
సాక్షి, ఏలూరు : కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్‌కు పంపించాలని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరులోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆళ్లనాని అధికారులతో కలిసి శనివారం కరోనాపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసు, మెడికల్ టీమ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
పాజిటివ్ వచ్చినవారి కుటుంబ సభ్యులు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్నారు. రెడ్‌జోన్ ఏరియాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, నాలుగు జోన్లలో ఒక్కొక్క జోన్‌కు స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలన్నారు. రెడ్‌జోన్ ప్రాంతంలో ప్రజలు బయటకు రాకుండా చూడాలని, అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏలూరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా సర్వే లైన్స్ టీమ్ ఏర్పాటు చేయడంతో పాటు రెడ్ జోన్ ప్రాంతంలో పూర్తిగా సర్వే చేయాలని ఆళ్ల నాని తెలిపారు. (ఏడాది కింద కరోనా వచ్చుంటేనా..)
Comments
Please login to add a commentAdd a comment