సాక్షి ప్రతినిధి, ఏలూరు: కరోనా పేషెంట్లకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. శనివారం ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పేషెంట్లకు అందుతున్న భోజనాన్ని, ఆస్పత్రిలో పారిశుద్ధ్యం, రూముల శుభ్రతను చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బాధితులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రతి రోగికి రోజుకు రూ.500 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు. ప్రభుత్వానికి భారమే అయినప్పటికీ ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రోగులకు ఏమైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1800–2332077కు ఫిర్యాదు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment