సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్. చిత్రంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తదితరులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీ డియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను మే 11వతేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈమేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో ఇంటర్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి.రమేష్‌లతో కలిసి మంత్రి 13 జిల్లాల ఆర్‌ఐఓలు, ఆర్జేడీలు, డీవీఈఓలతో చర్చించి పలు సూచనలు చేశారు.
60 లక్షల పత్రాల మూల్యాంకనం...
► మే 11 నుంచి ఆరెంజ్, గ్రీన్‌జోన్లలో ఇంటర్ జవాబు పత్రాల మూ ల్యాంకనం మొదలవుతుంది. లాక్‌డౌన్ ముగిసిన అనంతరం రెడ్‌జోన్లలో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమవుతుంది. 13 జిల్లాల్లోనూ జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటవుతాయి.
► మూల్యాంకనానికి రెండు, మూడు భవనాలను గుర్తించి ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తారు.
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి మూల్యాంకన నిర్వహిస్తారు.
► ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ పరీక్షలకు తేదీలు ఖరారు చేసినందున ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తారు.
► మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యారు.
► 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment