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు పురపాలక కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ డీఎంహెచ్ఓ అచ్యుతకుమారి, తహసీల్దార్ బాల లీలారాణి, మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా, రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి, సీసీఎస్ సీఐ అక్కేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్య పనులు చేపట్టాలి- ఏపీ టిడ్కో ఎస్ఈ జాన్ సైమన్‌రావు నాయుడుపేటటౌన్: నాయుడుపేట పట్టణంలో రెడ్‌జోన్ ప్రాంతాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టి జాగ్రత్త చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీల ప్రత్యేక అధికారి, ఏపీ టిడ్కో ఎస్ఈ జాన్ సైమన్‌రావు తెలిపారు. శనివారం మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పట్టణంలోని రెడ్‌జోన్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఉన్నతాధికారులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచనలతో నాయుడుపేట పట్టణంలో పారిశుధ్య పనులు, బ్లీచింగ్, సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఈ వెంట ఆ శాఖ ఏఈ దామోదర్, మేనేజర్ ఎంకే ఖాజామొహిద్దీ్దన్ ఉన్నారు. చదవండి: కోవిడ్ చికిత్స తీసుకుంటూ పరీక్షలు రాసిన విద్యార్థి -
రెడ్‌జోన్ ప్రాంతాల్లో సమగ్ర సర్వే
-
రెడ్‌జోన్ ప్రాంతాల్లో పోలీసుల అలర్ట్
-
ఏపీలో మొత్తం 133 రెడ్ జోన్లు
-
ఏపీలో మొత్తం 133 రెడ్ జోన్లు
సాక్షి, అమరావతి : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 133 ప్రాంతాలను రెడ్జోన్లను ప్రకటించింది. అత్యధికంగా నెల్లూరులో 30, కర్నూలులో 22 ఈ క్లస్టర్లు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ పేషెంట్లు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ కస్టర్లుగా గుర్తించిన ప్రభుత్వం.. రెడ్ అలర్ట్ ప్రకటించి వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలోని కంటైన్మెంట్ (అదుపులో ఉంచడం) క్లస్టర్ల పరిధిలో గుర్తించిన రెడ్ జోన్, హాట్ స్పాట్లను పోలీస్ వలయంలో ఉంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాకుండా, బయటి వారు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ బయటకు రానీయడం లేదు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కేసుల నమోదుకూ వెనుకాడటం లేదు. కంటైన్మెంట్ క్లస్టర్లలో చర్యలిలా పాజిటివ్ కేసులున్న ప్రాంతం చుట్టూ కిలోమీటరు మేర (హాట్ స్పాట్), దానికి మూడు కిలోమీటర్ల మేర రెడ్ జోన్‌గా పరిగణిస్తున్నారు. ఆ మొత్తం ప్రాంతాన్ని కంటైన్మెంట్ క్లస్టర్‌గా ప్రకటించి.. దానికి చుట్టూ ఉన్న మార్గాలను మూసేసి 28 రోజులపాటు ఆంక్షల్ని కొనసాగిస్తున్నారు. ప్రతి జోన్లో ఎస్ఐ ఇన్చార్జిగా ఆ ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి 10 నుంచి 20 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వలంటీర్లు, నిర్దేశించిన ప్రభుత్వ ఉద్యోగుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. వాటి పరిధిలోని ప్రతి ఇంటినీ వలంటీర్లు, ఆశా వర్కర్లు సర్వే చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ ప్రాంతాల్లో భోజనం, ఇతర ఆహార పదార్థాలను పంపిణీ చేసేవారు ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ జరిగిన నిర్ధారణ పరీక్షలను బట్టి 5.72 శాతం పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా తేలింది. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం వరకూ 381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ గుంటూరులో 7, తూర్పు గోదావరిలో 5, కర్నూలులో 2, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా నమోదు అయిన 16 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరింది. అలాగే ఆస్పత్రుల్లో 365మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. (అనంతపురం 2, కృష్ణా 2, గుంటూరు 1, కర్నూలు 1) -
‘విజయవాడలో కొత్తగా 25 కరోనా పాజటివ్ కేసులు’
సాక్షి, విజయవాడ: జిల్లాలో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పోలీసు కమీషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. శుక్రవారం జిల్లాలోని రెడ్‌జోన్ ప్రాంతాలలో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పాత రాజరాజేశ్వరి పేటలో పాజిటివ్ కేసులు పెరగకుండా పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని సబ్బందిని ఆదేశించారు. ఇక నమోదైన 25 కరోనా పాజిటివ్ కేసులలో నలుగురు విదేశాల నుంచి రాగా వారి ద్వారా మరొకరికి కరోనా సోకినట్లు వెల్లడించారు. మరో 17 కేసులు ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న వారు కాగా.. మిగిలిన ముగ్గురు ఇతర మార్గాలతో పాజిటివ్ వచ్చిందని చెప్పారు. జిల్లాలో కేసులు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. (మా చేతగాని తనంగా తీసుకోవద్దు: సీపీ) భవానీ పురం, సనత్ నగర్, బుద్దూస్ నగర్, రాణిగారి తోట, పాయకాపురం, పాత రాజరాజేశ్వరి పేట ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించి పూర్తిగా రాకపోకలు నిషేధించినట్లు ఆయన తెలిపారు. ఇక మిగతా ప్రాంతాలలో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు అనుమతించినట్లు సీపీ పేర్కొన్నారు. అయితే రెడ్‌జోన్ ప్రాంతాలలో భోజనం, ఇతర తినే పదార్థాలు పంపిణి చేసే వారు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం ముందుగానే ఎంత ఫుడ్ అనేది కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూంకి సమాచారం ఇస్తే.. ప్రాంతాల వారీగా పంపిణీకి అనుమతిస్తామన్నారు. రెడ్‌జోన్ పరిధిలో పెద్దలు అందరూ కలిసి కమిటీలు ఏర్పాటు చేసుకుని.. నిర్ణయాలు తీసుకోవచ్చని, వారి ద్వారా అధికారుల దృష్టి తీసుకు వస్తే రాకపోకలు నియంత్రణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇక కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. -
కరోనా: రెడ్జోన్లుగా 11 ప్రాంతాలు..
సాక్షి, కృష్ణా: కరోనా వైరస్‌తో ఎంతటి ముంపు పొంచి ఉందో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళకర పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి విపత్కర సమయంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌కు మించిన మంత్రం లేదు. అదే సమయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలి. కానీ జిల్లా పరిధిలోని అధిక శాతం ప్రాంతాల్లో వాతావరణం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. లాక్డౌన్ సమయంలో ఇచ్చిన వెసులుబాటును పౌరులు అధిక శాతం దురి్వనియోగం చేయడం కరోనా విస్తరణకు మార్గం సుగమం చేయడమే అవుతుంది. ఈ నేపథ్యంలో కనీస జాగ్రత్తలు తీసుకుని, స్వీయ నియంత్రణ పాటించి అప్రమత్తంగా ఉండటమే శ్రీరామరక్ష అని అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో విజయవాడ నగరంలోని 6 ప్రాంతాలు, జిల్లాలోని మరో ఐదు ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించి నేటి నుంచి అక్కడ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా గురువారం నుంచి నిత్యావసరాల కొనుగోళ్ల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకు పరిమితం చేశారు. ఆ తర్వాత రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పనిలేకున్నా రోడ్లపైకి పౌరులు.. చేతిలో మందుల చీటి.. వాహనాలకు అత్యవసరం పేరిట స్టిక్కర్లు అంటించుకుని జిల్లాలో యథేచ్ఛగా జనం తిరుగుతున్నారు. ముఖ్యంగా పట్టణ, నగరాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడలో పోరంకిలో ఉంటున్న ఓ వ్యక్తిని బెంజిసర్కిల్ వద్ద పోలీసులు నిలిపి ప్రశ్నించగా.. నిత్యావసరాల కోసం డీమార్ట్‌కు వెళ్తున్నాని చెప్పాడు. లాక్డౌన్ సమయంలో మీ ఇంటి నుంచి 3 కిలోమీటర్లు దాటి రాకూడదని తెలియదా అని పోలీసులు చెబితే.. మా ప్రాంతంలో అన్ని నరుకులు ఒకేచోట లభించడం లేదని అందుకే అక్కడి వెళ్తున్నానే వింత సమాధానం వస్తోందని పోలీసులు చెబుతున్నారు. కాలనీలపై కన్ను.. విజయవాడలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న కాలనీల్లోకి రాకపోకలు నియంత్రించేందుకు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాలనీలకు నలువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25కు పెరగడంతో అక్కడ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రెడ్జోన్లుగా 11 ప్రాంతాలు.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రత్తమైంది. కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలోని కుమ్మరిపాలెం, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, రాణిగారితోట, ఖుదూస్‌నగర్, పాయకాపురం, కానూరు గ్రామంలోని సనత్‌నగర్‌లను, మచిలీపట్నంలోని చిలకలగూడ(ఏడు వార్డులు), జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గంలోని రాఘవాపురం, ముప్పాళ్ల గ్రామాలు, నూజివీడులను రెడ్జోన్లుగా జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు. నేటి నుంచి ఈ ప్రాంతాలన్నింటిలోనూ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఎవ్వరూ ఇంటి గడప దాటి బయటకు రాకూడదు. ఇతరులు ఆ ప్రాంతాలకు వెళ్లకూడదు. అక్కడి ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, పాలు, గుడ్లు వంటి వాటిని ఇళ్ల వద్దకే తీసుకొచ్చి అందజేస్తారు. కూరగాయలు తదితరాల కోసం మొబైల్ వ్యాన్లను సమకూరుస్తున్నారు. దశదిశలా కట్టడి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్‌ను ప్రారంభించిన మంత్రి వెలంపల్లి భవానీపురం: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లో ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ సల్కాన్–600 మెషిన్ (పత్తి పొలాల్లో మందు చల్లటానికి వినియోగించే యంత్రం)ను బుధవారం దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న సౌకర్యా లను కరనా కట్టడికి వినియోగిస్తు న్నామన్నారు. కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షాలిని, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ ఇక్బాల్ హుస్సేన్, వైఎస్సార్ సీపీ నాయకులు జి. నరేంద్ర, షేక్ హయాత్ షరీఫ్ పాల్గొన్నారు. -
రెడ్‌జోన్ ప్రాంతాల్లో నిబంధనలు
-
గడప దాటారో.. పట్టేస్తారు!
సాక్షి, కర్నూలు: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కోవిడ్ వైరస్ విస్తరించకుండా తీసుకుంటున్న చర్యలకు సాంకేతికతను జోడించింది. ఆన్లైన్లో పర్యవేక్షించే ఏర్పాట్లు చేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియం పక్కన ఇందు కోసం ప్రత్యేకంగా కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రెడ్‌జోన్ ప్రాంతాలకు గూగుల్ మ్యాప్‌లో జియోట్యాగింగ్ చేశారు. దాటి పాజిటివ్ కేసు ఉన్న వ్యక్తులు నివసించే పరిసరాల్లో కిలో మీటర్ దూరంలో పూర్తిగా నిర్భందాన్ని అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు ఇతరులు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. చిన్న చిన్న వ్యాపార దుకాణాలతో పాటు పట్టణంలోని పెట్రోల్ బంకులన్నింటినీ కూడా మూత వేయించారు. జిల్లాలో 27 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. వాటి పరిధిలోని ప్రజలు నిత్యావసరాల పేరుతో బయటకు వచ్చి వీధుల్లో తిరగకుండా ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేశారు. అత్యధికంగా కేసులు నమోదైన ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అలాగే అనుమానిత ప్రాంతాల్లో వైరస్ నివారణ చర్యలు చేపడుతూనే సర్వే కొనసాగిస్తున్నారు. బయటకు రాకుండా కరోనా నియంత్రణకు సహకరించాలని ప్రజలను పోలీసు అధికారులు కోరుతున్నారు. -
రెడ్ జోన్‌గా ప్రకాశం
సాక్షి, ఒంగోలు: కోవిడ్–19 వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాను రెడ్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన కేంద్రం తగు చర్యలను సూచించింది. జిల్లాలో ఇప్పటి వరకూ 24 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో 23 కేసులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనతో సంబంధం ఉన్నవే ఉన్నాయి. నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని జిల్లా అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో కోవిడ్–19 అత్యధికంగా ప్రబలే అవకాశం ఉండటంతో కఠిన చర్యలు తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నారు. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. అయితే జిల్లాను రెడ్ జోన్‌గా కేంద్రం ప్రకటించినందున లాక్డౌన్ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. కొనకనమిట్ల మండలంలో కోవిడ్–19 పాజిటివ్ కేసు జిల్లాకు చెందిన శాంపిల్స్‌లో మరో కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారిస్తూ ల్యాబ్ అధికారులు జిల్లా అధికారులకు నివేదికలు పంపించారు. దీంతో జిల్లాలో కోవిడ్–19 పాజిటివ్ కేసులు 24కు చేరుకున్నాయి. సోమవారం ల్యాబ్ అధికారుల నుంచి అందిన 76 నివేదికల్లో ఒకటి పాజిటివ్‌గా నిర్ధారించారు. కొనకనమిట్ల మండలం వెలిగండ్ల గ్రామానికి చెందిన యువకుడు ఢిల్లీలో మానవాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉండటంతో ఈ నెల ఒకటో తేదీన ఒంగోలు జీజీహెచ్‌లో చేర్చారు. పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులను కూడా జీజీహెచ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు జిల్లా నుంచి ల్యాబ్‌కు పంపిన 206 కోవిడ్–19 శాంపిల్స్ నివేదికలు రావాల్సి ఉందని ఒంగోలు జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి.శ్రీరాములు తెలిపారు. ఇప్పటి వరకు 339 శాంపిల్స్ నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని చెప్పారు. జీజీహెచ్‌లో కోవిడ్–19 పాజిటివ్ వ్యక్తులందరూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కొన్ని కేసులను కిమ్స్ వైద్యశాలకు తరలించామన్నారు. ఒకరికి ఇతర అనారోగ్య కారణాలు ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం కూడా నికలడగా ఉందని అక్కడి వైద్యులు చెప్పారన్నారు. క్వారన్టైన్, ఐసోలేషన్‌కు 826 గదులు జిల్లాలో కోవిడ్–19 వైరస్ అనుమానితులను ఉంచేందుకు, పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేసేందుకు 826 గదులను సిద్ధంగా ఉంచారు. ఈ గదులన్నిటికీ ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయి. ప్రత్యేక వైద్యులు, నర్సులు కోవిడ్–19 వైరస్ పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసేందుకు అనుభవం ఉన్న వైద్యులు 30 మంది, నైపుణ్యం కలిగిన 56 మంది నర్సులను నియమించారు. ఇప్పటి వరకు 311 మందిని ఐసీయూలో అడ్మిట్ చేశారు. పూర్తి స్థాయిలో చికిత్స కిట్లు జిల్లాలో కోవిడ్–19 వైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వాడే పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్లు(పీపీఈ) 3,560 అందుబాటులో ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది వాడే ఎన్ 95 మాసు్కలు 5,477, గ్లవ్స్ 1,60,611, సర్జికల్ మాసు్కలు 1,21,140, శానిటైజర్లు 15003, వెంటిలేటర్లు 37 ఉన్నాయి. చీమకుర్తిలో శానిటైజర్ టన్నెల్ చీమకుర్తి: చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలోని కరోనా క్వారంటైన్ సెంటర్లో ఆటో శానిటైజర్ టన్నెల్ ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్‌ను సోమవారం సాయంత్రం చీమకుర్తి తహసీల్దార్ విజయకుమారి ప్రారంభించారు. క్వారంటైన్ సెంటర్లో కరోనా అనుమానిత లక్షణాలు కలిగిన వ్యక్తులకు ఆహారం, మంచినీరు, వైద్యం, ఇతర అవసరాలు తీర్చేందుకు రాకపోకలు సాగించే వ్యక్తుల రక్షణ కోసం ఈ ఆటో శానిటైజర్ టన్నెల్ ఏర్పాటు చేశారు. ఈ పరికరాన్ని చీమకుర్తికి చెందిన ఇంజినీరింగ్ వర్క్స్‌లో నిపుణులైన షేక్ షఫీ, హెచ్ సుబ్బారెడ్డి స్వచ్ఛందంగా రూపొందించారు. శానిటైజర్ టన్నెల్లో తహసీల్దార్‌పై ఆటోమేటిక్‌గా సోడియం హైపో క్లోరైట్ స్ప్రే -
రెడ్జోన్లలో హై అలర్ట్
సాక్షి, ఏలూరు : కరోనా ప్రభావిత రెడ్జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి.. ఆ ప్రాంతాలకు వైద్య అధికారులను నియమించాలని ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. కరోనా కట్టడి చర్యలపై శనివారం ఏలూరు నగరపాలకసంస్థ కార్యాలయం కౌన్సిల్ హాలులో సమీక్షించారు. నగరంలోని వాస్తవ పరిస్థితులు చెప్పాలని, తర్వాత తాను తనిఖీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు, ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాజిటివ్ వచ్చిన వ్యక్తులు నివసించే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రతి రోజు సర్వే చేయాలని, ఏవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే వెంటనే వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని నాని ఆదేశించారు. ఏలూరు మొత్తం మరోసారి సర్వే చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని.. దానిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ర్యాపిడ్ యాక్షన్ టీం సభ్యులకు కలి్పంచాల్సిన సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు. త్వరలోనే ఆస్పత్రులకు కోవిడ్ కిట్లు కోవిడ్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కోవిడ్ చికిత్స పరికరాలు, ఇతర కిట్లు త్వరలోనే అన్నీ ఆసుపత్రులకు వస్తాయని చెప్పారు. పోణంగి ప్రాంతంలోని రెడ్‌జోన్‌లో చేపడుతున్న శానిటేషన్ పనులపై ఆరా తీశారు. క్వారంటైన్‌కు అందరూ సహకరించాలని, లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. నగరంలోని నిత్యావసరాలు విక్రయించే షాపుల వద్ద ధరల పట్టికలు చిన్నవిగా ఉన్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి సమయంలో బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణరెడ్డిని ఆదేశించారు. చేపల మార్కెట్లో విక్రయాల తీరు దారుణంగా ఉందని, మార్కెట్లలో అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ తేజ్‌భరత్, డీఎంఅండ్ హెచ్‌వో సుబ్రమ్మణేశ్వరి, డీపీవో శ్రీనివాస్ విశ్వనాథ్, ఆర్డీవో రచన, డీఎస్పీ దిలీప్‌కిరణ్, కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. క్వారంటైన్ కేంద్రాలుగా కాలేజీలు భీమవరం: భీమవరం పట్టణంలోని శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును నర్సాపురం సబ్‌కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ శనివారం పరిశీలించారు. కళాశాలలోని క్లాస్ రూమ్స్, హాస్టల్స్ భవనాన్ని తనిఖీచేశారు. నల్లజర్ల ఏకేఆర్జీలో నల్లజర్ల: నల్లజర్లలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు తహసీల్దారు పి.ప్రతాపరెడ్డి తెలిపారు. ఏకేఆర్జీ కళాశాల హస్టల్ భవనాన్ని ఎంపిక చేశారని చెప్పారు. భవనంలోని 39 గదుల్ని శుభ్రంచేసి 39 బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటలు పనిచేసేలా నల్లజర్ల మెడికల్ ఆఫీసర్‌తో పాటు పిప్పర, ముదురునూరుపాడు పీహెచ్సీ డాక్టర్లను నియమించారు. గూడెం క్వారంటైన్లో 135 మంది తాడేపల్లిగూడెం: గూడెంలోని ఎల్.అగ్రహారంలో ఉన్న కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న వారి సంఖ్య 135కి చేరింది. ఏలూరు ఐసొలేషన్ సెంటర్లో జరిపిన పరీక్షలలో నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారిని శుక్రవారం రాత్రి, శనివారం ఈ కేంద్రానికి పంపారు. కొవ్వూరులో 39 మంది కొవ్వూరు: టిట్కో కాలనీలోని క్వారంటైన్ కేంద్రంలో 39 మందిని ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ కేటీ సు«ధాకర్ తెలిపారు. కొవ్వూరుతో పాటు దేవరపల్లి, తాళ్లపూడి, పెనుమంట్ర, పోలవరం తదితర మండలాల వారు ఉన్నారని చెప్పారు. -
'ఆ ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించండి'
సాక్షి, ఏలూరు : కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్‌కు పంపించాలని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరులోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆళ్లనాని అధికారులతో కలిసి శనివారం కరోనాపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసు, మెడికల్ టీమ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పాజిటివ్ వచ్చినవారి కుటుంబ సభ్యులు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్నారు. రెడ్‌జోన్ ఏరియాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, నాలుగు జోన్లలో ఒక్కొక్క జోన్‌కు స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలన్నారు. రెడ్‌జోన్ ప్రాంతంలో ప్రజలు బయటకు రాకుండా చూడాలని, అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏలూరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా సర్వే లైన్స్ టీమ్ ఏర్పాటు చేయడంతో పాటు రెడ్ జోన్ ప్రాంతంలో పూర్తిగా సర్వే చేయాలని ఆళ్ల నాని తెలిపారు. (ఏడాది కింద కరోనా వచ్చుంటేనా..) -
కరీంనగర్లో కొనసాగుతున్న హైటెన్షన్
-
ఆ ఆస్పత్రి పరిసరాల్లో భయం భయంగా..
సాక్షి, హైదరాబాద్: అంతార్జతీయ విమాన సర్వీసులు రద్దు చేసి నేటికి వారం రోజులైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా రద్దు చేసింది. ప్రస్తుతం విదేశాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ 14 రోజులు. ఇది మరో వారం రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం 25 వేల మంది క్వారంటైన్లో ఉన్నారు. వీరిలో ఎంత మందికి లక్షణాలు బయట పడనున్నాయి..? వీరి నుంచి మరెంత మందికి వైరస్ విస్తరించి ఉంటుంది..? వంటి ప్రశ్నలకు రాబోయే ఈ వారం పది రోజుల్లో జవాబు దొరుకుతుంది. వచ్చే కేసులను బట్టే వైరస్ వ్యాప్తి ఏ దశలో ఉందనే అంశంపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సంఖ్యతో పోలిస్తే రాబోయే వారం పది రోజుల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సామాజిక బాధ్యతలకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, ఇదొక్కటే వైరస్‌కు విరుగుడుకు మార్గమని సూచిస్తున్నారు. (కరోనా: ధోని విరాళం రూ. లక్ష.. సిగ్గు పడండి!) ఆ ఆస్పత్రి పరిసరాల్లో భయం భయంగా.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 59 పాజిటివ్ కేసులు నమోదైతే..వీటిలో అత్యధికంగా 40పైగా కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే కావడం విశేషం. గురువారం దోమలగూడకు చెందిన డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా శుక్రవారం ఆయన తల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గ్రేటర్లో ఇప్పటి వరకు లోకల్ కాంటాక్ట్‌ల సంఖ్య ఆరుకు చేరింది. ఇదిలా ఉంటే డాక్టర్ దంపతులకు వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సోమాజిగూడలోని ఆయన పని చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రిలో ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగులు, వారికి సహాయంగా వచ్చిన బంధువులు, ఇతర వైద్య సిబ్బందితో పాటు ఆస్పత్రి చుట్టు పక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసుల్లో ఆందోళన మొదలైంది. (కరోనా : డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!) కార్పొరేట్ వైద్యులపై విమర్శల వెల్లువ.. నగరంలో అనేక కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రముఖ వైద్య నిపుణులు ఉన్నారు. కానీ వీరిలో ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా పాజిటీవ్ బాధితులకు, అనుమానంతో వస్తున్న బాధితులకు చికిత్స అందించేందుకు ముందకురాక పోవడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లో చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బందిపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే నగరంలో ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రికి ఒకే పేరుతో రెండు మూడు బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కానీ వాటిని వదిలేసి కరోనా చికిత్సల పేరుతో పేదలు చికిత్స పొందే గాంధీని పూర్తిగా ఖాళీ చేసి వాటిని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. (తెలంగాణ: ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్) ఇదిలా ఉంటే విదేశాల నుంచి వచ్చిన వారిని సెల్ఫ్ క్వారంటైన్ చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలను జీహెచ్ఎంసీ, పోలీస్, అధికారుల బృందం రెడ్‌జోన్‌గా ప్రకటించింది. ఇలా రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు తగిలించారు. ఆ నివాసాల్లోకి ఎవరూ వెళ్లవద్దంటూ కచ్చితమైన సూచనలు జారీ చేశారు. నిత్యం ఆ ప్రాంతాలు తమ పర్యవేక్షణలో ఉంటాయని సూచిస్తున్నారు. ఇలా కోవిడ్–19 క్వారంటైన్ రెడ్‌జోన్ బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో చుట్టుపక్కల నివాసితులు అప్రమత్తంగా ఉండి ఆ ప్రాంతాల సమీపంలోకి వెళ్లకూడదని అధికారులు పేర్కొంటున్నారు. చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి..తుర్కయాంజల్, కొత్తపేట రెడ్ జోన్లో ఉన్నాయి. (ఒకేరోజు 14 మందికి కరోనా పాజిటివ్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘రెడ్ జోన్’లో గ్రీన్హౌస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్హౌస్ రైతుల వెతలు ఇవి. గ్రీన్హౌస్లో కూరగాయలు సాగుచేసిన రైతులంతా నష్టాల పాలై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం గ్రీన్హౌస్ సాగుకు ప్రోత్సాహం కోసం 75 శాతం సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రీన్హౌస్ సాగుకు ఎకరానికి దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చయితే.. ప్రభుత్వమే రూ.30 లక్షలు భరిస్తుండగా, రైతులు రూ.10 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,042 ఎకరాల్లో గ్రీన్హౌస్లకు అనుమతి ఇచ్చారు. అందులో 600 ఎకరాల్లో జరబెర, 150 ఎకరాల్లో గులాబీ, చామంతి తదితర పూల సాగు జరుగుతోంది. మిగతా 292 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. అయితే సరైన విత్తనాలు, సాంకేతిక అవగాహన కరువై నష్టాలపాలవుతున్నారు. పూలతో లాభాలు జరబెర వంటి పూల సాగుతో రైతులు లాభాలు పొందుతున్నారు. కూరగాయల సాగుతో మాత్రం చాలా చోట్ల నష్టాలే వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో అయితే పూల సాగులోనూ పెద్దగా లాభాలు రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. రైతులకు అవగాహన లేకపోవడం, అధికారుల నుంచి సహకారం లభించకపోవడం, వాతావరణంలో వచ్చే మార్పులను అంచనా వేసే పరిస్థితి లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఉదాహరణకు చేవెళ్ల మండలం చెనుపల్లిలో ఒక రైతు సీజన్లో టమాటా సాగు చేశారు. కానీ ధర కిలో రెండు మూడు రూపాయలకు పడిపోవడంతో తీవ్రంగా నష్టాల పాలయ్యారు. ఏ సమయంలో ఏయే కూరగాయలు సాగు చేయాలన్న అవగాహన లేక ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. సూచనలతో లాభదాయకం అయితే పలు చోట్ల రైతులు స్వయంగా సొమ్ము ఖర్చు చేసుకుని.. శాస్త్రవేత్తల సూచనలతో లాభాలు పొందుతున్నారు. చేవెళ్ల మండలం చెనుపల్లిలో 45 గ్రీన్‌హౌస్‌ల సాగును పరిశీలించేందుకు నెలకోసారి పుణే నుంచి శాస్త్రవేత్త వస్తుంటారు. వచ్చినప్పుడల్లా ఒక్కో రైతు రూ.3 వేల చొప్పున రూ.1.35 లక్షలు ఆయనకు చెల్లించి.. తగిన సూచనలు పొందుతుంటారు. దీంతో అక్కడ గ్రీన్హౌస్ సాగు లాభదాయకంగా ఉంది. మిగతా చోట్ల ఈ పరిస్థితి లేదు. సాధారణ రైతులకు అవగాహన లేక, ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు లేక నష్టాలపాలవుతున్నారు. నెట్హౌస్లపై దృష్టి.. గ్రీన్ హౌస్‌లకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చయ్యే నెట్ హౌస్‌పై రైతులు దృష్టి సారిస్తున్నారు. దీనికి ఎకరానికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. పంజాబ్, హరియాణాల్లో నెట్‌హౌస్ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కూరగాయల సాగుకు నెట్హౌస్లను ప్రోత్సహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రైతు పేరు నాగిరెడ్డి.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లక్ష్మీపురం. రెండేళ్ల కింద ఎకరా విస్తీర్ణంలో గ్రీన్హౌస్ సాగు మొదలుపెట్టారు. రూ.10 లక్షలు అప్పుచేసి మార్జిన్ మనీగా ప్రభుత్వానికి చెల్లించారు. భూమిలో మట్టి మార్పు, ఎరువులు, విత్తనాలు, ఇతర ఖర్చులకు మరో రూ.5 లక్షలు ఖర్చుచేశారు. గ్రీన్హౌస్లో క్యాప్సికం, టమాటా సాగుచేశారు. కానీ దిగుబడులు సరిగా రాలేదు. సీజన్లో టమాటా బాగా పండినా ధర లేక నష్టం వాటిల్లింది. ఏడాదిగా గ్రీన్‌హౌస్‌ను ఖాళీగా ఉంచారు. ఇప్పుడా భూమిని అమ్మకానికి పెట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారెపల్లికి చెందిన ఈ రైతుపేరు రాజిరెడ్డి. రెండేళ్ల క్రితం మూడెకరాల్లో గ్రీన్హౌస్ సాగు మొదలుపెట్టారు. కీరా, క్యాప్సికం, టమాటా పంటలు వేశారు. టమాటా ఏపుగా పెరిగినా దిగుబడి రాలేదు. గతేడాది క్యాప్సికం వేసినా.. గ్రీన్హౌస్ నిర్మాణం దెబ్బతిని పంటకు నష్టం వాటిల్లిందని, వేసవిలో కీరా వేస్తే వైరస్ కారణంగా నష్టం వాటిల్లిందని ఆయన వాపోతున్నారు. మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటున్నారు. ప్రత్యేక నిర్వహణ అవసరం గ్రీన్హౌస్లో కూరగాయలు సాగు చేయాలంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజువారీగా పరిజ్ఞానం పెంచుకోవాలి. నిర్వహణ సరిగా లేకపోతే నష్టాలు తప్పవు. ఏ సీజన్లో ఏ పంటలు వేసుకోవాలన్న అవగాహన ఉండాలి. వర్షాకాలంలో ఆకుకూరలు, చలికాలంలో బెండ, బీర, కాకరకాయలు పండించాలి. క్యాప్సికం, కీరాలకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. మార్కెట్ సరళిని బట్టి పూల సాగు చేపట్టాలి.. – వెంకట్రామిరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ -
‘రెడ్ జోన్’కు వ్యతిరేకంగా ధర్నా
పుణే: రెడ్ జోన్ వాసుల దుస్థితిని రాజకీయ నాయకులతోపాటు రక్షణ శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకుగాను దేహూ రోడ్ రెడ్ జోన్ సంఘర్ష్ సమితి గురువారం ధర్నా చేసింది. నిగిడిలోని భక్తిశక్తి చౌక్ వద్ద జరిగిన ఈ కార ్యక్రమంలో శివసేన ఎంపీ శివాజీరావ్ అఢల్రావ్ పాటిల్, ఎమ్మెల్యే బాలాభెగ్డే, లక్ష్మణ్ జగ్తాప్, మేయర్ మోహినీ లాండే, బీజేపీ నాయకుడు ఏక్నాథ్పవార్, వందలాదిమంది స్థానికులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు ఏక్నాథ్ పవార్, ఆ పార్టీ పింప్రి-చించ్వాడ్ శాఖ అధ్యక్షుడు సదాశివ్ ఖడేలతోపాటు దేహూ రోడ్ రెడ్ జోన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఢిల్లీలో ఆందోళనకు దిగుతాం ధర్నా అనంతరం దేహూ రోడ్ రెడ్ జోన్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు సుడం తరస్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల సమయంలో దేశ రాజధానిలో ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు. జిల్లాలోని దిఘి, దేహూరోడ్, లోహెగావ్, పాషణ్ సుతర్వాడిలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని, ఈ కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే ఆరు లక్షలమంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. తమ బాధలను ప్రముఖ సంఘసేవకుడు అన్నాహజారే దృష్టికి తీసుకెళ్లామని, తమ ఆందోళనకు నాయకత్వం వహించేందుకు ఆయన అంగీకరించారన్నారు. కాగా దేహూరోడ్ ఆయుధ కర్మాగారం (డీఏడీ) పరిధిలోకి దేహూ కంటోన్మెంట్ తోపాటు పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అనేక ప్రాంతాలు వస్తాయి. ది వర్క్స్ ఆఫ్ డిఫెన్స్ చట్టం-1903 ప్రకారం రెడ్ జోన్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టకూడదు. రక్షణ శాఖకు చెందిన ఆయుధ డిపోలపై వీటి ప్రభావం పడడం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించేవారికి నష్టం వాటిల్లకుండా చేయాలనేది ఈ చట్టం ముఖ్యోద్దేశం.