CM YS Jagan Review Meeting On Coronavirus Control In AP At Tadepalli - Sakshi
Sakshi News home page

థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్‌

Published Tue, Jul 20 2021 12:35 PM | Last Updated on Tue, Jul 20 2021 3:37 PM

CM YS  Jagan Review Meeting On Coronavirus Control In AP At Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సమర్థ నిర్వహణ ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగామన్నారు. గర్భిణీలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా కొనసాగాలన్నారు. థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని  అధికారులను సీఎం ఆదేశించారు.

‘‘పీడియాట్రిక్‌ సూపర్‌కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలి. పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌కేర్‌ ఎక్విప్‌మెంట్‌తోపాటు వైద్యులను నియమించాలి. కమ్యూనిటీ ఆస్పత్రుల స్థాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉండాలి. సబ్‌ సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటన్‌నెట్‌ సౌకర్యం ఉండాలని’’ సీఎం జగన్‌ ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే....:
రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్‌ డోసులు 1,80,82,390
ఇంకా (బ్యాలెన్స్‌డు డోసులు) వినియోగించాల్సిన డోసులు 8,65,500
ఇప్పటివరకు ఇచ్చిన డోసులు సంఖ్య 1,82,49,851
సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులు ఆదా
ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది
విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్‌
సమర్ధ నిర్వహణద్వారా ఆదా చేయడం సాధ్యమైంది
45 సంవత్సరాల దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత ప్రయారిటీగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలి
గడిచిన మే నెల నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్‌ డోసులు 35 లక్షలు
కేవలం సుమారు 4,63,590 డోసులు మాత్రమే వినియోగం 
ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయం
గర్భిణీ స్త్రీలకు వాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా కొనసాగాలి
వాక్సినేషన్‌పై వారికి అవగాహన కలిగించాలి
అధికారులకు స్పష్టం చేసిన సీఎం

థర్డ్‌ వేవ్‌ సన్నద్దత
థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో సన్నద్ధంగా ఉండాలి
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచన
పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలి
కమ్యూనిటీ ఆస్పత్రులు స్ధాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి
పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలి
సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలి
అప్పుడే వారితో పీహెచ్‌సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారు
కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలి
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు
కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలి
జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయి

ప్రైవేటు ఆసుపత్రులు – ఆక్సిజన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు 
50 పడకలు దాటి ఉన్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు విషయంలో పురోగతిని అడిగి తెలుసుకున్న సీఎం
జిల్లా కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చారన్న అధికారులు
ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఇన్సెంటివ్‌ ఇస్తున్నామని స్పష్టం చేసిన సీఎం 

కోవిడ్‌ 19 నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్, థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతపై సీఎంకు వివరాలందించిన అధికారులు 
యాక్టివ్‌ కేసులు 24,708 
పాజిటివిటీ రేటు 2.83 శాతం
3 కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 8
3 నుంచి 5 మధ్యలో పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 5
రికవరీ రేటు 98.05 శాతం
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు  94.19 శాతం
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు  76.07 శాతం
13వ దఫా ఫీవర్‌ సర్వే కూడా పూర్తయింది.  
104 కాల్‌ సెంటర్‌కు వస్తున్న రోజువారీ కాల్స్‌ 1000 లోపు 

బ్లాక్‌ ఫంగస్‌
తగ్గుముఖం పట్టిన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు
గత వారంలో నమోదైన కేసులు 15 
మొత్తం కేసులు 4075
చికిత్స పొందుతున్నవారు 863

వ్యాక్సినేషన్‌
మొత్తం వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు   1,41,42,094
సింగిల్‌ డోసు పూర్తయినవారు  1,00,34,337
రెండు డోసులు పూర్తయినవారు  41,07,757

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement