
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీతో పాటు రెడ్‌జోన్ల పరిధిలో ఉన్న ఇతర అన్ని మున్సిపాలిటీల్లో ఆటోమొబైల్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, వాహనాల రిపేర్ గ్యారేజీలు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లకు సంబంధించిన అన్ని రకాల షోరూమ్స్, షాపులను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం రెడ్‌జోన్ల పరిధిలోని మున్సిపాలిటీల్లో నిత్యావసర వస్తువుల దుకాణాలు, అత్యవసర సేవలతో పాటు నిర్మాణ రంగానికి సంబంధించిన హార్డ్‌వేర్ తదితర షాపులు, వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన పంపుసెట్ల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉండగా, ఇకపై పైన పేర్కొన్న దుకాణాలు, షోరూమ్స్‌ను అనుమతించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment